ఈ ఉదయం ఇన్విజిలేషన్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ సింహద్వారం నుంచి ఆర్ట్స్ కాలేజ్ వైపు వెళుతుంటే...గుండె తరుక్కుపోయింది. టాగోర్ ఆడిటోరియం దగ్గర ఒక ఎం.సీ.ఏ.విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి ఒళ్ళు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 'సోనియాజీ తెలంగాణా ఇవ్వండి'...అని రాసి వున్న ఒక కాగితం వదిలి వెళ్ళాడు.
నల్గొండ జిల్లాకు చెందిన వేణు చదువులో, కమ్యునికేషన్ స్కిల్స్ లో ఇతరులకన్నా ముందు ఉండేవాడట. ప్రతిభావంతుడైన ఒక యువకుడు ఇలా ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధాకరం. ఇప్పటికే రెండు పక్కలా కలిపి వంద మందికి పైగా బలవన్మరణం పొందారు. డిమాండ్ ఏదైనా...ఇలాంటి పని చేయడం ఆక్షేపణీయం. ఈ సంక్లిష్ట పరిస్థితిలో ఇలా చనిపోయి సాధించేది ఏమిటి?
ఇది మొట్టమొదటి సారిగా ఉస్మానియా క్యాంపస్ లో జరిగిన దుర్ఘటన. ఇది మరొక ఘట్టానికి తెరలేపుతున్నది. కే.సీ.ఆర్. నిరాహార దీక్ష తర్వాత...అనూహ్యంగా ఈ ఆత్మహత్యల పరంపర మొదలయ్యింది. మర్నాడు 'విద్యార్ధి గర్జన' ఉన్నందున...సోనియా గాంధీ జన్మదినం రోజే చిదంబరం ముందూ వెనుకా ఆలోచించకుండా...ఎవ్వరితో ప్రత్యక్ష సంప్రదింపుల పనిలేకుండా...ఆ ప్రకటన చేసారు. 'తెలంగాణా వాళ్ళు గింజుకు చచ్చినా...ప్రత్యేక రాష్ట్రం ఇవ్వర్లే," అని అన్ని తీర్మానాలకు వాకే అన్న ఈ బాధ్యతలేని నాయకులు...ఆంధ్రా, రాయలసీమలలో ప్రజా స్పందన చూసి వెంటనే పిల్లిమొగ్గలు వేసారు. అక్కడ అలజడికి, ఆగని మరణాలకు కారణ"భూతం" అయ్యారు వీరంతా.
ఇంత జరుగుతున్నా...సోనియా అండ్ కో ఒక నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేక ఇక్కడ రాష్ట్రాన్ని పలురకాలుగా నాశనం చేస్తున్నది. చిదంబరం ప్రకటనలు...అన్ని పక్షాల జనాన్ని పదజాలంతో మోసం చేసేవిగా ఉన్నాయి తప్ప ఏమీ ఒరగబెట్టడంలేదు. కేంద్రం ఇలా మన రాష్ట్రంతో మాటలతో, మౌనంతో ఆడుకుంటుంటే...మన నాయకులు రెండుగా చీలి ఎవడి గొడవ వాడిదన్నట్లు స్టేట్మెంట్లు ఇస్తూ స్వలాభనష్టాల బేరీజులో పడ్డారు. చేవ, రోషం లేని ఒక ముఖ్యమంత్రి చోద్యం చూచుచూ పన్నుల మోత మొగించుచూ ఉన్నారు తప్ప సమస్య పరిష్కారానికి ఏమీ చేయలేక పోతున్నారు.
ఇది అర్థంకాని గందరగోళంలో ఉన్న యువకులు అమాయకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్రం మీనమేషాలు లెక్కించకుండా...అటో ఇటో ఒక నిర్ణయం తీసుకోవాలి. ముసుగులో గుద్దులాట ఇక ఏ మాత్రం మంచిది కాదు. ఒక పక్క జనం చస్తుంటే..మరొక పక్క ప్రాంతీయ విద్వేషాలు బుసలుకొడుతున్నాయి. ఇంకోపక్క అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రం ప్రమాదకర స్థితిలో తిరోగమనంలో ఉంది.
"ఇతర ప్రాంతాల అభ్యంతరాలతో పాటు ఇస్లామిక్ తీవ్రవాదం, మావోయిజం హింసల పై మాకు భయం ఉంది...అందుకే తెలంగాణా ఇవ్వడానికి మాకు కొంత సమయం కావాలి," అని స్పష్టంగా చెప్పినా..."ఇది దీర్ఘకాల సమస్య. ఇప్పటికే...ఒక మాట ఇచ్చి ఉన్నాం కాబట్టి తెలంగాణా ఇవ్వక తప్పడంలేదు," అని ప్రకటించినా...ఈ సందిగ్ధ పరిస్థితి ఉండదు.
అప్పుడు జరిగే గొడవ ఏదో...కొన్ని రోజులు జరిగి చల్లారుతుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకుని...ధైర్యంగా ప్రకటించి...పరిణామాలకు సిద్ధపడితే...నష్టం ఇంతగా ఉండదు. తేనెతుట్టెను కదిల్చి...కందిరీగలు జనాలను కుడుతుంటే....నిర్ణయాలు చేయలేక కాలక్షేపమే మంచి మందని అనుకోవడం అవివేకం, మూర్ఖత్వం, దేశద్రోహం.
ప్రమాదకరమైన మౌనముద్రతో ఇన్ని మరణాలకు, నష్టానికి కారణం అవుతున్న సోనియా బృందం, ఈ యావన్మంది స్వార్ధ రాజకీయ నేతలు రాష్ట్రానికి నష్టపరిహారం చెల్లించాలి. ఇరు పక్షాల నేతలు, మీడియా విద్యార్ధులను, యువకులను రెచ్చగొట్టడం వెంటనే ఆపాలి. ఇంకా ఒక్కడు చచ్చినా...ఉద్యమాన్ని ఆపేస్తామని గాంధీజీ స్ఫూర్తిగా ప్రకటించాలే తప్ప...ఇలాంటి చావులతో ఉద్యమాలకు ఊపిరిలూద్దామని చంకలుగుద్దుకో కూడదు. ఇలా సమిధలవుతున్నది ఎక్కువగా...బడుగు బలహీన వర్గాల యువకులే. వారి మరణం...వారి పేద కుటుంబాలకు కోలుకోలేని కుదుపు, అశనిపాతం.
తమ్ముళ్ళూ....రాజకీయ నేతల ప్రకటనలు, కల్లబొల్లి కబుర్లు చూసి ఆవేశానికి, నిస్పృహకు లోను కావద్దు. ప్రాణాలు తీసుకోవద్దు. ఒక అభిప్రాయాన్ని లేదా నిరసనను తెలియజేయడానికి మార్గాలు చాలా ఉన్నాయి. అన్నింటికీ...చావే పరిష్కారం కాదు. మిమ్మల్నే నమ్ముకుని...అనునిత్యం మీ కోసమే పరితపిస్తూ మీ అభ్యున్నతిని చూసి ఆనందిద్దామని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లి గురించి ఓ క్షణం ఆలోచించండి. ఇలాంటి చావు...ముమ్మాటికీ ఓటమే.
ఈ గొడవ మధ్య ఇంకొక అమానుషమైన పరిణామం జరుగుతున్నది. ఇతర రెండు ప్రాంతాలలో మరణాలు ఇక్కడి నేతలకు కనిపించడంలేదు. ఇక్కడి ఆత్మహత్యలను అటు పక్క నేతలు లెక్కలోకి తీసుకోవడం లేదు. వారి యువత చేస్తే అది 'బలిదానం'...వేరే ప్రాంత యువత అదే పని చేస్తే...అది 'అనవసరపు చావు'! ఎటుపోతున్నాం? మనం ఏమైపోతున్నాం?
టీ.వీ.ఛానెల్స్ మైకుల్లో, స్టూడియోలలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న నేతలు....కళ్ళు తెరవండి, కుళ్ళు మరవండి. మనం రాక్షసులం కాదని..మనుషులమని కాస్త గుర్తుంచుకొండి.
Tuesday, January 19, 2010
Subscribe to:
Post Comments (Atom)
22 comments:
EXAMS ELAAGAINAA POSTPONE CHEYINCHENDUKU EVARAINAA VENUGOPAL REDDYNI MURDER CHESI UNDOCHUKADAA
ENDUKANTE EXAMS POSTPONE CHEYAALANI RENDU VARGAALU UNIVERSITYLO 18TH GODAVA PADDARU
The problem we have today is created by the Govt both at the Central and State level. Even if they take a decision either way, it will be tough to implement it forcefully. Probably they don't have guts to implement either solution. May be also because Sonia Gandhi is not Indira Gandhi. or May be because of the democratic times we are living, people like Manmohan may find it tough to implement any decision forcefully without consensus.
Funny thing is, two people whose foolish acts brought the situation to this level YSR and CB NAIDU are nowhere near scene.
if the maniestos of the political parties have any sanctity, if the political parties believe in the democracy (which they boast as the worlds largest democracy) the political parties that have deviated from their promise in the elections manifesto should ask the election commission to declare the election of its legislators as null and void and that they will go for fresh mandate from the people on their renewed policy.
But it sounds a big joke for our leaders who swear by the constituion. Next time when such parties go to the people, the people should reject these parties. Who is responsible for the suicides? The parties that are responsible for the protests (reason for protests is the 'u' turn by parties on telangana)are responsible. second, the leaders who time and again take hundreds of seconds on television to declare that they would be the first to 'sacrifice'. The leaders who think hundred times before quiting the post can never sacrifice.
A very good and balanced piece of writing.My heart is burning continuously at the tragedy of our students who are supposed to fulfill the dreams and aspirations of their parents for good academic career andemployment so that these youngsters will look after their families as well as parents with love and responsibility.But the way our students committing suicide emotionally without any proper thinking is indeed deplorable and unjustified irrespective of their participation in the agitations.
I feel our politicians are inciting our innocent students to take their lives.
How many political leaders,MLAs,MPs,ministers and other political VIPs committed suicide for a seperate Telangana since 1956?Except for fast unto death now and thenm no politician has so far come forward to sacrifice the life for the cause of Telangana and more over they got good benefit out of agitation of Telangana bu getting good posts in the ministry since the agitation by TPS during Chenna Reddy's leadership.Chenna Reddy,Venkata Swamy,Madan mohan,.Mallikharjun,Anjiah,Hashim and others who were active for a seperate state agitation backtracked and succumbed to the pressures of late Indira Gandhi and enjoyed power and earned a lot for generations.But how many of thse leaders committed suicide for ther cause of Telangana?How many present leaders of TRS,TDP,BJP,CPI and other prominent leadr of JAC are ready to sacrifice their lives?Why the family members of KCR who are infront line of agitation are not ready for sacreifice?When these leaders are reluctant to sacrifice their lives why are they not preventing the students from suicides.If these leaders sacrifice the students will automatically stop self immolation.The leaders want to enjoy the power at the cost of the sacrifice of our students and this is the history of Telangana.If these leaders become our rulers in Telangana state they just loot Telangana more than Andhras and make the people poorer.
I SINCERELY,HUMBLY AND HEARETFULLY APPEAL TO MY STUDENT FRIENDS OF TELANGANA NOT TO TAKE THE DRASTIC STEP SUICIDE,SELF IMMOLATION etc but fight for the casue during their life time only.Nothing can be achived by taking away one's life as the rulers have become stone hearted and the meaning of sacrfice has lost it's importance in these days but one has to fight till the last breath for any cause.Suicide is not only a crime but a big sin too.PLEASE PLEASE DONOT TRY FOR ANY SUICIDE OR SELF IMMOLATION BUT TRY TO BRING PRESSURE ON THE POLITICAL LEADERS FOR REACHING THE GOAL AS THESE LEADERS ARE THE IMMEDIATE BENEFICIARIES OF A SEPERATE state as common never expects the price of rice,pulses edible oils,electricity,petrol and diesel and others will come down the moment Telangana gets seperate state.
JP Reddy.
Anna
One of our friends in his comments expressed his/her doubts on Venugopal Reddy's death. Yes, it is true that there was a major altercation between two groups of students on the campus over postponement of examinations. The meeting apparently happened at the Tagore Auditorium. Reddy too has committed 'suicide' near the auditorium. Late on Tuesday, the postmortem report has confirmed that it was a suicide. But, the scene at Tagore auditorium does not give any evidence to make you believe that it was a suicide. Reddy's body is just lying there. There is no sign of the struggle a person goes through after immolation. No ash, no pieces of burnt skin, no impact of fire on the grass on the floor, no signs of Reddy running around due to the burns...nothing. Mysterious. May be a coincidence, there was an inhuman discussion on one of the channels. One of the participants pointed out that all those who have committed suicide so far are from Dalit community. He alleged that the forward caste is enjoying as the lower classes are sacrificing. Very next day, a forward caste student committed 'suicide'. Still, I think it is just a coincidence.
It is a real tragedy that 195 people laid their lives for Telangana till Tuesday.
Ramana
A very good post related to the current situation.
You said it exactly right.
Where are we going ?
Why are we being ruled by such politicians?
I'am feeling so disturbed and sad about the innocent students.
Why should he suicide in OU campus? No one heard of his cries while burning?
I strogly believe it to be a political murder, followed by KCR's statement of 'heads will be severed if no statement infavour of the seperation'.
And also the hype that is being created by CHEAP reporters & TV Channels.
What more clarity you need, Ramu?
Did you mean that, Center should say YES to T? It did that on 9th Dec. The state saw the result.
Do you want them to say NO? They "almost" did that in the second statement. We all saw the result.
Now, as I see the Jan5 meeting outcome, Center's stand was clear. "Conduct Wider Discussions & get some consensus".
It means
a. can not promise a deadline
b. can not assure a T
c. Will put sincere effort, owing to availability of all people for discussion
To sum up: The process has begun. It does not ensure a T. Neither it deny a T.
It assures discussions.
What else do you want?
Center's stand is the political diplomacy of putting something in cold storage.
>> 195 people laid their lives
>> for Telangana till Tuesday.
On that note, Some points for academics to think & spread the awareness
1. No politicians' kith/kin has suffered any damage in the agitation till date. Why?? Does any agitator realized this till date?
2. Politicians were making empty statements..About resignations Ponnam prabhakar challenged a govt employee, that resig is not easy. in response, the govt employee resigned in a second! Ponnam has no answer
3. students are fooled by false cinemas, that student power is supreme. They realise the truth, after some 'bokkalu' are broken.
4. As someone wrote above, students have no benefit of T. It is the politicians who will be immediate beneficiaries.
So, it is better for them NOT to resort to extreme actions like suicide or arson.
Finally, today's student's death was mysterious. It "may not" be suicide.
VUNUGOPAL REDDYDI MURDER AYI UNDOCHANI OKA NAYAKUDU KOODA CHEPPADAMELDU STUDENTSKI BHAYAPADUTUNNARU.. CAMPUSLO EXTREMISTS EE PANI CHESI UNDOCHU
VENUGOPAL REDDY DI MUMMATIKI MURDEREEE... SUICIDE KAADANIPISTHONDI. IDI STUDENTS MADHYA JARIGINA GODAVALE KARANAMANIPISTHONDI. MANCHI INTELLIGENT STUDENT SUICIDE CHESUKUNENDUKU VELLEDU. EVARAINA MURDER CHESI THAPPUDOVA PATTINCHARANI ANUMANAM KALUGUTHONDI. UNIVESITY CAMPUS LO ILANTI DARUNAM PAKKAMANISHIKI KOODAA TELIYAKUNDA JARIGINATLUNDI. VENUGOPAL MOBILE KU VACHINA OUTGOING CALLS, INCOMMING CALLS, SMS LANU PARISEELISTHE VASTHAVAALU VELUGU CHOOSE AVAKASAM UNDI. VENUGOPAL ATHMAHATYA CHESUKUNENTHATI PIRIKIVADU KADU. VENUGOPALNU EVAROO MURDER CHESARU... ATHMAHATYAGAA CHITREE KARINCHI JANAANNI, VYAVASTHANU THAPPUDOVA PATTINCHI... VENU PARENTSKU KADUPUKOTHA MIGILCHARU. POLISULU EEKESUNU PARISEELINCHI MOBILE NUMBARLA AADHARANGA NINDITHULANU VICHARISTHE ASALU KATHA TELUSTHUNDI.
తెలంగాణ ఆత్మహత్యలతో రాదు. తెలంగాణకు అడ్డం కోస్తా వాళ్ళ ప్రయోజనాలే. ఆ ప్రయోజనాలనే గాంధేయవాద పద్దతిలో దెబ్బ తీయాలి. వాళ్ళ షాపుల్లో కొనొద్దు. వాళ్ళ వృత్తి పనివాళ్ళ సేవలు తీసుకోవద్దు. వాళ్ళ సినిమాలు చూడొద్దు. వాళ్ళకు మన సేవలు అందించొద్దు. ఏ పనికైనా ముందు నువ్వు సీమాంద్ర వాడివా? అని అడిగి నిర్ణయం తీసుకోవాలి. కార్పోరేట్ సంస్థలు అటో ఇటో తేల్చుకుని ప్రకటన చేశాకే తెలంగాణ కులంలో చేర్చుకోవాలి. తోటి తెలుగు వాడి విషయంలో ఇలా చేయడం భాధాకరమే. కానీ లక్ష్య సాధనలో ఇలాంటివి తప్పదు. ఈ క్రమంలో మహారాష్త్ర, కర్ణాటక ప్రజల సాయం తీసుకోవాలి. ఆర్ధికంగా కొన్ని కష్టాలు తప్పవు. భరించాలి. ప్రయోజనం లేని చోట ఏ కోస్తా బ్రదరూ పేగు బంధం అంటూ ఎక్స్ ట్రాలు చేస్తూ పట్టుకొని వేలాడడు. మనం ఆర్ధికంగా వెలి వేస్తే రాయపూర్ లో ఉన్న తెలుగు వారిని ఉద్దరించడానికి వెళతాడు. సోదరుడైనా సీమాంద్ర వాడిపై ఎందుకింత పగ అని అడగవచ్చు. కేంద్రం ఎవరి లాబీకి భయపడి తెలంగాణ ఆపింది? ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంది? ఆలోచించాలి.
ప్రజాస్వామ్య భారత దేశంలో ఇంతకన్న మార్గం లేదు. తుపాకి పట్టుకుంటే తొక్కేస్తారు. జాగ్రత్త. ఇండియన్ గవర్నమెంట్ ఎంత లిబరల్ గా ఉంటుందో, తన ఇంటెగ్రిటీకి ముప్పు వస్తుందని భావిస్తే అంతే దారుణంగా తొక్కేస్తుంది. కేంద్రానికి విధేయంగా ఉంటూ లక్ష్యం సాధించుకోవాలి. కే సీ ఆర్ కోస్తా పెట్టుబడి దారులతో కలవనంత వరకు అతను రైట్. ఈ విషయంలో తెలంగాణ విధ్యార్ధులు కే సీ ఆర్ తో కూర్చుని తేల్చుకోవాలి.
Anonymous, please don't joke or don't speculate on died people
non cooperation movement? partnering with Karnataka & maharashtra????
if Marathi's do the same to your mahaboob nagar migrants in Mumbai?
if kannadiga's do the same to your IT engineers in Blr?
if dubai does the same to your migrants sent by dubai sekhar (KCR)?
if americans does that your desi's in america?
burra undaa? dobbinda??
బుర్ర ఉందా? దొబ్బిందా? అని పెత్తందారీ భాష వాడిన డి.కె.బోస్ గారికి,
ఇంత అసహనం ఎందుకు?
నేను చెప్పింది తెలంగాణ వాళ్ళకు. నా తొలి కామెంట్ లో ఎక్కడా ఎవరినీ అవమానించలేదు.
తెలంగాణ వాళ్ళు బెంగళూర్ వెళ్ళినా, ముంబై వెళ్ళినా, దుబై వెళ్ళినా, అమెరికా వెళ్ళినా నేల విడిచి సాము చేయలేదు. లోకల్ వాళ్ళ మీద పెత్తనం చేయాలనుకోలేదు. మీరు చెప్పిన పై వాళ్ళ మీద పెత్తనం తెలంగాణ వాడు చేస్తే ఎస్ అదే గతి పట్టాలి. సీమాంద్ర ప్రయోజనాలు దెబ్బ కొట్టాలి అంటే పొట్ట కొట్టమని కాదు. పొట్ట కూటికోసం వచ్చే వాడికి అంత నోరు లేదు. సమైక్యంద్ర వాదం తెలంగాణతో ఆర్ధిక ప్రయోజనాలు ఉన్న కోస్తా ప్రజా ప్రతినిధుల నుంచి వస్తోంది. తెలంగాణ నినాదం బడుగులనుంచి వస్తోంది.
దొరికితే తుపాకి పట్టాలన్న ఆత్రుత కనబరుస్తున్న తెలంగాణ తమ్ముళ్ళను దగ్గర నుంచి చూసిన ఆవేదనతో పై పోస్ట్ ను రాశా. మీకు తెలంగాణ వాళ్ళమీద చిన్న చూపు ఉంటే తప్పు పట్టను. ఇది దశాబ్ధాల ఆలోచనా విధానం. తుపాకి, ఆర్ధిక వెలివేతలు కాకుండా మూడో మార్గం ఉంది. అదే రికన్షిలియేషన్. మీ లాంటి వాళ్ళను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నందున, నేను ఇస్తున్న సలహా తెలంగాణ వాళ్ళకు అయినందున, మాటలు ఇచ్చే నేతలు చిరకాలం జీవించలేరు కాబట్టి దాని ప్రస్తావన తేలేదు.
ఇక కే సీ ఆర్ విషయానికి వస్తే... బాబు మొదలు సమైక్యాంద్ర నేతలందరికీ ఇంతే చెత్త బ్యాక్ గ్రౌండ్ ఉంది. మీకు చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదు.
ఆవేశంలో అన్న తొలి అన్ పార్లమెంటరీ మాటను ఉపసంహరించుకుంటున్నా.
babu, DK Lamb:
it is not "asahanam". it is "jaali" that a fellow human being is unable to think properly.
and it has become a practice for all T slogan raisers, to give "titles" to all others who are not side'ing them. for ex: "pettandaari". first, change there.
Next, The T guy who is going for "potta kooti kosam" is actually snatching the "potta koodu" for someone else.
what you are preaching is same as what raj thakeray is talking about.
if you worked in the US in recession days, you undersntad the "potta koodu" stories. Your desi or outsourcing to Blr will cost a few dollars less, so the american loses his job.
i know my T friends, who own houses in bay area. I know americans who are out on road as they cant pay the loans.
did you see your "local vaalla meeda pettanam" concept there?
Australians are not beating your fellow indians for "kanda kaavaram" as they report in indian press.
they are beating, becos, our Indians are gaining more mileage.
What you are preaching for your T frineds is exactly the same.
period.
SO MANY "Anonymous" QUITE STRANGE IN A SOCIETY PROPAGATING FREEDOM OF EXPRESSION.
SIVA sir: message is important. Not the face & the scenic photo ;)
Dear Anonymous jee, I do not wish that we should display our photos with good background of flowers just for the sake of the photogenic faces. But its a statement we are making in our own name. Freedom of express is guaranteed to us and we should not be afraid to use it. Message is definitely required but we should let know others who is making it.
Thats only my point Dear Friend.
Siva gaaru,
I fully agree with you. I don't know why these people take pride in being anonymous. Dear anonymous, your message would get some credence if you show your face.
Give a thought to it
Cheers
Ramu
Dear Ramu & Siva:
I gave a thought to it.
While you have a reason for posting with your name, hope you agree that others "may" have a reason to post anon.
You both are preaching about freedom of speech etc...
You are right in principle. But you are wrong in practice.
In Hyd, If any samaikya vadi claim that he has equal right to Hyd, his tongue will be cut by KCR (press statements available for your ref.)
On a bandh day, if you dont say jai T, then you have to run to your vehicle insurance office for damages.
Need more examples of freedom of speech, dears?
In mumbai, question MNS & Sena. you understand your rights.
In Blr, comment on Annavaru's action or nose. you will be reminded of your rights.
I dont agree with you that we have a freedom of speech in India. So I go anon.
peice. (no peace, when they split the state).
Dear Anonymous garu,
I very much appreciate your response and I think I understand your reasons for being Anonymous. The reason why I originally made a comment regarding "Anonymous" is that in a blog writing about media and press, it looked quite odd to see so many comments without any name.
By freedom of expression I do not mean to express your opinion to a mad crowd rampaging on the road throwing your life and limb into great risk. But when we are writing in a blog I do not find any problem.
Instead of calling yourself Anonymous, you can create a pen/Net name and post your comments which would look better. I just wonder, How many names in the blogs are real?
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి