ఛీ...ఛీ...నాలుగు రోజుల బెంగాల్ పర్యటన తర్వాత వచ్చి టెలివిజన్ పెట్టి, పేపర్లు తిరగేస్తే మళ్ళీ అదే కథ. జనశ్రేయస్సు పట్టక...అభివృద్ధి వార్తలు కనిపించక...డబ్బు పిచ్చి తప్ప వేరే ఏ ధ్యాసాలేక...భావదారిద్ర్యంతో చస్తున్న ఛానెల్స్ నుంచి ఇంతకన్నా ఏమీ ఆశించలేమనుకోండి.
ఒక పిల్ల హీరో పెళ్లిచేసుకోవాలని అనుకోవడం... అబ్బాయి-అమ్మాయి కుటుంబాల వారు మాట్లాడుకోవడం...ఈ అంశం ఇతివృత్తంగా పుంఖానుపుంఖాలుగా కథనాలు. వాళ్ళు ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఏదో కొంప మునిగిపోతుంది అన్నట్లు దాదాపు అన్ని ఛానెల్స్ కథనాలు ప్రసారం చేసాయి. మధ్యలో ఆ హీరో పాటలు ఒకటి.
హీరో తండ్రి....'ఇది పధ్ధతి కాదు' అని మొత్తుకున్నా...అదే ధోరణిలో కథనాలు ప్రసారం చేశారు. పత్రికలు ఆ అమ్మాయి ఫోటో కూడా వేసాయి. కుటుంబ వివరాలు కూడా అందించాయి. ఒకవేళ ఏదో వ్యవహారం బెడిసి....ఆ పెళ్లి వద్దనుకుని వాళ్ళు అనుకుంటే...ఇప్పుడు పాప బతుకు ఏమికాను? ఇంకేముంది....అప్పుడు కూడా విషయాన్ని ఒక రెండు స్టోరీ లుగా మలిచి పండగ చేసుకుంటాయి....ఈ తుక్కు ఛానెల్స్.
అసలు ఈ ఛానెల్స్ కు ఎందుకు ఇంత కక్కుర్తి? నాకే గనక అధికారం ఇస్తే...ఈ ఛానెల్స్ ను 24 గంటలు ఆడనివ్వను. అది సమాజానికి పెద్ద ప్రమాదం తెచ్చి పెట్టింది. ఆ రాత్రి లేదా పగలు బూతు చూపి... ప్రజోపయోగమైన వార్తలు ఇవ్వని ఛానల్ కు మర్నాడు ఒక అర్ధగంట మాత్రమే ప్రసారాలకు అనుమతి ఇస్తాను. భావప్రకట లేదు...పచ్చిచేపల పులుసూ లేదు...గొంతెత్తిన ప్రతి ఓనర్ గాడ్ని తొక్కిపారేస్తాను. ఈ ఎదవల అఘాయిత్యాన్ని, బరితెగింపు ను అడ్డుకోవాల్సిన నాయకులు, మేధావులు స్టూడియోల చుట్టూ అడ్డగాడిదలు తిరిగినట్లు తిరుగుతూ....పాపులారిటీ వచ్చిన్దహో అని మురవలేక చస్తున్నారు. తెలుగు సమాజం సంక్షోభంలో పడింది సార్.
మొన్నామధ్య ప్రభుదేవా-నయనతార గురించి పండగ చేసుకున్న ఛానెల్స్, ఇప్పుడు అల్లు అర్జున్ గురించి హంగామా చేసాయి. ఈ ఉదయం వాడెవడో...పిల్ల హీరో బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి కృష్ణా నదిలోకి షికారుకు వెళ్లి, మర పడవ ఆగడంతో ఆగమాగమైపోయాడు. విజువల్స్ లేవు కాబట్టి...స్క్రోల్స్ తో పండగ చేసుకున్నాయి....ఛా...నల్స్. సెలవరోజైన రేపు (ఆదివారం) ఈ అంశంపై పంచనామా చేస్తాయి చూడండి.
అయ్యా...తెగులు ఛానెల్స్ ఎడిటర్లూ....సీ.ఈ.వో.లూ...కాస్త మానవత్వంతో బాధ్యతాయుతంగా ఉండవచ్చేమో చూడండి. ఒక ఒరవడిలో కొట్టుకుపోయి మీరు జర్నలిజం రూపురేఖావిలాసాలు మార్చేసారు. జనాలను పనికిరాని కథనాల ఉయ్యాలలో వేసి జోకొడుతున్నారు. సమాజానికి అమూల్యమైన వనరులైన మనుషుల ప్రాధాన్యతలను క్రమంగా మారుస్తున్నారు, ఆలోచనా శక్తిని దెబ్బతీస్తున్నారు.
సినిమా మాత్రమే ప్రపంచం కాదు సార్. ఇది అప్పటికి హాయిగా అనిపించే ఒక వినోదం మాత్రమే. అందులో మనుషులకు మరీ అంత ప్రాముఖ్యత ఇవ్వకండి. వాళ్ళను జనం దేవుళ్ళనుకునే స్థాయికి తీసుకుపోవద్దు. ప్లీజ్...ఈ పోరంబోకు జర్నలిజం వదిలి....బాధ్యాతాయుతమైన జర్నలిజం చేయండి...సమాజానికి తోడ్పడండి.
Saturday, October 30, 2010
Subscribe to:
Post Comments (Atom)
16 comments:
జర్నలిస్టులకు చెప్పారు సరే కానీ వారానికి ఒక సినిమా అన్నా చూడక పోతే ప్రాణం పోయే పెద్దలున్నారు మనలో వాళ్లకి చెప్పండి బుద్ధి పిల్లలను చేదగోట్టకండీ అనీ సినిమాలకి దూరంగా పెంచమనీ...
నిజంగానే ఛానల్స్ కి పిచ్చి బాగా ముదిరింది. కుర్రహీరో లవ్వాడితే ఏంటి? పెళ్ళాడితే ఏంటి? జూ యన్ టి ఆర్ విషయంలో కూడా అనవసరంగా వధువుకు 18 ఏళ్ళు పెళ్ళికి ముందువస్తాయా తర్వాత వస్తాయా అనే విషయం మీద బుర్రలు తినేసారు.
ఏం చేస్తే ఈ చానల్స్ బాగు పడతాయి అనే చర్చ మొదలు పెట్టండి వేరే బ్లాగు పోస్టుతో.
ఇంటర్ చదివే ఆడ పిల్లల దగ్గర మైక్ పెట్టి ... అల్లు అర్జున్ పెళ్లి చేసుకుంటున్నాడు ,మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంట ...థూ ,ఏంటి ఈ మతి లేని పనులు ?గత దశాబ్ద కాలం లో రాష్ట్రానికి పట్టిన అతి దరిద్రం ఏదయినా ఉంది అంటే..ఈ 24 గంటల న్యూస్ ఛానల్సే . చూడటం మానేయటం తప్ప చేసేది ఏమి లేదనిపిస్తోంది !
read the following post in my blog
http://kasturimuralikrishna.com/wp-content/uploads/2010/09/sinima.jpg
You have timely blasted the channels for their sadistic attitude.If the daughter of any CEO or proprietor of any channel is involved in incidents like Allu Arjun and Navdeep do the channels behave in a similar way?Why these channels never expose the immoral activities and extra marital relationships,physical relationships with the anchors,TV stars of CEOs and other bosses of the media houses?Do they think that no body knows about their immoral activities?They are just following the Guruginja story!
JP.
మీడియాగా పిలవబడే ఈ చానెళ్ళు (దాదాపు అన్నీ), జర్నలిస్టులని పిలవబడుతున్న కొంతమంది కలిసి, పత్రికా స్వాతంత్రం మీద ఎంతటి దెబ్బ కొడుతున్నారో వాళ్ళకి వాళ్ళకి అర్ధం కావట్లేదు, కాదు, కాదు తెలుసు వాళ్ళకి! వాళ్ళు చేసేది చండాలపు పనులు అని (దాదాపు వీళ్ళదరూ కొంతకాలం మర్యాదగా ఉన్నవాళ్ళే/నటించినవాళ్ళే, పెద్ద పెద్ద వాళ్ళు పైగా, ఎదో తెలియని కుర్ర సజ్జు అనుకుంటె పోనీ తెలియదు అనుకోవచ్చు) వాళ్ళు చేసే లేకి, వెకిలి, చౌకబారు పనులవల్ల మొత్తం సమాజం వాళ్ళని అసహ్యించుకుంటూ, చీదరించుకుంటోందని తెలిసినా, "ఆ వీళ్ళేం చేయగలరు లే" అన్న రౌడీ మనస్తత్వంతో, వ్యాపార ప్రకటనలే ధ్యేయంగా తద్వారా డబ్బు సంపాదనే ఏకైక ప్రధాన ఉద్దేశ్యంగా బతుకుతున్నారు. ఇలా కొంతకాలం సాగితే మీరు మీ బ్లాగులో వ్రాసినట్టే , పత్రికా స్వాత్రంత్రం లేదు మరెమీ లేదు అందరూ చానెళ్ళు మూసుకుని కూచొండి అని ప్రభుత్వం హుకుం జారీచేస్తే, ప్రజల్లో ఒక్కళ్ళు, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఎదురు చెప్పరు. ఎందుకంటె, ప్రీ ప్రెస్ పేరుతో ఈ మీడియా ఆగడాలు, అల్లరి, కాలుష్యాలతో అంత విసిగిపోయారు ప్రేక్షకులు/పాఠకులు/శ్రోతలు. ఈ క్షణాన, ప్రబుత్వం చానెళ్ళను (అన్ని భాషల్లోనూ) రోజుకి ఒక నాలు గంటలే ప్రసారాలు చేయండి అని నియంత్రిస్తే అందరూ సంతోషిస్తారే కాని, ఎవ్వరూ బాధపడరు.
మీడియాగా పిలవబడే ఈ చాన్నెళ్ళు, అదంటే ఏమిటో తెలిస్తే, ఆత్మ పరిశోధన చేసుకోవాలి, లేకపోతే కొన్నాళ్ళకి జర్నలిజం పాఠాల్లో, జర్నలిజం అంటే ఎలా ఉండకూడదో అన్న అధ్యాయంలో, చండాలపు ఉదాహరణలుగా మిగిలిపోతారు. మరో రెండు మూడు దశాబ్దాల తరువాత 200లలోట మీడియ ఇంత అసహ్యంగా ఉండేదిట అని చోద్యంగా చెప్పుకుంటారు.
ఈ విషయం మీద బాధపడుతూ మునుపు వ్రాసిన వ్యాసం ఈ కింది లింకు నొక్కి చూడగలరు.
http://saahitya-abhimaani.blogspot.com/2010/02/blog-post.html
దీనికి నాల్గోవపురమని అని ఒక డాబుసరి పేరొకటి.కోడిగుడ్డుకి ఈకలు పీకే పనిలో వీరికంటే సిద్ధ్హహస్త్తులు మరొకరుండరు మరి..ఒక సీ.ఈ.వో చెన్నైలో [అన్నా-నగర్లో ]భూకపంవచ్చిందని,రెండు భవనాలు కూలాయని సాక్షి ప్రతినిధి చెప్పారు [చెన్నై]మీరెళ్ళి కొంచం హడావిడి చేయండని నాకూ ఆదేశాలు ఇచ్చారు.తీర నేను సి.న్.న్ కి ఫోనేచేస్త్తే ,కనీసం పగుళ్ళు కూడా రాలేదని చెప్పారు.ఇలాంటి వాళ్ళంతా సీ.ఈ.వో లుగా వెలగబెడుతున్నారు.మీరు వాడిన చచ్చు అనే పదమే వీటికి సరిఅయినది.
The state of journalism in AP has reached disgusting levels. However I personally would like to believe that the public anger will translate for better. As people get more and more averted by such irresponsible journalism the media houses have to cope up with the change in the mindset of people.
Ramu garu, national level English news channels seem to have more evolved in this context, I feel. It would be nice if you can share your thoughts on that front.
దూరదర్శన్ రోజులే నయం అనిపిస్తున్నారు. ఈ 24 గంటల ఛానెల్స్ కు సినిమా పిచ్చ ఎంత ఎక్కువైందంటే సి గ్రేడ్ సెంటర్లో కూడా పట్టుమని పదిరోజులు కూడా ఆడలేని సినిమాలకు ప్రమోషన్ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి. ఆ చిత్రాలేవో దేశభక్తిని పెంపందిస్తున్నట్లు సందేశం ఏమిటి అని అడగడం, నాలుగు డబ్బులకోసం బట్టలూడదీయించే దర్శక నిర్మాతలతో ముఖాముఖి, నాలుగైనా తెలుగు పదాలు మాట్లాడలేని దిగుమతి సరుకులైన హిరోయిన్లతో మాట్లాడే అద్భుత అవకాశాల్ని తెలుగు జనాలకు అందించడం వీరి వృత్తి అయిపోయింది. ఇక వినోద ఛానెళ్లు తమిళ కంపును ప్రేమగా రాసుకుని తిరుగుతున్నాయి. లింపతీవ తమో అంగాని అనే పదబందం తెగులు ఛీనెల్స్ కు బాగా సూటవుతున్నది.
దీనికన్నా కాస్త వెనుకబడి ఉన్నట్లు కనిపించినా దూరదర్శనే నయం అనిపిస్తోంది నాకు. వాటీజ్ యువర్ ఒపీనియన్
samannudi gurinchi aalochinche okka chennal kuda lekapovatam mana duradurstakaram......journalisam ante yento kuda teludu villaki...addamaiena news latho janalanu pakka tova pattistunnai sir...ippudu meru paddaru chudandi ade avedana nenu prathi roju padatanu sir...oka mamulu manishi gurinchi villu yenduku aalochincharu ani...? paper tirageste chalu vadu vidini titadam vidu vadini tittatam ate tappu samajamlo cheyitannaym tisuku vache okkatanti okka news kuda kanipinchadu sir...monna oka tv chennal vadu aiete heyderabd yeppudo antam aiepotundi anta yevaro yedo documetari tisaru danini pattukoni vallu yedo tappu chesinattu pedda charchha pettaru....valla chitilo vunna vurthi yenta goppado ee chennals vallaku teliyatam ledu sir....vallu cheppe matam, chupinche durshyam samajanni yento prabavitham chestundi ani villaku teliyatam ledu sir. nenu inta avedana padataniki karanam journalisam ante naku pranam sir na goal oka manchi journalist avatam sir.... yemaiena tappulu vunte sorry sir
mee abhimani
Balakrishna.M
Blue programmes are broadcast not only during day and night but also at dusk and dawn. I watch tv only for a short time. And I cursed myself for switching on the tv at about 7.30pm when zee 24 hrs was showing a nonsensical programme.
Several years ago, Mandolin Srinivas, when asked why he settled down in TN, simply replied that AP LO CINI,AALAKI UNNA AADARANA SANGEETHAANIKI LEDHU.
ఇది సినిమా పిచ్చి మాత్రమే కాదు. వ్యక్తిగత స్వేచ్చ కి తీవ్రమైన భంగకరం. అన్ని పేపర్స్ అన్ని టీవీ చానల్స్ నిస్సుగ్గుగా ప్రచురించాయి ప్రసారం చేసాయి. నిజం గా తెలుగు మీడియా భావ దారిద్రం లో కొట్టుమిట్టాడు తుంది.
డియర్ రాము!
మనం ఎంత మొత్తుకున్నా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. బహుశా ముందు ముందు ఇంకా జుగుప్సాకరంగా కూడా ఉండొచ్చు. కానీ, మీరు మాటి మాటికీ ఇలా ఆవేదనగా వ్రాయడం, తరువాత అది (వ్రాసి ఊరుకోవడం) అలవాటుగా మారడం నాకెందుకో సరి అనిపించడం లేదు.
ఎందుకంటే-మనిషికోమాట గొడ్డుకో దెబ్బ అనే స్థాయి దాటి మన మెడియా హోజుల తోలు దొడ్డుదైపోయినప్పుడు ఇలా సుతిమెత్తగా చురకలు వేయడం కాకుండా సర్కస్లో కౄరమృగాలను హంటర్ తో బాది దారికి తెచ్చినట్లు 'మీడియా ఆంబుడ్స్మన్ ' వంటి ఒక పటిష్ఠ వ్యవస్థ ద్వారా నియంత్రించాలి. నేను గతంలో కూడా ఈ విషయంపై రెండు మూడు సార్లు మీకు వ్రాసినా మీరెందుకో దానిపై చర్చ జరపలేదు!
శిశుపాల ప్రవృత్తిగల రిపోర్టర్లు, సంపాదకులను, ముఖ్యంగా మీడియా హౌజు లను నడిపేవారిని వెంటనే శిక్షించే ఒక వ్యవస్థ ఉండి తీరాలి. గతంలో అనేక సంధర్భాలలో నేను ఇదే పాయింట్ మీద 'మీడియా ఆంబుడ్స్మన్ ' వంటి వ్యవస్థ వుండాలనీ, ఫిర్యాదు కోసం ఎదురు చూడకుండా స్వతంత్రంగా మీడియా మొత్తాన్ని మానిటర్ చేస్తూ, తిక్క తిక్క ప్రసారాలను చేసినప్పుడు నిస్పక్ష వైఖరతో చర్యలు తీసుకోగల సత్తా గల పెద్దలతో ఉండాలి అనే దానిపై చర్చను ఆహ్వానించండి. మన బ్లాగులోనే కాకుండా మీకందుబాటులో ఉన్న హెచ్.ఎం టీవి వంటిదాంట్లో విస్తృత చర్చ (ఏ.పి దశ, దిశ లాగ) జరిపితే బాగుంటుందేమో?
బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్ ఆంబుడ్స్మన్ వ్యవస్థలు పటిష్టంగానే పనిచేస్తున్న అనుభవం మన దేశంలో ఉంది కనుక, మరియు మీడియా లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నిఖార్సైన జర్నలిస్ట్లు ఇంకా మిగిలే ఉన్నారు కనుక అటువంటివారి ఆధ్వర్యంలో మీడియావారే అందరికీ అమోదయోగ్యంగా 'ఆంబుడ్స్మన్ ' లాంటి వ్యవస్థ ఏర్పరుచుకొని తీరేలా ప్రభుత్వం ఒక చట్టం తీసుకువచ్చినా తప్పుకాదేమో? అంటే ఇదేదో అనవసర ప్రభుత్వ జోక్యానికి దారితీస్తుందనో లేక మీడియా స్వేచ్చకు భగం వాటిల్లుతుందనో భావించనవసరం లేదు. ఈ అతి స్వేచ్చకు బ్రేకులు వేస్తుంది. ఎందుకంటే నిర్ణీత గడువులోగా వ్యవస్థను ఏర్పరుచుకునేలా నిర్దేశించడం మాత్రమే ప్రభుత్వ పని. అందరికీ ఆమోదయోగ్య విధి విధానాలతో మీడియ స్వయంగానే అలాంటి వ్యవస్థను ఏర్పరుచుకునే స్వేచ్ఛ ఎటూ వారికుంటుంది.
ఇటువంటి వ్యవస్థ ఒకటి వుంటే ఎవరికి సమస్య వచ్చినప్పుడు వారు వ్యక్తిగతంగా పోరాడటం కాకుండా దాని ద్వారా సహేతుక న్యాయాన్ని ఆశించవచ్చు. పైగా మీడియా హౌజుల 'అతి' ని కూడా అది నియంత్రించగలదు.
Reddy gaaroo,
".....హెచ్.ఎం టీవి వంటిదాంట్లో విస్తృత చర్చ (ఏ.పి దశ, దిశ లాగ) జరిపితే బాగుంటుందేమో?...."
Excellent suggestion. Whether HM TV shall do it or dare to do it?? I doubt.
శివగారూ!
Ramu has to clarify on ur doubt?
రెడ్డి గారూ, చాలా మంచి suggestion sir.
బాబ్బాబూ, ఎవరో ఒకరు ఆ పని చేసి పుణ్యం కట్టుకోండీ, please!!!
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి