Sunday, March 4, 2012

మీడియా బాసులూ....మీ ఆస్తులు ప్రకటించరా?

తరచి చూస్తే... మీడియా (ఎలక్రానిక్, ప్రింట్) లో మూడు రకాల ఎడిటర్లు కనిపిస్తారు. 

మొదటి వర్గం వారు...నైతికతకు పెద్ద పీటవేస్తూ విలువలే ప్రాణంగా మనసా వాచా కర్మణః పనిచేసేవారు. యజమాని వాణిజ్య, వ్యాపార విషయాలలో రాజీ పడకుండా...సత్తా, సరుకున్న జర్నలిస్టులను ప్రోత్సహిస్తూ బతికే వారు. తెలుగు సెట్టింగ్ లో ఇదొక అరుదైన జాతి. ఇది దాదాపు అంతరించి పోయింది. 

రెండో వర్గం వారు...పైకి నైతికత గురించి గంభీర ఉపన్యాసాలు ఇస్తూ...దొంగ వ్యవహారాలు చేస్తూ...తమ పదవే ముఖ్యంగా.... తమకు భజన చేసే వారిని ప్రోత్సహించుకుంటూ ఇంకొకడు ఎదగకుండా చర్యలు తీసుకుంటూ ఒక ఉన్మాదంతో ముందుకు సాగిపోయే వారు. పైన పటారం...లోన లొటారం టైపు. తెలుగులో ఇది అద్భుతంగా వర్ధిల్లుతున్న జాతి. 

మూడో వర్గం వారు...యజమానులు తమ కులం, ప్రాంతం, చావు తెలివి తేటల ఆధారంగా ఎంచుకుని కనకపు సింహాసమున కూర్చుండ బెట్టేవారు. వీళ్ళకు రెండో వర్గం వారి లక్షణాలు ఒక పది రెట్లు ఎక్కువగా వుంటాయి. నీతీ జాతీ లేకుండా...సంపాదనే ధ్యేయంగా, పనిలో పనిగా ఇల్లు చక్కబెట్టుకునే వారు వీరు.  

మరి వీరిలో ఎవరు బెటరు అనేది...మనీకి, ఎథిక్స్ కు మనమిచ్చే ప్రాధాన్యాన్ని బెట్టి ఉంటుంది. నా వరకూ అయితే...మొదటి వర్గం ది బెస్ట్. రెండో వర్గం వరస్ట్. మూడో రకం సన్నాసులతో పెద్ద సమస్య వుండదు. అవి విషపుపురుగులని తెలుసు కాబట్టి...మనం జాగ్రత్త పడవచ్చు. 

ఈ వర్గీకరణ ఇలా వుండగా....పొరుగునున్న కర్ణాటకలో ఒక కొత్త టీ వీ చానల్ అధిపతి హెచ్.ఆర్.రంగనాథ్ ను చూసి ముచ్చటేసి ఈ పోస్టు రాస్తున్నాను.  గతం లో కన్నడ ప్రభ (పత్రిక), సువర్ణ న్యూస్ (ఛానల్) లో ఎడిటర్ గా పనిచేసి....పబ్లిక్ టీవీ అనే కన్నడ ఛానల్ ను పెట్టిన రంగనాథ్ ఒక చరిత్ర సృష్టించారు.  ఒక లైవ్ ప్రోగ్రాం లో తన ఆస్తులు, అప్పుల వివరాలు బాహాటంగా ప్రకటించడం ఆయన చేసిన గొప్ప పని. చానల్ ఛైర్మన్, మానేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉండి ఆయనీ పనిచేసారు. పదిహేనేళ్ళుగా తనకు టాక్స్ కన్సల్టెంట్ గా వున్న వ్యక్తి ద్వారా ఆస్తుల వివరాలు  ప్రకటించి....ఇంతకన్నా ఎక్కువ ఉంటే...జప్తు చేసుకోవచ్చని ప్రకటించారు. ఆయన ఆస్తుల వివరాలు. 

1) A gift from his mother of four guntas of land in Arkalgud, Hassan
2) 1991-92: Partnership in a plot of 13,980 square feet in Mysore
3) 2002-03: A house constructed on a 30×40 site in Bangalore
4) 2005: A Hyundai Accent car bought on loan
5) 2009: A Honda Activa scooter
6) 2011: A second-hand 1975 jeep bought last year
7) 11,000 shares in Mindtree, 12 shares in Reliance Industries, 15 shares in Kairon250 grams of gold belonging to his wife, 100 grams gifted at the time of marriage, the rest bought over the last 20 years. 
తను పనిచేసిన చోట్ల ప్రతి ఏడాది తన ఆస్తుల వివరాలు యజమానులకు ఇచ్చేవారట ఈయన. అనతి కాలం లోనే వినుతి కెక్కుతున్న తెలుగు టీ.వీ.చానళ్ళ, పత్రికల ఎడిటర్ మహాశేయులారా....మరి మనసంగతి ఏమిటి? ఎజమానుల సంగతి ఎలా వున్నా...మీరైనా రంగనాథ్ ను అనుకరిస్తే....బాగుంటుందేమో!

9 comments:

Alapati Ramesh Babu said...

నీతి మేము యెదుటివారికి చెపుతమేకాని మేము ఆచరిస్తామా. ఇది అన్ని పత్రికలది అదె దారి.

Unknown said...

నేనే ఈ విషయం గురించి చెబుదామనుకుంటున్నా...
బెంగుళూర్ లో గత ఇరవయి ఏళ్ళుగా ఉంటూన్న నాకు ఇక్కడి మీడియా కి అంధ్ర లో తెలుగు మీడియా కి ఎంత తేడా ఉందో స్పష్టంగా తెలుసు. కన్నడ చానల్స్ ఎంత నిష్ట తో పనిచేస్తాయంటే సామాన్య ప్రజానీకం కూడా మద్దతిచ్చేంతగా. ముచ్చటేస్తుంది...కొద్దిగా బాధ కూడా... మన తెలుగు లో ఇలా లేదే అనిపించేలా.

కన్నడ చానల్స్ లో మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే సామాన్య ప్రజానీకానికి పెద్ద పీట వెయ్యడం.పబ్లిక్ గొంతు వినిపించడం. రాజకీయనాయకుల వాణి కి ఇంపార్టన్స్ ఇవ్వక పోవడం వల్ల మరింత దగ్గర చేసాయి.

యెడ్యూరప్ప భూకుంభకోణాలు కానివ్వండి. గాలి గనులు కానివ్వండి. అసెంబ్లీ లో బూతుపురాణం కానివ్వండి.నిన్నటికి నిన్న పత్రికారంగం పై లాయర్ల అట్టహాసం కానివ్వండి. ఎండగడుతూనే ఉన్నారు... మన తెలుగు లో.....సత్య నిశ్ఃట కలిగిన చానల్. ఒక్కటయినా ఉందా.? ఊహించలేము కూడా.

రంగనాథ్ మొదట్లో కస్తూరి చానల్ లో పనిచేసేవారు.... ఆయన సంధించే ఒక్కొక్క ప్రశ్న, రాజకీయనాయకుల గుండెల్లొ దడ పుట్టిస్తాయి... ఈ నలభయి ఐదేళ్ళ జర్నలిస్ట్ ముందు కూర్చోవాలంటే ఎంత తలపండిన రాజకీయనాయకులకయినా హడలే...ఆయన మాట్లాడుతుంటే మనం మన గొంతు ని వినిపిస్తున్నట్టే ఉంటుంది. సామాన్య మహిళలు గృహిణులు కూడా చర్చ ల్లొ పాల్గొంటారంటే ఊహించండి ఈయన ఎంత పాపులరో.

ఈయన చేసే చాల ప్రోగ్రాములు తెలుగు లో మీరు కూడ చెయ్యొచ్చు...మీరు జర్నలిస్టు కాబట్టి మీకు ఇది అసాధ్యం కాకపోవచ్చు.
ఎవరో ఒకరు ఎపుడో ఒకప్పుడు అడుగెయ్యాలిగా... అది మీరే ఎందుకు కాకూడదు.?
ఇది మీ దృష్టి కి తీసుకొద్దామని అనుకుంటూండగానే.. ధన్యవాదాలు..

-సుధ

surfizenn said...

ఒకఱి ఆస్తుల చిట్టాలూ, లెక్కలూ, ఆవర్జాలూ ఇంకొకఱికెందుకు ? ఆస్తి ప్రైవెట్ విషయం. అది ప్రజల కవసరం లేదు. ఒకఱి ఆస్తి గుఱించి తెలుసుకోవాలనుకోవడం, దాని పరిమాణాన్ని బట్టి అతను మనకి వర్గశత్రువవునా ? కాదా ? అని ఆలోచించడం ఇదంతా పాతబడిపోయిన కమ్యూనిస్టు/సోషలిస్టు ధోరణి. అంతకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకి ముఖ్యమైన విషయం - ఆయా పాత్రికేయులకి నిరూపిత నేరస్థ చరిత్ర లేకపోవడం. అలాంటివేమైనా ఉంటే బయటపెట్టమని అడగాలి. అంతే గానీ వాళ్ళకి ఎక్కడ ఎన్ని ఇళ్లూ, షాపులూ, షేర్లూ, పొలాలూ, అప్పులూ, డిబెంచర్లూ ఉన్నాయో మనకెందుకు ? అవన్నీ తెలుసుకుని మనమేం చేయాలి ?

కర్నాటక పరిస్థితి కాస్త వేరు. ఇక్కడిలాగా ఇక్కడ ప్రజల్లో అమాయకత్వం పూర్తిగా చచ్చిపోలేదు. అక్కడ ప్రజలు మన తెలుగువాళ్ళలాగా సంప్రదాయ విరోధులు, జాతివ్యతిరేకులూ కారు. అక్కడ the flavour of old world goodness ఇంకా సజీవంగానే ఉంది.

Unknown said...

twaralone abn andhrajyothy lo vastundi chusi aanandinchandi

Ramu S said...

Surfizenn,
You have a good point. Similarly criminal background too is nothing do with journalism.
If they disclose their assets every year, we can make a comparative study and question them. At the same time, they too have a fear of being caught.
It comes in handy to create fear in them, thats it.
Cheers
Ramu

tv9 jaffar said...

sir imthaki me phone vachindaa..

Jai Gottimukkala said...

బాబు గారు ఆస్తులు ప్రకటించారు కదా. దాని వల్ల ఒరిగిందేమిటి?

ఆస్తులతో పాటు వాటిని ఎలా సంపాదించామో, వాటి విలువ ఎలా నిర్ణయించామో కూడా చెప్పాలి. ఆస్తి విలువను అంచనా వేసే విధానంపై ఏకాభిప్రాయం రావాలి.

srikanth said...

babu gari laaga donga asthulu prakatinche badulu prakatinchakunda undatame melu..

srikanth said...

ee moodu vargaalaku okko example cheppagalara? manushulu ayinaa leda media houses ayinaa sare.. thx

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి