ఏవేవో ఆరోపణలు ఎదుర్కొంటూ "టైమ్స్ ఆఫ్ ఇండియా"లో ఐదు నెలలుగా పని చేయకుండా జీతం తీసుకుంటున్న ఒక సీనియర్ జర్నలిస్టు గురించి, "ది హిందూ" లో ప్రమోషన్ల వ్యవహారం గురించి, కొన్ని చానళ్ళ విలేకరులపై ప్రభుత్వం తెలంగాణా ముద్ర వేయడం గురించి, "ది సండే ఇండియన్"ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ప్రపంచానికి మాత్రం ప్రవచనాలు వల్లిస్తున్న ఆరిందం చౌదరి గురించి, హెచ్ ఎం టీ వీ నుంచి కోటి ఆశలతో వీ సిక్స్ చానెల్ కు వెళ్లి అక్కడి బాసు మూలంగా ఏడాదిలోనే ఒక చేదు 'అంకం' ముగించుకుని మళ్ళీ పాత చానెల్ కు వెళ్ళిన నా మిత్రుడి గురించి, అవినీతి జర్నలిస్టుల గురించి...సమాచారం పుష్కలంగా ఉన్నా...రాయబుద్ధి కాక రాయలేదు. ఈ మీడియా గురించి, భారత రాజకీయాల గురించి, కుక్క తోక గురించి రాయడం ఒక్కటే అని స్పష్టం కావడం ఒక్కటే ఈ నైరాస్యానికి కారణం కాకపోయినా....ఎందుకో మనసు పోలేదు.
ఈ రోజు మాత్రం...వ్యక్తిగతమైన ఒక విషయాన్ని రాయడానికి బ్లాగు ఓపెన్ చేసాను...చాలా రోజుల తర్వాత. మా పుత్రుడు ఫిదేల్ గత ఆరు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ అనే చోట వున్నాడు. సీ బీ ఎస్ ఈ జాతీయ స్థాయి పోటీలలో అండర్ 14 వ్యక్తిగత విభాగంలో పాల్గొనేందుకు వెళ్ళాడు. మొన్న క్వార్టర్ ఫైనల్లో సుమిత్ గోగోయ్ అనే ఒక అస్సాం క్రీడాకారుడిని ఓడించిన ఫిదేల్ ఈ రోజు ఉదయం డిల్లీ కి చెందిన యుగమ్ గులాటి మీద సెమీ ఫైనల్స్ లో గెలిచి ఫైనల్స్ కు చేరుకున్నాడు. నేను ప్లాన్ చేసినట్లు మనవాడు ముందుకు వెళ్ళుతున్నాడని, గోల్డ్ మెడల్ వస్తుందని అనుకున్నాము నేను, హేమ. కానీ ఫైనల్స్ లో బెంగాల్ కు చెందిన శివాజీ రాయ్ అనే ఆటగాడి చేతిలో ఈ మధ్యాన్నం ఓడిపోయాడు. పన్నెండు సంవత్సరాల పిల్లవాడు అండర్ 14 విభాగంలో ఆ లెవెల్ కు పోవడమే గొప్ప. పైగా సిల్వర్ మెడల్ తెచ్చాడు. మాకు చాలా ఆనందం అనిపించింది. అది పంచుకోవడానికే ఈ పోస్టు. మరేదో రాస్తానని పోస్టు చివరి దాకా చదివి...'సొంత డబ్బా'తో చంపేస్తున్నాడు...' అని అనుకున్న వారికి సారీ. ఈ ఫోటోలో ఉన్నది మా వాడే.

19 comments:
ముందుగా మీ అబ్బాయికి అభినందనలు. భవిష్యత్ లో ఇంకా ఎదగాలని అశిస్తున్నాను. మీకు పుత్రోత్సాహం కలగడం సహజమే, దానిని నలుగురితో పంచుకోవడం తప్పేమీ కాదు.
raamu gaaroo, fidel koo, meekoo abhinandanalu. fidel marinni vijayaalu sadhinchaalani aashistunnaanu.
ఫిదేల్ కి అభినందనలు.
ivala mi snehit photo to kudina vijayavaartha sakshi tabloid lo vesaru...
thanks a lot sirs.
ramu
Anna Congratulations
a small correction@మా పుత్రుడు ఫిదేల్!
...................పుత్ర రత్నం!!
:)
Congratulations to Fidel, the Karate Kid and his father, Jackie Chan. I wish the young warrior to win many more battles in the days to come and emerge as one of top sport stars of India.
-sreedhar babu
Hearty congratulations to fidel,
and i wish you to get many more victories
in coming future.
ramuji, encourage him to reach
his goal with proper guidance.
- peddiraju chennu
Congrats bhayya,
vamshoddarakuduki marinni vijayalu kalagaalani maspoorthigaa aashistunnaanu.
Urs,
Narender javvaji,
mitayipotlam.blogspot.com
You are using this blog as a platform to project your kids performance in tournaments.A portal with a selfish motive doesn't augur well.All your commandments seem to have gone to wind.Well,Kudos for your son !
abhinandana mandaaraalu
kavuri
Thanks for my good friends for your greetings.
Dear Prashanth,
You are right. Everything is going to winds now a days. Please don't waste your time by visiting the blog from today. I wish you good luck.
Cheers
Ramu
ఫిదెల్ మరెన్నో విజయాల్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నాం.
oh my god!
why so jealous Dear Prashant?
Nowhere in his commandments he wrote that he will keep away from all his personal things and will write only on public issues!!
We should congratulate and see this also as a motive for other parents (like me) not to stop training their kids in sports despite several odds. you better refer Ramu's previous posts on how much he suffered due to the worst politics in sports and after a great struggle he could establish an T.T academy.
cheers
God luck to Fidel.
JP.
నమస్కారం సర్. ఫిదేల్ కు నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి విజయాలు మరిన్ని సొంతం చేసుకోవాలని కోరుకొంటూ మీ విద్యార్ధి సురేష్(isj).
నమస్కారం సర్. ఫిదేల్ కు నా హృదయపూర్వక అభినందనలు.
suresh, your student in ISJ.
నమస్కారం సర్. ఫిదేల్ కు నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి విజయాలు మరిన్ని సొంతం చేసుకోవాలని కోరుకొంటూ మీ విద్యార్ధి సురేష్.(ISJ)
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి