Monday, July 4, 2011

చిరంజీవి ఛానల్ కు స్వప్న- తులసి సీడ్స్ వారి ఛానల్ త్వరలో

టీవీ నైన్ వ్యవస్థాపక బృందంలో కీలక భూమిక పోషించి, తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక స్థానం పొందన స్వప్న ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ప్రారంభించబోయే ఛానల్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) లేదా ఎడిటర్ ఇన్ ఛీఫ్ గా వెళ్లి పనిచేయడం ఆరంభించారని చాలా ఆలస్యంగా నాకు అందిన సమాచారం. "ఇప్పుడు అడుగుతున్నవేమన్నా...రామ్ వెళ్ళిపోయిన కొన్నాళ్లకే ఆమె కూడా వెళ్లిపోయింది గదా..".అని సాక్షి సంస్థలో ఉద్యోగి ఒకరు సోమవారం సాయంత్రం నాతో చెప్పారు. కొద్దిగా ట్రాక్ చేయడం ఆపితే చాలు...ఈ తెలుగు ఛానల్స్ లో విషయాలు తెలియకుండా పోతాయి.

నిండుగా చీర కట్టుకుని కట్టూబొట్టూతో తీరుగా ఉండే వారు బుల్లితెరను ఏలుతున్న రోజుల్లో రంగప్రవేశం చేసిన స్వప్న టీవీ నైన్ ద్వారా అనతికాలంలోనే వినుతికెక్కారు. అమెరికాలో చదువుకుని వచ్చి, సంగీత పరిజ్ఞానం ఉన్న ఆమె యాంకరింగ్ తో సంచలనం సృష్టించారు. ఆమె నవ్వు మాత్రం భలే ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పక తప్పదు. ఆడవారి విషయంలో బాగా బద్నాం అయిన కరీం అనే యాంకర్, స్వప్న అటూ ఇటుగా ఒకరి తర్వాత ఒకరు టీవీ నైన్ ను వదిలారు. ఒక అమ్మాయి తండ్రి, బ్రదర్ జరిపిన యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడి కరీం కోలుకుంటుండగా, స్వప్న రేడియో వైపు దృష్టిమరల్చారు. తర్వాత సాక్షి ఛానల్ లో చేరారు కానీ అక్కడ అప్పటికే పాతకుపోయిన ప్రియదర్శిని రామ్ తో తనకు పడలేదని చెబుతారు. ఒక దశలో రామ్ మీద జగన్మోహన్ రెడ్డి భార్యకు స్నప్న ఫిర్యాదు చేశారని కూడా ధృవపరుచుకోడానికి వీలులేని వార్తలను బట్టి తెలుస్తున్నది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి భజన బృందంలో కీలక భూమిక పోషించిన జర్నలిస్టులలో ఒకరైన స్వప్న...చిరంజీవి ఛానల్ లో చేరారు...ఒక మంచి పే ప్యాకేజీకి ఆకర్షితురాలై.
బడుగుల బాగుకోసమంటూ ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి ఎన్నికలలో బొక్కబోర్లా పడగానే...ఇక లాభంలేదని అధికార కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న చిరంజీవిని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్న స్వప్న కల సాకారమవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. ఒక మీడియా సంస్థ అంటూ లేకపోవడం వల్ల చాలా నష్టపోయామని బాధపడుతున్న చిరంజీవి బృందం స్వప్నపై చాలా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తున్నది.

ఇదిలావుండగా...తులసి సీడ్స్ అనే సంస్థ త్వరలో ఒక ఇరవై నాలుగు గంటల ఛానల్ తేబోతున్నదట. ఈ ఛానల్ నిర్వహణ బాధ్యతలను తోట భావ నారాయణ అనే సీనియర్ జర్నలిస్టుకు అప్పగించారట. ఆ ఛానల్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నదని చెబుతున్నారు. మా టీవీ, జెమిని టీవీలలో ఉన్నత పదవుల్లో పనిచేసిన భావ నారాయణ...ఎలక్ట్రానిక్ మీడియా మీద ఒక పుస్తకం కూడా రాశారు. కొన్నాళ్లు హెచ్.ఎం.టీవీ లో పనిచేసిన భావ నారాయణ ఆ తర్వాత దాన్ని వదిలేశారు.

14 comments:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఈ అమ్మాయి తెలుగు కన్నా ఇంగ్లీషే ఎక్కువ వాడుతూ ఉంటుంది, ప్రోగ్రాం హోస్ట్ చేసినా, వార్తలు చదివినా.

Vinay Datta said...

Swapna completed her studies at Hyderabad. Got married while working with CFA and left for the US. Very talented in both classical music and light music, has wide knowledge in other art forms, too. Though modernly dressed, she is one of the few anchors who has command over Telugu and English. She also knows Tamil and Hindi. She uses English very rarely while conversing in Telugu. Use of English while reading news is on the request of the channels. It's not her decision. Iam sure she will do her best in making Chiranjeevi's channel a top rated channel.

madhuri.

y.v.ramana said...

Swapna is good . i wonder what she can do with Chiranjivi's channel . best of luck Swapna .

we4telangana said...

Swapna is one of the main contributing factor in saakshi'success,definately she can make difference in Chiru's channel.Request to chiru is take tv9's rajinikanth into his channel.

all the best chiru.. All the best chiru..swapna...

katta jayaprakash said...

TV9 to FM to Saakshi to Chiru channel and this is the route of Swapna.No body knows her next destination.By frequently changing the jobs she definetely looses her crdibility and personal image.Rolling stone gathers nothing.

JP.

srikanth said...

rajanikanth vankara navvulu chiru thattukoledu le brother...

nareshnunna said...

కొందరుంటారు .... కేవలం వారి ఉనికితో పరిసరాల్ని సౌందర్యభరితం చేస్తారు. గండ శిలల నెత్తిన రాలే పువ్వులతో మొట్టి, లేదా తీర్థపురాళ్ళ నిష్క్రియాపరత్వం మీద విసుగులేని అక్కరతో జలాక్షితలు చల్లి ఆ బండరాళ్ళలోంచి కూడా చైతన్యం కలిగిస్తారు. స్వప్నని (అభిమాన కోటికి ఏకవచన సంభోదన అయాచితంగా దక్కిన హక్కు అని మనవి) చూస్తుంటే మొదట్నుంచీ నాకు ఆ కొందరిలో ఒకరన్నట్టే ఉంటుంది.
కిటికీ రెక్క పక్కగా అతిశయంతో పాకివెళ్తున్న రేరాణి పరాయి అనిపించనట్టే, ఈ నవ్వుల రాణి కూడా-
ఇందాక అన్నట్టు, ఇటువంటి సౌగంధిక తన స్వాభావికమైన నవ్వుల పరిమళాలు వెదజల్లుతూ ఉంటే, సాచివేతకీ, నిర్లిప్తతకీ చోటు లేని ఒక రసోల్లాసం సిరల్లో దమనుల్లో ఉరకలెత్తుతుంది. నేను ఆమె చేసే interview లని గమనిస్తుంటాను నిశితంగా. శ్రుతి చేసిన వీణని చూస్తే, అప్రయత్నంగా మీటాలని అనిపించినట్టు, ఆమె సమక్షంలో ఉంటే కబుర్లలా ఉబుకుతాయి, పొర్లుతాయి అనిపిస్తుంది. స్వతహాగా తానూ గాయని కాబట్టి, తను గొంతెత్తి పాడుతుంటే, ఏ తెలియనితనాల అమాయకత్వంలో, ప్రతిదీ నోట్ళో పెట్టుకునే పసివయసులో మింగేస్తే గొంతులో ఉండిపోయిన సన్నాయి పలుకుతున్నట్టుంటుంది.
ఇక వృత్తి పరంగా Ramu గారు చెప్పిన మంచి విషయాలేమీ నాకు ఆట్టే తెలియవు. ఏది ఏమైనా, తన ప్రతి new venture లో కూడా తాను success కావాలని కోరుకుంటూ,

నరేష్ నున్నా

katta jayaprakash said...

Ramu gau,
You have been fighting against eenadu in this column for a long time against the harassment to your friends and staff in eenadu?Did you get any support from your colleagues?If so any positive result from eenadu?

JP.

srinucpd said...

డబ్బు మీద యావతో చిరంజీవి పార్టీ పెట్టాడు.
డబ్బు కోసమే చానెళ్ళు మారుతోంది ఈ యాంకరమ్మ.
ఇలాంటి వాళ్ళను ఆకాశానికి ఎత్తేసేలా ఆ పొగడ్తలేంటి? ఛీ..ఛీ

Murali Krishna said...

రమణ గారు చిర౦జీవి గారు డబ్బుకోసమె పార్టి పెట్టారని శ్రీనివాస్ కామె౦ట్ చేశారు. చిర౦జీవి రాజకీయల్లొకి వచ్చెటప్పటికి ఆయనకి నిజ౦గా రాజకీయాలు తెలియదు. ఆయన యేదొ తనకు చాల పేరు౦ది కాబట్టి న౦దమూరి తారక రామరావు లాగ జన౦లొ ఇమేజ్ వు౦ది కాబట్టి తనను కూడా జన౦ ఆదరిస్తారని వాల్లకి తనేదైన చెయ్యలని వచ్చాడు. కాని అప్పటికె అధికార౦ వెలగబెట్టి కొన్ని స౦వత్సరాలుగ ప్రభుత్వమ్ సొమ్ము బాగబొక్కి సొ౦త ఛానళ్ళు, కుల౦ ఛానళ్ళు సపోర్టుతొ మరియు దేవే౦దర్, ప్రభాకర్, సీతారా౦ లా౦టి కోవర్ట్ నాయకులు టిక్కట్లు అమ్మితే అదేపనిగ కొ౦దరు ప్రభుత్వ౦ సొమ్ముతో మీడియాను బాగా మనేజ్ చేస్తు చిర౦జీవి మీద ప్రచార౦ చేసినారు. అదె ఆ రోజు కనుక చిర౦జీవికి వొక ఛానల్ వు౦డి వు౦టే వీటన్ని౦టికి సమానదాన౦ చెప్పి వు౦డేవాడు. చిర౦జీవి చేసిన తప్ప౦తా సినిమాల్లో వున్నప్పుడు మీడియా తన వె౦ట వు౦డి తనను ప్రోత్సహి౦చిన విధ౦గా రాజకీయాల్లోకూడా చేస్తు౦డనికుని మీడియాని కొనకపోవడ౦. లేడ సొ౦త ఛానల్ పెట్టకపోవడ౦. కోట్లు దోచుకొ౦టూ ఆకర్షణ పధకాలతో జనాన్ని మోస౦ చేస్తు నీ పర్సు కొట్టేసి నీకు పది రూపాయలు దాన౦ ఇస్తే అటువ౦టి వాల్లని దేవుల్ల౦టూ చిర౦జీవి లా౦టి మ౦చి వ్యక్తిని విమర్శి౦చడ౦ మాన౦డి.

Anonymous said...

@Srinucpd
why so brother? Is any channel working for the cause of the ppl if not for their profits? Then why can't Swapna or anybody else can capture whatever the opportunities come by their way? After all they are doing business and the employees too will have the same right. Isn't it?
Coming to the point - leave about her changing the channels so frequently, look at her talent - that is what is the source of attraction for many channels to run after her:)

katta jayaprakash said...

Does the source of attraction mean that one can go to any channel whoever calls?There are and were many talented persons in the proffession of journalism.How many changed the posts very frequently?Every one knows how the things are going in TV9 and God knows why Swapna left TV 9.These are not the days of ethics and proffessionalisam but attraction for money and personal choices.

JP.

we4telangana said...

i think she has succeeded in as employee of saakshi by bringing some vaue to saakshi but how far she has succeded as journalist we don't know.

Recently once again she came in SAAKSHI

vikram said...

SWAPNA ALL THE BEST

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి