Thursday, January 7, 2010

వై.ఎస్.ఆర్. దుర్మరణంపై TV-5 కథనం; గందరగోళం

తెలుగు టెలివిజన్ రంగంలో మునుపెన్నడూ లేని ఒక అరుదైన వింత సంఘటన జనవరి ఏడో తేది రాత్రి జరిగింది. అది నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణంపై TV-5 ఛానల్ దాదాపు మూడు గంటల పాటు ప్రసారం చేసిన ఒక "సంచలనాత్మక" కథనం. ఈ 'గొర్రెదాటు మీడియా' ఒక పరిశోధనా పాడూ లేకుండా వార్తలను క్షణం ఆలస్యం చేయకుండా ఎలా వాస్తవాలుగా చిత్రీకరించిపారేస్తుందో కూడా ఈ సంఘటన నిరూపించింది. 

మాస్కో కేంద్రంగా రెండు వారాలకొకసారి వచ్చిన సంచలనాత్మక పత్రిక  "The eXile" మూతపడిన తర్వాత ప్రారంభమైన exiledonline.com అనే వెబ్ సైట్ అందించిన ఒక వార్తా కథనం ఈ రాత్రి పెద్ద సంచలనం సృష్టించింది. కృష్ణా బేసిన్లో గ్యాస్ విషయంలో వై.ఎస్.ఆర్. అంబానీ సోదరులతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టఫ్ గా వ్యవహరించారనీ, అది గిట్టక వాళ్ళో, ఇద్దరిలో ఒకరో ఆయన హత్యకు పథకం పన్నారనీ, ఇదొక వెయ్యి కోట్ల రూపాయల డీల్ అనీ... స్థూలంగా ఈ వ్యాసంలో ఉంది(ట). హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన కెప్టెన్ భాటియా మృతదేహం ఛిద్రం కాకపోవడం ఈ అనుమానాలకు మరింత బలమిస్తున్నదని ఈ వెబ్ సైట్ లో రాసారట. 

 
ఈ కథనాన్ని బేస్ చేసుకుని TV-5 యాంకర్, సీనియర్ జర్నలిస్టు వెంకటక్రిష్ణ మూడు, నాలుగు గంటల పాటు ఒక సీరియస్ చర్చ జరిపారు. తన వాక్చాతుర్యంతో ఆయన షో ను పండించగా...మాజీ మంత్రి మారెప్ప ఆ కథనాన్ని బలపరిచేలా మాట్లాడారు. ఈ చర్చ జరుగుతుండగానే...నిజంగానే ఆశ్చర్యకరంగా అ వెబ్ సైట్ పనిచేయడం మానేసింది. ఆ పేజీలు  ఓపెన్ చేస్తే "Error establishing a database connection" అని  రావడం మొదలయ్యింది. దీంతో...వెంకట క్రిష్ణ అనుమానం మరింత బలపడి వెరీ సీరియస్ చర్చ ఆరంభించారు. "మా చర్చ జరుగుతుండగానే...వెబ్ సైట్ ఎందుకు క్లోజ్ చేసారని మీరు భావిస్తున్నారు?" అని ఆయన అడగడం..."ఇది కూడా కుట్రలో ఒక భాగమే" అని కొందరు చర్చలో అనడం జరిగిపోయింది. ఇందులో నిజమెంతో ఆ పైవాడికే తెలియాలి. అంతకుముందు...ఆ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న ఈ కథనం మీద TV-5 ఎక్స్ క్లూజివ్ అన్న ముద్రవేసుకుని, దాన్ని తెర నిండా చూపిస్తూ కార్యక్రమం నడిపింది.


ఆ సమయంలో TV-5 చూసిన మరికొన్ని ఛానెల్స్ వెంటనే...రంగప్రవేశం చేసాయి. ఒక పక్క మన TV-9 వెంటనే రజనీ బాబును రంగప్రవేశం కావించగా, వై.ఎస్.తనయుడి ఛానల్ 'సాక్షి' కూడా ఈ స్టోరీ ని అందబుచ్చుకుంది. TV-5 కు తీసిపోకుండా..."పావురాల గుట్టు" అంటూ రజని దడదడ లాడిస్తూ ఉండగానే...N-TV ఏకంగా TV-5 ను అనుసరిస్తూ ఆ వెబ్ సైట్ కథనం మీదనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తూ...హడావుడి చేసింది. 

ఇది చూసి ఉత్సాహం, ఉత్తేజం పొంది...మహా టీవీ కూడా చటక్కున రంగప్రవేశం చేసింది. అప్పటికే i-news లో 'హార్డ్ కోర్" అనే ఒక చక్కని చర్చా కార్యక్రమంలో రాష్ట్ర బడ్జెట్ పై సీరియస్ గా డిస్కషన్ చేస్తున్న రవి ఇతర ఛానెల్స్ లో జరుగుతున్న హడావుడికి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే..బడ్జెట్ సంగతి పక్కనపెట్టి...అర్థంతరంగా ఆయన కూడా వై.ఎస్.ఆర్. దుర్మరణం వెనుక గుట్టుపై చర్చ మొదలెట్టారు.

ఈ ఛానెల్స్ అన్నీ ఒక వెబ్ సైట్ కథనంపై ఎక్కడలేని హడావుడి చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ కథనంతో ఆగ్రహం చెందిన కొందరు వై.ఎస్.ఆర్. అభిమానులు పలుచోట్ల రిలయన్స్ సంస్థల ఆస్తులపై దాడులు ప్రారంభించారు. కొందరు కడప బంద్ కు పిలుపు కూడా ఇచ్చారు. దీని పరిణామాలు శుక్రవారం గానీ బోధపడవు.


అప్పుడు ABN- ఆంధ్రజ్యోతి ఛానల్ కూడా బరిలోకి ప్రవేశించింది. స్టార్ యాంకర్ మూర్తి కొత్త వాదనతో ముందుకు వచ్చారు. అసలు ఆ వెబ్ సైట్ వై.ఎస్.ఆర్. మృతిపై...నాలుగు నెలల కిందట ఆయన మరణించిన తర్వాతి రోజు ఫ్లాష్ చేసిందని...ఆ కథనంపై ఒకే సారి మూడు తెలుగు ఛానెల్స్ ఇప్పుడు హడావుడి చేయడమేమిటన్నట్లు ఆయన మాట్లాడారు. వికిపిడియా లో ఆ పత్రికకు ఉన్న మురికి చరిత్రను మూర్తి గారు వివరిస్తూ....ఈ కథనానికి ఇంత పెద్ద ప్రాముఖ్యత ఇవ్వవలసిన పనిలేదన్నట్లు మాట్లాడారు. ఇదండీ సంగతి.

17 comments:

Vasu said...

మీడియా ఎంత న్యూస్ హంగ్రీ అయిపోయిందో తెలుస్తోంది దీని బట్టి.

తెలుగు వెబ్ మీడియా said...

http://teluguwebmedia.net/ysr_death/ysr_death.html

వెంకట రమణ said...

ఆ వెబ్ సైటు ఆగిపోవడానికి మాత్రం మనమే కారణం అయ్యుంటాము. పాపం ట్రాఫిక్ అసలు రాని అనామక వెబ్సైటుకు ఒకే సారి ఇంత మంది వెలితే సైటు చావక ఏమిచేస్తుంది.

ఆ ఆర్టికలుకు సంబందించి, బింగు వాడి cache లో ఉన్న కాపీ చూడాలంటే ఈ లింకు చూడండి
article

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

మన మీడియాకి కావలసింది నిజం కాదు, సంచలనం. దాని కోసం వారు ఏదైనా చేస్తారు.

Lakshmi Naresh said...

first of all we need to close the news channels in AP.prathi daniki ee chaneels e kaaranam.idi andariki telsu,malli ade choostham.sir pls help to save AP.

Anonymous said...

I am able to open this website in Europe. It seems , Indian gateway blocked this site. And this news is dated as September 3, 2009

http://exiledonline.com/enemy-of-larry-summers-ex-boss-dies-in-mysterious-helicopter-crash/

నరేష్ నందం (Naresh Nandam) said...

ఆ పత్రిక పూర్తి కధనం ఇక్కడ చూడవచ్చు.
http://74.125.153.132/search?q=cache:xjFKPQOgTAUJ:exiledonline.com/enemy-of-larry-summers-ex-boss-dies-in-mysterious-helicopter-crash/+http://exiledonline.com/enemy-of-larry-summers-ex-boss-dies-in-mysterious-helicopter-crash/%23more-12129&cd=1&hl=en&ct=clnk&client=firefox-a

ఆ వెబ్‌సైట్ మూత పడటానికి ఒకే ఒక్క కారణం ఉంది.
అదేంటంటే..
ట్రాఫిక్ సమస్య!
నిజమండీ బాబూ..
మన చానెళ్ల హడావిడి చూసి నమ్మి కొందరు, నమ్మలేక కొందరు ఆ వెబ్‌సైట్ మీద పడ్డారు.
పాపం ఎప్పుడూ ఇంత ట్రాఫిక్ ఊహించని ఆ వెబ్‌సైట్ వాళ్లు తక్కువ బ్యాండ్‌విడ్త్‌తో హోస్ట్ చేస్తుండటంతో అది కాస్తా లిమిట్ దాటి పోయి ఎర్రర్ చూపించింది. అది తెలియని మన (అ)ఙానులు మావళ్లే వాళ్లు వెబ్సైట్ మూసేశారు.. మా చర్చను చూసి(?) భయపడిపోయారు.. అని చంకలు గుద్దుకున్నారు.

Saahitya Abhimaani said...

This is the time that Government should take appropriate action against the erring channels which telecast the "story" without verifying the antecedents, just based on one obscure website, which ultimately resulted in arson in many places.

Now is the time that these wagabond news Channels are taught a lesson they would never forget.

Anonymous said...

కొన్ని విషయాలు.

1) ఎక్సయిల్డ్ కథనం నీట్ గా ఎక్కడా దొరక్కుండా ఉంది. ముందు తెలుగు జర్నలిస్ట్ లు అలా రాయడం నేర్చుకోవాలి.

2) ఎవడో గొట్టం గాడు రాసినవి ఎత్తి రాయడం మనకు అలవాటే. 2009 ఎన్నికలకు ముందు ఖత్రో చీ గురించి మీరూ ఇలాంటి వ్యాసమే ఎత్తి ఈనాడులో రాసినట్లు గుర్తు రామూ గారూ. ఆంధ్రా డొమైన్ లో ఖత్రో చీ ప్రయోజనాలు ఏమీ లేవు కాబట్టి, నైతికంగా కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేక పోయారు. ఇలంటి వాటిని డీల్ చేయడానికి వెంకట క్రిష్ణ, మాధవ్ ల అనుభవం చాల లేదు. నిజానికి చర్చలో కూర్చున్న ఇద్దరు పెద్ద మనుషులు లీగల్ గా గాడి తప్పకుండా బాగా వ్యవహరించారు. రిలయన్స్ రాష్ట్రంలో బలమైన సంస్థ కాబట్టి దానికి సపోర్ట్ లబించింది.

3) మీ పోస్టులో "మురికి చరిత్ర- మూర్తిగారు" పక్కపక్కనే బాగా అమిరాయి .

4) సీ ఎన్ ఎన్ డాక్యుమెంటరీ ఎక్సయిల్డ్ ను తిట్టలేదు. ఆంద్ర జ్యొతి పిల్లకాయలను అనువాదం నేర్చుకోమనండి.

5) రిలయెన్స్ తరఫున ఇంతగా స్పందించిన మీడియా ఆర్టీసీ బస్సుల తరఫున అంత గట్టిగా స్పందించలేదే?

6) ఈ కధనం ఒక ప్రయోజనం సాధించింది. వై ఎస్ మరణంపై దర్యాప్తు ఆలస్యం ఉద్దేశ పూర్వకమే అయితే సర్కారులు ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిక వెళ్ళింది.

7) అన్నింటికన్నా ముఖ్యమైనది రోశయ్య సర్కారు శాంతి భద్రతలు పరిరక్షించడంలో పూర్తిగా విఫలమైనది. సబితను తీసేయడమో, తనే రాజీనామా చేయడమో జరగాలి.

Anonymous said...

మీడియా.....ఇప్పుడు ఇదో రకం టెర్రరిజంలా మనల్ని భయపెడుతుంది . రోజురోజుకూ పేట్రెగిపోతుంది .ఒక్క చట్టంతోనో ఒక్క సంతకంతోనో దీన్ని నియంత్రించే అధికారం వుండికూడా ప్రభుత్వం ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదంటారు . మీడియాని కొన్నాళ్ళపాటు నిషేదించాలి అన్న జె. పి వాదనతో మీరు ఏకీభవిస్తారా అన్నదానిమీద ఓ చానెల్ ఓటింగ్ పెడితే 95 % అవును అని ఓట్ చేసారు . రాత్రి జరిగింది సామాన్యమైన సంఘటన కాదుకదా ! ఇప్పటికయినా ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్సక సుత్రాలని రూపొందించి అమలు చెయ్యకపోతే పిచ్చివాడి చేతికి తుపాకీ ఇచ్చి రోడ్డుమీద వదిలినట్టే . క్షణ క్షణం భయం భయం
మీడియా సంగతి పక్కనపెడితే , ప్రజలు మరీ ఇంత వెర్రిగొర్రెల్లా ఎలా మారిపోతున్నారో కదా! ఇదే ఆవేశం సొంత సమస్యలు తీర్చుకోటమ్మీద, పెరిగే ధరలమీద , పేరుకుపోయిన అవినీతిమీద , పెడదారిపడుతున్న విధ్యా వ్యవస్థ మీద , నట్టేట ముంచుతున్న నాయకులమీద , చూపిస్తే కొంతైనా జీవితాలు బాగుపడతాయి

Indian Minerva said...

eXailed కధనం అసలు చాలా అసంబధ్ధంగా. ఎక్కడా ఆధారాల ప్రసక్తేలేదు. పోనీ ఏదో conspiracy theory టైపులో విశ్లేషించాడా అంటే అదీలేదు. ఇలాగైతే దేనీమీదయినా ఎంతైనా రాయొచ్చు. రాసినవాడి విశ్యసనీయతని పట్టించుకోకుండా "మెరుగైన సమాజంకోసం నిరంతరం కృషిచేసే" ఘనత వహించిన మన మీడియా ఇలాంటి బాధ్యతారహితమైన కార్యకలాపాలకు దిగడం కొత్తేమీ కాకపోయినా అసలే క్లిష్టపరిస్థితుల్లో రాష్ట్రంలో మంటలెగదోయడం గర్హనీయం.

ఆయా అధిపతులను ఎందుకు నిర్భందించి, వారి వారి చానళ్ళనుమూసివేయకూడదో నాకర్ధం కవటంలేదు. ఏం వీళ్ళేమైనా చట్టానికి అతీతులా? ఇలాంటి పని ఏ (ధాకరేలను మినహాయించి) రాజకీయనాయకుడో చేస్తే మరుక్షణం అరెస్టులు చేస్తారుగా మరిప్పుడు ఎందుకు చేయరో?

జనాలుకూడా ఆస్తుల విధ్వంసంలో తాదాత్మ్యాన్ననుభవిస్తురానుకోవాల్సొస్తుంది. వాళ్ళు ప్రసారం చెయ్యడం వీళ్ళు తగలబెట్టడం. ఇంతటి ఉత్సాహం వాగ్దానాలు మరచిన నాయకులను నిలదియ్యడంలో వుండుంటే చాలా బాగుండేది. ఇంతతొందరగా ప్రభావితమయ్యే ఇలాంటి మూర్ఖులు, బధ్యతా రహితులు ప్రజాస్వామ్యానికీ, అందువల్ల ఒనగూడే హక్కులకూ అనర్హులు.

kanthisena said...

శివ గారూ మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను

ఈ లింకును తెరిచి చదవండి

http://blaagu.com/chandamamalu/2010/01/08/%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%82%e0%b0%b8%e0%b1%8d/

Anonymous said...

ee vishayamlo okka zee 24 gantalu mathrame sarigga vyavaharinchindi deeniki sambandhinchi okka vaartha kood ivva ledu .ee website gurinchi septemberlone thelisina ivvakoodadani nirnainchukundi

Anonymous said...

Ramu: go back and correct your y'days' article on JP. It is better to shut down the channels for 15 days ;)

kvramana said...

What those three TV channels did on Thursday is definitely irresponsible and shocking. Like the Russian government, which had forced the closure of the The Exile, the Indian government too do something (?) with these channels. Primarily the problem seems to be with the chiefs in these channels not understanding the language used in the website. But more importantly, why the hell did these guys check a Russian website? Who gave this idea to these channels? Because, I am sure this is not a regularly visited website by any of the journalists of these three channels.
Even if it is out of context, I would like to draw your attention to an event on January 5. While home minister P Chidambaram's statement at the all party meeting in Delhi was given out to the reporters, a channel's senior reporter based in national capital tried to read it and simplify it for the Telugu audience. "There is a misconception that the December 9th announcement was made in haste..." is what the statement said in English. While simplifying it for us, the lady reporter explained twice that the home minister was admitting that it was a 'hasty decision'. God save us from these reporters.
Ramana

Unknown said...

Raamu Sir

Now can you agree with JP words. Close all the channels ? Everything will come into a shape

Saahitya Abhimaani said...

Today Sakshi TV is taking a stand that arresting the TV5 channel people is wrong. In the process they started to aim at Chandrababu Naidu and brought his long forgotten rival Lakshmi Parvathy (Remember her?? Mrs. NTR)to speak on the matter.

On one hand criticizing the errant channels, other channels are going on talking about the incident showing the YSR's crash site again and again. Whats their idea.

Shri K.V.Ramana informed with example how illeterate these so called reporters are. I do not understand one thing, while reporting some live incident, why they cannot keep their voice calm and steady. Usually, they stammer, blabber, repeat themselves, speak breathlessly and many times speak in circles and mostly meaningless. When a picture is being shown, is it necessary to go on shooting off their mouth? Can't the viewer see whats happening and understand it? Do we require their golden words?? Is it what the schools (??!!) they studied taught them what is TV journalism?? What a pity, what a pity. There is every need and necessity to define MEDIA and also NEWS. Then lets talk about whether media control is required or not. The present channels and most of the news papers are not media. A new word is to be coined to describe them.

Now that TV5 people are arrested, the champions of free press shall swing into action and start stuttering incoherently. Where they have been hiding when the channels were misbehaving?? Is it the process an illiterate country (just because we read and write we are not literate)coming to terms with the technology and the attendant issues.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి