Wednesday, August 15, 2012

లాభాల బాటలో లోక్ సభ టీ వీ

స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇది నిజంగా శుభవార్తే. నష్టాలు వస్తున్నాయని మొత్తుకుంటూ వివిధ టీ వీ చానెళ్లు నానా విధ పిల్లిమొగ్గలు వేస్తూ, సినిమా క్లిప్పింగుల మీద, స్త్రీ లను అసభ్యంగా చూపించడం మీద బతుకుతుండగా లోక్ సభ టీ  వీ సీరియస్ సమాచారం తో లాభాల బాటలో పయనిస్తున్నది. 2012-13 మొదటి క్వార్టర్ లో వ్యాపార ప్రకటనల అమ్మకంలో ఈ చానెల్ పదిహేను రెట్లు ఎదుగుదలను కనబరిచినట్లు సమాచారం. ఈ ఏడాది ఇరవై కోట్ల రూపాయలు ఆర్జించాలని ఈ చానెల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు 'ది  హోట్' పేర్కొంది. మొదటి మూడు మాసాలలో ఈ చానెల్ వీక్షకుల సంఖ్య మూడు వందల రెట్లు పెరిగినట్లు తెలిపింది. 


2006 నుంచి ఈ చానెల్ హిందీ, ఇంగ్లిష్ భాషలలో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది. ఇది ప్రజల సొమ్ముతో నడుస్తున్న ఛానల్. లోక్ సభ సమావేశాలు లేని సమయంలో విద్యా, సంస్కృతిక సంబంధ కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది. ఇందులో చర్చలు బాగుంటాయన్న పేరు వున్నది. లోక్ సభ సమావేశాల లైవ్ ను వివిధ భాషల చానెల్స్ వారు లోక్ సభ చానెల్ నుంచి స్వీకరిస్తుంటారు.

నిజమైన భారతీయులు చేయాల్సిన పని ఏమిటంటే...బీచులు, బ్లడ్డు, బొడ్డు మీద బతికే చానెల్స్ ను విదేశీ వస్తువులను బహిష్కరించినట్లు బహిష్కరించి ఈ రోజు నుంచి  అందరం లోక్ సభ చానెల్ ను కాసేపైనా చూడాలి. దాని రేటింగ్ బాగా పెంచాలి. జనాలకు ఉపకరించే కార్యక్రమాలను ప్రసారం చేసేలా.... మన బాధ్యతా రహిత చానెల్స్ కు బుద్ధి వచ్చేలా చేయడం దేశభక్తి గల వారి పని. జై హింద్.

7 comments:

Saahitya Abhimaani said...

ఈ చానెల్ వీక్షకుల సంఖ్య మూడు వందల రెట్లు పెరిగినట్లు తెలిపింది.

Very good news. This should be a wake up call to all those other channels calling themselves News Channels and churning out trash in between high level of ads.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

మంచి విషయం. ప్రేక్షకులు తెలివైనవారన్న విషయాన్ని, ఇతర చానల్స్ వారి డొల్ల తనాన్ని ఎత్తి చూపుతుంది.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

మరీ నల్లపూస అయిపోతున్నారు ఈ మధ్య.

lakshman said...

Any online Streaming is available for this this TV?

Ramu S said...

http://loksabhatv.nic.in/

katta jayaprakash said...

Good news and best advice.Every one is fed with the commercial Telugu channels as cinema smell is felt in every clip and the serials are polluting the family environment.

JP.

katta jayaprakash said...

Ramu garu,
you have become irregular for this blog.Any other commitments? Or not interested to write spicy stories on media?

KJP.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి