TV-9, N-TV లను నిషేధిస్తున్నట్లు తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ చేసిన ప్రకటన అంత సబబుగా లేదు. ఆ ఛానెల్స్ స్టూడియోలకు వెళ్లకూడదని తెలంగాణా వాదులను ఆదేశించడం...చెరువు మీద అలిగి ఏదో చేసినట్లు అనిపిస్తున్నది. ఆ ఫత్వాను కాదన్న విజయశాంతి పై జే.ఏ.సీ.నేతలు టీ.ఆర్.ఎస్. పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు గారికి ఫిర్యాదు చేయడం, ఇక ముందు అలా చేయవద్దని ఆయన ఆమెను కోరడం ఎబ్బెట్టుగా ఉన్నాయి.
ఇషాన్ రెడ్డి భౌతిక కాయంతో ఒక పక్క అంతిమ యాత్ర జరుగుతూ ఉండగా...అమరవీరుల స్థూపం దగ్గర ఈ రెండు ఛానెల్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కూడా అనుచితంగా అనిపించింది. తమకంటూ ఒక ఛానల్ (Raj-news) ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ పార్టీ లో వచ్చిన భరోసాతనానికి ఇది నిదర్శనం.
తెలుగు మీడియా చాలా పక్షపాతం తో వ్యవహరిస్తున్నదనడంలో పెద్దగా సందేహం అక్కర్లేదు. అన్ని వర్గాల గళాలు వినిపించాలి, నిష్పాక్షికంగా వ్యవహరించాలన్న మౌలిక సూత్రాన్ని ప్రస్తుత మీడియా యాజమాన్యాలు ఎప్పుడో తుంగలో తొక్కాయి. తెలంగాణా జర్నలిస్టులు, తెలంగాణా ఉద్యమం పట్ల మెజారిటీ ఛానెల్స్, పేపర్స్ చిన్నచూపుతో వ్యవహరిస్తున్నాయన్న విమర్శ ఒట్టిదే.... అని కొట్టిపారేయ్యలేని పరిస్థితి. అయినా సరే...అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు.
ఒకవేళ ఈ ఛానెల్స్ తమ పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నాయని అనిపిస్తే....ఛానల్ హెడ్లతో మాట్లాడి కాస్త సుతిమెత్తగా హెచ్చరిస్తే సరిపొయ్యేది. అంతకూ కాకపోతే...ఒకటి రెండు సార్లు వాటి కార్యాలయాల దగ్గర ధర్నా చేసినా, వాటి ధోరణిపై ఫిర్యాదు చేసినా ఒక పధ్ధతి ప్రకారం ఉండేది.
అలా కాకుండా...వాటిపై నిషేధం విదిస్తున్నట్లు ప్రకటించడం బాగోలేదు. రేపు మరొక బలవంతుడైన నేత మరొక ఛానల్ ను నిషేధిస్తాడు. జయప్రకాష్ సారు ఏకంగా ఛానెల్స్ మూసేద్దాం అని పిలుపునిస్తారు. మీ పొలిటికల్ క్లాస్ అంతా ఏకమై...ఈ కాస్త మీడియా స్వేచ్ఛ లేకుండా చేసేలా ఉన్నారు. అందులో లోపాలు ఉన్నాయి కదా అని ఒక వ్యవస్థనే లేదా సంస్థనే రద్దుచేయాలని/నిషేధించాలని డిమాండ్ చేయడం మాత్రం సబబు కాదు. ప్రొఫెసర్ కోదండ రామ్ గారు ఈ విషయంలో పెద్ద మనసుతో వ్యవహరించాలి. సార్...ఇలా నిషేధిస్తూ పోతే...ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు అన్ని మీడియా హౌజులను ఏదో ఒక కారణం చేత మూసేయాల్సివస్తుంది.
Saturday, July 31, 2010
Subscribe to:
Post Comments (Atom)
20 comments:
"...ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు అన్ని మీడియా హౌజులను ఏదో ఒక కారణం చేత మూసేయాల్సివస్తుంది. ..."
What a thought!! I hope it comes to reality.
Because of the over action and improper behavior of the news channels, common man is quite vexed. If Govt.or some parties take steps to curtail the media, there will not be much reaction from public, as it came during the dark era of emergency. The cause of it should be introspected by media-both print and electronic.
విధ్యార్థి మరణాల పై ఒక చానెల్ లో ఈ రోజు ఉదయం కోదండరాం గారిని "విధ్యార్థులే ఎందుకు మరణిస్తున్నారు ?" వేరే వారెందుకు ( నాయకులు వారి పిల్లలు ) చావట్లేదు ? అనే అర్థమొచ్చేటట్టు ప్రశ్నించారు.
వీళ్ళు జగన్ ని, YSR family members ని, congress నాయకుల్ని ఇలా ప్రశ్నించగలరా ??
రాము సారు గారు ! మిమ్మల్ని ఇన్నాళ్లు పక్షపాత దృష్టిలేని మేధావి వర్గానికి చెందినవారనుకున్నాను. కానీ మీ మీడియా బహీష్కరణ పోస్ట్ చదివాక నా అభిప్రాయం తప్పని తెలుస్తుంది. మొట్ట మొదట బహీష్కరణకు నిషేధానికి తేడా తెలియని చిన్న పిల్లవాడికి మల్లే ఉంది మీ పోస్ట్. హెడ్డింగ్ లొనేమో బహీష్కరణ అని పెట్టారు. విషయానికొచ్చేసరికి నిషేధమని ఎత్తుకున్నారు.
ఇష్టం లేకపోతే ఎవరు ఎవరినైనా బహిష్కరించవచ్చు కానీ నిషేధించ లేరు. ఇక్కడ తెలంగాణ జెఏసి చేసింది బహీష్కరణే కానీ నిషేధం కాదు. అదీ కాక మీకు తెరాస పార్టీకి తెలంగాణ వాదానికి మధ్య స్పష్టత కూడా లేనట్టుండి. అమరవీరుల స్థూపం వద్ద నినాదాలు చేసినవాళ్లంతా తెరాస కార్యకర్తలు కారు. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు, తెలంగాణ సానుభూతి పరులు ఉన్నారు.
ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. చర్యని(మీడియా పక్షపాతాన్ని) మీరు ఖండించినా, ప్రతిచర్యనే ఎక్కువ తప్పు పడుతున్నారు. రాగద్వేషాలు లేకుండా ఉండాల్సిన మీడియాను వదిలేసి (గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవటం ఎందుకు అనుకున్నారో) తెలంగాణ వాదులను అనడం ఏమీ బాగోలేదు. మీడియా న్యాయంగా ఉండి ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా.
ఇక మీడియా హెడ్స్ ని సుతి మెత్తగా హెచ్చరించడం గురించి, ఈ విషయమై ఆయా చానల్స్ ముందు పలుమార్లు ధర్నాలు జరిగాయి, అరెస్టుల వరకు వెళ్ళాయి. (ఏది జరిగినా చూపించాల్సింది వాళ్లే కాబట్టి వాళ్ళు వీటిని చూపించలేదు ).
వీళ్ళు చూపించే అవాస్తవాలు, వక్రీకరణ వార్తలు, వెటకారపు మాటలతో యువకుల మనసులు ఎంతగా గాయపడ్డాయో మీకు తెలియదో లేక మీరు ఆ కోణం పట్టించుకోదలచుకోలేదో తెలియదు. ఇలాంటి ఆత్మహత్యలకు అన్ని రాజకీయ పార్టీల తోపాటు ఈ మీడియా సంస్థలు కూడా బాధ్యత వహించాలి.
ఒకటి మాత్రం నిజం రాజ్ న్యూస్ వచ్చాక చేపల చెరువులే కాదు మంచి నీళ్ళ చెరువులు కూడా ఉంటాయానుకుంటున్నారు. తమ గొంతు కూడా వినపడుతుంది అని యువకులకు భరోసా వచ్చింది.
ఇక మీరు ఈ నా జవాబు ను అప్రూవ్ చేస్తారో, లేక కొన్ని చానల్స్ అన్ని కాల్స్ ను తీసుకొనట్టు ఫిల్టర్ చేస్తారో మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను.
-శ్రీకాంత్
suthimettani hecharikalu,dharnalu,requestlu anni ayipoyayi.anni telisina meere itla maatladite etla?newslo sattavunte ilanti nishedaalanu pattinchukovaalsina avusaram ledu.nishedam gurinchi e roju prakatana vachindi,already maa manasulalo ,indlalo eppudo nishedam vachindi.ippatikaina paddati marchukokapote aa chanalsku bhavisyattu vundadu.
Mr.Srikanth has rightly pointed the mistake i the blog.Boycoting and banning are entirely different.No one can ban except the government but any one can boycot.It is true there is no unifformity in the media and it is EVADI GOLA VAADIDE.Congress may boycot Saakshi and TDP Saakshi.The media houses have become the personal properties of some individuals and political parties with tubular vision of their selfish interests and the comon man who is the bread and butter of the media i the form of circulation and viewership is the victim of media's selfishness and unproffessionalism.It may be recalled that Amitab Bachan had kept the media out of his perview for years but still he is the Shahanshaw of Hindi film industry.It is time forvthe print and TV media tomend their ways and become a true mirror of the society but not a mirror of themselves.Being a media proffessional Ramu definetely supports it but he should look with the eyes of the common man and the society at large and at the same time recognising the good and best of media and criticisingb the bad and worst equally.Though Ramu looks impartial in this case of TV9 NTV it seems he has deviatyed from the main track.
JP.
శ్రీకాంత్ కు కళ్ళు మూసుకొని పోయినట్టున్నాయి .ఒక సారి రాజ్ న్యూస్ ఛానల్ చూడు బాబు .
అందులోని కార్యక్రమాలు చూసిన తరువాత పోస్ట్ వ్రాసింటే బాగుండేది .
కంట్లో దూలము పెట్టుకొని వేరే వాళ్ళ కంటిలో నలుసును తెసివేయలనుకోవడం మూర్కత్వం.
TRS ను కానీ తెలంగాణా వారిని కానీ బహిష్కరించమని ఇతర వారు అంటే కూడా మీరు సమర్ధించగలరా? .
నిజంగా అవన్నీ బలియగాలేన అందులో ప్రేమకోసం ఇతర కారణాలతో చనిపోయిన వారిని తెలంగాణా భజనపరులు అమరవీరుల జాబితాలో చేర్చడము మానవ జాతికే సిగ్గు చేటు .
బహిష్కరణ, నిషేధం అనేవి వారు వివిధ సందర్భాలలో వాడుతున్న పదాలు. అవి నా సృష్టి కాదు.
రాము
మీ కామెంట్ కనీసం మీకైనా అర్ధమవుతోందా. మరేమీ లేదు... రాము గారి పోస్ట్, శ్రీకాంత్ తదితరులు చేసిన కామెంట్స్ అంతా ఒక విషయం గురించి చర్చిస్తుంటే మీ కామెంట్స్ ఇంకేదో సూచిస్తున్నాయి. గమనించండి. మీ narrow mindedness ని తలుచుకుంటే జాలేస్తోంది. డిస్కషన్ మీడియా గురుంచి జరుగుతుంటే... మీ బాధంతా మరో ఇష్యు గురించి అన్నట్టుగా ఉంది. ఇక ఆత్మహత్యలపై తెలంగాణా భజనపరుల "భజన" అనే తమరి వ్యాఖ్యకి ముందు... సాక్షి ఛానల్ వారి నెల రోజుల ఓదార్పు భజన కనిపించలేదా. నా కళ్ళు పూర్తిగా తెరుచుకుని... మీడియా తెగులును ప్రత్యక్షంగా అనుభవించిన తరువాత ఈ కామెంట్ రాస్తున్న. మళ్లీ నా కళ్ళు కూడా మూసుకుపోయయంటే... ఇక చెప్పడానికి నా దగ్గర ఏమి లేదు.
@Ramu
మంచి టాపిక్ ఎంచుకున్నారు. రాగ ద్వేషాలకు. ప్రాంతీయ భావజాలానికి అతీతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ సాగాలని కోరుకుంటున్నా.
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
౧) శ్రీకాంత్ చెప్పినంత నైసుగా ఏమీ తెలంగాణా జెఎసి వ్యవహరించడం లేదు. బయపెట్టి బ్లాక్ మెయిల్ చేయడంలో ఉద్యమకారులు రాటుదేలి పోయారు. బహిష్కరణ అన్నా నిషేధం అన్నా అదే మీనింగ్.
౨) చట్టానికి మొహమాటాలు లేని రోజు రావాలి. చేదు నిజాలు దాచడం తెలంగాణా వాదానికి మేలు చేసేది కాదని బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి కళ్ళు ముసుకుంటున్న విజ్ఞులు తెలుసుకోవాలి.
andhra media paxapatha dhoranulani balamga edurkonnadhi Raj news.
andhulo bagangane telangana vadhulu boycot cheyadamlo thappuledu ani na abhi prayam. Oka mondi modhu charmam varki idhi chala methati prayathnam.Media ni brastu pattinchevi chala jarguthunnayi. ippudu media swetcha ki vachina muppu emiledhu.
mii andhra gola apithe manchidhi.
Indiara
నేను పైన పేర్కొన్న చానెల్ " మహా టీవీ", యాంకరయ్య
భోగీంద్రనాథుడు.
చాలా చానెళ్ళు అవ్వడంతో ఏ చానెల్ చూస్తున్నామో పట్టించుకోవడం లేదు ఈ మధ్య. యాంకర్ ని బట్టి చానెల్ గుర్తుపట్టాల్సి వచ్చింది.
అడ్డగోలు పెయిడ్ న్యూస్ ప్రసారాలు ఆ చానెళ్ళకు గునపాఠం నేర్పాయనుకొంటా.
oka channel nu bahishkarinche hakku vallaku unda? aa channel chudalo akkarledo prajale nirnayinchukutaru. aina channels vallu ee ee vishyala pi eduku focus cheyyadam ledani ela adagagalam? adi vari opinions batti untundi. for example jagan odarpu yatrane teeskundam.. 4 channels baga udaragottayi.. 2 channels assalu pattinchukoledu.. ala annamata..
n tv entha darunanga telanganaku opposite ga panichesthundo andariki thelusu.cheif editor live show with ksr lo lagatapati che kcr nu istham vachinatluga thittisthadu ade trs vallu lagadapati edina ante manam charchalo sahanam paticihali nenu alantivi allow cheyyanu nethi suthralu valle vesthsu.
TV9:ika tv9 ki vasthe appudu unbissed ga ubtoo appudappudu telanganku oppsite ga pani chesthundi.by poll electons results artharathri vachai next day morning complete results eminaini ani chuddamani tv9 pedithe morning bulleten lo a new assalu veyaledu.entha darunam.tv9 ceo thelangana prajala akhankshalni dighest chesukolekapothunnada.
This really a welcoming discussion in this blog on the role of media in a society. For any progressing country in 21 st century the fundamental ingredients to be successful are freedom of speech and democratic right to spread what they believe in.Now a days for media if you know two characters who can draw attention to people is enough to write any news/views.
If we learn correctly our media is insisting on progress of people as a society under shadow of a few people narrow minded ideology.In realistic world media should run independently to promote Truth but ours is biased one and have been running investors self interests for last two decades.
I don't see anything wrong in banning a particular media ,which is against their ideology in this case TV9 or NTV because our media just throw as much mud as possible on baseless things just for TRP ratings there by advertising money .
So what could be the potential solution for this out of track is either imposing ethics or practicing self discipline,which is economically impossible for existence of any media house. Revolution will come in any of the form form public and I believe in role of writers and journalists, who are the architects of media need to create difference in opinion like this in a big way
"...role of writers and journalists....
Good. But, a big B U T at that!! A dispassionate and impartial definition of who is a Writer and who is a Journalist is to be made and accepted. Everybody has his own definition for these words.
The rot of the media started with the leftist oriented persons infiltrating and started angling anything they wrote and reported in favor of their imported prejudices.
With that the concept of "impartiality" went out of the window. This was followed by party rags being started in various shades starting from red to saffron. When such rags can be given all the facilities and more importantly the status of a News Paper/Channel, how can you expect impartiality??
Then came the commercialization of News with big investors starting the media houses which ultimately resulted in Advetisement Mafia running the media.
How can we expect impartiality with prejudiced people writing the reports and Media being run by people whose sole aim is earning money??!!
These are the questions before the people who are concerned about today's circus going on which is called "Media"
ప్రశ్న అడిగే వాడు వినేవాడికి లోకువా. భోగీంద్ర నాథ్ అడిగిన ప్రశ్నలో తప్పేముంది. తెలంగాణా విద్యార్థుల్లో వున్న బలమైన కోరిక... నాయకులు, వారి పిల్లల్లో లేదా. కేసిఅరో, హరీష్ రావో ఆత్మహత్య చేసుకోవాలని ఎవరూ అడగరు. పోరాటం చేయలిగాని పిల్లల్ని బలిపెట్ట్తో , వేరే మరణాలని లిస్ట్‌లో వేసో కాదు. యాంకరయ్య ను ప్రశ్నించిన తిక్క శంకరయ్య బాధ ఆ ప్రశ్న అడిగినందుకా... లేక జగన్ గురించి అడగనందుకా. సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రశ్న అడిగారా లేదా చూశారా బ్రదర్.
-మురళీ కృష్ణ. కే.
...people who are concerned about today's circus going on which is called "Media"
Shiva garu let them realize first,awake and enlighten them in an unleashed form . As you said media houses are running under mafia money journalist is the one who knows by heart what is wrong what is right. Even for the sake of his/her media giant to be successful he or she contributes to distort the truth , they can compensate damage to the reality in blog like this in an unbiased platform anonymously.Here If I am not wrong ,I am expecting this initiative from journalist end who got enormous amount of potential to bring change.If we talk or initiate a discussion one day or some day it will reach the goal.
I believe Doctor monitor and guide physical health of people where as a journalist or a writer,which ever way they might be defined , monitors and guide the mental health of whole society . Unfortunately we don't have a proper system or a best platform for journalists and writers to excel in their field.Lets try to create one as open forum may be this is like a squirrel helping Lord Rama to build bridge to Lanka. We live in a world where everything is measured on scale of money for being successful.The only one in society who can change this stigma is Journalist or a writer and can plant value frame work for future society.In my view writer/journalist is a creator, Brhamha for future generations thought process.
.. మా బాధంతా అడిగినవాడి / అడిగించినవాడి చెంప చెళ్ళుమనిపించనందుకు. ఇంకా ఆ చానెల్ ని బహిష్కరించనందుకు.
@ All for TV9 & NTV:
Well well well here come the so called most noble people and journalists spewing their anguish against the JAC for boycotting TV9 and NTV. (Remember they have boycotted the two channels, appealed to people of a particular region not to watch them. Ultimately it is the decision of people. The boycot thing happened for apparent reasons like both the channels out of their political interests misguided the people on the suicide of a person. In which caves were you people hiding when for the first time in the history of Indian news media a news channel telecast was stopped in one particular region? Were you in a hangover of over subscribing to the yellow journalism of the yellow party or were you out of brains watching a tour of wanna be C.M? Mr Ramu and all : Why didn't you make a hue and cry when Raj news telecast was stopped in Nizamabad on the election day. Mr Ramu this time you proved to be a hypocrite. Put aside the condemning / supporting Raj news against ban on it, you didn't even mention anywhere about the black day in the history of Tv journalism. Do you even knpw that something like this happened? I presume your blog's name is AP media kaburlu. Not Andhra media or Telangana media etc. Raj news is still the very part of AP news channels. Now don't cry saying that Raj news is a highly authoritarian political channel. Of course we all know that the promoter of every news channel is some or other way related to a political party / real estate broker. Sakshi has nothing to do but glorify the lad who is craving like anything for a C.M seat. The same is the case with eenadu. And ofcourse Raj news too has political reasons.
"....let them realize first,awake and enlighten them..."
Yes let them realise and enlighten "themselves" first before embarking upon cleansing the society. Only persons who themselves are clean can clean the society. You can the history where only great men are born at infrequent intervals but at most appropriate time and they cleanse the society. For cleansing the society , Media need not take such important duty upon themselves . Let the media atleast report the news dispassionately without angling news for the sake of their own prejudices, party affiliations and more dangerously for pecuniary benefits. Let the society get clean and impartial news and opinions only in editorials and articles and not as part of the news.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి