Wednesday, January 29, 2014

దొంగలతో టీవీ చానెళ్ళ లైవ్ షోలు కరెక్టేనా?

దొంగలు..అదో ఘనకార్యం లాగా టీవీ చానెల్స్ ను ఆశ్రయించడం ఇప్పుడు తెలుగు దేశంలో ఒక కొత్త ట్రెండ్. దొంగోడి లైవ్ షో చేయడం చానెల్స్ కూడా ఘనకార్యం లాగా భావించడం కూడా చూస్తున్నాం.   
దొంగతనం చేసినోడు...నేరుగా టీవీ స్టూడియోకి వచ్చి..తానే దొంగనని దర్జాగా చెప్పడం..సారు గారిని ఆ ఛానెల్ వాళ్ళు ఇంటర్వ్యు ప్రత్యక్ష ప్రసారంలో చూపించి...పోలీసులను ఎర్రి పప్పలను చేయడం గత మూడు రోజుల్లో రెండు సార్లు జరిగింది. 
తనిష్క్ ను తనవి తీరా దోచుకున్న దొంగల్లో ఒకడు టీవీ-9 దగ్గరకు, ఇంకొకడు ఎన్ టీవీ దగ్గరకు  వెళ్లి...దొంగగా తనను తాను పరిచయం చేసుకుని...చేసిన ఘనకార్యం వివరించి...లైవ్ లో జాతి జనులను ఉద్దేశించి ప్రసంగించడం...వారికి యాంకర్లు వివిధ కోణాల్లో ప్రశ్నలు సంధించడం చూసాం.    
తెలుగు దేశం నాయకుడు పరిటాల రవిని మర్డర్ చేసిన మొద్దు శ్రీను కోసం పోలీసులు గాలిస్తుండగా...
ఆయన టీవీ-9 కు ఇచ్చిన ఇంటర్వ్యూ అప్పట్లో సంచలనం సృష్టించడం గుర్తుకు వస్తున్నది. పోలీసులకు దొరక్కుండానే..హైదరాబాద్ లో ఒక లాడ్జిలో బాంబు తయారుచేస్తూ సదరు శ్రీను దొరికి పోయి...జైల్లో హత్యకు గురయ్యాడు. 
ఇలా దొంగోళ్ళు స్టూడియోలకు వెళ్ళడం, వారిని చానెల్స్ యజమాన్లు 'మనోడే... మన బాపతోడే' అని అనుకోవడం కరెక్టేనా? మీకేమనిపిస్తున్నది? 

7 comments:

సుజాత said...


వాళ్ల కంటే దొంగలే చాలా మెరుగనిపిస్తోంది ! నిజాయితీగా ఒప్పుకున్నారు..పాపం పిల్లలు అనిపిస్తోంది

Ravi Chandra Enaganti said...

నాకెందుకో సంచలన వార్తలు దొరక్క టీవీ తొమ్మిది వాడే ఈ దొంగను ఏర్పాటు చేశాడేమో అనిపిస్తుంది :-)

Kishore said...

'దోపిడీ మిష్టరీని టీవీ9 ఛేధించింది ' అని అంటారు; మళ్ళీ అదే కధనంలో దొంగ తనే స్వయంగా వచ్చి లొంగిపోయాడని చెబ్తున్నారు. ఏది నిజం? దొంగే వచ్చి లొంగిపోతే టీవీ9 ఛేధించింది ఏముంది?

SIVARAMAPRASAD KAPPAGANTU said...

@Ravi Chandra Enaganti

Are you by any chance comparing this with fiction created by Irving Wallace "Almighty"!?

ధాత్రి said...

దొంగతనం ఎలా చెయ్యలో శిక్షణాతరగతులు నిర్వహిస్తున్నరు.సినిమాలకైనా ఒక బోర్డు ఉంది కాని వీరి హానికరమైన ప్రసారాలను అడ్డుకొనేవారు ఎవరూ లేకపోవడం శోచనీయం..

Swarupa said...

రామూ గారూ... ఇక్కడ మీకో విషయం చెప్పాలి. దొంగలిద్దరూ ఎన్టీవీ-టీవీ9ను ఆశ్రయించిన మాట వాస్తవమే. కానీ ఎక్కడా ఈ రెండు ఛానెళ్లు నిబంధనలు మర్చిపోలేదు. వారు ఆఫీసులకు రావడమే ఆలస్యం పోలీసులకు సమాచారం అందించి ముందు పౌరులుగా తమ బాధ్యత నిర్వర్తించారు. ఆ తర్వాతే వాళ్లను ఇంటర్వ్యూలు చేశారు. మొద్దు శ్రీను విషయంలో అంతర్గతంగా ఏం జరిగింతే నాకు తెలియదు గానీ... తనిష్క్ దొంగల విషయంలో మాత్రం మీడియా ఎక్కడా తప్పటడుగు వేయలేదు. నిబంధనలు మర్చిపోలేదు.

Ashok Kumar said...

meeku media meeda asahyam vesinattu.. a dongalaku kuda samajam meeda vegatu putti untundi. meeru oka blog creat chesi.. gatam lo mimmalni tittina valla meeda ippudu kasi tirchukuntunnaru. mari a dongalaki kuda publicity picha undemo.. vallu blog lo raste evaru chustaru?, anduke tv9, ntv office laki velli untadu anukunta.