Friday, January 20, 2012

కారంచేడు, చుండూరుకు...శంకర్ రావు పదవీచ్యుతికి లింకా?

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కోసారి గమ్మత్తుగా ఉంటాయి. ఎవరు ఎందుకు ఎలా మాట్టాడుతుంటారో చెప్పలేం. ఇప్పుడే టీవీ పెడితే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మంద కృష్ణ మాదిగ మాట్టాడుతూ కనిపించారు. శంకర్ రావు పదవి పోవడాన్ని దళిత కోణం నుంచి చూపుతూ కారంచేడు, చుండూరు ఘటనలను ప్రస్తావించారాయన. ఇది అగ్రకులానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి చేసిన రాజకీయ హత్యగా ఆయన అభివర్ణించారు. 

మనిషన్నవాడు ప్రతొక్కడూ ఖండించాల్సిన ఆ రెండు దారుణ మారణకాండలకు, శంకర్ రావు పదవీచ్యుతికి ముడిపెట్టడం నాకు మర్యాదగా అనిపించలేదు. ఇలా మాట్టాడటం వల్ల....ఎంతో దారుణమైన ఘటనల సీరియస్ నెస్ ను తగ్గించిన ఫీలింగ్ నాకు కలిగింది.
ముఖ్యమంత్రి మీద ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వ ప్రతిష్ఠను మంటగలిపే వారిని కేబినెట్ లో ఉంచుకుంటారా? శంకర్ రావు పద్ధతీపాడూ లేకుండా ఎన్ని ప్రకటనలు ఇచ్చి ఉంటారు? అలా తిక్కమాటలు మాట్టాడటం ఎందుకని మంద కృష్ణలాంటి నేతలు చెప్పి సరిదిద్ది ఉంటే బాగుండేది. ఉద్యమ నేపథ్యం ఉన్న మంద కృష్ణ లాంటి నాయకుడు ఈ అంశానికి కులం రంగు పులిమి మాట్టాడటం బాగోలేదు.
శంకర్ రావు విషయంలో కులాన్ని, ప్రాంతాన్ని ప్రస్తావించడం నా వరకైతే నచ్చడంలేదు. మీరేమంటారు?

14 comments:

Subba Reddy said...

same feeling sir

Naresh said...

మంద కృష్ణ ఉద్యమ నేపథ్యమే కులం కదండి. అందుకే పేరు వెనక కులం పేరు చేర్చుకున్నాడు. అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రిని పీకారు కాబట్టి దీన్ని తన ఉద్యమానికి వాడుకుందామని కూడా చూస్తుండొచ్చు కదా.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

I agree with you.

Thinking about it... I do not remember this Shankar Rao talking about any specific Dalit issues or his vision for a more inclusive society.
He must realize that, just belonging to Dalit community will not make him sacrosanct. Manda Krishna has no business to express his view about this matter. The way he linked up irrelavant issues is utter base politics.

In my opinion :
1. His inclusion into Ministry is for his nuisance value and for his stong support to Cong. high command. Such an inclusion was made in the guise of giving representation to Dalits.
2. His sacking is not at all related to Dalits or their issues. It is his own mindlessness.

ధర్మస్థలమ్ said...

అది చండూరు కాదండీ ! చుండూరు.

mettaseema said...

yes sir

శరత్ కాలమ్ said...

దీని గురించి ఓ టపా వేస్ట్ అంటాను.

Ramu S said...

Dear Dharmasthalam
Thanks, I've corrected the spelling.
Dear Naresh,
Everything shouldn't be seen from caste glasses. For every caste, it has become a custom to support its members irrespective of the nasty things they do. Its dangerous.
Ramu

విజయ్ అనంగి said...

chunduru athma ghoshaku, sankaranna seatku sopati etta krishannna...!!
edo sametha cheppinattu... gadida nu gurranni okate antunnare..! sankarravu padavi voodatampai GAJJELA KANTHAM gari comment( in GEMINI NEWS ) sarina samadanam. dalitha samsyalapai ennadu norettani sankarravu ku
padavi poyaka kulam guthochindani vimashincharayana. udyama netha krishannnaku amatram telidanu kovala...? kani karamchedu tho mudipettesaru chala goppaga. kondarina nammaka pothara ane asha kabolu.

Jai Gottimukkala said...

@Naresh: మంద కృష్ణది శంకరరావు సామాజిక వర్గం కాదు. This is an attempt by MKM to raise above the Mala-Madiga (ABCD) debate.

@Ramu S: ప్రతి ఒక్కరూ (I mean politicians) కులపుటద్దాలు (caste glasses) వేసుకున్నారు. కాపులకు ఎక్కువ పదవులు వచ్చాయని గాదె బాధ పడితే, అదేమీ లేదని బొత్స చెప్పుకున్నారు. కమ్మలకు న్యాయం జరగడం లేదని రాయపాటి ఏడుపు. మీరు వాటిని వదిలేయడం మీ దళిత వ్యతిరేకతకు చిహ్నమని శంకరరావో, మంద కృష్ణో అనక ముందే తప్పు సరి దిద్దుకోగలరు :)

Ramu S said...

సోదరా...
నన్ను ఏమన్నా పర్వాలేదు గానీ శంకర్ రావుకు కులానికి లింకు పెట్టడం నాకు భావ్యంగా అనిపించడం లేదు. కృష్ణ పోరాట పటిమను, గొప్ప నాయకత్వ లక్షణాలను నేను జర్నలిస్టుగా ఉన్నప్పుడు కూడా వార్తల రూపంలో రాశాను కానీ ఎందుకో శంకర్ రావు విషయంలో తన స్టాండ్ కరెక్టుగా లేదని అనిపిస్తున్నది.
రాము

sneham said...

avunu sir e kulala chichulatho em matladina... venakala "thokatho" koduthunnaru...

ddtv said...

మీరన్నట్టు పోరాట పటిమ తోనే పైకొచ్చిన మంద కృష్ణ (ఎల్లన్న అసలు పేరు) ఆ తర్వాత పోరాటాన్ని వదిలివేసి కొన్నాళ్ళు చంద్రబాబు తో ఇంకొన్నాళ్ళు వైఎస్ లాంటి అధికారంలో ఉన్న (ఇప్పుడు కిరణ్ తో కాదులెండి) నాయకులతో అంట కాగే పటిమ ను మాత్రమే ఉంచుకున్నాడు. కొందరు పెద్ద నాయకులు అవ్వాల్సిన వాళ్ళు చిన్న చిన్న ప్రయోజనాలకు తమ వ్యక్తిత్వాలను అమ్ముకుని ఎదగలేకపోతున్నారు. దీనికి మంద కృష్ణే ఉదాహరణ.

srikanth said...

Sir my home town at tenali... Manda krishna support cheyadam sankar rao ki it's not correct, DL ravindra reddy ni kuda thesesthe minister post nunchi intha loli undedhi kadhemo, kulla gaji rajakiyalu cheyadam asahyam ga und!!!

Anonymous said...

ఇక్కడ వచ్చిన పెద్ద మొత్తం కామెంట్ చూస్తేనే తెలుస్తుంది కుల వ్యవస్త ఎంత ఘాడంగా ఉందో. ఇకపోతే నేను మంద కృష్ణ మాదిగ గారిని గుడ్డిగా నమ్మేవాడిని కాదు అలాగని మాజీ మంత్రి శంకర్ రావు గారి అభిమానిని కాను. ఒక దళితుడిగా మాజీ మంత్రిగారిని సాగనంపిన విధానం పై కృష్ణ మాదిగ గారి పోలిక సరియినదే అందులో మీరందరూ భాదపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది అడుగడుగునా అవమానానికి గురియిన వారికే అర్థం అవుతుంది. మీలో ఎంత మంది చుండూరు,కారంచేడు ఘటనపై స్పందించారో నాకు తెలియదు కాని అప్పుడు, ఇప్పుడు దళితులపై జరిగిన దాడులకు, జరిగిన అవమానాలకు స్పందించిన వ్యక్తీ మంద కృష్ణ మాదిగ గారు.

అప్పుడు జరిగింది బౌతికం ఇప్పుడు రాజకీయ హత్య అన్నారు, మంత్రి శంకర్ రావు స్తానంలో ఎ రెడ్డో, కాపో, కమ్మో ఉన్నట్లయితే ముంక్యమంత్రి గారు ఇలాంటి సాహసం చేసే వారా? పనితీరు లేదా స్వంత పార్టీపై విమర్షల విషయానికి ఒక కొలమానం ఉంటే తను తప్పక మిగతా వారికంటే బ్యాలేన్సుడుగానే ఉన్నారు. ప్రాంతీయ ఉద్యమాల నాయకులు శంకర్ రావు గారికంటే ఎక్కువగా తిట్టి పోసారు కాని వారు దళితులు కాదు కాబట్టి వారిపై చర్య తీసుకోలేదు అని అనుకోవచ్చా? ఇకపోతే ప్రస్తుత మంత్రి వర్గం పనితీరుని పరిశీలిస్తే మాజీ మంత్రి శంకర్ రావు గారు మిగత వారు లాగ కోట్లు మింగేసి అది నాకు తెలియదు నా దృష్టికి రాలేదు అనలేదు, లేదా రోజురోజుకు హత్యలు మానబంగాలు పెరిగి పోతున్నా, ఇవన్ని తనకేమి ఎరుగనట్లు ఉన్న మంత్రులు లా లేదు. ఇంకొ విషయం శంకర్ రావు గారే అన్నారు నన్ను రాజీనామా చెయ్యమంటే నేనే నా పదవికి రాజీనామా చేసేవాడినని కాని ఆ అవకాసం కూడా ఇవ్వ కుండా బర్తరఫ్ చేయడం భాదాకరం. అందుకే ఇది ముమ్మాటికి రాజకీయ హత్యే!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి