Sunday, May 17, 2015

'ది హిందూ'లో చేరిన రామ్ కరణ్ గారు

మేము గతంలో ఒక పోస్టులో చెప్పినట్లు--హైదరాబాద్ కేంద్రంగా ఇంగ్లిష్ లో పక్కా ఎడిటర్ లక్షణాలు ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. తెలుగు చానెల్స్ లో అయితే ఎవ్వడైనా ఎడిటర్ అయిపోవచ్చు....ఇరగదీయవచ్చు. ముక్కు మీద కోపం జాస్తి అన్న అపవాదు ఉన్నా... అద్భుతమైన ఎడిటర్ రామ్ కరణ్ గారు. ప్రతిభను, నాణ్యతను, ముక్కుసూటితనాన్ని గౌరవించాలంటే రామ్ కరణ్ సార్ కు సాల్యూట్ చేస్తే చాలు. ఈ ఫోటోలో ఉన్నది ఆయనే. 

ఉస్మానియా లో జర్నలిజం విద్య అభ్యసించిన ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ స్థాయికి రావడంలో కీలక పాత్ర పోషించారు. టైమ్స్ వదిలాక టీ వీ నైన్ గ్రూప్ లో, తర్వాత 'ది  న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' లలో పనిచేసారు. తన సహాధ్యాయి అయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు రామ్ కరణ్ గారు ఐ న్యూస్ లో పెద్ద హోదాలో చేరారు. కొన్నాళ్ళ తర్వాత అది వదిలేసారు. ఆయన 'ది హిందూ'లో చేరితే బాగుండేదని అనిపించేది. 

'ది హిందూ'ను బలపరచడం లో భాగంగా.... ఇప్పుడు చెన్నైలో మంచి స్థాయిలో ఉన్న శ్రీనివాస రెడ్డి గారు మురళీధర్ రెడ్డి గారిని రెసిడెంట్ ఎడిటర్ గా తేవడంలో కీలక భూమిక పోషించారు. అదే అభిప్రాయంతో రామ్ కరణ్ రెడ్డి గారిని విజయవాడ రెసిడెంట్ ఎడిటర్ గా నియమించారు. దాంతో పాటు, మాజీ 'ది హిందూ' సీనియర్ చింతల ప్రశాంత్ రెడ్డి (ప్రస్తుతం బిజినెస్ స్టాండర్డ్ బ్యూరో చీఫ్) గారిని మురళీధర్ రెడ్డి గారి డిప్యుటీ గా నియమించారు. రవి రెడ్డి గారు బ్యూరో చీఫ్ గా ఉన్న 'ది హిందూ' ఈ సీనియర్ల చేరికతో మరింత బలోపేతమై శ్రీనివాస రెడ్డిగారి నేతృత్వంలో ఉన్నత స్థాయికి ఎదుగుతుందని ఆశించడం తప్పు కాదు. 

అన్నీ కులం కోణం నుంచి చూడడం అలవాటైన వాళ్ళు... 'ది హిందూ'లో రెడ్డి రాజ్య స్థాపన యత్నాలు అని మాకు రాసారు కానీ నీ... పై పేరాలో పేర్కొన్న మిత్రులంతా కులానికి, మతానికి అతీతమైన మంచి జర్నలిస్టులని గుర్తెరగాలి. 
అల్ ది బెస్ట్ 'ది హిందూ.'

5 comments:

Murthy said...

సీరియస్ గా కొన్ని ఏళ్ళు బాటు ఒక మంచి ఇంగ్లీష్ బ్లాగు /వెబ్సైట్ ని రాయగల ఆత్మ విశ్వాసం చాలామంది ఘనత వహించిన తెలుగు జర్నలిస్టులలో లేదు అనిపిస్తుంది. పెట్టుబడిదారులు గా చెప్పబడే ఒక ప్రధాన వర్గం వారి లో ఇంగ్లీష్ సరిగా రాయగలిగే లేదా మాట్లాడగలిగే వారిని నేనైతే ఒక్కరిని కూడా చూడలేదు. ఈ విషయం లో ఒరిస్సా జర్నలిస్టులు లక్ష రెట్లు నయం.ఉదహరణకి ఈ బ్లాగు చూడండి. www.orissamatters.com

శ్యామలీయం said...

>తెలుగు చానెల్స్ లో అయితే ఎవ్వడైనా ఎడిటర్ అయిపోవచ్చు....ఇరగదీయవచ్చు.

అవుననే అనిపిస్తోంది. తెలుగు చానెల్స్ వినిపించే తెలుగు భాషాసౌందర్యమూ వారిచ్చే స్క్రోలింగులలో కనిపించే వర్ణక్రమాదికాల సౌందర్యమూ చూస్తుంటే, తెలుగు చానెల్స్ ఎడిటర్ గారికి తెలుగు ఏమీ రాకపోయినా ఇబ్బంది లేదనే అనిపిస్తోంది.

katta jayaprakash said...

Talent is the prime factor but not caste.It is only the people who got caste eczema comment Adversely.What about late GK Reddy of The Hindu?

venu madhav said...

long time no postings ramu

JE said...

ఏంటి ఏమయ్యారు..ఛానల్ కు సంబంధించిన పోస్టింగ్స్ పెట్టండి బాబూ...మహా,సీవీఆర్, ఐ న్యూస్, 99 ఇలా జీతాలివ్వని ఛానళ్ల గురించి కాస్తో కూస్తో రాస్కుంటే గదా అందరికీ తృప్తైనా మిగిలేది..

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి