Friday, May 4, 2012

'ఇమేజ్' వారి ఛానెల్ లో స్వప్న, మూర్తి, వాసుదేవన్

'ఇమేజ్' హాస్పిటల్స్ వారు త్వరలో తేబోతున్న న్యూస్ ఛానెల్ బాగుండే అవకాశాలు ఉన్నట్లు అనిపిస్తున్నది. ఇండస్ట్రీ లో ఉత్తమమైన జర్నలిస్టులను వెతికి ఎంపిక చేసుకుంటున్నారు. తెలుగు టెలివిజన్ జర్నలిజం లో తనదైన ముద్ర వేసుకున్న స్వప్న ఇందులో చేరారు. ఈ-టీవీ, ఎన్ టీవీ, ఏ.బీ.ఎన్-ఆంధ్రజ్యోతి ఛానెల్స్ లో బ్యూరో చీఫ్ గా పనిచేసిన మూర్తి, టీ.వీ.నైన్ లో వార్ కథనాలు అందించడంలో దిట్టగా పేరుపొందిన పత్రి వాసుదేవన్ ఇందులో పెద్ద పదవుల్లో చేరారు. ఇంకా పేరు పెట్టని ఈ ఛానెల్ రెండు మూడు నెలల్లో రాబోతున్నట్లు సమాచారం.టీ.వీ.నైన్ తర్వాత సాక్షిలో పనిచేసిన స్వప్న ఇప్పుడు ది హన్స్ ఇండియా కు ఒక కాలం రాస్తున్నారు. మూర్తి ఒక నెల కిందట ఏ.బీ.ఎన్-ఆంధ్రజ్యోతిని వీడారు. టీ.వీ.నైన్ వదిలిన తర్వాత సాక్షి ఢిల్లీ బ్యూరో చీఫ్ గా, తర్వాత  జెమిని ఇన్ పుట్ ఎడిటర్ గా పనిచేసారు వాసుదేవన్. స్వప్న రాకతో గ్లామర్ సంతరించుకున్న ఈ ఛానెల్ ఈ మధ్యన వచ్చిన ఛానెల్స్ కన్నా భిన్నంగా ఉంటూ ఇప్పటికే స్థిరపడిన ఛానెల్స్ ను ఎదుర్కొనడానికి సన్నద్ధమవుతున్నది. ఆయా టీ.వీ.ఛానెల్స్ లో బాసుల తీరుతో, యాజమాన్యాల విధానాలతో విసిగిన పలువురు జర్నలిస్టులను ఈ ఛానెల్ వారు తీసుకుంటున్నట్లు సమాచారం


13 comments:

తెలుగు భావాలు said...

ఇన్నిన్ని వార్తా ఛాణల్ల అవసరమేమై ఉంటుందో!!!

WitReal said...

an interesting rankings
http://www.mediacrooks.com/2012/04/indias-worst-journalists-2012.html

Do we have any telugu TV version of this??

shrigo said...

V6 ela nadustundandi?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

కోటి లింగాలలో ఒక బోడి లింగం కాకుండా ప్రత్యేకతను చూపించగలిగితేనే ఏ చానల్‌కైనా మనుగడ ఉంటుంది. Let's hope.

the tree said...

నిరంతరం
చూస్తూనే వుండండి.
వాళ్ళ భావాలు
మీలో విత్తుతారు.
-----------------
నాలుగు వార్తలు,
ఆరు బూతులు,
మన తెలుగు
న్యూస్ చానల్ .

pardha said...

త్వరలో వస్తున్న "ఇమేజ్" వారి చానల్ పేరు సి.వి.ఆర్.News.

banesh varma said...

ఇమేజ్ చానల్ లొ చెరడానికి మిగతా చానల్ ఉద్యొగులు చాలా పొటి పడుతున్నారు.

banesh varma said...

ఇమేజ్ చానల్ లొ చెరడానికి మిగతా చానల్ ఉద్యొగులు చాలా పొటి పడుతున్నారు.

విజయ్ అనంగి said...

NIJAM niggu thelchi.... journalism imagenu nilapali

విజయ్ అనంగి said...

nijam cheppe nijam untene
journalism IMAGE nilustundi

evadaite enti said...

idem media kaburlu basu...o pakka sakshi accounts freez cheste..kanisam aa vartha pettalanna gnanam lekunda..ante..antha updates rayanappudu..andulo employees journalists kadu anukunnappudu matrame..ila jarugutadi..ledhante..maro lokottaramaina karyam lo busy ga undi untaru..anthele..vere channels ki baka udhadam bavuntundi..kani..ivenduku padathayi?

Ramu S said...

yes brother..evadaite...
lokootara kaaryam...true. I am in my village to attend my father, who suffered paralysis stroke. I'll get back to you on this topic. My fate is that I've to take shit from anonymous buggers like you.
Cheers
Ramu

ramesh said...

image management is asking for two years bond from their employees after recruiting them with out informing earlier