Tuesday, July 30, 2013

ఇది 'బిగ్ డే' నా?--నిజంగా తెలంగాణా వస్తుందా?

భారత దేశ చరిత్రలో ఈ రోజు ఒక మరుపురాని, మరిచిపోలేని రోజుగా మిగిలి పోయే అవకాశం అనిపిస్తున్నది. తెలంగాణా రాష్ట్రం పై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేట్లున్నది. హైదరాబాద్ ఒక పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తారని గట్టిగా అనిపించేలా పరిణామాలు ఉన్నాయి. ఒక వేళ అదే జరిగితే మనందరి జీవితాల్లో ఇదొక ప్రధాన ఘట్టం. ఒక చారిత్రక పరిణామాన్ని ప్రత్యక్షంగా చూసిన వారమవుతాం. 

ఇదొక బిగ్ డే నే కానీ.. ఒక భారమైన రోజు. ఇప్పుడు ఏమి జరిగుతుందో... భవిష్యత్తు ఏమవుతుందో, అంతా సవ్యంగా సాగుతుందో లేదో, మున్ముందు తెలుగు ప్రజలు భారత్-పాకిస్థాన్ జనం మాదిరిగా కొట్టుకు చస్తారో ఏమో అన్న అనుమానాలకు తావిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నీచ రాజకీయాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ పరిస్థితులు దాపురించాయి. 

తెలంగాణా నిజంగానే అత్యంత సున్నితమైన అంశం. ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అన్ని వాదనలు నిజమే అనిపిస్తాయి. ఒక వేళ తెలంగాణా వస్తే ఇళ్లల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో కదా! అనిపిస్తుంది. ఆంధ్ర కు తెలంగాణాకు మధ్యన ఉన్న మా ఖమ్మం జిల్లా పరిస్థితి ఏమిటి? అన్న సందేహం నా బోటి వాళ్లకు కలుగుతుంది. ఒంటి రంగు, ఉన్న డబ్బు, జన్మించిన కులం, పుట్టిన ప్రాంతం... బట్టి మనుషుల గుణగణాలను బేరీజు వేయడం, ముద్ర వేయడం కచ్చితంగా సంకుచితత్వమే కదా!   

మా అమ్మా వాళ్ళది ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామం. మా నాన్నా వాళ్ళది కృష్ణా జిల్లా తిరువూరు మండలం నెమలి గ్రామం. మా నాన్న ఉద్యోగం మొత్తం ఖమ్మం జిల్లాలో కావడం వల్లనో, నేను గొల్లపూడి లో పుట్టి ఖమ్మం జిల్లాలో పెరగడం వల్లనో, నన్ను వృత్తిలో దారుణంగా ఇబ్బంది పెట్టిన నీచ నికృష్ట దరిద్రులు అంతా ఆంధ్రా ప్రాంతం వారు కావడం వల్లనో, ఒక జర్నలిస్టుగా గ్రౌండ్ రియాలిటీస్ ను దగ్గరి నుంచి చూడడం వల్లనో...నేను తెలంగాణా వాదిని.
హేమ సంగతీ అంతే. వాళ్ళ నాన్న గారు ప్రకాశం జిల్లాలో పుట్టి ఖమ్మం జిల్లా కొత్తగూడెం కు ఉద్యోగ రీత్యా వచ్చారు. హేమ పుట్టింది అమ్మమ్మ గారి ఊర్లో అయినా చదివింది పెరిగింది కొత్తగూడెం లో. మా అమ్మాయి ఖమ్మం జిల్లా కొత్తగూడెం లో పుట్టింది. మా అబ్బాయి తాన తాత ఉద్యోగ రీత్యా ఉన్న అనంతపురం జిల్లా పుట్టపర్తి లో పుట్టాడు. అమ్మాయి, అబ్బాయి నల్గొండ, హైదరాబాదు లలో పెరిగారు.  

రాష్ట్ర విభజన మా నాన్నకు గానీ, మా మామ గారికి గానీ సహజంగానే ఇష్టం ఉండదు. నేను ప్రత్యేక తెలంగాణా గురించి మాట్లాడితే వీళ్ళిద్దరి మొహాల్లో చిరాకు కనిపిస్తుంది. ప్రాంతాల గురించి ఆలోచించకుండా మనసా వాచా కర్మణా ఉద్యోగ ధర్మం నిర్వర్తించి సేవ చేసి పదవీ విరమణ చేసిన తమను ప్రాంతాల వారీగా చూడడం వారికి ఇష్టం ఉండదు. నాకూ, హేమకు, మా అమ్మకు మాత్రం ప్రత్యేక రాష్ట్రం వస్తేనే మంచిది అని ఉంటుంది.  నేతలు, అధికారులు తెలిసి చేసారో, తెలియక చేసారో గానీ ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని, ఇక్కడి ప్రజల పట్ల చిన్న చూపు నిజమని మేము నమ్ముతున్నాం. 

ఈ పరిస్థితి మా కుటుంబం ఒక్క దానికే పరిమితం అని నేను అనుకోవడం లేదు. చాలా కుటుంబాలు ఇదే వాతావరణంలో ఉన్నాయి. రాష్ట్ర విభజన ప్రభావం కుటుంబ సంబంధాలపై కూడా పడుతుంది. ఈ రోజు వచ్చే నిర్ణయం ఏదైనా... తెలుగు ప్రజలంతా పరస్పర గౌరవంతో, బాధ్యతాయుతంగా మెలగాలని కోరుకుంటున్నాం. వీర తెలంగాణా సాయుధ పోరాట వారసులు, సమ సమాజం కోసం పోరాడి నేలకొరిగిన విప్లవ యోధుల వారసులపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంది. 

 ప్రత్యేక రాష్ట్రం వస్తే బ్రహ్మాండం బద్దలై ఇక్కడి ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందన్న  పిచ్చి భ్రమలు లేకపోయినా తెలంగాణా, ఆంధ్రా ప్రజల మధ్యన మానసికంగా గ్యాప్ ఏర్పడిందని నేను నమ్ముతున్నాను. ఇది ఎప్పటికీ మంచిది కాదని నమ్ముతున్నాను. ఇవ్వాళ కాకపోయినా రేపైనా ఈ సమస్య మళ్ళీ మన ముందుకు వస్తుంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సభ్య సమాజంలో చాలా సవరణలు జరగాలని కోరుకుంటున్నాం. 

7 comments:

Unknown said...

మేము కూడా తెలంగాణ కొరుకున్తున్నాము

K V V S MURTHY said...

మీరు చెప్పింది వాస్తవం..!ఖమ్మం జిల్లా పరిస్థితి ప్రత్యేకమైనది.కొత్తగూడెం అవతలనున్న భద్రాచలం ఇంకా ఆ చివరలుగా వున్న వాజేడు..చింతూరు మండలాల దాకా వున్నవారు చాలా మంది కోస్తా జిల్లాల కి సంబందించినవారే..!అలాగని సమైకాంధ్రని గాని ..తెలంగాణని గాని వారు వ్యతిరేకించడం లేదు.అసలు దేన్ని పట్టించుకోవాలో కూడా నిర్ణయించుకోలేని స్థితి. ఒకవేళ తెలంగాణ లో ఈ ప్రాంతం చేరినా దీన్ని వ్యవసాయ రంగానికి మకుటాయ మానంగా అభివృద్ది పరచుకోవచ్చు.ఇరు రాష్ట్రాలు తమ ఎడబాటుని కేవలం ద్వేషాలు ఇంకా పెంచుకోవడానికి కాకుండా తమకి కలిగిన అవకాశాన్ని పారిశ్రామిక,వాణిజ్య,వ్యవసాయ రంగాల్లో మరింత పురోగతి సాధించడానికి వుపయోగించుకోవాలి. ఒకటి గుర్తుంచుకోవాలి.. ఉత్తరాది హిందీ రాష్ట్రాలనే తీసుకుంటే వివాహ సంబంధాలు అన్నీ కలగలిసి పోయే వుంటాయి.
భారత దేశం లో అన్ని బంధాల కంటే బలమైనది కులం.ఉదాహరణకు ఖమ్మం జిల్లా చర్ల గ్రామం లోని కమ్మ మరియు బలిజ నాయుళ్ళకు అటు కర్ణాటక,ఇటు తమిళ నాడు ల్లోనూ వైవాహిక బంధాలున్నాయి ఎప్పటినుంచో..సరదాగా ఆటపట్టించుకుండానికే తప్ప వారిలో పరాయి రాష్ట్రాలు అనే భావమే వుండదు.రాకపోకలు సాధారణంగానే వున్నాయి.

ఆ మాటకొస్తే కె.సి.ఆర్. కుటుంబమే వలస కుటుంబం కాదా..!ఆయనకి కాకినాడ నుంచి ఉత్తరాంధ్ర దాకా బంధువులున్నారు అంతమాత్రం చేత తెలంగాణ ఆయన్ని కాదన్నదా..!

Prashant said...

Don't believe it.I am native of Telangana.I have so many Andhra friends.I have seen no discrimination.It's all political gamble for votes and power.Create rift among people citing cultural,habits and economic differecnes to carve out new state is just indigestible.It's more of diversity than anything else.Congress game is purely political.People are just into the trap.

its me said...

1. You can never change the past but always make another beginning and end with what you want to achieve.
2. All politicians have one common goal- to make money and take care of their dynasty. So even if some one opposes- big boss knows how to gift them projects, SEZ, and other earning opportunities apart from plum posts.
3. Its the common man who would end up paying the taxes and suffer.

శ్యామలీయం said...

ప్రజల మధ్యన అభిప్రాయబేధాలు ఉన్నాయన్న భ్రమను బాగానే కలిగించారు రాజకీయవేత్తలు. సమర్థులే.

ఇప్పుడు రాష్ట్రం విడిపోతే మాత్రంగా ఉన్న అభిప్రాయబేధాలు తప్పకుందా నిజంగానే ప్రజల మధ్యన ఏర్పదతాయి.

నిందలు వేసి విడిపోయిన వాళ్ళు అన్నదమ్ములం అంటూ అప్యాయత నటిస్తే ఆవలి ప్రాంతం జనం అమాయకంగా సంబరపడతారని భావించటం కష్టం.

ఏది జరిగినా ఇన్నాళ్ళూ అది తెలుగువాళ్ళ మంచి కోసం జరగలేదు.
ఏది జరిగినా నేడు అదీ తెలుగువాళ్ళ మంచి కోసం‌ జరగబోవటం లేదు.

దీర్ఘకాలంలో తెలుగుజాతి ఆక్రోశించటం మాత్రం సత్యం. అది మీలాంటి వాళ్ళ్య్ ఇప్పుడు నమ్మక పోయినా సరే

Unknown said...

తెలుగు రాష్ట్రాలు రెండైనంత మాత్రాన అనుబంధాలు ఆత్మీయతలు దూరమవుతాయా !మీరన్నట్లు తెలంగాణాకు చాలా రంగాలలో అన్యాయం జరిగినమాట అక్షరాలా నిజం!కక్షలూ కార్పణ్యాలూ తాత్కాలికం!ఎప్పటి తెలుగే మళ్ళీ! ఎప్పటి వెలుగే మళ్ళీ!పెరుగుతున్నజనాభా ప్రాతిపదికన తెలుగువారికి మూడు రాష్ట్రాలుండాలి!తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది!!!

katta jayaprakash said...

Though it is a painful decision but inevitable as Telangana people are being made guinea pigs and victims of selfis politics since 1956 and the common man and students are worst sufferers.Once a seperate state is made then people will be relieved of future agitations permanently.Definetely a number of problems arise while starting a new home and the people have to face these troublems for quite some time.The only ultimate satisfaction is self rule.All the leaders must work sincerely with dedication without corruption,scandals,scams and misapropriation of government revenue.Every citizen must pay all taxes regularly to increase the revenue for developmental activities.There should not be any laziness or nawab giri by any one otherwise it will be a state of povery in future.A commitment in this direction must be for atleasat ten years and one should not depend Hyderabad revenue only but the districts must generate revenue for progress of the new state.

JP.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి