ఇవ్వాళ ఆంధ్రజ్యోతి పత్రిక బాబ్లీ వివాదంపై ఒక సమయోచిత సంపాదకీయం ప్రచురించింది. దానికి పెట్టిన శీర్షిక 'ఇంత కర్కషమా!'. ఇది చాలా కర్కశమైన అక్షర దోషం. నాకు తెలిసి 'కర్కషం' బదులు 'కర్కశం' అని ఉండాలి. ఏదో పేజీలో తప్పు చేస్తే పోనీ అనుకోవచ్చు. మరీ..సంపాదకీయం శీర్షికలో మరీ ఇంత అక్షర దోషమా? కవిపుంగవా...ఎడిటర్ శ్రీనివాస్...ఇదేమి దారుణం స్వామీ?
ఇక్కడ ఇంకో సమస్య ఉంది. 'ఇంత కర్కషమా' పక్కన '!' చిహ్నం పెట్టారు. 'ఎంత కర్కశత్వం' అన్న తర్వాత ఆ చిహ్నం పెడితే సబబేమో కానీ...ఇక్కడ అది సరైన చిహ్నం కాదని నాకు అనిపిస్తున్నది. అక్కడ ఉండాల్సింది...'?' అనుకుంటా. మీలో పండితులు ఎవరైనా వుంటే....దీని గురించి కాస్త తెలియజేయండి.
ఈ ఎడిట్ లో ఒక వాక్యం ఇలా వుంది. "గదిలో చీకటి, దోమలు, పారిశుధ్య వసతి లేదు, బయట వర్షం." గదిలో చీకటి లేదు, దోమలు లేవు కాబోలు...అని నా లాంటి మందమతులు అనుకునే అవకాశం ఉందిక్కడ. మధ్యలో ఫుల్ స్టాప్ లు పెడితే బాగుండేది.
ఇదే సంపాదకీయంలో మరికొన్ని వాక్యరాజాలు ఇలా ఉన్నాయి.
"విద్యుత్ సౌకర్యం ఉన్నప్పటికీ గొడవ చేసే వరకు చీకటిలోనే నిర్బంధించారు."
"అన్నపానీయాలు తగిన రీతిలో అందలేదు."
"మరుసటి రోజు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీసు అధికారులు క్షమాపణ చెప్పినప్పటికీ వీరి పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు."
ఈ ఎడిట్ లో ఇలాంటివి మరొక మూడు నాలుగు వాక్యాలు ఉన్నాయి. వీటిలో కవి హృదయం అర్థమవుతున్నది కానీ...వాక్యంలో స్పష్టత లోపించిందని నాకు అనిపించింది. వేమూరి గారూ....తెలుగు ప్రజలపై ఇంత 'కర్కషత్వం' ఎందుకు చెప్పండి?
ఈ సంపాదకీయం లోపల కూడా 'కర్కషం' కొనసాగింది. శ్రీనివాస్ చూడకుండా ఈ ఎడిట్ ను ఎలా పాస్ చేశారు? నాకు తెలిసి నిన్న ఆయన మహబూబ్ నగర్ లో ఉన్నారు. 'ఈనాడు' లో ఇద్దరు సీనియర్లు--మూర్తి, బాలు--సంపాదకీయాలు రాస్తారు. వారు రాసాక వాటిని తప్పకుండా రామోజీ గారికి పంపే వారు. ఇప్పటికీ ఈ సంప్రదాయం ఉండే ఉంటుంది. నిజంగా రామోజీ స్పెల్లింగ్ లలో స్ట్రాంగ్ అని చెప్పలేము కానీ...ఒక పెద్దాయన చూస్తారంటే...రాసేవాళ్ళు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాస్తారు.
ఆంధ్రజ్యోతి వారు రేపు ఇదే ఎడిట్ పేజీలో అది 'కర్కషం' కాదు..'కర్కశం' అని సవరణ వేసి తెలుగు జాతికి మేలు చేయాలి. ఈ తప్పుడు మాటను ఒక పది మంది అయినా...బుర్రకు ఎక్కించుకుని వాడడం మొదలెడితే...అది మల్టిప్లయ్ అవుతూ పోయి కొన్నాళ్ళకు జరగరాని అపరాధం జరుగుతుంది. శ్రీనివాస్ కు నిజంగా భాషాభిమానం ఉంటే ఈ సవరణ రేపటి పేజీలో ఇస్తారు. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు.
Wednesday, July 21, 2010
Subscribe to:
Post Comments (Atom)
27 comments:
రంగనాయకమ్మ గారి "వాడుక భాషే రాస్తున్నామా" పుస్తకంలో ఒక చోట ఇలాంటిదే ఒక వార్తా పత్రికలోని వాక్యాన్ని ఉదాహరించారు.
"కోళ్ళు,కుక్కలకు మందులు"..ఇదీ ఆ వాక్యం! దానికింద "అయితే కుక్కలకు మందులుగా కోళ్ళను పడేస్తారన్నమాట"!అని వ్యాఖ్యానించారు రంగనాయకమ్మ!
నిజానికి కోళ్ళకు,కుక్కలకు మందులు..అని కదా ఉండాలి!
ఈ పుస్తకాన్ని ఆమె మళ్ళీ అప్ డేట్ చేస్తే ఈ సంపాదకీయం పనికొచ్చేట్టుంది.:-))
వార్తా పత్రికల్లో భాషా దోషాలు,తెలుగు యాంకర్లు చదివే వార్తల్లో ఉచ్చారణా దోషాలు పట్టుకోవడం గొంగట్లో తింటూ వెంట్రుకలేరినట్లే!
మొన్న ఒకరోజు పొద్దున్నే I news వాల్ళు బడిపిల్లల పుస్తకాల సంచుల బరువు గురించి ఒక ప్రోగ్రామ్ వేశారు. దాంట్లో "యాస్పల్ కమిటీ ప్రకారం"అని ఒక వందసార్లు చదివారు. విజువల్ లో కూడా "యాస్పల్ కమిటీ"అనే చూపిస్తున్నారు. కొద్ది సేపు జుట్టు పీక్కున్నాక అర్థమైంది అది ప్రొఫెసర్ యశ్ పాల్ కమిటీ అని! అంటే వార్తలు చదివే వారికి, వాయిస్ ఓవర్ చదివే వారికి,పర్యవేక్షించే వారికీ,.,ఎవరికీ ప్రొఫెసర్ యశ్ పాల్ ఎవరో తెలీదన్నమాట స్పష్ట.ఆయన ఈ విషయమై చేసిన సిఫార్సులు చాలా ప్రముఖమైనవి.ఏదో ఒక న్యూస్ క్లిప్పింగ్ పట్టుకుని స్టోరీ తయారు చేశారు తప్ప యశ్ పాల్ ఎవరో,ఏమిటో ఒక వార్తా ఛానెల్ లో పని చేస్తున్నవారికి తెలీదు. ఇదీ పరిస్థితి!
even i saw dat editorial in andhrajyothi..."karkashatwam" even i felt its not the correct spelling....but as its an editorial...i thought may b i am wrong...thanks for clarifying ramu garu....పర్లేదు నాకు కూడా తెలుగు బాగానే వచ్చు అన్నమాట!!!
దీనినే ఫ్రాయిడియన్ స్లిప్ ఆఫ్ టంగ్ అని అంటారు. ఒక తప్పు అతికినట్టు రాయడానికి కొంచెం టైం కావాలి కదా... అలా వండి వార్చడానికి ఆంధ్రజ్యోతికి టైము సరిపోలేదు గావాలి లేదంటే శ్రీనివాస్ వేరే వూర్లో వుండడం వల్ల కొంపదీసి రాధాకృష్ణగారు చెయ్యి చేసుకున్నారేమో! నిజానికి అక్కడ ఏమి జరిగిందని మన చెప్పులు నాకే తెలుగు పత్రికలకంటే కొన్ని జాతీయ దినపత్రికలు చక్కగా రిపోర్ట్ చేశాయి. మరిన్ని ఆశ్చర్యకరమైన వివరాలకు దిలీప్ రాసిన ఈ పోస్ట్ చదవండి. http://hridayam.wordpress.com/2010/07/21/babu-babli-drama/
రామాయణంలో పిడకల వేట అంటే ఇదేనేమో... అనిపించేలా ఉంది. No offence!!. ఇప్పుడు మనం వ్యాకరణ దోషాలు పట్టించుకోవడం అంత అవసరమాండి?
Dear sir,
meeru cheppindi chala nijam....and chala baga chepparu.....repati paper lo aa tappu sarididdukuntaro ledu vechi chudali.
Balakrishna.M
ఇంతువంతటివాళ్ళాల్లంతా ఎదితర్లూ/మీడియా హేడ్లూనూ.
ఈ రోజు చెన్నై జిల్లా ఎడిశన్లో .మొదటివిడత మెడికల్ కోన్సిల్లిన్గ్లో ౩౯ మన్దీ హాజరు కాలేదు కాని వారు మాత్రం ౧౧ మంది హాజరుకాలేదని రాసారు .ఎంత చిత్రమైన వార్తో ?
భలే తలంటేశారుగా ! ‘కర్కషం’ అనే మాటలో ఏదైనా ‘వ్యంగ్య వైభవం’ ఉందేమో అని చూశాను. అదేమీ లేదు. ఇప్పుడు సాయంత్రం 4 గంటల సమయం దాటాక కూడా ఆంధ్రజ్యోతి ఆన్ లైన్ ఎడిషన్‌లో ‘ఇంత కర్కషమా!’ అనే ఉంది. అక్షర దోషాన్ని ఏమీ మార్చలేదు.
ఆకాశరామన్న గారన్నట్టు... ఇది రామాయణంలో పిడకల వేట కాదు. సంపాదకీయ శీర్షిక లోనే తప్పు దొర్లటం అంత చిన్న విషయమా?
సంపాదకీయం సంగతేమోగానీ, ఎడిటర్ శ్రీనివాస్ గారు శ్రీకృష్ణదేవరాయలు మీదో వ్యాసం రాశారు. ఆవు వ్యాసంలా అటు ఇటూ తిప్పి దాన్ని తీసుకొచ్చి అలవాటుగా తెలంగాణతో ముడిపెట్టారు మహానుభావులు. ఎప్పట్లాగే, ఆయన చెప్పదల్చుకుంది ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు.
Eenadu district editions did an awareness campaign for mosquitoes eradication. The news was carried in the next day's paper with the following headline
"ఈనాడు దోమల నివారణపై అవగాహనా కార్యక్రమం" ఆంద్ర జ్యోతి, వార్త, సాక్షి దోమలు బతికిపోయాయన్నమాట. ఇలాంటి అన్వయ
దోషాలకు పత్రికల్లో, టీవీ చానెళ్ళ స్క్రోలింగ్‌లో కొదవ లేదు.
Eenadu journalism school లో శిక్షణ సమయంలో తెలుగు మాష్టారు చెప్పిన ఓ సరదా వాక్యం ఇలా ఉంది. "ఇచ్చట చెరకురసం
పిండబడును" రాసింది మాత్రం.... "ఇచ్చట చేరకు రసం పిండబడును" ... ఇలా తెలుగు ప్రేక్షకుల రసం ఎన్నాళ్ళు పిండబడుతుందో ఏంటో.
రాముగారు నా వ్యాఖ్యలో నేను అసహ్యించుకునే అచ్చుతప్పు.... ళ ని ల గా పలకడం అనేది దొర్లింది. "వాళ్ళు "అనడానికి ఎటూ కాకుండా "వాల్ళు"అని రాశాను. లేఖినిలో ఇలాంటివి అప్పుడప్పుడూ తప్పించుకోలేకపోతున్నా..హడావుడిలో!
తెలుగుకు పూర్తిగా తెగులు పట్టిస్తున్నారు.
నగ్నముని తన మహాకావ్యం 'కొయ్యగుర్రం'లో రాసిన కొన్ని పదాలు ఇక్కడ గుర్తుకొస్తున్నాయి.
అక్షరాన్ని భ్రూణహత్యచేసేవాడే కవి. కవి రాయకముందే అక్షరాన్ని హతమారుస్తాడు. కాగితాన్ని శ్మశానవాటికగా మార్చి, అక్షరాలను ఖననం చేస్తాడు అని ఆయన ఆక్రోశించారు. ప్రతి అక్షరాన్ని శంకించి మరీ రాసేవాడే నిజమైన కవి అని అభివర్ణించాడు. ఇక్కడ ఎడిటర్లకూ అదే వర్తిస్తుంది. ప్రస్తుతం నగ్నముని మాటల్లో కవిని తొలగించి, ఎడిటర్‌ను పెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని టీవీ ఛానళ్ల బ్రేకింగ్లలో మరీ దారుణంగా అక్షర దోషాలు కనిపిస్తున్నాయి.
@ ఆకాశరామన్న garu.
sir, edo pamplet lo spelling mistake vosthe ok anukoochu. enni thousands circulation undi, adi kuda editorial column lo silly mistake chesthe adi chaala hasyaspadam ga untundi.
school lo 3rd class telugu teacher ki unnantha knowledge kuda leni vaalu editors ga panikiraaru ani naa opinion
Raja
Ramu garu,
andhrajyothi topic madhyalO RamOjee
elaa vachchaaru ? i am unable to get ?
అనేకసార్లు మన పత్రికలలో ఎవరిని "అతను" అని వ్రాయాలి, ఎవరిని "ఆయన" అని వ్రాయాలి అన్న తేడా తెలియకుండా వాడేస్తుంటారు. "అతను" అనవలసిన ఎవడో బేవార్సు గాడిని ఆయన అని ఉదహరిస్తుంటారు. గాంధీ, నెహ్రూ లాంటివారి గురంచి వ్రాస్తూ అతను అని వ్రాసి గోడమీద గోరుపెట్టి గీస్తున్న జలదరింపు కలిగిస్తుంటారు ఈ అభినవ జర్నలిస్టులు. జర్నలిస్టు అనేవాడికి ముందు భాష ముఖ్యం ఆ తరువాతే ఏదైనానూ. ఆ తరువాత అనేకసార్లు "చాన్నాళ్ళు" అన్న మాట పత్రికల్లో వాడబడటం చూస్తున్నాను." చాలా రోజులు" అన్న పదానికి భ్రష్ట స్వరూపమా లేక ఇలాంటి పదం తెలుగులో ఉన్నదా తెలియచేయండి.
ఎలాగో సందర్భం కాబట్టి మరో మాట. మనలో చాలామంది "నిజమా" అని ఆశ్చర్య పోతూ ఉంటారు. "అలాగా' అనటానికి బదులుగా ఈ "నిజమా" అన్నమాట వాడటం గత 20-25 సంవత్సరాల నుండే ఉన్నది, అంతకు ముందు లేదు. ఇలాగే ఆంగ్లంలో "నిజమా" అని ఒక్క మాటతో ఆశ్చర్య ప్రకటన పరయత్నించండి?!
రిప్ వాన్ వింకిల్ లాగ మనం ఒక ఇరవై ఏళ్ళు తరువాత లేచి చూస్తే, భాష ఇలా ఇలా మారి కొన్నాళ్ళకి మనమాట అప్పటి వాళ్ళకు అర్ధంకాదు, వారి మాటలో అన్ని మనకి తెలియవేమో అని భయం వేస్తున్నది. ఇప్పటికే ఒక ఇరవై ఏళ్ళ క్రితం పత్రికలలోని భాషతో పోలిస్తే ఇప్పటి భాష చాలా చౌకబారుగా ఉంటున్నది. ఏమైనా జనరేషన్ గాప్ అని సద్ది పుచ్చుకుంటున్నాను. అంతకంటే చెయ్యగలిగింది ఏమున్నది.
వార్తా పత్రికలలో శీర్షికలు (హెడ్డింగులు) లను నేలబారుకు దిగలాగిన ఘనత "ఈనాడు" దే . అన్ని పత్రికలూ అదే బాటన పయనించి, అంత్య ప్రాసకోసం పాకులాటేకాని, పాఠకుడికి అర్ధమయ్యేలాగ శీర్షిక ఉండాలి అని ఒక్క "సంపాదకుడు" అని మనం పిలుచుకునే ఈ పత్రికా ఉద్యోగులలో ఒక్కడికన్నా ఉన్నదా?!
" ! " is right. It is not a question. It is exclaimation. VISMAYAM.
శివ గారు....
చాలా మంచి విషయాలు ప్రస్తావించారు, సార్. జవహర్ లాల్ నెహ్రూ అయినా, దేవినేని నెహ్రూ అయినా...ఆయనో లేదా అతనో లో ఒకటే వాడాలని చెబుతారు సార్. రిపోర్టర్, సబ్ ఎడిటర్ అందరినీ సమదృష్టిలో చూడాలన్నది రూలు. అది పాటించడం పెద్ద సమస్య.
నిజానికి 'ఈనాడు'లో చాలా మంది మంచి జర్నలిస్టులు...అద్భుతమైన భాషా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు సార్. కానీ...వారు దాదాపుగా బూదరాజు గారి శిష్యులు. ఆ మహానుభావుడి మీద కోపంతో, తర్వాత వచ్చిన 'ఈనాడు జర్నలిజం స్కూల్' ప్రిన్సిపాల్ మీద మమకారంతో....బూదరాజు గారి శిష్యులను 'ఈనాడు'లో తొక్కేస్తున్నారన్న ఒక విమర్శ ఉంది. బూదరాజు గారి శిష్యులను ప్రమోషన్స్ ఇవ్వకుండా, చాదస్తులని ముద్ర వేసి బైటికి పంపుతున్నారు.
కృష్ణార్జున గారు...
'ఆంధ్రజ్యోతి' 'ఈనాడు' వ్యవస్థలను పోల్చాను అంతే. వేరే ఉద్దేశ్యం లేదు.
మాధురి గారు...
విస్మయం, ప్రశ్న లకు తేడా లేకుండా పోతున్నది కదా...
రాము
సమానత్వం! సమానత్వం!! ఇదే కొంప ముంచుతోంది మనదేశాన్ని. ఇచ్చే గౌరవంలో కూడ మనిషిని బట్టి గౌరవం కాని, అందరినీ ఒకే గాటన కట్టడం ఈ "సమానత్వపు" వికృతరూపం అని నా ఉద్దేశ్యం. సరే అందరినీ సమానంగా చూడాలి, మరి ఒకరిని "అతను" ఎందుకు, మరొకరిని "ఆయన" ఎందుకు? ఏమైపోయింది ఈ "సమానత్వం"!!?? ఇది నా ప్రశ్న, నా అసహనం, నా అనుమానం, నా అయోమయం. ఇవన్నీ పత్రికల్లో భాష చూసే !!
మీరు ఇంకా వ్యాకరణ దోషాలు చూస్తున్నారు.... కంటెంట్ లో కూడా చాల tappulu vuntayi jyothi లో. oka sari chirala guntur dist లో vundhi ani rasesaru. కనీసం basics కూడా తెలియక పొతే ఎలా. Dist edition lo vache Abbreviations lo chalavaraku wrong. అదే తెలుగు దేశం ను పొగుడుత, కాంగ్రెస్ ని తిడత రాయమనండి pagilu pegilu rasestaru......
nenu media person ni kadu. sagatu readerni. edena journalism ante?????
"Eenadu & ETV-2" ..`Telugu bhasha`..vishayamulo chesthunna krishini abhinandinchanli.
a)Veelintha varaku Telugu padalanu upayogistharu.
b)English padalaku Telugu anuvadalu kanipettadam
c)Abbreviations.lo telugudanam uttipadetatlu cheyadam..etc
eg:- P.R.P. (PRA.RA.PA.),
N.T.P.P. (NA.TE.PA.),
BREAKING NEWS (TAJA VAARTHA)
etc.
ఈ పైన రాము కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈయన వేరే రాము. ఆయన అభిప్రాయాలు నా అభిప్రాయాలు కాదు.
రాము
apmediakaburlu.blogspot.com
@ మరో రామూగారూ. ముందు తెలుగును తెలుగులో వ్రాయటం నేర్చుకోండి ఆ తరువాత మరేదైనా.
Dear Raamu
There is a lot of difference between the approach to telugu between Budaraju gaaru and MNR. If we compare language to a vehicle budaraju has made his students perfect drivers and mechanics too. Where as MNR has given some tips on driving only. I often refer to this analogy. Thats why new gen journalists are not coping well with telugu
Today's new paper - Tomorrows waste paper అనే నిర్లక్ష్య భావం వల్ల కూడా ఇలాంటి తప్పులు జరుగుతాయని నా అభిప్రాయం.
@Siva garu: North Andhrites use "అతను" as a respective salutation. I, native of Guntur (coastal Andhra), was taken aback initially. Later, I understood they mean "ఆయన", but say "అతను".
Hope u know those dialectical disparities.
Telangana people don't use ANDI, MEERU during the conversations. It doesn't mean they don't have civic etiquette. And these issues are cultural disparities..
I don't mean that u don't know above. Just I am reminding u..
naresh Nunna
@Naresh Nunne. Thank you for the clarification in dialects, which I too experienced. But the language used in media for good or bad is a certain dialect only. Spoken dialects are not used in written/Spoken language of Media, despite news papers are coming in local isues. In English also the usaage of "you" and "thou" or "thy" was used to be there but no not heard.
That being the case, I find it quite odd and irritating to see that for some criminals, media uses "AAYANA" and for great Leaders they use "ATANU". I hope I made myself clear once again.
Ramu Gaaru,
Meeru Eenadu lo work chesaaru kada? Ramoji Rao gurunchi oka post rayochu kadaa. His working Attitude, journalism skills, veeti gurunchi. Try to get some more information about his roots? where did he came from, education details etc etc.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి