Saturday, May 26, 2012

సత్యమేవజయతే... సత్యమేవజయతే...


మీడియాలో పెట్టుబడులు స్వచ్ఛంగా ఉండాలని సాధారణ జనం భావిస్తున్నారు, అమాయకంగా. అలాగే...మీడియా యజమానులు, ఎడిటర్లు, జర్నలిస్టులు స్వచ్ఛంగా పులుకడిగిన ముత్యాల్ల ఉండాలని కోరుకుంటారు. అలా ఆశించడం లో తప్పు లేదు కానీ వాస్తవాలు ఎప్పుడూ భిన్నంగా, భయంకరంగా ఉంటాయి. 

స్వాతంత్ర్యం రావడానికి ఏడాది ముందు...తెగబలిసిన పారిశ్రామికవేత్త రామ్ కిషన్ దాల్మియా తాను ఛైర్మన్ గా వున్న లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ నిధులు బెనేట్ అండ్ కోల్మన్ (టైమ్స్ అఫ్ ఇండియా) స్వాధీనానికి మళ్ళించాడు. దాని వల్ల ప్రభుత్వ రంగ సంస్థ దివాలా తీసింది. ఆడిటర్స్ అభ్యంతరాలు పెడచెవిన పెట్టారు. ఇది పసిగట్టిన ఫిరోజ్ గాంధీ 1955 డిసెంబర్ లో పార్లమెంట్ లో లేవనెత్తారు. ఫిరోజ్ గాంధీ ఈ లావాదేవీలకు సంబంధించిన డాకుమెంట్స్ సేకరించి జనం ముందు ఉంచారు. ప్రభుత్వం వివియన్ బోస్ కమిషన్ ను వేసింది. డబ్బు తిరిగి చెల్లించడానికి దాల్మియా ఆ పేపర్ ను అల్లుడికి కుదవపెట్టక తప్పింది కాదు. నేరం నిరూపణ కావడం  తో దాల్మియాను తీహార్ జైలుకు పంపారు. వైద్యుడికి కారు బహుమతిని ఎరగా చూపి దాల్మియా బైటపడ్డాడు. తొందరలోనే జైలు నుంచి బైటపడి ఆరో భార్య సరసన చేరాడట. అయినా...అంత సుఖమైన జీవితాన్ని అనుభవించలేక పోయాడట. అలాంటి చరిత్ర కలిగిన టైమ్స్ ఇప్పుడు భారత దేశం లో ఒక ప్రముఖ పత్రికగా నడుస్తున్నది. 

ఇదీ...పాత కథ. రోజులు మారాయి కాబట్టి పద్ధతులు మారాయి. 'సాక్షి' లో ప్రవాహంలా వచ్చి చేరిన పెట్టుబడులు ఒక అద్భుతమైన కొత్త తరీఖా. ఇలాంటివి మనం ఆపలేము.  ఇంతకన్నా ఘోరమైనవి చూడబోతున్నాం. 'ఈనాడు' పెట్టుబడులు ఒక రకంగా మంచివి కావచ్చు గానీ...దాన్ని అడ్డంపెట్టుకుని ఇతర వ్యాపారాలు పెంచుకున్న వైనం అంత గొప్పగా చెప్పుకునేది కాదు. కొందరు జర్నలిస్టులను, కంట్రిబ్యూటర్లను అడ్డం పెట్టుకుని పత్రికలు దండుకుంటున్నాయి. పెయిడ్ న్యూస్ వంటి అరాచకాలు మీడియా లో చాలా ఉన్నాయి. పైకి మాత్రం అంతా నీతి సూత్రాలు వల్లిస్తారు. ఏమైనా అంతే....పత్రికా స్వేచ్ఛ అనే సొల్లు స్లోగన్తో వీధికెక్కుతారు. రూలు అందరికే ఒకటే అన్న సిద్ధాంతం మరుగున పడింది. పేపర్లలో కాలమ్స్ రాయనివ్వరని, ఛానెల్స్ లో చర్చలకు పిలవరన్న భయం తో మేథావులు సత్యం మాట్లాడరు. యథార్థ వాది...లోక విరోధి అవుతున్నాడు. సత్యం సమాధి అవుతున్నది.      

టీ.వీ.ఛానెల్స్ పచ్చి వ్యాపారం చేస్తున్నాయి. తెర మీద బొమ్మ కనిపించాలంటే అక్రమాలకు పాల్పడక తప్పదని యజమానులు వాదిస్తున్నారు. ఇప్పుడున్న ఛానెల్స్ దాదాపు అన్నీ అవినీతి, అక్రమాల పునాదుల మీద నడుస్తున్నాయన్న ఆరోపణ ఉంది. కొన్ని ఛానెల్స్ లో సీ.ఈ.ఓ.లు జర్నలిజం చేయడం లేదు. పచ్చి వ్యాపారం చేస్తున్నారు. కొందరు...యజమానుల కోసం బ్రోకర్ పనులు చేసి నెలకొక లక్షో రెండు లక్షలో సంపాదిస్తున్నారు. విధి లేక పొట్ట కూటి కోసం వస్తున్న ఆడ పిల్లలను చేరుస్తున్న, వాడుకుంటున్న చిత్తకార్తె కుక్కలు, మేక వన్నె పులులు.... ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళదే రాజ్యం. ఇలా...జర్నలిజం ఏనాడో కుల హీన మయ్యింది. కాగా ఇప్పుడు నీతి, గీతి, రీతి అన్న వ్యర్ధ ప్రసంగాలు ఎందులకు? 

అయితే...మరి పరిష్కారం ఏమిటి అన్న సందేహం తలెత్తక మానదు. సత్యమేవజయతే...ఒక్కటే నాకు కనిపిస్తున్నది. సత్యం దాని పని తాను చేసుకు పోతుంది. నీతి మాలిన జర్నలిజం చేసే వారు తప్పక శిక్షింపబడతారు. ప్రతి జర్నలిస్టు కళ్ళ ఎదుట ఇందుకు సాక్ష్యాలు కనిపిస్తాయి. వేల కోట్లు ఉండి...ఒక కొడుకు కాన్సర్ నయం చేయించుకోలేని ఒక తండ్రి, వందల కోట్లు ఉండి...బీ.పీ., షుగర్ లతో చస్తున్న యజమానులు, మనశ్శాంతి లేక నిత్యం చచ్చి బతుకుతున్న ఎడిటర్ ఇన్ చీఫ్ లు మనకు సాక్షి. సత్యం నిజంగా ప్రమాదకరమైనది, బ్రదర్స్. బీ కేర్ ఫుల్.    

7 comments:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

My take on print media in a different,lighter vein http://visakhateeraana.blogspot.in/2012/05/blog-post_26.html

Anonymous said...

so you say poetic justice goes on. :)

hussainghou said...

ok

hussainghou said...

ok

Ramu S said...

అయ్యా ప్రశాంత్ గారూ..
నా వాదన నచ్చకపోతే....దాన్ని ఖండిస్తూ రాయండి. వేస్తాను. అంతే కానీ పీ.పీ.కామెంట్స్ వ్యక్తిగతమైనవి రాసి నన్ను కెలకొద్దు. కాదూ...కూడదూ...అంటే...అడ్రస్ గానీ..ఫోన్ నంబెర్ గానీ ఇవ్వండి ..కలుసుకుని మాట్లాడుకుందాం. ఎవ్వరాలు సెటిల్ చేసుకుందాం.
సీ యు
రాము

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

రాము గారూ, మీరన్నట్లు నిజంగా సత్యమే జయం సాధిస్తూ ఉంటే ఎంత బావుంటుందో!

Ramu S said...

P.P...purely personal comments.
cheers
Ramu