కబడ్డీ ఆటలో అటు ఏడుగురు ఇటు ఏడుగురు ఆటగాళ్ళు ఉంటారు. కూతకు వెళ్ళిన ఆటగాడిని ఏడుగురు--కలివిడిగా, విడివిడిగా-- ముందుగా కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వీలు చిక్కగానే కలిసి కుమ్మేస్తారు. కూతకు వెళ్ళినవాడు కుంటూకుంటూ పోవాల్సిందే.
ఈ మధ్యన తెలుగు ఛానెల్స్ లో ఈ 'కబడ్డీ జర్నలిజం' ఎక్కువయ్యింది. వార్తలలో, యాంకర్ అడిగే ప్రశ్నలలో, స్టూడియో చర్చలలో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడ ఒకటి రెండు ఉదాహరణలు ఇస్తాను.
ఎవరో జ్యోతి అనే నటిని ఒక సెక్స్ రాకెట్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. తెలిసిన వ్యక్తి పిలిచాడు కదా...అని మాట్లాడడానికి వెళ్ళాననీ, తాను ఎలాంటి తప్పు చేయలేదన్నది..ఆమె వాదన. N-TV లో పరితోష్ అనే యాంకర్ ఆ జ్యోతి గారిని స్టూడియో లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశాడు.
"అసల మీరు ఎందుకు వెళ్లారు?", "మీరోమో ఏమీ తెలియదు అంటున్నారు...మరి పోలీసులేమో మిమ్మల్ని సెక్స్ వర్కర్ గా కోర్టు లో పేర్కొన్నారు కదా!" వంటి ప్రశ్నలు గుప్పించి కబడ్డీ ఆడుకున్నాడు. 'మిమ్మల్ని పోలీసులు సెక్స్ వర్కర్ అన్నారు కదా...' అనే ప్రశ్న మూడు సార్లు అటు తిప్పి ఇటు తిప్పి అడిగాడు...మన పరితోష్.
అబద్ధం చెప్పకుండా నిజం చెప్పమని మీరు నన్ను అడిగితే...సినిమా రంగంలో కన్నా ఎక్కువ ఇలాంటి 'చీకటి' వ్యవహారాలు బుల్లి తెర ఆఫీసులలో రసవత్తరంగా జరుగుతున్నాయి. పెళ్ళాం బిడ్డలను, మనస్సాక్షిని వదిలి సెక్స్ కుంభకోణాలకు పాల్పడుతున్న ఘనులు పలు ప్రముఖ ఛానెల్స్ లో మంచి హోదాలు అనుభవిస్తున్నారు. అదేమిటి సారూ...మనకు రూల్స్, చట్టాలు ఉన్నాయి కదా అంటే...."ఒక పెళ్ళికాని ఆమ్మాయి (జూనియర్ ఉద్యోగిని) కి, ఒక అబ్బాయి (బాసు సీట్లో ఉన్న 35-40 ఏళ్ళ వివాహితుడు) మధ్య శారీరక సంబంధం ఉంటే తప్పేంటి? స్వేచ్ఛ సమాజం..." అని వాదించే సీనియర్ జర్నలిస్టులు అన్ని ఛానెల్స్ లో పుష్కలంగా ఉన్నారని నాకు ఈ మధ్యన అర్థమయ్యింది.
అలాగే...టీ.టీ.డీ.మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డిది మరొక ఉదాహరణ. ఆయన ఈ మధ్యన దీక్షకు కూర్చునే ముందు ఒక రోజంతా అన్ని స్టూడియోలలో దర్శనం ఇచ్చారు. రిపోర్టర్ల ప్రశ్నలకు ఉదయం పూట సమాధానం బాగానే చెప్పారు కానీ....కబడ్డీ కుమ్ముడు ఎక్కువ కావడం తో సాయంత్రానికి స్టూడియోలలో యాంకర్, ప్రజెంటర్స్ మీద విసుక్కోవడం మొదలు పెట్టారు. HM-TV లో యాంకర్ కిరణ్ కు రెడ్డి గారికి మధ్య మంచి సంభాషణ జరిగింది.
ఈ కబడ్డీ జర్నలిజం...ఇంకా బాగా జరిగింది వర్ధమాన నటుల విషయంలో. ఒక నైజీరియన్ డైరీ లో దొరికిన ఫోన్ నంబర్ల ఆధారంగా తెలుగు ఛానెల్స్ ఒక రోజంతా రాజా, ఉదయ్ కిరణ్ వంటి పిల్ల హీరోలతో ఆడుకున్నాయి. "అంటే...మీ మీదనే ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి?," "అంటే...మీరు పబ్బులకు రెగ్యులర్ గా వేల్తుంటారా?" వంటి ప్రశ్నలు లైవ్ లో వేసి ఆ హీరోలతో కబడ్డీ ఆడుకున్నారు.
నా భర్త హింసించాడు, మామ వేధించాడు, అత్త తిట్టింది...అంటూ అమాయకంగా టీ.వీ.లైవ్ షో లలో పాల్గొంటున్న పిచ్చి తల్లులను చూస్తే...చాలా జాలి వేస్తుంది. స్టూడియో లకు వెళ్ళడం, తలతిక్కల ప్రశ్నలకు జవాబులు చెప్పడం, జనాలకు కనువిందు కలిగించడం వల్ల ఒరిగేది ఏమీ లేదు...ఇంకా వ్యవహారాన్ని రచ్చరచ్చ చేసుకోవడం తప్ప. డ్రగ్స్, సెక్స్, కరప్షన్ వంటి నెగిటివ్ అంశాలు వుంటే మాత్రం జర్నలిస్టులు చెలరేగి కబడ్డీ ఆడుకుంటారు. ఇది ఎలాంటి రూల్స్ లేని కబడ్డీ.
Friday, August 27, 2010
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
Recent incidents of drugs and sex racket have given good and delicious dinner to ost of te channels and Zee has taken over all of them by continously telecasting on the so called sex racket.Not only kabaddi the channels are playing football too with the victims.
While covering the death of Swayam prakash the news reader of TV9 has asked it's reporter at the residence of Swayam prakash "Akkada paristhithi elavundi?"It is foolish to ask the question as no body expects anything other than tragic scenes and calm atmosphere with sorrow everywhere which is usual at such places.Then why a senior news reader loike Devi has asked such a meaningless and foolish question?
It is true that there might be many scandals of sex with extra marital relationships in the TV studios but who has to bring them out?Whoa has to bell the cat?If anybody has got any confirmed story on the sex scandals in the studios it is better it is shared among the blogs so that they are exposed.
JP.
అన్నయ్యా
కరెక్టే...కబడ్డి జర్నలిజం అన్ని చానల్స్ లో రసవత్తరం గ జరుగుతొంది. ఆ సినిమ వాళ్ళ లాగ కొందరు దొరికిపొతారేమొ గాని మనము అనుకుంటున్న ఆ "పిచ్చి తల్లుల్లో" చాలామంది విషయం కంపు కంపు కావాలనె వొచేవాళ్ళుంటారని నాకున్న సమాచారం. అన్ని ప్రయత్నాలు చేసి ఇక లాభం లేదనుకొని ఒక చానల్ లొ కూర్చుంటె తమను వేధిస్తున్న వాళ్ళ పరువన్న తీయొచ్చనె ఉద్దేశం తో చివరి ప్రయత్నం గా చాల మంది ఈ మధ్య చానల్స్ కు వొస్తున్నరు. అందువల్ల అలా వొచ్చిన వాళ్ళెదో తెలియక వొచి ఇరుక్కుంటున్నారనుకొవడం మన అమాయకత్వం. ఒక్క సారి ఆ కోణం లొ కూడా అలొచించండి
It's definitely a good post. I now remember how Ayesha Siddiqui's Lawyer was grilled in the TV9 studio on live by Rajanikanth.
There's one channel doing a patch work on broken lives and broadcasting it. It's good to take up social responsibility but it is not necessary to show that on the TV just because they have a channel. Luckily I escape all this. I switch on the tv once in a while. But thank God! He's showing his grace in the form of TTD channel.
ఈ న్యూస్ బ్రేక్ అయిన రోజున మహా టీవీ వెంకట్రావు గారు ఈ నటీమణుల సినీ బిట్లతో ఇరగదీసాడు. మిడ్ నైట్ ప్రోగ్రాము సాయంత్రానికే వస్తుందేమిటి అని చూద్దును కదా ఈ వ్యవహారం తెలిసింది. రాత్రికి TV9 లో బద్రి జ్యోతి తో interview. జ్యోతి ని ఇబ్బందికర ప్రశ్నలడగకుండా వుండటానికి బద్రి చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది.
సంగతేమిటంటే ( నేను విన్నది ) ఈ సైరా బాను, మొన్న డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రవితేజ తమ్ముడు భరత్ సహజీవనం చేస్తున్నారట. ఆ తీగ లాగుతుంటే ఈ డొంక కదిలిందన్న మాట.
అనవసర విషయాలతో రోజంతా తలతినడం లో తెలుగు చానల్స్ అంత పరిజ్ఞానం ఇండియా లో ఏ ఇతర భాషల చానల్స్ కి లేదు.
రామూ గారూ, దీనిని కబడ్డీ అనడం కంటే చెడుగుడు అనడం సమంజసంగా వుంటుందని నా భావన.
కబడ్డి ఆడడానికి కొంచెం నేర్పు కావాలి, చెడుగుడు కి అది అవసరం లేదు. ఎంతమంది out ఐనా ఒకటే point. కూతకి వచ్చినవాడిని ఎంతమంది ఐనా కలిసి పడేసి తొక్కెయ్యవచ్చు(పద ప్రయోగానికి క్షమాపణలు).
ఇక ఇంటింటి పంచాయితీల విషయానికి వస్తే, ఇలాంటి పంచాయితీలు పెట్టే ముందు, ఈ మీడియా పెద్ద మనుషులు ఇరువర్గాల వాళ్ళనీ కుర్చోబెట్టి సమస్య సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నం ఎందుకు చెయ్యరు? ఐనా వచ్చే వాళ్ళు ఏమి ఆశించి వస్థున్నారో అర్థం కావడం లేదు. పాపం ఆ అమ్మాయి 'మామ వేధిస్తున్నాడు, ఇదేంటి రా బాబూ ఇలా జరిగింది' అని బాధలో వుంటే, మన రాష్ట్ర BJP మహిళా మోర్చా నాయకురాలట ఎవరో, ఆ అమ్మాయికి 'అభినందనలు' చెప్తుంది.
ఇవన్నీ ఒక ఎత్తైతే, మన సభ్య సమాజం ఎంతగా ఎదిగిందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ:
జ్యోతి గారిని ఒక బాదిత మహిళగా (నిజా నిజాలు కోర్ట్ వారి ద్వారా పోలీసులు ఎష్టాబ్లిష్ చెయ్యనంతవరకూ అలాగే పిలవాలి) కాకుండా దోషిలాగా (కోర్ట్ విచారణ టైపులో) కూర్చోబెట్టి ఒక చానల్ వాడు ('N' Tv అనుకుంటా?) ఇంటెరాగేట్ చేస్తుంటే, ఫోన్ కలిపిన ఒక మహిళ (గుంటూరు నుండి శారద) ఎంత అసహ్యంగా, సాటి మహిళ అనికూడా చూడకుండా "తప్పు చేసినప్పుడు ఒప్పుకోకుండా అక్కడ కూర్చొని ఏం వాదిస్తున్నావు. మీ లాంటి వాళ్ళు వచ్చే సంపాదన చాలక ఇలాంటి పనులు చేస్తారు. ఇది నిజమే, కొత్తగా నిరూపించాల్సిందేమీ లేదు........." ఇలాంటి మాటలతో కబడ్డీ ఆడేసుకుంది. ఎంత దౌర్భాగ్యం?
ఇక Tv9 లో బద్రి 'మామ వేధిస్తున్నాడు అని వచ్చిన అమ్మాయితో దాదాపు ఐదారు గంటలు లైవ్ 'షో' చేసేసి సభ్యతను మరచి, ఆమె చెబుతున్న వాస్తవాలను మించి ఇంకా ఏదో బ్రహ్మ రహస్యాన్ని రాబట్టాలనే తాపత్ర్యం తో 'ఇంకా ఏమి చేసాడు, ఇంకా ఏమేమి చేసాడు ....." అంటూ ఐదారుసార్లు ప్రశ్నించాడు.
హతవిధీ! మన వాళ్ళకు Destitute మహిళలతో ఏ విధంగా ప్రవర్తించాలో ఎప్పటికి తేలుస్తుందో ఏమో? వీరి దగ్గరకెళితే ఏదో ఒరుగుతుందనుకోవడం వారి అమాయకత్వమనే అనుకోవాలి. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్నట్లు ఏదైనా అడిగేస్తారు, ఎంతసేపైనా ర్యాగింగ్/ కబడ్డీ/ చెడుగుడు ఆడేస్తారు.
అందుకే మీడియా మీద నియంత్రణ ఉండాల్సిందే అని చాలామంది మొత్తుకుంటున్నారు. అయితే అక్కడికి తామేదో సుద్ద పూసలమైనట్లు, తమవైపు వేలు చూపితే నరికేస్తామంటూ మాట్లాడే మీడియాను నియంత్రించాలనుకోవడం ప్రభుత్వాలకు జరిగేది కాదు/ సబబు కూడా కాకపోవచ్చు. కానీ, స్వయం నియంత్రణ కోసం 'ఆంబుడ్స్మన్ ' వంటి వ్యవస్థనైనా తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చట్టపరమైన వత్తిడి చెయ్యవచ్చేమో? ఏమంటారు?
Sorry. that was Studio'N', not 'N'Tv.
ఇంకా తెలవారదేమి!
మీడియా కోళ్ళు కూస్తున్నాయి. కానీ ఎంతకూ తెలవారడం లేదు. చీకటి విడిపోవడంలేదు. ఎందుకంటె ఇది పగటివేళ కనుక. కోడి కూసింది కదా అని పట్టపగలే తెల్లవారదు.
వెనక తెలుగు టీవీ సీరియళ్ల గురించి చెప్పుకునే జీడిపాకం జోకులు ఇప్పుడు మీడియా గురించి చెప్పుకోవాల్సివస్తోంది. ఏదోజరగాలని అనుకుని అది జరగకపోతే కలిగే నిరుత్సాహం మీడియా యాంఖర్లలో ప్రస్పుటంగా కానవస్తోంది. జగన్ ఓదార్పు యాత్ర, అధిస్థానం వైఖరి, కాంగ్రెస్ పార్టీలో చీలికలు – ఏ అంశం తీసుకున్నా – మీడియా గత కొద్ది నెలలుగా చేస్తున్న ఊహాగానాలలో ఏ ఒక్కటీ నిజం కాలేదు. అయినా వాళ్ళు ‘విసుగు చెందని విక్రమార్కుల’ మాదిరిగా అవే ప్రశ్నలు మార్చి మార్చి సంధిస్తున్నారు. ఏ ఒక్క రోజయినా వీళ్ళు తమ ప్రోగ్రాములు ఒక్కసారి ‘రీవైండ్’ చేసుకుని చూస్తె – మళ్ళీ ఇలాటి జిడ్డు ప్రశ్నలు వేయరనిపిస్తుంది కానీ – ఏ పూటకు ఆ పూటే పరగడుపు అనే తీరుకు అలవాటు పడిన వాళ్లకు ‘ఆత్మ విమర్శ’ సాధ్యమయ్యేపనేనా! యెంత ఆశావహులకు కూడా మీడియా మారుతుందన్న ఆశ కలగడం లేదు. మీరేమంటారు? – భండారు శ్రీనివాసరావు
yedho cheyalani journalism chesi IT vadili nundi media lo adugu pettanu.news ante prajalaki upayoga pade vidhanga undali.kani ippudu adhi ye channel lo kanabadadam ledhu. electronic media antene visugu vachesindindi.aa roju studio-n lo jyothi ni thisukuvachi thanani interview cheyadam asalu prajalaku avasaram ledhu alantidhi mobile no.echi call chesi matladinchadam varu adige prashnalaku aame javabu cheppadam people ki emanna use avuthundha...aa roju tho media antene cheraku vachindi. nenu cheyali anukunnavi media lo undi cheyanavasam ledhu mamuluga kuda cheyochu anukuni na job ki kuda resign chesanu.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి