Wednesday, December 30, 2009

వెర్రితలలు వేస్తున్న నిరసన పద్ధతులు

ప్రత్యేక తెలంగాణా కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా... ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రసారం అవుతున్న కొన్ని నిరసన పద్ధతులు చూస్తుంటే జుగుప్స కలుగుతోంది. ప్రజలు కసితోనో...తెలిసో..తెలియకో...వినూత్నత్వం పేరిట చేస్తున్న నిరసనలు బాధ కలిగిస్తున్నాయి. అలాంటి వాటిని ఛానెల్స్  చిత్రీకరించి....మసాల దట్టించిన కాపీ తో స్టోరీగా ప్రసారం చేయడం నొప్పిస్తున్నది.

G.O.-610 విడుదలై పాతికేళ్ళు అయిన సందర్భంగా...ఒక చోట కొందరు పట్టభద్రులు...పేడతో చేసిన ఒక కేక్ ను కట్ చేసారు. దాన్ని చెప్పుల సహాయంతో లగడపాటి, జగన్ తదితర కొందరు నేతల ఫోటోలకు తినిపించారు. నిజానికి....ఈ రెండు వాక్యాలు ఇలా రాయడానికే ఇబ్బందిగా ఉంది. ఈ G.O. అమలుకాకపోబట్టి ఈ ప్రాంతంలో నిరుద్యోగులు నష్టపోయారనేది నిజం. అంతమాత్రాన...ఇంత ఘోరంగా నిరసన తెలపాలా? దీన్ని ఛానెల్స్ ఒక పెద్ద విడ్డూరంగా చూపడం బాగోలేదు.

ఆంధ్రాలో ఉద్యమం సందర్భంగా నిరశన చేస్తున్న ఎం.పీ.లగడపాటి రాజగోపాల్ గారిని తెలుగు దేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి గారు అభినందనపూర్వకంగా...రెండు చేతులతో తల పట్టుకుని నుదురు మీద ఒక ముద్దు ఇవ్వడాన్ని తెలంగాణా నిరసనకారులు ఘోరంగా అపహాస్యం చేస్తున్నారు. ఇది వెర్రితలలు వేసిన కొన్ని చోట్ల...లగడపాటి, నన్నపనేని ఫోటోలకు పెళ్లి చేసారు. ఇంత విపరీతార్థం తీయడం బాగోలేదు.


నల్గొండలో ఐతే...రాము అనే పేరుగల ఒకడు...నన్నపనేని మాస్క్ ధరించి వీధిలో కనిపించిన అందరికీ ముద్దులమీద ముద్దులు ఇచ్చాడు. అక్కడ డ్యూటీ లో ఉన్న ఒక మిలిటరీ వాడికి కూడా ఒక ముద్దు ఇచ్చాడు. దీన్ని...zee-24 gantalu ఛానల్ వారు ఒక స్టోరీ గా ప్రసారం చేసారు. 

మరికొన్ని చోట్ల సమైక్య వాదం అన్న బోర్డు పెట్టి శవ యాత్రలు, దహనాలు...నిర్వహించారు. ఇది ప్రజాస్వామ్యం అని మనం నమ్ముతున్న వ్యవస్థలో నిరసనలు మరీ...ఇంత పచ్చిగా ఉండాలా? లగడపాటి వారిది  కామిడీలే అని వదిలేసినా...ఒక మహిళ అయిన నన్నపనేని గారిని అంతగా అవమానించడం మంచిది కాదు. తెలంగాణా ప్రజలు స్త్రీ లకు ఇచ్చే గౌరవం లోక విదితమని గుర్తుంచుకోవాలి. 

అటు వాళ్లైనా..ఇటు వాళ్లైనా...ముందుగా మనం...మనుషులమనీ, మనుషులం కాబట్టి మనకు కొన్ని అభిప్రాయలు ఉంటాయని, ఇతరుల అభిప్రాయాలు విమర్శించే హక్కు ఉన్నా...మరీ మానవత్వం మరిచి...ఇతరుల హక్కులకు, గౌరవాలకు భంగం కలిగించరాదని గుర్తెరగాలి. 

చివరిగా--గత పోస్టుల్లో ఒక బొచ్చు కుక్క పిల్ల మీద ఆంధ్రా అనే బోర్డు పెట్టి  మిర్యాలగూడలో ఒక తెలంగాణావాది ఓవర్ యాక్షన్ చేసినట్లు రాసాను. కొద్దిగా కష్టపడి...ఆ పనిచేసిన వ్యక్తిని పట్టుకున్నాను. ఫోనులో మందలించాను. తాను చేసిన పని ఒక ప్రాంత ప్రజల మనోభావాలను ఎలా దెబ్బతీసేదీ వివరించాను. ముందుగా ఏదో కుంటి సాకు చెప్పబోయాడు, కానీ చివరకు తప్పు తెలుసుకున్నాడు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే... ఇలాంటి వెర్రితలలు వేసే నిరసనలను మీడియా బాధ్యత్తయుతంగా వ్యవహరించి సమాధి చేస్తే మంచిదేమో!

10 comments:

Anonymous said...

konni nijalu

http://dedicatedtocpbrown.wordpress.com/2009/12/28/%E0%B0%9A%E0%B1%87%E0%B0%A6%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%82-%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B1%80-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%82-%E0%B0%92%E0%B0%95%E0%B1%8D%E0%B0%95/

Unknown said...

సమైక్య ఆంద్ర పేరిట జరిగిన కృత్రిమ ఉద్యమం లో 13 రోజులపాటు ఆంధ్రాలో అనేక చోట్ల
ఎవరో ఒక వ్యక్తీ కి కే సి ఆర్ వేషం వేసి -
మెడలో చెప్పులదండ, ఖాళీ విస్కీ బాటిళ్ళు వేసి,
చేతిలో నిజం బీరు సీసా పెట్టి
చెప్పులతోచీపుళ్ళతో కొడుతూ నానా రకాలుగా అవహేళన చేసిన గొప్ప నిరసన ప్రదర్శనల గురించి ప్రస్తావించ లేదేం మిత్రమా?

తెలంగాణాకు మేం వ్యతిరేకం కాదు,
మీరు బిల్లు పెట్టండి మేం మద్దతిస్తాం,
అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం,
సామాజిక తెలంగాణా అంటూ నానా రకాలుగా మభ్య పెట్టి
తీరా నిర్ణయం తీసుకున్నాక నీతీ జాతీ లేకుండా ప్లేటు ఫిరాయించిన లత్తకోరు రాజకీయ పార్టీల , అవకాశ వాద నేతల ప్రవర్తన తెలంగాణా ప్రజలను ఎంత బాధ పెట్టిందో ఆలోచించరేం ?

ఈ సృజనాత్మక సింబాలిక్ నిరసనలు నిజానికి నీతీ నిబద్ధత లేని మన స్వార్ధ నేతల కేమీ ఆనవు.
దున్నపోతు మీద వర్షం పడ్డట్టే.టేక్ ఇట్ ఈజీ .

కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేయకుండా
అసలు సమస్య సత్వర పరిష్కారం మీద దృష్టి పెట్టండి!

Ramu S said...

raajanna,
k.c.r.vesham vesi akkadi janam chesina avahelana gurinchi aa roje raasaananna. jara paata postulu chadavocchukadaa.
..ramu

Anonymous said...

rajagopal ki GARU ani maryada itchharui.military man ni VADU ani amaryadaga vrasaru.

Please edit.

military man is better than any other poitician

Ramu S said...

Chandu gaaru,
Thanks for the alert. I am extremely sorry for the silly mistake. I agree that military men are always better than any politician. I am very sorry for the inadvertent mistake. I am unable to change it in the post due to a technical problems.
Once again thanks for your keen observation and kind alert.
ramu

Anonymous said...

ramu sir...

Naaku ee post chadivite meeru telangana pine mee akkasunu vellagakkinatte kanipistundi.
Meeru manobhavala gurinchi rasinappudu telanaga vallaku kuda manobhavalu untayani teluvada..
gata 50 samvatsaraluga maa manobhavala gurinchi alochinchinollu leru.
Ippudu edo kondaru avesham,avedana lo cheste,danni meeru etla rasinarante telangana vallu strilanu gavaravincharu ani.
Rendu prantala manobavala gurinchi raasi vunte mee post chadivinanduku santoshinchevaani.

Saahitya Abhimaani said...

Ramuji,

What is happening is that if in some area somebody protests in a particular manner, in that area, news hungry cameramen capture it(or they will be forced/asked to cover it) and ever hungry editors in Studios show it (they have to fill up 24 hours!) without giving a second thought as to the sensibilities of people who would be watching. Problem is more with the so called Editors in media rather than with people. We need mature people in the studios. Just because some footage is received, it is not always necessary show it all. Only sensible news (the word sensible should be properly defined and more importantly understood)should be aired. If one cannot find footage to fill the so called 24 hour news channels, better show some bhajans by Anup Jalota or show some Abba music videos, but do not play with the people and their emotions.

Anonymous said...

రాము గారు,

ఉద్యమాల విషయం పక్కన పెడితే, ఒక స్త్రీ అభిమానంగా ముద్దు పెడితే ఇంత దిగజారుడు పనులు చెయ్యాల! నిరసన చూపించటానికి ఇక పద్దతులే లేవా!ఈ వార్త తెలిసినప్పటి నుండి చాలా అసహ్యంగా అనిపిస్తుంది.ఇలాంటివి ఆపటానికి ఏమి చెయ్యాలో తెలియక ఆవేదనతో ...

సుధ

Anonymous said...

mi postlo journalisticlaki avasaramaina balanceni chakkaga chepparu. Kani prastutam journalistlu rajakiya nayakulani minchipoyaru. Vallaku ilativi chepadam valla upayogam untundantara? e udyamalu prabaladanki journalistlu chesina seva samanyulakanna, rajakiyanayakulakanna chala ekkuvaga undannadi kadanaleni nijam. telangana culture gurinchi ento idiga cheppe kcrgaru nannapanenini apahasyam cheydam, mana chanels danni ento badhyatato prasaram cheydamto anta adi sababu ankuntunnattunnaru. emaina mi post matram chala bagundi.journalistlu e profession enta badhyatayutamaindo gurtiste bagundu

Anonymous said...

helo,

Mano bhavalu gurinchi bagane raseru bagundi adi iru prantala mano bhavalu gurinchi raasthe baguntundhi.

Telangana prakatincha gane andhra lo undhyamalu puttukavachinai

samaikya andhra chala bhagundhi, nenu korukune telangana prajalu korukunnedi samaikya andhra ante andhra vallu andharu smaikyam ga undandi alage ma telangana vaalamu kuda samaikyam ga untam antunnam, samayka telangana.

asalu andhra valla ku charitra annade telavadu, ex: potti sriramulu garu madras nunchi andhra divide avvataniki nirahara deeksha chesaru appudu telangana state already vidi gane unnadi kani andhra vallu sriramulu garu telugu varu andharu kalasiundalani udyaman chesarantunnaru idi andhra valaki telisina cheritra.
Even the graduates and PG of andhra students dont know the history of andhra and Telaengana

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి