Monday, May 2, 2011

'యంగిస్థాన్' లో వేమూరి రాధాకృష్ణ బీభత్స కాండ

జర్నలిస్టులంటే పొగరుబోతు వెధవలన్న అభిప్రాయం జనంలో ఉంది. ఈ అభిప్రాయాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక, ఏ.బీ.ఎన్. చానెల్ అధినేత వేమూరి రాధాకృష్ణ తన లైవ్ ప్రోగ్రాంలతో ఇంకా దృఢ పటేట్లు చేస్తున్నారు...శక్తి వంచన లేకుండా. నా సుడి బాగోలేక...కొద్దిసేపటి కిందట...ఆ చానెల్ లో వచ్చిన 'యంగిస్థాన్' అనే ప్రోగ్రాం చూస్తే...పరమ రోత కలిగింది. ఆయన ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి లైవ్ లో మాట్లాడుతున్నారు. యాంకర్ గా ఆయన ప్రజెంటేషన్ పరమ దరిద్రంగా ఉంది.

ఒక ఇంటర్ అమ్మాయి ఏదో చెప్పలేకపోతే...'నీ తలకాయ' అని రాధాకృష్ణ తిట్టాడు. ఇలాంటి తిక్కల మాటలు, పిచ్చి ప్రయోగాలు చాలా చాలా వున్నాయి. చెప్పాపెట్టకుండా ప్రోగ్రాం కు బ్రేక్ ఇవ్వడం చెత్తగా అనిపించింది. మధ్యలో ఆయనకు రాని ఇంగ్లిష్ ప్రయోగం ఒకటి. యువతకు "మెంటల్ ఎవల్యూషన్" కావాలని రాధాకృష్ణ చెప్పారు. దాని అర్థం 'మానసిక పరిపక్వత' అని అదృష్టవశాత్తూ సారే అనువదించారు. "యూ టాక్ విత్ యువర్ పేరెంట్స్" అని సలహా కూడా ఇచ్చారు....మన సీనియర్ జర్నలిస్టు. ఆయన మాట్లాడే ఇంగ్లిష్ లో సగం తప్పులు వున్నాయి. స్వీపింగ్ స్టేట్ మెంట్స్ చేస్తూ...''దట్ ఈస్ ద హ్యూమన్ సైకోలజి," అని ఒక చోట విశదీకరించారు. పిల్లోళ్ళు...ఈయన ఏదో తురుంఖాన్ అనుకుని ఆ భాష ప్రయోగించడం అలవాటు చేసుకుంటే...కొంప కొల్లేరు అయ్యేట్లు ఉంది. రాధాకృష్ణా...ప్లీజ్ స్టాప్ థిస్ నాన్ సెన్స్.

"నువ్వు మందు తాగుతావా?" అని ఒక పిల్లోడిని సభా మర్యాద మరిచి ఆయన అడగడం..."పీకడం"..."నువ్వు చెప్పు...," "ఆగాగు...నువ్వు జెప్పు" "కూచో..కోచో..." అని అనడం అస్సలు బాగోలేదు. ఆయన మాటలు ఇరిటేషన్ కలిగిస్తున్నాయి. ఒక దశలో...."ఐ యాం సారీ టు సే....మీ స్టూడెంట్స్ కన్నా...రాజకీయ నాయకులకు చాలా ఎక్కువ తెలుసు," అని తేల్చిచెప్పిన రాధాకృష్ణ..."మీకు పుస్తకాలు తప్ప ఏమీ తెలియదు..."అని తీర్మానం చేసారు. ఒక పిల్లవాడు ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే....'అంటే...మన దేశం మీద బాంబు పడాలంటవా?" అని ఈయన అడగడం బాగోలేదు. ఆ ఈడు పిల్లలతో మాట్లాడే పధ్ధతి ఇదా? ఒక సభ్యత, సంస్కారం లేవా? బాసూ....యాంకరింగ్ అంటే...ఊళ్ళో వేప చెట్టు కింద రచ్చబండ మీద కాళ్ళు జాపి కూర్చుని దొరగారిలా ఇతరులను డామినేట్ చేస్తూ మాట్లాడటం, నోటికి వచ్చింది వాగడం కాదని ఎవరైనా ఈ వీర జర్నలిస్టుకు చెప్పి పుణ్యం కట్టుకోండి...ప్లీజ్.   

'ఇంక నీకేమి తెలియదు...కూసో' అని ఒక యువకుడ్ని గద్దించాడు...మన రాధాకృష్ణ....ప్రోగ్రాం చివర్లో. 'ఇక్కడ వున్నాళ్ళలో సగం మందికి వ్యవస్థ గురించి ఏమీ తెలియదు' అని కూడా ఆయన చెప్పాడు.
"అన్నయ్యా రాధాకృష్ణా....నీకు ఎట్ట మాట్టాడాలో తెలియదు. ఈ ప్రోగ్రాం ఇంతటితో ఆపి ఆయిగా ఇంట్లో కూకో" అని మా అబ్రకదబ్ర అన్నాడు. ఆ స్టేట్ మెంట్ ను నేను బలపరుస్తున్నా.  

24 comments:

Ajay Kumar said...

SIr, Radhakrishna yemi cheppado naaku anavasaram kaani.. being YOuth, i can say an 80% of us are dont know what is society, politics and what way we need to lead our live. we just know how to earn money, how to enjoy life and how to drive our lives crazy based on others words.

Srikanth said...

ఈయన గారి "గుండె పిప్పండి నాతో" కార్యక్రమం చూసా ఓ రెండు సార్లు. నోరు విప్పితే బూతులే. ఎవరితోనైనా పడుకోన్నావా? మందు తాగుతావా? ఇంకేమయిన వెధవ పనుల చేసావా/చేస్తావ? ఇలా సాగుతుంది ఈయన గారి ముఖ ముఖి. ఇవా అంది అడగాల్సిన ప్రశ్నలు? క్షమించండి సర్ బట్ వీడొక పెర్వేర్ట్. ఒక మానసిక వ్యభిచారి.

శ్రీకాంత్

kumar said...

Radha krishna, open heart with RK lo kuda questions chala asahyam ga vuntayee.
Film celebrities ani adige routine questions
1) Mee remunation entha?
2) Meeku emi anna affairs vunnayaa??
3) Meeru elanti avamanalu edurukunnaru?

జైభారత్ said...

ఈయన ఇంటర్వ్యూలను తలచుకుంటుంటే వళ్ళంతా అదో గగుర్పాటుకు లోనవుతుంది..ఆంధ్రప్రదేశ్ మొత్తం మీ మాటలకి ఏకీభవిస్తారు అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు కాకుంటే యంగిస్తాన్ గురించి మాత్రమే మీరు చుసినట్లున్నారు కాని "ఓపెన్ విత్ ఆర్ కే" లో ఆయన ఓపెన్ చేస్కుంటున్న మేధావితనాన్ని చూసి జర్నలిజాన్ని ఘాన్డ్రించి ఉమ్ముతున్నారు ( ఇంతకంటే వేరే పదం వాడి చెప్పలేను నాకున్న పరిజ్ఞానంలో.. ) ఛీ అని ఛానెల్ ని మార్చుకుంటున్నారు.....నవ్విపోదురు గాని నాకేటి సిగ్గు అని ఈయనా రెట్టించిన ఉత్సాహంతో ఈ రకంగా ముందుకు పోతున్నాడు...మోహన్ బాబు కుమార్తె లక్ష్మిని ఇంటర్వ్యూ పేరుతో ఈయన గారికున్న అనుమానాల్ని ప్రశ్నల పేరుతో అడిగిన పద్ధతి చాల చాల అనాగరికం మొరటుతనం...నీచాతి నీచం...పరమ రోతగా సాగుతున్న ఈ దాస్టికానికి తెరపడాలని అందరం కోరుకుందాం...

సుజాత వేల్పూరి said...

ఈ కార్యక్రమం చూస్తుంటే నాకు మొదట ఆశ్చర్యమూ, తర్వాత విస్మయమూ, తర్వాత నిర్ఘాంతపోవడమూ,మొదలైన భావాలు కల్గి అవి క్రమక్రమంగా వెగటు,చీదర, అసహ్యాలు గా పరిణమించి చివరికి దుఃఖం కల్గింది. ఒక ఛానెల్ MD విద్యార్థులతో ఏ స్థాయిలో మాట్లాడుతున్నాడురా దేవుడా అనిపించి!

బై ది వే, ఈయనకు పిల్లలున్నారాండీ పాపం?

prabhakarrao said...

every dog has a day..RADHAIAH ki kooda oka roju vasthundhi,,
RADHAKRISHNA LANTI JOURNALISTULLUNNA EE PATHRIKAPRAPAMCHAMLO NENU KOODA O JOURNALISTUNE ANI CHEPPUKOVADANIKI SIGGUGA VUNDHANNYYA,,,

Dileep_hyd

Kathi Mahesh Kumar said...

ఈయనగారి ఆధ్వర్యంలో ABN ఛానెల్ ప్రారంభదశలోనే నాశనమైపోయింది. అంతకంటే స్మర్థుడైన ఎడిటర్ వీళ్ళకి దొరకలేదా!?

Unknown said...

జర్నలిస్ట్ లలోకేల్ల పెద్ద అవినీతి పరుడు అవినీతి రహిత సమాజం గురించి , కులం ద్వార ఎదిగిన వ్యక్తి కుల రహిత సమాజం గురించి విద్యార్తులకు భోదించడం వింతగా అనిపించడం లేదా ?

AP TV NEWS said...

1. టీవీ5 వారి న్యూజెన్ గోల్డ్ తైలం రాసుకుంటే అంతే అన్నాడు..
త‌ర్వాత వాళ్లు ఫ్రంట్ పేజి యాడ్ ఇస్తే అదే తైలంతో మ‌ర్థ‌న చేసుకున్నాడు..
2. మైక్రోఫైనాన్స్‌..రుణం ఒక వ‌ల‌..మ‌ర‌ణం దాని వెల అంటూ ఊద‌ర‌గొట్టాడు.
అందాల్సిన‌దంతా అందితే వాళ్ల‌తోనే ఓపెన్ డిస్క‌ష‌న్ పెట్టేసి సెటిల్ చేశాడు.
3. ఇప్పుడు దేవాంత‌కులు అంటూ సాయి ట్ర‌స్ట్‌పై క‌న్నేశాడు..
రెండ్రోజుల త‌ర్వాత అక్క‌డ్నుంచీ ఏమైనా అందితే..మేట‌ర్ వ‌ర్క‌వుట్ అయిన‌ట్లే..

ఒకటి రెండు కాదు...ఇలాంటివి..కోకొల్ల‌లు.

Unknown said...

మీరు రాధాకృష్ణగాడి గురించే అలా రాశారు. కానీ.. వాడికి చాలా మంది చెంచా గాళ్లు ఉన్నారు. వాడు మాట్టాడిన వాటన్నింటికీ ఆహా ఓహో అనే తిగుళ్లు చాలా మందే ఉన్నారు.
రాధా కృష్ణగాడు ఈనాడులో పనిచేస్తూ సైకిలేసుకుని అసెంబ్లీకీ, పార్టీ ఆఫీసులకు వెళ్లిన రోజుల్ని ఆడీ కారు కొనగానే మర్చిపోయినట్లున్నాడు.
వీడు ఇంటర్వ్యూ చేసే తీరు చూస్తే కొత్తగా జర్నలిజంలో చేరిన పిల్లలకు ’’దరిద్ర నీచాతి నీచ ఇంటర్వ్యూ దాని విధానం‘‘ అన్న అంశానికి ఉదాహరణగా చూపొచ్చు.
వాడిని వాడు ఏదో పెద్ద వేత్తలాగా ఫీలైపోతూ ఉంటాడు. వీడి గత చరిత్ర మీడియాలో ఉన్న వాళ్లందరికీ తెలుసు.
వాడికి కూడా పిల్లలున్నారు. మొన్నే ఒక అమ్మాయికి కూడా పెళ్లి చేశాడు. రేపు మనవళ్లకు మనవరాళ్లకు కూడా ఇలాగే నేర్పుతాడేమో... ఈ అపర మేతావీ

Thirmal Reddy said...

మీడియా చేసిన అతి ఒకటి మీ దృష్టికి తీసుకురావాలనిపించింది. అక్బరుద్దీన్ పై జరిగిన దాడి దృశ్యాలు పాత బస్తికి చెందినా 4టీవీ వాళ్ళు ఎలాగో షూట్ చేసారు. మన తెలుగు మీడియాలోని అన్ని చానేల్ల్స్ వాటిని సంపాదించి నిన్న రాత్రంతా ఊదరగొట్టాయి. దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. ఖచ్చితంగా విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉంది. కాని అవేవి పట్టించుకోకుండా వరుసబెట్టి ప్రసారం చేసాయి. ప్రతీకార దాడులు జరక్కుండా ఓ వైపు పోలీసులు నానా తంటాలు పడుతుంటే, ఈ చానెల్స్ వారు మాత్రం పుండు మీద కారం చాల్లే ప్రయత్నాన్ని సిన్సియర్గా నిర్వహించాయి. పైగా దృశ్యాలు చూపేది కేవలం దాడి ఎలా జరిగిందో వివరించేందుకే తప్ప, ఎవరిని రెచ్చగొట్టడానికి కాదని డైలాగులు. ఇది నిజంగా సిగ్గుచేటు. ఎంబీయే మార్గదర్శకాల పేరు చెప్పి కొన్నిసార్లు వార్తలు తోక్కేసిన మన తెలుగు మీడియాకి, ఇప్పుడు ఆ సూత్రాలేవి గుర్తులేకపోవడం చూస్తుంటే, టీ.ఆర్.పీలు తప్ప వీరికి మరేమీ పట్టదేమో అనిపిస్తుంది.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

RSReddy said...

రామన్నయ్యా!
ఆ పుణ్యమేదో నువ్వల్రడీ కట్టుకున్నందుకు కంగ్రాట్స్:)

abn said...

ఇతరుల తప్పులు ఎత్తిచూపే ముందు.. మీ తప్పులు సరిచూపుకోండి రాముగారు..
'భీభత్స కాండ' కాదండీ.. 'బీభత్సకాండ'..
ఇలాంటి తప్పులు తరచూ వస్తున్నాయి. సరిచూసుకోండి.

-జమున

Unknown said...

ఈ ఆర్టికల్‌పై వచ్చిన కామెంట్స్‌ల్లో మీరు సెలక్ట్‌ చేసినవి మాత్రమే పబ్లిష్‌ చేస్తున్నట్టున్నారు.

Ramu S said...

Abn garu...
థాంక్స్ సర్/ మేమ్. తప్పు సవరించాను. నా అక్షర దోషాలకు, అజ్ఞానానికి రాధాకృష్ణ గారి పిచ్చివాగుడికి సంబంధం లేదు. చీర్స్--రాము
Jamuna medam,
నన్ను తిడుతూ ఒక తిక్కల జక్కన్న పంపిన రెండు కామెంట్లు తప్ప అన్నీ పబ్లిష్ చేశాను. నా పోస్టుకు అనుకూలంగా వున్నవి పబ్లిష్ చేయడం మాత్రమే నా ఉద్దేశం కాదు. నన్ను అపార్థం చేసుకోకండి. రాధాకృష్ణ గారి యాంకరింగ్ స్కిల్ల్స్ మీకు ఎందుకు నచ్చాయో రాయండి. అది నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ రాగ ద్వేషాలు లేకుండా వుండాలన్నది నా అభిప్రాయం. చీర్స్.--రాము

Sudhakar said...

రాధాకృష్ణ లాంటి తిక్కోడిని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

Unknown said...

అయ్యా ఏబీఎన్ గారు... మీరు ఇక్కడ వచ్చిన అక్షర దోషాల గురించి వ్యాఖ్యానిస్తున్నారా. హ హ హ... నవ్వొస్తోంది. ఎందుకంటే... ‘‘త్వరలో భారతదేశంలో e-cop విధానం’’ అన్న ఏజెన్సీ వార్త వస్తే.. దాన్ని ‘‘త్వరలో భారత్ లో ఈ-టోపీ విధానం‘‘ అని రాసి అదే హెడ్డింగ్ కూడా పెట్టిన ఘనతరమైన చరిత్ర ఆంధ్రజ్యోతి పత్రికది... హ హ హ.... కావాలంటే మీ పాత పేపర్లు తిరగేసుకోండి మీకే తెలుస్తుంది.
రాధాకృష్ణగాడితో బాగా అంటకాగి అంటకాగి వాడి బుధ్దులే మీకూ వచ్చినట్లున్నాయ్. విషయం గురించి మాట్లాడటం మానేసి ఇక్కడ ఉన్న అక్షర దోషాల్ని పట్టుకున్నారంటే మీ మేథో సంపత్తికి నా జేజేలు.
కానీ తెలుగులో ఒక బ్లాగ్ నిర్వహించడం ఎంత కష్టమో తెలిస్తే మీరు ఆ వాగుడు వాగి ఉండరు (ఏమో అనుమానమే. రాధాకృష్ణ అంటకాగు కదా). మన ఆఫీసుల్లోకి మల్లే అలా కొట్టేయగానే ఇలా తెలుగు పడిపోదు సర్ ఇక్కడ. తెలుగు యూనికోడ్ లో టైప్ చేయాలంటే దాన్ని ఇంగ్లిష్ లో టైప్ చేయాలి. ఆ క్రమంలో అక్కడక్కడా అక్షర దోషాలు వస్తాయి. ఇది రాము గారిమీద మీరు చేసిన అలిగేషన్ కు సమాధానం.
మరి రాధాకృష్ణ గురించి మీరు చెప్పండి... ఆయన అంత వింత వింతగా సారీ... బలుపుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో...
ఊరికే... నెత్తుకెత్తుకోకండి సర్... తర్వాత దింపుకోలేరు.
రాధాకృష్ణ బలుపుదనం గురించి ఒక్క ఈ బ్లాగులోనే కాదు చాలా చోట్ల రాశారు. మొన్న లక్ష్మీ ప్రసన్నను ఇంటర్వ్యూ చేసిన తీరుపై దట్స్ తెలుగు కూడా రాసింది. ఆమెపై ఆయనకున్న అన్ని అనుమానాలు అతి దారుణంగా అడిగాడు.
సార్ ఏబీఎన్ గారూ మనకూ పిల్లలున్నారు. వాళ్లూ రేపొద్దున ఇలాగే తయారైతే... అది మీకు ఆనందమైతే... మీ ---- ఆనందానికి నేను అడ్డురాను. లేకపోతే ’రాధాకృష్ణ అంత పొగరుబోతు మరొకడు ఉండడు‘ అన్న నిజాన్ని మీరూ ఒప్పుకోండి

ps: ఇంత చెప్పాక కూడా నేను రాసిన విషయంలో కూడా అక్షర దోషాలు పట్టుకుంటాను అంటే అది మీ విజ్క్షతకే వదిలేస్తున్నాను.

katta jayaprakash said...

I profusely thank all the friends who brought out the real inside picture of Radhakrishna who is a pervert,sadist and most corrupt.He poses himself as Mr.Clean but he is the most foul smelling sample in the proffession of journalism.His recent poisonous outbursts on Puttaparthi are just to extract crores from Sri Sathya Sai Central Trust.But the reaction and response is nill from the trust and the devotees are just laughing at his writings and telecast and turned them into a fiction novel. He is a worthless journalist.A stringer of a rural area is better than him.

JP.

Anonymous said...

రాము గారూ,

ఇదివరకు ప్రజలు పోలీసులను, రాజకీయ నాయకులను నమ్మటం మరిచిపోయారు. ఇప్పుడు వాటిని మించిన దౌర్జన్యకాండ పాత్రికేయ, మాధ్యమాల ముసుగులో జరుగుతోందంటే నిజంపాళ్ళు లేకపోలేదు. ఈ చానెళ్ళు చేసే కంపు చూసి నిజ నిర్థారణకోసం ఆంగ్ల పత్రికలో లేదా నాలాంటివారు తమిళ పత్రికలో వెదుక్కోవాల్సి వస్తోంది. పైన వ్యాఖ్యలో మిత్రులు చెప్పినట్టు మెదట ఆసక్తి...తర్వాత నిరాశ.....చీదర....ఏవగింపు....కంపరం స్థాయిలో ఉంటున్నాయి ఎ.బి.ఎన్ వండివార్చే వార్తలు.

Kavanoor Dayalan said...

మిత్రులందరికి నా చిన్న మనవి!
ABN లో వచ్చే ప్రోగ్రామ్స్ మంచివో చేడువో నాకు తెలియదు కాని, అతని ఆంగ్లం ఉచ్చారణ మీద comments చాలా దారుణం. ఒక భాష స్పష్టంగా ఎలా ఉచ్చారణ చేయాలని నిబందనలు పెడితే ఎవరు కూడా ఆ భాషను ఆదరించరు, నేర్చుకోలేరు. బొంబాయి లో పనిచేసేటపుడు నా గురువుగారు ఒకసారి ఇలా అన్నారు, మన జాతీయ భాష హిందీ కదా మరి ఆంగ్లం ఇంత త్వరగా మన జాతీయ భాష గా అల్లుకుపోతుంది కారణం ఏమిటని? దానికి కారణం మనలో ఎక్కువ మంది హిందీ మాట్లాడితే మన మాతృభాష ప్రభావం వల్ల స్పష్టంగా పలకలేము, ఇలా పలకడాన్ని అందరూ హేళన చేస్తారు. కాని ఆంగ్లం మాట్లాడేటపుడు మాతృభాష ప్రభావం ఉన్నా సర్డుకుపోతారు. ఉదా! మలయాళ మిత్రులు ఆంగ్లం లో ‘O’ తో మొదలయ్యే పదాల ఉచ్చారణ ఒకలా ఉంటుంది, అలాగే బెంగాళి, భీహార్, ఒరిస్సా వారు ‘w’ తో మొదలయ్యే పదాల ఉచ్చారణ ఒకలా ఉంటుంది. ఉత్తర భారత దేశంలో మొదట “జై మాతాజీ” అనే వారు కాని ఇపుడు కొంత మంది “జై మాతాది” అనికూడా అంటారు. నా విషయానికి వస్తే నేను అమెరికా లో Speech language pathologist గ speech therapy ఇచ్చేటపుడు నా patients/clients/residents నా ఆంగ్ల ఉచ్చారణ పై ఈ 4 సం. లో complaint లేదు. నా ఉచ్చారణ పై మన Indian మిత్రులు జోక్స్ వేస్తారు. They never insist for American accent. “యంగిస్థాన్” తెలుగు చానల్ ప్రోగ్రామ్స్ లో ఈ లాంటి చిన్న చిన్న లోపాలు పరవాలేదనిపిస్తుంది. సదరు చానల్ MD రాయలసీమ ప్రాంతం వారు, తప్పక అతని భాష, మరియు ప్రశ్నలు అడిగే తీరులో దాని ప్రభావం ఉంటుంది . ఇక్కడ ఇంకో రెండు విషయాలు చెప్పక తప్పదు, ప్రత్యెక తెలంగాణ వాదానికి ఒకానొక కారణం కూడా భాషయే తెలంగాణ ప్రాంత ప్రజలు తెలుగు ఉచ్చారణను తప్పుబట్టడం లాంటివి (“అది ఏమిటి vs గదేమిటి” రెండూ ఒకటే అని మరచి ) , HMTv program “తెలంగాణ దశ దిశ” లో దేశపతి శ్రీనివాస్ వాదనను తప్పక చూడండి (http://www.youtube.com/watch?v=vxaBU3EhYm8). రెండవది కాలానుగుణంగా ఉచ్చారణ లో కొన్ని మార్పులు జరగవచ్చు (డైరెక్టర్ vs డిరెక్టర్). మొన్ననే జల్లెడ సంకలినిలో “పల్లె భాష” పేరుతొ ఒక వ్యాసం చాలా చక్కగా కొన్ని ఇలాంటి విషయాలు వివరించారు.

Anonymous said...

అయ్యా ఒక ఏ.బి.ఎన్ చానలే కాదు, దరిదాపులు అన్ని చాన్నెల్స్ వారు ఇదే రీతిన ఉన్నారు. ప్రజలంటే వేరు తాము వేరు అన్న పద్ధతిలో చానల్ చేతిలో ఉన్నది కదా అని అహంకరిస్తున్నారు. ఎన్.టీ.వీ లో "లైవ్ విత్ కె.ఎస్.ఆర్" కార్యక్రమం నిన్నొ మొన్నొ చూసాను; ఆయనకి లైవ్ లో ఎవరొ ఫోను చేసి సారూ ఈ రాజకీయ పోచుకోలు కబుర్లెందుకు, ఇక్కడ ప్రజలు అనేక సమస్యలతో కొట్టుకు చస్తున్నారు కదా అని ప్రశ్నిస్తే .......... కె.ఎస్.ఆర్ గారి సమాదానం: "మనం రాజకీయ నాయకుల గురుంచి మాట్లాడుకొంటున్నాము అంటే దానర్ధం వారు ప్రాతినిధ్యం వహించే ప్రజల గురించే" అని వివరించి నిరంకుశంగా ఆ ఫోను కట్ చేసారు.

ఇక్కడ కె.ఎస్.ఆర్ గారికి ఒక సలహా: "బాబు కె.ఎస్.ఆర్ గారు రాజకీయ నాయకుల గురుంచి ఎందుకు?.... మనకు అనేక మతాల దేవుళ్ళు వున్నారు. వారి గురుంచి ప్రార్ధించి భజనలు చేయండి......" అప్పుడు మీరు దేశమే కాదు ప్రపంచ ప్రజల సమస్యల గుంచి చర్చించిన వారవుతారు.............. ఎందు కంటే దేవుళ్ళు విశ్వ పాలకులు కదా!!!!

రాధాకృష్ణ.
విజయవాడ.

yadhardhavadi said...

hi ramu did a good story

yadhardhavadi said...

తెలుగు టేవీలు ఇలా తగలడ్డాయేమిటి?

naveen said...

The way Mr.Radhakrishna spoken with others are very bad, recently i saw his open heart with PWD Sandhya,he is questioning her "Nuvvu",Pillalu kavalani ankuvateldha? magavallu ante antha kampram endhuku....all these r necessary to him,But i congratulate him to interview her,,,,upto now i have some negative opininon on her,but the humanistic values shown by her are knows by the interview only.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి