Sunday, April 29, 2012

హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల Vantage

నేను విజిటింగ్ ఫాకల్టీ గా ఉన్న హైదరాబాద్ యూనివర్సిటీ లో ప్రతి ఏడాది నా విద్యార్థులు రెండేళ్ళ కోర్సు పూర్తి చేసే ముందు ఒక మాగజీన్ తెచ్చే సంప్రదాయాన్ని నేను ఒక మూడేళ్ళ కిందట ప్రవేశ పెట్టాను. దీని పేరు వాన్టేజ్. ముచ్చటగా మూడో పత్రిక ఈ వారం తెచ్చాము. ఈ సారి హైదరాబాద్ మీద తెచ్చిన సంచిక ఇది. దాని కాపీలతో విద్యార్థులూ, మేము కమ్యూనికేషన్ డిపార్టుమెంటు ముందు ఇచ్చిన పోజు ఇది. హృదయ రంజన్, స్వయంసిద్ధ మిశ్రా, దివ్యా చౌదరి, ప్రియాంకా ప్రవీణ్ అనే చురుకైన పిల్లలు దీనికి ఎడిటర్లుగా వ్యవహరించారు. రహూఫ్, సంశీర్ అనే కేరళ పిల్లలు మంచి ఫోటోలు అందించారు. 

జర్నలిజం పిల్లలు తెచ్చే ఇలాంటి పత్రిక దేశం లో ఏ యూనివెర్సిటీ లో లేదని మిత్రులు అంటారు. మీకు కాపీలు కావాలంటే నాకు రాయండి.
  

1 comments:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ఎయు సృజన పేరుతో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు,జర్నలిజం విభాగం చాలాకాలం నుంచి ఏడాదికి ఒక సంచిక తెస్తోంది.తాజా సమాచారం నాకు తెలీదు గానీ,నేను చదువుకున్న రెండేళ్ళూ సంపాదక వర్గంలో ఉన్నాను.అలాగే మధ్యప్రదేశ్ నుంచి ,మిగతా చోట్ల నుంచీ ఇలాంటివి వస్తున్నట్టు విన్నాను.
--ముచ్చటగా మూడో పత్రిక ఈ వారం తెచ్చాము.--- అంటే బహుశా ఆ పత్రిక మూడో సంచిక తెచ్చుంటారు అనుకుంటున్నా,లేదా ప్రతి ఏటా పత్రిక పేరు మారుస్తున్నారా?
ఏ యూనివెర్సిటీ లో--- యూనివర్సిటీలో
మీకు కాపీలు కావాలంటే నాకు రాయండి.----పీడీ యఫ్ పైలు ఇక్కడ పెట్టేయండి-కావాల్సిన వాళ్ళంతా దించుకుంటారు.