రెండున్నర దశాబ్దాలుగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ స్పోర్ట్స్ రిపోర్టర్ గా ఉన్న జగన్నాథ్ దాస్ గారిని నేను రాజమండ్రిలో సౌత్ జోన్ నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్ సందర్భంగా కలిశాను. ఆయన అప్పటికే రాష్ట్రానికి చెందిన ఆడపిల్లలు జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణిస్తున్నారని పెద్ద వ్యాసం రాశారు. చాలా ఏళ్ల తర్వాత మొదటి సారి రాష్ట్రానికి చెందిన ఒక పిల్లవాడు కేడెట్ విభాగంలో ఇండియా నెంబర్ ఫోర్ అయ్యాడనీ, అతని గురించి మీ వ్యాసంలో రాయలేదేమిటని అడిగాను. బాధతోనైనా నేనేదో కాజువల్ గా అడిగితే...తను చాలా బాధపడ్డారు. "నిజమేనండీ....నేను కనీసం ఆ యాంగిల్ లో నిర్వాహకులను, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ వారిని అడిగి ఉండాల్సింద"ని చెబుతూ...నాకు సారీ చెప్పారు. రైట్ టైమ్ లో ఫిదెల్ గురించి రాస్తానన్నారు. నేను ఆయన మర్యాదకు అద్దిరిపోయాను. జర్నలిస్టులంటేనే....ఒక 70 % తలపొగరు, 20% కొవ్వు, 10% అతి తెలివితో తయారైన జీవులని నాకు తెలుసు. పైగా సీనియర్ మోస్టు జర్నలిస్టు. అలాంటిది తను సారీ చెప్పేసరికి అయ్యో అనిపించింది.
ఫిదెల్ మీద ఫీచర్ చేస్తామని పత్రికలు, ఛానళ్ల మిత్రులు, సన్నిహితులు చెప్పినా...పొగరు పెరుగుతుంది..వద్దు అని చెబుతూ వచ్చిన నేను జనవరిలో కావాలనే ఇంగ్లిషు పేపర్ల మిత్రులకు తన కెరీర్ గ్రాఫ్ ను తెలిపే డాక్యుమెంట్లతో మెయిళ్లు పంపాను. డెక్కన్ క్రానికల్ స్పోర్ట్స్ ఎడిటర్, ది హిందూ స్పోర్ట్స్ స్పెషల్ కరెస్పాండెంట్ లు వెంటనే కంగ్రాచ్యులేటరీ మెసేజీలు పంపారు. వ్యాసం సంగతేమిటో గానీ వారి స్పందన నాకు చాలా ముచ్చటేసింది. తర్వాత ఇద్దరూ రాసిన వ్యాసాలు ఈ బ్లాగులో నా సొంత సొద కింద మీరు చదివ ఉంటారు. వారికి థాంక్స్.
ఆ రెండు వ్యాసాలకు భిన్నంగా జగన్నాథ్ దాస్ గారు...వ్యాసం రాశారు.ఇది చదివి నా క్రీడా జీవితం గురించి గుర్తుకొచ్చి కళ్ల వెంట నీళ్లొచ్చాయి. ఇంకొక మాట...ఒకే విషయాన్ని మూడు పత్రికలు ఎంత భిన్నంగా రాశాయో అధ్యయనం చేయడానికి ఈ మూడు వ్యాసాలు పనికొస్తాయి. జగన్నాథ్ దాస్ గారు రాసిన వ్యాసం ఇక్కడ ఇస్తున్నాను...ఆయనకు ప్రత్యేక థాంక్స్ తో.
1 comments:
జర్నలిస్టులంటేనే....ఒక 70 % తలపొగరు, 20% కొవ్వు, 10% అతి తెలివితో తయారైన జీవులని _____________అయ్యయ్యో! :-))
ఫిదెల్ కి మనఃపూర్వక అభినందనలు! త్వరలోనే ఇండియా నంబర్ వన్ కావాలని ఆకాంక్షిస్తూ....మీకు హేమ గారికి కూడా అభినందనలు! పిల్లల విజయాల వెనుక ఉండే తల్లి దండ్రుల త్యాగాలు మామూలువి కాదు
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి