1998 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్ అఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎం.సీ.జే.) చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ లో భాగంగా 'ఈనాడు జర్నలిజం స్కూల్' కేస్ స్టడీ చేశాను. దళితులు, తెలంగాణా ప్రాంతం వారికి ఆ సంస్థలో ప్రాధాన్యత దక్కడం లేదని నా అధ్యయనం లో తేలింది. దగ్గరి నుంచి చూసిన వాడిగా అది ముమ్మాటికీ నిజమే అని నాకు తెలుసు. అందుకే నేను చేసిన నియామకాల్లో ఎస్.సీ.లు, ఎస్.టీ.లు వున్నారు. వారు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆ అధ్యయనానికి 'ఉర్దూ అకాడమీ గోల్డ్ మెడల్' వచ్చిందనేది వేరే విషయం. అప్పటి నుంచీ మీడియాను కులం దృక్కోణం నుంచి చూస్తూ వస్తున్న నాకు నిన్న ది హిందూ లో వచ్చిన రాబిన్ జాఫ్రీ ప్రసంగ పాఠం Missing from the Indian newsroom చదివాక పెద్దగా ఆశ్చర్యం కలగలేదు.
సమాజంలో కులం ఉంది, మీడియాలో కులం ఉంది. మీడియా అగ్రవర్ణ ధనిక స్వాముల చేతులో ఉంది. లాభాలు, వ్యాపార విస్తరణ ధ్యేయంగా ఉండే వారు...తమ సామాజిక వర్గానికి, తమ ప్రయోజనాలు కాపాడే వర్గానికి పెద్ద పీట వేయకుండా సమ సమాజం గురించి, దళితుల గురించి ఆలోచిస్తారని అనుకోవడం తప్పు. దేవుడు ప్రత్యక్షమై అందరికీ వారు కోరుకున్నవి ఇస్తే బాగు...అని అనుకోవడం ఎంత అత్యాశ అవుతుందో....దళితులకు, ముస్లిం లకు మీడియా యాజమాన్యాలు పెద్ద పీట వేస్తే బాగుంటుందని, మంచి పదవులు ఇవ్వాలని ఆశించడం కూడా అలాంటిదే అవుతుంది. ఇది జరగని పని. కులాన్ని బట్టి మాత్రమే ప్రతిభ ఉంటుందని అనుకోవడం నిజానికి దారుణమే. ఒక అవకాశం ఇస్తే అద్భుతంగా రాణించే వారు అన్ని కుల్లాల్లో వున్నారు. ఈ మధ్యన వస్తున్న ఒక ఛానెల్ అందుకేనేమో బీ.సీ.లకు అందునా ఒక సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నది. బీ.సీ.ల కోసం అని నూకారపు సూర్యప్రకాశ రావు గారు 'సూర్య' అనే పత్రిక పెట్టి పెత్తనం మాత్రం శర్మ గారికి ఇచ్చారు.
నేను కళ్ళారా చూసిన రెండు విషయాలు పంచుకోవడానికి ఇది రాస్తున్నాను.
ఒకటి) ఇప్పుడు మీడియాలో కులం తో పాటు ప్రాంతం లాయల్టీ ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. రామోజీ రావు ను పొగిడే కమ్మ జర్నలిస్టులకు పెద్దగా ప్రతిభ లేకపోయినా ఉన్నత పదవులు దక్కుతాయి. అది సత్యం. అలాగే...తనకు వీర విధేయుడిగా ఉండే చెత్త రెడ్డి జర్నలిస్టుకు రవి అందలం అందిస్తాడు. తమ ప్రయోజనాలు కాపాడతారనుకునే వారికి, భార్య తరఫు బంధువులకు ఉన్నత పదవులు కట్టబెట్టి, వారు అత్యంత ప్రతిభావంతులని నమ్మబలికే పరమ వీర ఎథికల్ జర్నలిస్టులు మన రాష్ట్రం లో వున్నారు.
తాను ఎక్కడో పనిచేస్తున్నప్పుడు చెప్పు కింద పడి వున్న ఒక సెక్షన్ కు, మసాజ్ చేసే చెత్త జర్నలిస్టులకు స్థాయికి తగని పదవులు ఇచ్చే మహానుభావుల కథలు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ పుస్తకం కింద అచ్చు వేస్తే...నయ వంచకుల బండారం బట్ట బయలవుతుంది. అయితే...కులం కన్నా...లాయల్టీ ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని నా పరిశీలన.
రెండు) ఈ మధ్యన మీడియాలో ఎస్.సీ., ఎస్.టీ.లను నియమించడానికి యాజమాన్యాలు జంకుతున్నాయనేది నిష్ఠురసత్యం. ఛానెల్స్ పెరిగాక కెమెరామెన్ గా చేరిన ఒక వర్గం వారు....రిపోర్టర్ లను, బాసులను కులం పేరుతో బెదిరించడం ఇందుకు కారణం. కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ బాసులు ఎస్.సీ.,ఎస్.టీ. అట్రాసిటీస్ కేసుల భయంతో వణుకుతున్నారు. లోపల కుల వాదం వంటబట్టించుకున్న వారు పైకి మాత్రం దళిత, ముస్లిం జర్నలిస్టులను ప్రోత్సహిస్తున్నట్లు నటిస్తున్నారు.
ఇక్కడ ఇంకో సమస్య ఉంది. దళితులు మీడియాలో ఉంటే...దళితుల సమస్యలు ఎక్కువ హై లైట్ అవుతాయని అనుకోవడం ఒక భ్రమ. ఎందుకంటే...ఏ కులం వాడైనా తాను చెప్పినట్లు చేసేలా మలుచుకోవడం...మన యాజమాన్యాలకు బాగా తెలుసు. ఈ పరిస్థితులలో ఎస్.సీ. కోటీశ్వరులు ఎస్.సీ.జర్నలిస్టుల కోసం, ఎస్.టీ. కోటీశ్వరులు ఎస్.టీ.ల కోసం పేపర్స్, చానల్స్ పెట్టడం ఒక్కటే ఉత్తమమైన మార్గంగా నాకు కనిపిస్తున్నది. మీరేమి అంటారు?
8 comments:
'ముల్లును ముల్లుతోనే తీయాలి' అన్నట్టుగా ఉన్నది మీ ప్రతిపాదన. మీ ప్రశ్నకు మరో ప్రశ్న సమాధానం కాదు కానీ - నాదో చిన్ని ప్రశ్న. ఒక సగటు భారతీయుడిగా అడుగుతున్నాను. మీరు ప్రస్తావించిన ఏ వర్గానికి చెందినవారినయినా ప్రోత్సహించి తీసుకున్నారనుకోండి - అలా చేరినవారు తమ హయాంలో తమ వర్గానికి చెందినవారిని చేర్చుకోడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వరని గ్యారంటీ ఉన్నదా?
"దళితులు మీడియాలో ఉంటే...దళితుల సమస్యలు ఎక్కువ హై లైట్ అవుతాయని అనుకోవడం ఒక భ్రమ"
మీరన్నది నిజమే. యాజమాన్యం చెప్పిన దానికి వ్యతిరేకంగా రాయగలిగిన సత్తా ఎవరికీ ఉంటుంది?
అయితే అనేక విషయాలలో దళిత/ముస్లిం/ఇతర వర్గాల దృక్పథం మిగిలిన వారికి ఒక పట్టాన అర్థం కాదు. ఉ. ఇటీవల ఉస్మానియాలో దళితులు గొడ్డుమాంసం కావాలని అడగడం దళిత దృష్టికోణంతో ఎవరూ చూడలేకపోయారు. మీడియాలో ఈ వర్గాల ప్రతినిధులు కొందరయినా ఉంటె ఈ అవగాహనాలోపం కొంతవరకు తగ్గొచ్చు.
There are many interesting letters to the editor in today's Hindu. Please read these if you can get hold of the print version.
రాము గారు నేను మీ బ్లాగుని గత ఆరు నెలలుగా చూస్తున్నాను...చాలా మంచి విషయాల గురించి చర్చించారు...కానీ మీరు దళితుల గురించి ఎప్పుడు రాసినా ఒక పక్షపాత ధోరణి కనిపిస్తుంది నాకు...
ఇక పొతే మీ ప్రతిపాదన వలన ఇంకో ఒకటి రెండు పత్రికలు వచ్చినా ఒక రకంగా అవికూడా ప్రజలకి పనికివచ్చే పని చేయవు...అక్కడ కూడా ఆ వర్గం కి అనుకూల సమాచారాలే వస్తాయి...
అసలు ఈ సామాజికవర్గం అన్న వ్యవస్థ కి ముగింపు పలికే దిశగా మీలాంటి వారు ఆలోచించటం సముచితం అని నా ఉద్దేశం
-ఫణి
I agree with Phani..
రాము గారు
అసలు ఈ సామాజికవర్గం అన్న వ్యవస్థ కి ముగింపు పలికే దిశగా మీలాంటి వారు ఆలోచించటం సముచితం
అని నా ఉద్దేశం
కులం ఒక బలం అని అనుకుంతున్న అంత కాలం ఈ సమాజం ఇంతె.
i always believed that the breeds belongs to dogs (or animals), like its a doberman breed, Pomeranian breed, pug breed,german shepard breed etc.
కులం పిచి లొ పది మనం మనుషులం అన్న ముఖ్యవిష్యని మరిచి పొతున్నరు ఈ జనం. ఇప్పతికి వీదు మన వాదు వీదికి ఎమన్న చెయాలి అని అనుకుంతున్నం కాని, వీదు కస్తం లొ వున్నదు వీదికి సహయం చెయలి అని అనుకొవతం లెదు
నిజ జీవితంలో "కులం" అనే పదమే వాడుతారు కానీ మీడియాలో మాత్రం ప్రజలని మిస్లీడ్ చెయ్యడానికి సామాజిక వర్గం అనే పదం వాడుతారు. కులం కూడా మతంలాగే ఊహాజనితమైనది. సమాజం గురించి ఆలోచించనివాడు కులం గురించి మాత్రం ఆలోచిస్తాడనుకోలేము. స్వార్థం అనేది ఎప్పుడూ వ్యక్తికేంద్రకంగానే ఉంటుంది కానీ కుల కేంద్రకంగా ఎన్నడూ ఉండదు.
ramu garu... just to share this information...
YSR Sarma joined Andhra Prabha as Editor in place of Vijayababu...
In two days after he joined AP, that KILLBILL Sarma sacked two senior staff from the organization...
BTW, How are you sir...?
Regards
Satish Kumar
MAA TV
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి