Monday, January 2, 2012

ఆ టైట్ డ్రస్ లతో జనాలకే కాదు...ఆ పిల్లలకూ కష్టమే...

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏ ఉద్దేశంతో అన్నారోగానీ...ఆడపిల్లల డ్రస్సుల మీద ఇప్పుడు నానా యాగీ జరుగుతోంది. ఆడోళ్ల అంశాలంటే గోతికాడి నక్కల్లా ఎదురుచూసే....పత్రికలు, ఛానళ్లు పండగ చేసుకుంటున్నాయి. ఆయన అన్నది సబబా? కాదా? అన్న పంచాయితీ జరుగుతోంది. మా సార్ అన్న దాంట్లో తప్పేముందని మహిళా ఐ.పీ.ఎస్.లూ ముందుకు రావాల్సివచ్చింది. డ్రస్సులను డ్రస్సుల కోణం నుంచి కాక...బూతు టెలివిజన్ ఛానళ్లు, నీలి సినిమాలు కల్పిస్తున్న కళ్ల నుంచి చూసి జనం రెచ్చిపోతున్నారని చెప్పడానికి ఈ పోస్టు రాస్తున్నాను.


ఒక మూడేళ్ల కిందట...అమెరికా నుంచి వచ్చిన ఒక ఫ్రెండు బంజారా హిల్స్ లో అద్దెకు దిగింది. బాగా చదువుకున్న అమ్మాయి. ఆమె, తన బాయ్ ఫ్రెండ్ డిన్నర్ కు ఆహ్వానిస్తే వెళ్లాను. తను రోడ్డు మీదకు వెళితే...హైదరాబాద్ లో జనం పనులు మాని తననే చూస్తున్నారని చెప్పి చాలా ఇబ్బంది పడిందామె. తన డ్రస్సులను చూస్తే...జనం ఎందుకు నోళ్లు అప్పగించి సొల్లు కార్చుకుంటూ చూసి ఉంటారో అర్ధమయింది. 
యమ టైట్ జీన్స్ పాయింట్, కురచ టీ షర్టు, పైగా దాని పల్చదనం...లోదుస్తుల రంగు కూడా కనిపించేంత. హై హీల్స్ చెప్పులు. వాటి మీద కాళ్లు బాలెన్స్ చేసుకుంటూ వయ్యారంగా ఊపుకుంటూ వెళ్తూ ఉంటే మగ పుటక పుట్టి, చీమూ రక్తం ఉన్న వాడెవడైనా...గుడ్లప్పగించి చూడక చస్తాడా? నాకు నేను ఈ విషయంలో ఒక పరీక్ష పెట్టుకుంటాను. సాధారణంగా, చలాకీగా వెళుతున్న ఏ ఆడపిల్లను చూస్తే నాకు గర్వమేస్తుంది. స్త్రీలకు సముచిత స్థానం ఇవ్వక చిన్నచూపు చూసిన...చూస్తున్న మన భారతీయ సమాజంలో ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు చిరునామాలయిన కొత్త తరం వస్తున్నదని ముచ్చటేస్తుంది. వీళ్లకు మేలు జరగాలని మనసులో అనుకుంటాను.

కాస్త శరీర సౌష్ఠవం బాగున్న అమ్మాయి...ఇలాంటి బిగుతు మోడ్రన్ దుస్తులతో రోడ్డు మీద వయ్యారంగా పోతుంటే...చాలా మందిలా అప్రయత్నంగా నేనూ వారిని కింది నుంచి పైకి చూస్తున్నా. ఛీ...ఇదేంటి..ఒక అమ్మాయి తన పాటికి తాను పోతుంటే....మనం ఇలా చూడడమేమిటి? అని అనిపించి ఒక్కోసారి సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది. పదిహేనేళ్ల కిందట బ్రహ్మచారిగా ఇదే తాజ్ కృష్ణ హోటల్ పక్కన తాగిన మైకంలో ఉన్న ఒక సుందరాంగి...ఒళ్లు కొవ్వెక్కి కవ్వించినా తప్పుకుని పోయిన ఆ నాటి సచ్ఛీలుడివేనా నువ్వు...ఇదేం పోయే కాలం....వరస్ట్ ఫెలో...అని అంతరాత్మ గూబపగలకొడుతోంది.


అయినా సరే కొందరు టిప్ టాప్ అమ్మాయిలనైతే....అప్రయత్నంగా మరికొంత సేపు చూస్తున్నాయి...దొంగ కళ్లు. మాయదారి మనసుకు ఇదేం రోగమని తర్వాత వగచినా...చూడటం అనే చర్య మాత్రం జరుగుతున్నదన్నది ఒప్పుకు తీరాల్సిన సత్యం. మగ వెధవల్లారా...మరెలాంటి డ్రస్ వేసుకుంటే...మీ జాతి మమ్మల్ని తినేసేట్టు చూడదురా...అని ఎవరైనా కాళిక కోపంతో అడిగితే చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. చక్కగా సంప్రదాయమైన బట్టలు వేసుకుని వెళ్తున్నా ఆడపిల్లలను జనం చూస్తారు. ప్రతి ఆడపిల్లనూ అదో రకంగా చూసే జబ్బు చాలా మందికి ఉందనేది వేరే విషయం.

ఎవడో వెర్రి తలకెక్కిన వాడు దుస్తులు డిజైన్ చేస్తాడు. వాటికి సినిమాల వాళ్లు ప్రచారం కల్పిస్తారు. ఆ దుస్తులను ముందుగా బంజారాహిల్స్ భామలు ధరిస్తారు. పులిని చూసి నక్కలు వాత పెట్టుకుంటాయి. లేటెస్ట్ ట్రెండ్ అంటూ....అందరమ్మాయిలు వేలం వెర్రిగా వాటిని ధరిస్తారు. అది జనం కనువిందుకు కారణమవుతోంది. చాలా మంది ఆడపిల్లలు వెర్రెక్కించే డ్రస్సులు వేసుకుని సినిమాల ప్రభావంతో వయ్యారాలు ఒలకబోసుకుంటూ నడుస్తున్నారని అంటే అది ముమ్మాటికీ కరెక్టే. అంత బిగుతైన డ్రస్సులు ఆ పిల్లలకు ఎంత సౌకర్యంగా ఉంటాయో అన్నది ఎప్పుడూ సందేహాస్పదమే.



అయితే...శాస్త్రీయంగా సర్వేలు, గట్రా లేవు కాబట్టి..మనం నోటికొచ్చింది మాట్టాడి....తోచింది ఊహించుకుంటున్నాం. అందాలు ఆరబోసే డ్రస్సులు వేసుకున్నంత మాత్రాన....ఆ ఆడపిల్లలపై అఘాయిత్యాలకు ఒడిగడ్తారని అనుకోవడం దారుణం. చూడటం వేరు, కొరికేసేట్లు చూడటం వేరు, హానిచేయడం వేరు. ఇందులో చివరి రెండు కేటగిరీల వాళ్లను నేను మెత్తగా మందలించిన సంగతి గతంలో పోస్టులో రాశాను. రోడ్ల మీద వయ్యారంగా వెళ్లే ఆడపిల్లలను ఆకతాయిలు సినిమా హీరోయిన్లతో పోల్చడం, దానికా భామలు ఏదో సాధించినట్టు సినిమటిక్ గా నవ్వి కవ్వించడం నేను గమనించాను. ఇక్కడే వస్తుంది సమస్య.

డీజీపీ వ్యాఖ్యల మీద కారాలూ మిరియాలూ నూరుతున్న మహిళలు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అంశం వేరొకటుంది. సమాజంలో మహిళల పట్ల వికారపు భావనలు కలిగిస్తున్నది సృజనాత్మకత పేరిట టీవీల్లో, సినిమాల్లో  చూపుతున్న అసహ్యకరమైన అశ్లీలం. అలాంటి ఛానళ్ల స్టూడియోల్లో కూర్చుని మహిళాభ్యుదయం గురించి మాట్టాడంది నిద్రపోలేని సోదరీమణలు కర్తవ్యం గుర్తెరగాలి. స్త్రీ, పురుషుల మధ్య గౌరవప్రదమైన సబంధం, పరస్పర గౌరవ భావం కలిగేలా మనం ఇళ్లలో, స్కూళ్లలో, కాలేజీల్లో, వర్కు ప్లేసుల్లో అందరూ చర్యలు తీసుకోవాలి. డ్రస్సుల సంగతి ఎలా ఉన్నా...పురుషుడిలా...మహిళా మాంసపు ముద్దే అని అందరూ గ్రహిస్తే బాగుంటుంది.
తన కూతురు వేసే బిగుతైన, పల్చనైన, కురచైన డ్రస్సులు తన భార్య కూడా వేసుకోవాలని ఏ మగ పురుషుడూ అనుకోడు. అలాగే, రోడ్డు మీద తనలాగానే  సొంగ కారుస్తూ ఇతర పురుషాధములు తన కూతుర్నో, భార్యనో చూస్తే ఎలా ఉంటుందో అని కూడా వాడు అనుకోడు. అలా అనుకునేలా ప్రజలను చైతన్య పరిచే సాహిత్య సృష్టి మన రచయితలు చేయరు, మంచి సినిమాలు మన నిర్మాతలు తీయరు. ఆ దిశగా మీడియా కూడా ప్రయత్నించదు. మహిళలను మనుషులుగా చూపించే ప్రయత్నం ఒక్కటీ జరగకపోవడం ఒక దౌర్భాగ్యం. మహిళను ఒక సెక్స్ సాధనంగా వీరంతా చూపుతారు. నిరక్షర కుక్షులు ఆ పాయింట్ ను ఒంటబట్టించుకుని వికారంగా, అసహ్యంగా, దారుణంగా వ్యవహరిస్తున్నారు. కాదా?    
 

29 comments:

Ravi said...

Well said ram gaaru... well said...

Mauli said...

/ఆడోళ్ల అంశాలంటే గోతికాడి నక్కల్లా ఎదురుచూసే....పత్రికలు, ఛానళ్లు పండగ చేసుకుంటున్నాయి./

బ్లాగుల్లో కూడా బోల్డన్ని టపాలు వచ్చాయి అండీ. కాని నిజం ఏమిటన్నది మీరు వ్రాసారు.

పాపం,ఈ ప్రవీణ్ ఈ ఒక్క ముక్క గొంతు చించుకొని మరీ వ్రాస్తున్నాడు, అన్ని బ్లాగుల్లో :)

[తన కూతురు వేసే బిగుతైన, పల్చనైన, కురచైన డ్రస్సులు తన భార్య కూడా వేసుకోవాలని ఏ మగ పురుషుడూ అనుకోడు. అలాగే, రోడ్డు మీద తనలాగానే సొంగ కారుస్తూ ఇతర పురుషాధములు తన కూతుర్నో, భార్యనో చూస్తే ఎలా ఉంటుందో అని కూడా వాడు అనుకోడు. అలా అనుకునేలా ప్రజలను చైతన్య పరిచే సాహిత్య సృష్టి మన రచయితలు చేయరు, మంచి సినిమాలు మన నిర్మాతలు తీయరు. ఆ దిశగా మీడియా కూడా ప్రయత్నించదు. మహిళలను మనుషులుగా చూపించే ప్రయత్నం ఒక్కటీ జరగకపోవడం ఒక దౌర్భాగ్యం. మహిళను ఒక సెక్స్ సాధనంగా వీరంతా చూపుతారు. నిరక్షర కుక్షులు ఆ పాయింట్ ను ఒంటబట్టించుకుని వికారంగా, అసహ్యంగా, దారుణంగా వ్యవహరిస్తున్నారు. కాదా? ]

Right !

<<< అయినా సరే కొందరు టిప్ టాప్ అమ్మాయిలనైతే....అప్రయత్నంగా మరికొంత సేపు చూస్తున్నాయి...దొంగ కళ్లు. మాయదారి మనసుకు ఇదేం రోగమని తర్వాత వగచినా...చూడటం అనే చర్య మాత్రం జరుగుతున్నదన్నది ఒప్పుకు తీరాల్సిన సత్యం. మగ వెధవల్లారా...మరెలాంటి డ్రస్ వేసుకుంటే...మీ జాతి మమ్మల్ని తినేసేట్టు చూడదురా...అని ఎవరైనా కాళిక కోపంతో అడిగితే చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. చక్కగా సంప్రదాయమైన బట్టలు వేసుకుని వెళ్తున్నా ఆడపిల్లలను జనం చూస్తారు. ప్రతి ఆడపిల్లనూ అదో రకంగా చూసే జబ్బు చాలా మందికి ఉందనేది వేరే విషయం. >>>

హ హ హ ..ఇక చెప్పేదేముంది .

కమల్ said...

బిగుతుగా..వళ్ళు కనపడే దుస్తులు వేసుకొంటున్నారా..? ఎక్కడ సారూ...? ఎవరో అరిస్టోక్రాట్ పీపుల్స్..బంజార, జూబ్లి హిల్స్‌లలో నివసించే దనవంతుల ఇళ్ళల్లోని అమ్మాయిలు తప్ప మద్యతరగతి అమ్మాయిలు మొత్తం పైనుండి కిందివరకు వళ్ళు కప్పుకొని..ముఖం కూడ కనపడకుండ మొహానికి అదేదో తాలిబన్ టెర్రిరిస్టుల్లా కప్పుకొని తిరుగుతుంటే అబ్బాయిలందరు ఎవరిని చూడాలో తికమకపడుతున్నారు..మరెక్కడ వళ్ళు కనబడే దుస్తుల్లో అమ్మాయిలు కనపడుతున్నారో అర్థం కాలేదు.

భాస్కర రామిరెడ్డి said...

బాగుందండి రామూ గారు. అలాంటివి చూసినప్పుడు అదేదో కలగకపోతే మగవాడిలో సృష్టిలోపమనుకోవచ్చు. ఆ భావాలు కలగడములో తప్పేమన్నా వుందా ఏంటి? కాకపోతే నిగ్రహించుకొనే శక్తి లేకనే ఇలాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు కొద్దిగా ఈ ఆలోచనలకు తావివ్వని డ్రెస్ వేసుకొంటే కొంపలేమన్నా మునిగి స్త్రీ స్వేఛ్ఛ నశించిపోతుందా?

Sasidhar said...

ఈ సమస్యకు ఒకటే పరిష్కారం.
మహిళలు కూడా పురుషుల మీద యథాశక్తి అత్యాచారాలు చేసి ప్రతీకారం తీర్చుకోవాలి.
దెబ్బకు దెబ్బ.

~ శశిధర్ సంగరాజు.
www.sasidharsangaraju.blogspot.com

తెలుగు వెబ్ మీడియా said...

మహిళలు పురుషులని రేప్ చెయ్యాలని మూడేళ్ళ క్రితం నేను వ్రాసాను. మహిళ పురుషుణ్ణి రేప్ చెయ్యడం సాధం కాదంటూ ఆకాశరామన్న, కార్తీక్ అనే ఇద్దరు బ్లాగర్లు వాదించారు.

తెలుగు వెబ్ మీడియా said...

స్త్రీ నిక్కర్ వేసుకుని కనిపిస్తే చూసీచూడనట్టు వెళ్ళిపోతాను కానీ రేప్ చేసే కుసంస్కారం నాకు లేదు. ఒకవైపు స్త్రీలు నిక్కర్లు వేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూనే తాము నిక్కర్లు వేసుకుని తిరిగే మగవాళ్ళని స్త్రీలు రేప్ చెయ్యాలి. వాళ్ళ నిక్కర్లు ఊడదీసి అండర్‌వేర్‌లతో ఊరేగించాలి. పల్లెటూర్లలో చేతబడుల నెపంతో ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగిస్తుంటారు కదా. అలాగే మగవాళ్ళని కూడా నగ్నంగా ఊరేగించాలి.

తెలుగు వెబ్ మీడియా said...

>>>>>
తన కూతురు వేసే బిగుతైన, పల్చనైన, కురచైన డ్రస్సులు తన భార్య కూడా వేసుకోవాలని ఏ మగ పురుషుడూ అనుకోడు.
>>>>>
కూతురు పెళ్ళి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతుంది. మగవాడు తన భార్యని మాత్రమే వ్యక్తిగత ఆస్తిని చూసినట్టు చూస్తాడు. అందుకే అతను తన భార్య మిడ్డీలు వేసుకోవడానికి ఒప్పుకోడు.

తెలుగు వెబ్ మీడియా said...

>>>>>
బిగుతుగా..వళ్ళు కనపడే దుస్తులు వేసుకొంటున్నారా..? ఎక్కడ సారూ...? ఎవరో అరిస్టోక్రాట్ పీపుల్స్..బంజార, జూబ్లి హిల్స్‌లలో నివసించే దనవంతుల ఇళ్ళల్లోని అమ్మాయిలు తప్ప మద్యతరగతి అమ్మాయిలు మొత్తం పైనుండి కిందివరకు వళ్ళు కప్పుకొని..ముఖం కూడ కనపడకుండ మొహానికి అదేదో తాలిబన్ టెర్రిరిస్టుల్లా కప్పుకొని తిరుగుతుంటే అబ్బాయిలందరు ఎవరిని చూడాలో తికమకపడుతున్నారు..మరెక్కడ వళ్ళు కనబడే దుస్తుల్లో అమ్మాయిలు కనపడుతున్నారో అర్థం కాలేదు.
>>>>>
వాళ్ళు ముఖాలకి ధూళి తగలకుండా కూడా అలా వేసుకుంటారు. అయితే కేవలం వ్యాపారం కోసం నిర్మించే సినిమాలు చూసి ఆడవాళ్ళు డ్రెస్ స్టైల్ మార్చుకుంటారని నేను అనుకోను.
ఈ లింక్ చదవండి: http://streevimukti.stalin-mao.net.in/-dgp

gudipudi said...

test

gudipudi said...

అయ్యా రాము గారు మీ బ్లాగు కి కామెంట్ మోడరేషన్ పెట్టి కూడా ఈ చెత్త ని జనాల మీదకి వదలటానికి గల కారణాలు చెప్పగలరు .

Divakar said...

మరి ఆడవాళ్లని బూతులు తిట్టే నీలాంటి నీచుల్ని ఏమి చెయ్యాలి ప్రవీణూ? నిలువునా పాతెయ్యద్దూ?

Manjusha kotamraju said...

well said sir,,

Sitaram said...

దివాకర్ గారూ...
వ్యక్తిగత దూషణలకు దిగవద్దు. ఈ అంశం మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. నేను తప్పు రాస్తే..నన్ను సరిదిద్దండి. అంతేకానీ, దయచేసి వ్యక్తిగతంగా మాటల దాడి చేయవద్దు.
రాము

తెలుగు వెబ్ మీడియా said...

రాము గారు, ఓసారి మీ హౌస్ అడ్రెస్ చెపుతారా, హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలి. నా ఫోన్ నంబర్ 9295019502 నేను మీ ఆఫీస్‌కి రాగలను కానీ ఆఫీస్ టైమ్‌లో మీరు బిజీగా ఉంటారేమోనని మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. మీరు ఎలాగూ జర్నలిస్టే కదా. పబ్ సంస్కృతి వల్ల యువత ఎలా చెడిపోతోంతో ఓసారి న్యూస్ కవర్ చెయ్యండి. నాకు తెలిసి పబ్‌లకి వెళ్ళేవాళ్ళు తప్ప ఎవరూ అశ్లీల దుస్తులు వేసుకోరు.

తెలుగు వెబ్ మీడియా said...

రాము గారు, "మగవాడు కూతురి చేత కురచ దుస్తులు వెయ్యిస్తాడు కానీ భార్య చేత కురచ దుస్తులు వెయ్యించడు కనుక కురుచ దుస్తుల సంస్కృతిలో హిపోక్రిసీ ఉంది" అని మీరు అంటే వాళ్ళు "అది మార్తాండవాదం" అనే అంటారు. ఎవరిదైనా మార్తాండవాదం అనిపిస్తే వాళ్ళని అలాగే వ్యక్తిగతంగా దూషిస్తారు.

Prashant said...

Mr.Ramu,
Iam not impressed with the article.There is no evidence for direct proportionality of rapes and the dress code of women.It is just the lust and the considerably compromised state at which the subject is available.For instance,a woman working in night shifts in a call centre or an offshore networking site has to be dropped by a male cabbie at odd hours.Here her state is vulnerable and may get assaulted easily.
Moreover,a strange fact of assualts occuring on women is they are done by mostly men known to the subject.This happens because attacker is aware of her vulnerability,that she is weak to protest.
It is better to have a broad outlook before drafting a column rather than jumping into an erroneous conclusion.
The article is filthy and doesn't fit for a debate.

తెలుగు వెబ్ మీడియా said...

I don't think that this article is filthy. I oppose wearing skimpy clothes but I don't think that skimpy clothes are main reason for rapes. The rapist doesn't mind whether the woman wore saree or burqa. So, rapes even happen in Afghanistan where 100% of the women wear burqas.

Ramu S said...

Dear Prashant,
That is what I was trying to talk. We are making assumptions without any scientific basis. I am for having a decent relation between male and female in schools, colleges, at workplace and homes. We should try to address the key issue of "vulnerability." My problem is none is trying to address it.
Cheers
Ramu

Ramu S said...

డియర్ తెలుగు వెబ్ మీడియా,
ప్రతి రోజూ సాయంత్రం నేను ఖైరతాబాద్ చౌరస్తాలో లభిస్తాను. మెయిల్ ఇచ్చి రండి, కలుసుకుందాం.
గుడిపూడి గారూ...
అందరి వాదనలూ వినడం మంచిదని ఆ పనిచేశాను. వేరే ఉద్దేశాలు లేవు.
రాము

తెలుగు వెబ్ మీడియా said...

రాము గారు, గతంలో గురువులు శిష్యులపై రేప్‌లు చెయ్యడం గురించి చర్చ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఇలాగే వ్రాసారు. "ఆడ గురువు మగ శిష్యుణ్ణి రేప్ చెయ్యడమే కదా నీకు కావాలి" అంటూ నన్ను దూషించారు. ఆడవాళ్ళు మగవాళ్ళని రేప్ చెయ్యడం సాధ్యమే. కానీ సామాజిక కట్టుబాట్ల వల్ల ఆడవాళ్ళు మగవాళ్ళని రేప్ చేసే ధైర్యం చెయ్యరు. ఈ విషయం చెపితే నేను ఆడ రేపిస్ట్‌లని తయారు చేస్తున్నాని వాదిస్తారు. ఒకరిద్దరు స్త్రీలు కురచబట్టలు వేసుకున్నంతమాత్రాన స్త్రీలందరిపై రేప్‌లు జరుగుతాయనుకోను. కానీ కురచబట్టలు వేసుకోవడం తప్పు కాదా? కురచబట్టలు వేసుకుంది అని చెప్పి రేప్‌లని జస్టిఫై చెయ్యడం తప్పు కాదా?

Ramu S said...

ఓరి నాయనో...చరిత్ర ఉందా? నాకు తెలియదు. అయినా...మీరు వాళ్ల గురించి పట్టించుకుంటే...విసిగిస్తారు. ఈ వెబ్బు గబ్బులో మన వాదన మనం చేయడం, ఓపిక ఉంటే ఇతరులవి వినడం, ఇంకా ఓపిక ఉండి...ఎదుటివాడూ మనిషని మనం నమ్మితే...ప్రతివాదన చేయడం మంచిది. ఇంతకు మించి ఏమి చేసినా ప్రశాంతత కరువవుతుంది. కాదంటారా....మాట కు తూటా సిద్ధాంతం పాటించండి. ఖైరతాబాద్ చౌరస్తాలో ఉండే హోటల్లో కూర్చుని వివరాలు మాట్టాడుకుందాం.
రాము

SHANKAR.S said...

రామూ గారూ :)) (మీ పై జవాబుకు)

Praveen Mandangi said...

నెక్‌లేస్ రోడ్ స్టేషన్ దగ్గర ఉన్న రెస్టారెంట్ నాకు బాగా పరిచయం. పక్కన ఎలాగూ హుస్సేన్ సాగర్ ఉంది కనుక లేక్‌వ్యూలో కూడా ఉన్నట్టు ఉంటుంది కనుక అక్కడ మాట్లాడుకోవచ్చు. హిపోక్రిసీని ఎవరైనా విమర్శిస్తే అది మార్తాండవాదం అనడం వాళ్ళ స్టైల్. ఆడవాళ్ళు మగవాళ్ళ కుతి తీర్చే వస్తువులుగా ఉండాలనేదే వాళ్ళ అభిప్రాయం.

Ramu S said...

తెలుగు వెబ్ మీడియా అన్నా, ప్రవీణ్ శర్మ అన్న ఒకరేనా?
సోదరా....మీది శ్రీకాకుళం కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారా? హుస్సేన్ సాగర్ అసలే కంపు సార్. నేను కంపు జోలికి అస్సలు పోను.
సీ యూ
రాము

Praveen Mandangi said...

BHEL దగ్గర మా బాబాయి గారు ఉన్నారులెండి. హైదరాబాద్‌లో నాకు లోకల్ రైల్వే స్టేషన్‌ల దగ్గర ఉన్న ప్రాంతాలు & BHEL సర్కిల్ దగ్గర ఉన్న ప్రాంతం మాత్రమే తెలుసు. వేరే ప్రాంతాలు ఎప్పుడో చిన్నప్పుడు మా తాతయ్య MLA క్వార్టర్స్‌లో ఉన్న రోజుల్లో చూసినవి. అవి నాకు గుర్తులేవు. చౌరస్తా అంటే ఖైరతాబాద్ స్టేషన్‌కి ఎంత దూరమో అనుకున్నాను. నవంబర్‌లోనే ఎవరో నన్ను ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్‌కి వెళ్ళమంటే దారితప్పిపోయి బేగంపేట ఎయిర్‌పోర్ట్ దగ్గరకి వెళ్ళిపోయాను. ఎలాగూ సెల్ ఫోన్ ఉంది కాబట్టి కరెక్ట్ అడ్రెస్ కనుక్కున్నాను.

Praveen Mandangi said...

తెలుగు వెబ్ మీడియా నా వెబ్‌సైట్ పేరు. అప్పట్లో నేను వెబ్‌సైట్ కోసం పెట్టిన జిమెయిల్ అడ్రెస్ ఉండేది. నా కంప్యూటర్లలో ఒకదాని బ్రౌజర్‌లో ఆ అడ్రెస్ సేవ్ చెయ్యడం వల్ల ఆ అడ్రెస్ ఆటోలాగిన్ అయిపోయి తెలుగు వెబ్ మీడియా పేరుతో మెసేజెస్ పడ్డాయి.

Praveen Mandangi said...

ఇంకో రెండు నెలల తరువాత శ్రీకాకుళం నుంచి వైజాగ్‌కి షిఫ్ట్ అయిపోతున్నానులెండి. ఇక్కడ ఎలాగూ ఖాళీగా ఉన్నాను కాబట్టి వైజాగ్‌లో రియల్ ఎస్టేట్స్ వ్యాపారం చేసి సంపాదించాలనుకుంటున్నాను. మీరు వైజాగ్ కైలాసగిరి, సాగర్‌నగర్ బీచ్ రోడ్‌కి ఎప్పుడైనా వచ్చారా? వచ్చినప్పుడు కలుద్దాం.

mettaseema said...

kottataram alochanalu..kottapokadalu

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి