Sunday, March 18, 2012

మన పీహెచ్ డీ...సచిన్ వందో సెంచరీ....

పిచ్చ ఆలోచన అనండి లేదా గొప్ప అబ్జర్వేషన్ అనండి....నా పీహెచ్ డీ కి, సచిన్ వందో సెంచరీకి ఏదో అవినాభావ సంబంధం ఉందని నాకు అనిపిస్తుండేది. "సోదరా...నీ రీసెర్చు ఇంకా పూర్తి కాలేదా..." అని అడిగితే...."లేదన్నా...సచిన్ వందో సెంచరీ లాగానే ఎంతకూ తెగని ముడిపడని వ్యవహారం లా ఉందీ పరిశోధన..." అని చెప్పేవాడిని గత ఏడాదంతా. అదే మాట ...ఓ ఐదేళ్లు భారత్ లో క్రికెట్ ను నిషేధిస్తే సరి...అనే పోస్టులో కూడా రాశాను జనవరి చివర్లో. 

మొత్తం మీద నేను ఈ నెల పన్నెండున థీసిస్ సబ్మిషన్ కార్యక్రమం లాంఛనంగా ముగించాను. అప్పటి నుంచి కొందరు సన్నిహితులతో సరదాగా అన్నాను...ఇక సచిన్ సెంచరీ చేస్తాడు చూడండని. వారం తిరక్కుండానే...నా లాగానే చచ్చీచెడీ...మనోడు సెంచరీల సెంచరీ సాధించాడు. ఆదివారం నాడు ఇదండీ సంగతి.

2 comments:

రసజ్ఞ said...

ముందుగా మీ phd అయినందుకు శుభాకాంక్షలు! మీరు డాక్టరు అయ్యేదాకా సెంచరీ కొట్టను అని ఒట్టు పెట్టుకున్నాడేమో అండీ ;)

ఆర్.ఎస్ రెడ్డి(డేర్2క్వశ్చన్ బ్లాగర్) said...

ha..hha...hhhha..........any way congrats Dr!