Tuesday, January 5, 2010

మీడియా --అడ్వర్టైజుమెంటు మాఫియా

తెలుగు టెలివిజన్ ఛానెల్స్ లో బూతు కార్యక్రమాల ప్రసారంపై మేము రాసిన పోస్టులకు...చాలా ఆవేదనతో క్రమంతప్పకుండా స్పందిస్తున్న సదాలోచానపరుల్లో గౌరవనీయులు కప్పగంతు శివరామ ప్రసాద్ గారు ఒకరు. సమాజహితం పట్టని ఈ నీచ నికృష్ట ఛానెల్స్ పై కోర్టుకు వెళ్తే ఎలావుంటుందని కూడా వారు సూచించారు. TV-5 ప్రసారం చేసిన 'నగ్నా'మృతం...మీద పెట్టిన పోస్టుకు స్పందనగా వారు పంపిన వ్యాఖ్యను ఇక్కడ ఇస్తున్నాము. సమాజం గురించి ఆందోళన చెందుతున్న శివ గారికి హృదయపూర్వక అభినందనలు---రాము, హేమ
---------------------------------------------------------

ఈ విషయం మీద కొంత ఆలోచించిన మీదట నాకు అనిపించినది ఏమంటే, ప్రస్తుతం మన సమాజం అడ్వర్టైజుమెంటు మాఫియా చేతుల్లో నలిగి పోతోంది. ఈ మీడియా గాళ్ళందరూ, ఆ మాఫియా చేతిలో కీలు బొమ్మలే. చాపకింద నీరులాగ, ఈ అడ్వర్టైజుమెంటు మాఫియా అన్ని చోట్లా చేరి మన జీవితాలను భ్రష్టు పట్టించి తమ తమ వ్యాపార పబ్బాలను గడుపుకోవటానికి అన్ని పన్నాగాలను పన్నుతోంది. ఏ చానెల్ కు ఏ రేటిన్గు? ఎందుకు? ఎవడికి ఎంత రేటింగు అయితే అన్ని అడ్వర్టైజుమెంటులు వస్తాయి, దాంతో బాటే డబ్బులు. అది అసలు కథ. 

ఇదివరకు ఎక్కడో ఓ పత్రికలో ఒదిగి ఉండే ఈ అడ్వర్టైజుమెంటులు, ఇప్పుడు కాల సర్పాలలాగ ఆ పత్రికలనే మింగేసి, వాటిల్లో ఉండే కథలను ఇతర శీర్షికలను పక్కకు నెట్టేసి వాటిని ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. దూరదర్శన్ నుండి ఈ రోగం బాగా వంట పట్టించుకున్నయి చానెల్సు అన్ని.

మనం కూడ అబ్బా బాగుంది బాగుంది... అని ఎగపడి చూస్తున్నాము, వాళ్ళు చెలరేగి పోతున్నారు. మనం చూసే ప్రతి ప్రోగ్రాము, స్పాన్సరుడు, అంటే ఎవడో ఒక వ్యాపారి తన వస్తువులను అమ్ముకోవటానికి ఈ చెత్త ను స్పాన్సరు చేస్తాడు. అది మనం ఎగబడి చూడటం వల్ల తన వస్తువులను (ఎంత పనికిరానివైనా) అమ్ముకోవటానికి ప్రచారం సంపాయించి పదే పదే చూపటం వల్ల మన మీద తెలియకుండా మన కొనుకోలు ప్రవర్తన మీద ప్రభావితం చేస్తారు. 


మనం మన కేబుల్ వాడికి కట్టేదే ఖర్చు అనుకుంటాము. అది సరి కాదు. మనం కొనే ప్రతి వస్తువులోను, మనం చూసే/చదివే ప్రతి చెత్త ఖరీదు పడుతోంది. ఇది తెలుసుకుని, ఇది చూడచ్చు, ఇది చూడకూడదు అని నిర్ణయం తీసుకోగలిగిన పరిణితి మనకు వచ్చి, టీ.వి. తీసేస్తే ఇవన్ని సద్దుమణుగుతాయి. ఇక్కడ బ్లాగుల్లో ఎంత వ్రాసినా అరణ్యరోదనమే. కారణం బ్లాగుల్లో వ్రాసేవారే ఇక్కడ ఎక్కువమంది చదువుతారు, వ్యాఖ్యలు వ్రాస్తారు. జనరల్ పబ్లిక్ కి ఈ బ్లాగుల గురించి తెలుసా?? నాకు అనుమానం. 

ఈ మీడియా వాళ్ళు అస్సలు చూడరు. వాళ్ళకు టైమేది, రేపు మరేమి చెత్త చూపించాలి అన్న విషయం లో చాలా బిజీ. డబ్బులు కోసమే ఈ చానెల్సుకాని, సమాజ శ్రేయస్సు కోసమా? ఈ చానెల్సు పెట్టిన వాళ్ళల్లో ఒక్కడుకూడ సమాజం గురించి అలోచించట్లేదు. సామాజిక స్పృహ (ఈ జర్నలిస్టులమని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఈ మాటను తెగ వాడేస్తుంటారు తమ సౌకర్యం కొద్ది) అనేది మృగ్యం. కాబట్టి ఈ అడ్వర్టైజుమెంటు మాఫియా (అవును మాఫియానే) కోరలలోంచి మనను రక్షించేది ఎవరు? మనకు మనమే. 

అతి వ్యాపార ప్రకటనలు చేశే ఉత్పత్తులను కొనటం మానేయ్యాలి. చండాలపు ప్రోగ్రాములను స్పాన్సరు చేస్తున్న ఈ వ్యాపార సంస్థలకు మన అభిప్రాయాలను తెలియ చెయ్యాలి. ఈ రోజున ఆ పని ఇంటర్నెట్టు ద్వారా చాలా సులభం.

6 comments:

admin said...

కొనక పోవడం అనేది కాదు.. టీవీ ప్రసారాల మీద సినిమా ల లాగే సెన్సార్ ఉండడానికి భాద్యత కలిగిన వ్యక్తులు గా మనం కృషి చెయ్యాలి . కోర్టు లో పిల్ వేద్దాం.. మన బ్లాగ్గర్స్ అందరం కలిసి. దీనికి ఒక ప్లాట్ ఫోరం ఏర్పాటు చేసుకుందాం. రాము గారు ఇందులో ఆక్టివ్ పార్ట్ గ ఉండాలి.

Anonymous said...

axe స్ప్రే ప్రకటన సెన్సార్ చేయవలసి ఉన్నది .అందులో లిఫ్ట్ లో ఒక అమ్మాయి అబ్బాయి ఎక్కి దిగబోయే ముందు ఆ అబ్బాయి ఫీలింగ్స్ కి అర్ధం ఏమిటి ? అని పిల్లలు అడిగితేటీవీ వాళ్ళు ,కంపనీ వాళ్ళు ,గవర్నమెంట్ ఏమి సమాధానం చెప్తాయో చూడాలి ? డబ్బు కోసం తన శరీరాన్ని అమ్ముకొనే వాళ్లైనా తమ పిల్లలని ఇటువంటి వాటిని చూడనిస్టారా ? సమాజపు నైతిక పతనానికి ఇవాల్టి తల్లితండ్రులు వీటిపై పోరాడలేక తమపిల్లలికి చెప్పలేక ,రేపటి చిన్నారుల
జీవితాలను నాశనం చేస్తున్నాం .అయ్యా ,ఒక డాక్టర్ తన భద్త్యత గా పేపర్లలో ,టీవీ లలో మంచి విషయాలు చెప్తారు .కాని న్యాయవాదులు ,ఒకప్పటి స్వాతంత్ర్య పోరాటానికి కారకులు ఎందుకు మౌనంగా ఉన్నారో ? డబ్బిస్తే కాని వైద్యం చేయని (అత్యవసర ప్రాధమిక వైద్యం )డాక్టర్ ది ఎంత నేరమో అంతకు (సమాజం X రెట్లు )లక్షల రెట్లు నేరం ఇలాంటి వాటి పైన కోర్ట్ లో కేసు వేయకపోవటం .చూడటం మనేయ్యోచు అని ఎవరైనా అంటే ,మంచి సినిమా మధ్యలో ఇలాంటి ప్రకటనలు ఎలా చూడకుండా ఆపగలం .సెన్సార్ కి ఒక స్వచ్చంద వెబ్సైటు ఉండి ఇదిగో ఇలాంటి సన్నివేశాలు ,ప్రకటనలు మేము అంగీకరించ వచ్చా అని కొంత చర్చ జరగాలి .లేదా random గా లేదా సేక్రేట్ గా కొన్ని ప్రాంతాలనుంచి కొంతమంది ప్రజలో ,ప్రభుత్వ అధికారులనో (రహస్యంగా ఎంపిక చేసి )
వాళ్ళు మెజారిటీ అంగీకరిస్తే అప్పుడు సినిమా ,టీవీ ,ప్రకటనలు టెలికాస్ట్ చేయాలి .pilot ప్రాజెక్ట్ గా చేస్తే మంచిది .

Saahitya Abhimaani said...

Thank You Ramu garu for converting my comment on one of your posts into a new post of its own
I am of the view that media alone is not the reason for the rot. its everybody. The advertising agencies as a cartel command the respect of the channesl and the manufacturers themselves command the advertising agencies. Its a Circle.

Whatever it is there is every necessity to contain and regulate the media today. The overaction and misbehaviour is so much that even the Loksatta Leader is demanding that for six months all news channels to be closed for improving the situation in Andhra Pradesh. Even ardent opponent of censorship is coming out with that kind of opinion we can imagine the seriousness of the situation.

kvramana said...

Anna
I completely agree with this post. I would also like to draw your attention to the content of a newspaper too. I would not like to name the newspaper, but a leading newspaper has been offering space to its leading advertisers. The reporters and the desk too are under an obligation to cover/carry the stories of these clients. In a way, the newspaper is forcing the readers to read what its advertisers want to say. Though these are typically categorised as advertorials, they dont look so. They become part of the regular stories. There has been a convention to identify such reports either with a different font or with ADVT written on it. But, the managements do not want to do so and promise the advertisers that their stories will be covered. This automatically means that the newspaper will invariably write good things about the advertisers and ignore anything negative, which might of public interest. So, to avoid any negative writeups in a newspaper, the advertisers too are queuing up to become a part of the game.
Ramana

shankar panthangi said...

spoorthy dayakamyna nee aalochanalu journalisum lo pani chesthunna vaarikiaalochanalu rekathimpa chesthunnayi, viluvalatho kudina jouranlism ika chudalemanna variki Asha deepaga undi, mee krushiki maaa Abhinandhanalu...shankar, secretary, andhra pradesh workinjouranlist federation

bobby said...

dear ramu,
nice thought provoking article. it is high time that we should have some sort of censorship or some system controlling electronic media.
of late you might have observed that one leading english news paper is publishing photos of girl friends of international sports persons ironically in a sports page.
i wonder whether they want the upcoming sportspersons to get inspiration from these ie if u become a good sports person u will have a nice girl friend.
besides not only publishing photographs there are also articles how tiger wood spent his christma with his mistress n duration also
so mfar as electronic media is concerned the less said the better .
Undser the guise of freedom of press they think they can telecast any programme and get away without
without eve bothering about
consequences therof.

we have seen some channels showing the porno scenes repeatedly under the caption that some some cyber cafes have been raided.we r watching high lighting of suicides who failed in exams love affairs though all the sociologists n psychologists have always said these kind of telecasts would provoke the similarly situated persons to take exttreme step as if it is the only solution
any way lot to say about these
keep up good work

bobby

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి