Friday, June 21, 2013

'దమ్మున్న ఛానల్'....పిచ్చి గోల...

ABN-ఆంధ్రజ్యోతి ఈ మధ్య కాలంలో రెండు అద్భుతమైన పరిశోధనాత్మక కథనాలు ప్రసారం చేసింది. ఆంధ్రా రాడియా పేరిట రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో దందా గురించి ఒక స్టింగ్ ఆపరేషన్ గగ్గోలు రేకెత్తించింది. తెలంగాణా రాష్ట్ర సమితి నేత కే చంద్ర శేఖర్ రావు కుమారుడు కే టీ ఆర్ ప్రమేయం ఉన్నట్లు చెబుతున్న ఒక భూ దందా ను 'గిదేంది రామన్నా?' అని రెండు రోజుల పాటు చూపించారు. నిజంగానే ఇలాంటి సాహసం చేసే దమ్ము ఆ ఛానెల్ కు మాత్రమే ఉంది. ఈ రెండు స్టోరీలు అద్భుతమైనవి కానీ ఈ ఛానెల్ పైత్యం వల్ల కథనాల్లో సీరియస్ నెస్ దెబ్బ తింటున్నది.  కే టీ ఆర్ విషయం చూద్దాం. 

తెలంగాణా ఉద్యమం పేరుతో అటు కొందరు విద్యార్థి నేతల నుంచి సీనియర్ లీడర్ల దాకా దండు కుంటున్నారన్న విమర్శ చాలా రోజుల నుంచి ఉంది. ఉస్మానియా యూనివెర్సిటీ లో విద్యార్థి నేతల విలాసవంతమైన జీవితాల గురించి, వారికి అందుతున్న డబ్బుల గురించి ఇంతుంటే అంత ప్రచారం జరుగుతున్నది. ఒక లాండ్ సెటిల్మెంట్ లో కే టీ ఆర్ బంటు ఒకడు ఒరిస్సా పోలీసులకు చిక్కడాన్ని ABN-ఆంధ్రజ్యోతి పెద్ద స్టోరీ గా మలిచింది. బాధిత కుటుంబాల వాళ్ళు కే టీ ఆర్ ప్రమేయం గురించి చెప్పారు. బాగానే ఉంది. ఛానెల్ కథనం అంతా....  జరిగిన అరెస్టు, ఆరోపణల ఆధారంగా సాగింది తప్ప కే టీ ఆర్ ను ఫిక్స్ చేసే పక్కా ఆధారాలు లేకుండా పోయింది. అలాంటప్పుడు ఇంత సంచలనం చేసే బదులు...ఆ యువ ఎం ఎల్ ఏ వెర్షన్ కూడా తీసుకుని కథనం ప్రసారం చేస్తే బాగుండేది. జర్నలిజం లో మౌలికమైన ఆ పని చేయకపోవడం వల్ల... దురుద్దేశం తో కథనాన్ని ప్రసారం చేసారన్న అపవాదును మోయాల్సివస్తున్నది. 

ABN-ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ మూర్ఖత్వం వల్ల జరుగుతున్నదో లేక అక్కడ బాధ్యతా రహితమైన ఎడిటర్ల వల్ల జరుగుతున్నదో కానీ... విమర్శ ఎదుర్కొంటున్న వ్యక్తి వెర్షన్ లేకుండా రోజంతా సంచలనాత్మక కథనం ప్రసారం చేయడం ఈ ఛానెల్ కు అలవాటు గా మారింది. దీనివల్ల ఏతావాతా జర్నలిజం నవ్వుల పాలవుతున్నది. చంద్రబాబు ఎప్పుడు అధికారం లోకి వస్తారా... అన్నట్లు ABN-ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ జర్నలిజం ఉంటుందన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది.  ఆ  పరిస్థితుల్లో అక్కడి ఎడిటర్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ కథనాల కోసం రాస్తున్న కాపీలు అడ్డగోలుగా ఉంటున్నాయి. 

రచయిత పైత్యాన్ని రంగరించి వీటిని రాస్తున్నారు. అందులో పదాలు దిక్కుమాలిన జర్నలిజాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మాటి మాటికీ 'దమ్మున్న ఛానెల్' అనే ప్లేట్ ఒకటి... ప్రతిదాని చివర 'ఉయ్ రిపోర్ట్... యూ డిసైడ్..' అనే మాట ఇంకొకటి. అయ్యా... కథనం పసను బట్టి జనం డిసైడ్ చేస్తారు... మీకు దమ్ముందో, దగ్గుందో. మాటి మాటికీ మీ చంకలు మీరే గుద్దుకుంటే రోత గా ఉంది. మీరు వార్తల్లో ఎడిటోరియల్ వ్యఖ్యానాలు పెట్టి జనాన్ని పిచ్చోళ్ళను చేయాలనుకుంటే ఎలా? 

ఇక ఈ వార్తలు చదివే మహాతల్లి భయంకరమైన డబ్బింగ్ ఆర్టిస్టును తలపిస్తారు. ఎద్దేవా, ఎత్తి పొడుపు, వ్యంగ్యం, విసుర్లు అన్నీ గొంతులో దట్టించి చదువుతారు. దీనివల్ల పరిశోధన సీరియస్ నెస్ చంకనాకి పోతున్నది. ఇలా రాస్తున్నానంటే దానర్థం.. కే టీ ఆర్ ను సమర్ధిస్తున్నామని కాదు. ఆయన ప్రమేయం ఉంటే ఎక్స్ పోజ్ చేసి బుక్ చేయాల్సిందే కానీ ఒక పధ్ధతి ప్రకారం ఆ పనిచేయాలి. జర్నలిజం మౌలిక సూత్రాలను గాలికి వదలడం మంచిది కాదు. ABN-ఆంధ్రజ్యోతి చేసిన తెలివి తక్కువ జర్నలిజం వల్ల ఇప్పుడు ఇది రాధాకృష్ణ కు టీ ఆర్ ఎస్ కు మధ్య పోరాటం గా మారింది. అది కరెక్ట్ కాదు.  

ఇక అక్కడి ప్రముఖ జర్నలిస్టు మూర్తి గారు రా కృ పంచన చేరి పాడైపోయారని అనిపిస్తున్నది. ఒకప్పుడు సంసార పక్షమైన జర్నలిస్టు అనిపించే వాడాయన. ఇప్పుడు కథనాన్ని రక్తి కట్టించడానికి, కథనంలో పాత్రల మధ్య చిచ్చు పెట్టడానికి, వీలయితే వాళ్ళను స్టూడియో లకు రప్పించడానికి ప్రశ్నలు అడుగుతున్నారు. మిత్రమా... పొలిటికల్, బిజినెస్  ఎజండా తో పనిచేసే యజమానులకు మీ లాంటి సిన్సియర్ జర్నలిస్టులు కనువిప్పు కలిగించాలి తప్ప వారి ఎజండా ను మోయడం, వారిని సంతృప్తి కలిగించేందుకు కార్యక్రమాలు నడపడం జర్నలిజానికి మంచిది కాదు. Report as a journalist and let people decide.   

17 comments:

Anonymous said...

ఇందులో మూర్ఖత్వం ఏమి లేదు .. ^ సామాజిక ^ బాధ్యతగానే రాస్తున్నారు .. తమ సామాజిక వర్గం నాయకుడు తిరిగి సియం కావడానికి సీమంద్రలో జగన్, తెలంగాణలో trs అడ్డుగా ఉంది .. ఆ అడ్డు తొలగించదమే సామాజిక బాధ్యత

చదువరి said...

"ఇక ఈ వార్తలు చదివే మహాతల్లి భయంకరమైన డబ్బింగ్ ఆర్టిస్టును తలపిస్తారు. ఎద్దేవా, ఎత్తి పొడుపు, వ్యంగ్యం, విసుర్లు అన్నీ గొంతులో దట్టించి చదువుతారు." - మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. "లక్ష్మీ గణపతి ఫిలిమ్స్.." దీనికన్నా నయం!

వినటానికి చిరాగ్గా, అసహ్యంగా, ఇకారంగా ఉంటై ఆ నెరేషన్లు. ఇదొక్కటే కాదండి, ఆ చానల్లో వచ్చే కార్యక్రమాలు మరికొన్నింటిలో కూడా ఈ ధోరణి చూసాన్నేను. వీకెండ్ కామెంటనుకుంటా.. అందులో కూడా అంతే. జిల్లాల వారీగా రాజకీయాలు ఎలా ఉన్నాయో చెబుతూ ఉంటారు, అందులోనూ అదో రకమైన మాడ్యులేషను వాడతారు. ఎకిలిగా, లేకిగా, వంకరగా ఉంటదా మాడ్యులేషను.

దమ్ముందో లేదోగానీ, మర్యాద, పద్ధతి, అణకువ అనేవి లేనే లేవసలు వాళ్లకు.

Unknown said...

me samajaka nayam chiru wadu ala no matti kottuku poyadu...eppudu jagan telangana lo kcr suport chesthunnaru meru me blog.........abn wadu lanidi ami chupaledu kadi...adi nijam ga jariginde kada adi jaraga ledu ante court lo dava vesuko wachu ani cheppadu ball gudii...kidnap avvadam arrest avvadam nijam kcr suport cheyadam nijam...nijam kadu ani meru nirupinchandi appudu thittandi abn ni......abn dhammu unna channel nerupinchukundi....live lo kuda wachi matladincharu....

shayi said...

RAM BABU GARU!
EM MATLADUTUNNAARU MEERU?
REPU PODDUNA EVADO OKADU VACCHI - "RAM BABU PACCHI DONGA .. MUNDALA ..." ANTADU. "NIJAM KAKAPOTE COURT LO DAWA VESUKOVACCU ... NIJAM KADANI NIROOPINCHUKONDI .." ANNADANUKONDI. MEERU OPPUKONTARA? AA ANNA VADU DAMMUNNA VADENA? DHAIRYAMGA ANNADUGA!

thanooj said...

right news gurinci pakkana medithey aa melodrama voice tho narrate ceyadam maneyymansthey bavunntundemo.abn channel dammunadhey kanee aa vishyam vallu dabba kottukuntuntey vintaniki ebbettuga untundi.

good post

Kavanoor Dayalan said...

ఈ పోస్టు చూసిన తరువాత నాకు ఇప్పుడు భోధపడింది చిన్న పల్లెటూరులో ప్రజల ఎవరైన ఏదైనా పిర్యాదు చేస్తే ఎందుకు అధికారులు స్పందించరో, ఎందుకంటే గ్రామ భాష వేరుగా ఉంటుంది,నిజాయితిగ నిజాన్ని చెబుతారు. కాని అధికారులు ఏమో పాలిష్డ్ భాష మాట్లాడతారు. వీరికి మర్యాద, పద్ధతి, అణకువ అనేది చాలా ముఖ్యం అసలు విషయం వీరికి అవసరం లేదు.

కాక పొతే ఏమిటండి ఒక ఛానల్ లో వచ్చిన కతనం లో నిజం ఎంతో దాని పై విమర్శ చెయ్యాలి గాని, సదరు ఛానల్ వారు ఏవిదంగ మాట్లాడారు, ఎక్కడ కామా పెట్టారు ఎక్కడ పులిస్టాప్ పెట్టారు, ఏ డ్రస్ వేసుకొన్నారు దగ్గారా తుమ్మారా అని విమర్శించడం మీకు సరే అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్న.

మొన్న డెక్కన్ క్రానికల్ లో జరిగిన అవకతవకల గురించి మీరు ఎందుకు ఒక టపా వ్రాయలేదని ఒకరు వేసిన ప్రశ్నకు మీరు ఇచ్చిన జవాబు టైమ్స్ వాళ్ళు వ్రాసారుగా అందుకే వ్రాయలేదు అన్నారు,

ఇక రెడ్డి వారి ఛానల్ లోకి వచ్చిన ఆరోపిత అవనీత పెట్టుబడుల గురించి దేశం లోనే అత్యున్నత న్యాయస్తానం లో జరుగుతున్న విచారణల గురించి ఎందుకు వ్రాయలేదు? అని ప్రశ్న ఎవ్వరైనా వేస్తె మీరు ఇలాంటి రెడిమేడ్ జావాబులె ఇస్తారా!ఈనాడు వారు వ్రాస్తున్నారు కదా! అంటారా.

మీకు తెలియదనికాదు యుటూబ్ లో తెలుగు ఛానల్
సబ్స్క్రైబ్ చేసుకొన్న వివరాలు

ETV-55740
ABN-48,330
TV5-11638
NTV-1770
TV9-1492

Anonymous said...

ఇంతకీ బాబు గెలవాలి కాబట్టే....ఇలాంటి కధనాలు ప్రసారమవుతున్నాయా?వాళ్ళని ఇరుకున పెట్టటానికి?అసలు ఇలాంటి దందాలను పట్టించుకో నక్కరలేదంటారా?ఇవన్నీ రొటీన్ కాబట్టి అసలు అవి ప్రసారమే చేయనక్కరలేదంటారా??
ఘంటసాల గారితో చెప్పించాలా వాయిశ్ ఓవర్?లేక గీత పాడినట్టు శ్లోకాలు రాయించాలా?
అయ్యా ..ఎదో ఒకటి ఈ దరిద్ర నీచ నాయకులు కొంచమయినా భయపడనీయండి...మహా ప్రభో...

thanooj said...

dayalan gaaru

palletooru valla complaints nu pattinchukokapovadaaniki kaaranam valla bhshantaru .mee avagaahana anthena?bhasha prathipadika meeda saili meeda gouravam tho nagarallo complaints teesukunataru ani cheptaraa?


satyam annitiki athheetham kanee daaniki melo drama jatha chesthey adi mee vykathigatha prathibha gurinchi chestunna aarbhatam la kanipistundi kanee satyanni kaapade prayatnam la undadhu.edimaina satyanni edusthu cheppina navvuthu cheppina chiragga cheppina vanukuthu cheppina vetakaaramga cheppina daani viluvanu kadani evaru cheppagalaru

Mee Abhimani said...

Ee Ramu lanti medhavulu anukune vallaki, Eenadu, AJ manchi rasina thappe anipistundi. JD Laxminarayana samajika vargam Kamma ayyunte, Ramu lanti medhavulu, bahirangam gane Jagan and co ki open gane support chesi undevallu.

Sakshi lo entha junk rasina, ee site lo commenting undadu. RK ki polishness leka povachchu, kani adagali anukunnadi dhairyam ga aduguthadu. Nijam ga dammunna channele, ABN.

asha said...

"ఇలా రాస్తున్నానంటే దానర్థం.. కే టీ ఆర్ ను సమర్ధిస్తున్నామని కాదు."
ఆఖరికి ఇంత విమర్శలో ఇలాంటి డిస్క్లైమర్‌లు పెట్టుకోవాల్సి వస్తుంది. మనవాళ్ళ తర్కం అలా ఉంటుంది. దేనిగురించైనా వ్యతిరేకంగా మాట్లాడితే చాలు దానిపైన కుట్రపూరితంగా మాట్లాడుతున్నాం అంటారు.

ఇంక అసలు విషయానికి వస్తే సదరు సుభాష్ అగర్వాల్ మాట్లాడినంతవరకూ నాక్కూడా కొంచెం నిరాధారంగానే ప్రసారం చేసినట్లనిపించింది. అంటే అనుచరుడి దందాలు గురించి తెలీదు అని చెప్పడం మామూలుగా నమ్మశక్యంగా లేకపోయినా చట్టపరంగా తిరుగులేకుందా నమ్మశక్యమే. ఈ ఒక్క ఆధారంతో వాళ్ళ కధనాన్ని సమర్ధించుకోవాలంటే బహుశా ఆ అనుచరుడు కొంతకాలంగా ఈ దందాలు చేస్తూ ఉన్నట్లు నిరూపించబడాలి అనుకున్నాను.

కానీ అనుచరుడి సోదరుడి కధనమూ, బాధితుల కధనాలూ ఏబీయెన్ ప్రసారానికి బలం చేకూరుస్తున్నాయి. ఇంక వీకెండ్ కామెంట్‌లో కేటీయార్ ఈ వ్యవహారం గురించి ఉప్పందగానే ఆ ప్రసారం నిలిపేయాలని అర్ధించినట్లు, పలువురితో లోపాయికారీ మాట్లాడించినట్లు చెప్పారు. బహుశా అందుకే కేటీయార్ వెర్షన్ లేదేమో. అటువంటి పక్షంలో ఆ మాట ముందే చెప్పాలి.

వాళ్ళు వాడే భాష గురించి మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. నాటకీయతపైన పెట్టిన శ్రద్ధ భాషపైన పెట్టదావిడ. రిదం, ఇంటోనేషన్ పూర్తిగా దెబ్బతింటాయి. అయీనా ఆర్కే జర్నలిజమే వేరేగా ఉంటుందిలెండి. ఆయనకలా సాగిపోతుంది. చూద్దాం. ఎప్పుడైనా మారాలనిపిస్తుందేమో.

naresh2k5 said...

దీనిపైనే నిన్న TV9 ఒక కథనం ప్రసారం చేసింది . దాంట్లో ఆ అగర్వాల్ అనే వ్యక్తి KTR అనే వ్యక్తి నాకు తెలియదు అని చాల స్పష్టంగా చెప్పడమే కాదు, నాకు kTR దగ్గరినుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని కూడా చెప్పడు. ఇక TV9 ఇంకొక ముందడుగు వేసి జైల్లో ఉన్న సతీష్ రెడ్డి ని కూడా కలిసింది . అతను కూడా KTR కి ఎం సంబంధం లేదనే చెప్పాడని tv9 రిపోర్టర్ చెప్పాడు. ఈ పెద్ద కేసు లో అతి పెద్ద నిందితుడు మొదటి నిందితుడు అయిన శ్రీనివాస రావు ని ముందుకు తెచ్చి , ఎలాంటి ముందు జాగ్రత్త లేకుండా ఆంధ్రజ్యోతి నాలుక కరుచుకుంది. ఆ శ్రీనివాసరావు తన కూతుళ్ళతో ఆడిన కిడ్నాప్ డ్రామా ను ఇప్పుడు పక్కన పెట్టేసింది. దాన్ని ముందు హై లేట్ చేసిన ఆంధ్రజ్యోతికి శ్రీనివాసరావు అసలు సంగతి తెలిసే సరికి రా కృ బొక్క బోర్ల పడ్డాడు.

Kavanoor Dayalan said...

తనూజ్ గారు! మీకున్న అవగాహనకు నా జోహారులు!
ఇలా మీకు తోచిన విధంగా సబ్జెక్టు తొ సంభంధం లేకుండా వ్యాఖ్యానం వ్రాయండి మీ బ్లాగును ఎక్కువ మంది చూస్తారు.

మిగతా వారికి!
ఈ నా జవాబు లో కూడా వెతకండి ఏదైనా కామా, లేదా ఒత్తులు,ధీర్ఘాలూ లో తప్పులు ఉండవచ్చు.

Unknown said...

ఈనాడు చేసే మంచి పనిని సైతం ఉదాహరణకు ప్రమోషన్లను కూడా హేళన చేసే శ్రీమాన్ రాము గారు, సాక్షిలో నాలుగు సంవత్సరాలుగా జీతాలు పెరగక పోయిన స్పందించరు గాక స్పందించరు. కేవలం ఒక సామజిక వర్గాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించే బహు గొప్ప వారు ఈబ్లాగు నిర్వాహకులు.

Sudhakar said...

చదివే మాతల్లి గురించి చాల కరక్టుగా చెప్పారు. ఆమె వికారపు వ్యంగం తట్టుకోలేక ఆ చానెల్ చూడటం మానేసాం.

Thulasi Chandu said...

రాము గారు... మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పత్రికలు, న్యూస్ ఛానళ్లలో ఎవరైనా ఏబీఎన్ చేసినన్ని సాహసోపేత కథనాలు చేశారా.. ? ఎన్ని బెదిరింపులొచ్చినా.. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ధైర్యంగా కథనాలను ప్రసారం చేస్తున్నది ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ ఛానల్ కాదంటారా..? ఎన్డీ తివారీ రాసలీలల గుట్టు రట్టు చేసింది ఏబీఎన్ కాదా.. ఇప్పుడు ఏపీపీఎస్సీ అక్రమాలపుట్టను బద్ధలు కొట్టింది కూడా ఏబీఎన్ కదా.. ఇలాంటి సంచలనాలు చేసినప్పుడు వారి బ్రాండ్ అయిన దమ్మున్న ఛానల్ అనే టాగ్ లైన్ను ప్రచారం చేసుకోవడం ఎలా తప్పవుతుంది. దీని వల్ల జనానికి వచ్చే నష్టమేమానా ఉందా.. ?
ఇకపోతే మరొకవిషయం.. ఛానల్లోని వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ చదివే తీరును మీరు హేళనచేశారు. ఎక్స్ ప్రెసివ్ గా చదవకుండా న్యూస్ పేపర్ చదివినట్లు చదవమని మీరు సలహా ఇస్తున్నారా.. ? చెప్పే విషయంలోని తీవ్రత తెలియజేసేందుకు ఎత్తిపొడుపులు, దీర్ఘాలు తప్పవు. దాన్ని ఓ స్టైల్ గా మీరెందుకు భావించడం లేదు. అదో ఇలాగే చదవాలని ఎక్కడా లేదు కదా. మీరు గొప్పగా విశ్లేషిస్తారేమో అనుకున్నా. అంతేగానీ.. అంతపెద్ద కథనాలను దమ్మూ ధైర్యంతో బయటపెట్టిన ఛానల్ను చులకన చేశారు. ఏబీఎన్ చేసిన సాహసాన్ని మరో ఛానల్ లేదా పత్రిక చెయ్యగలదని మీరు చెప్పగలరా.. ఈనాడు లాంటి పెద్ద పత్రికే తెలంగాణకుగానీ, తెలంగాణ వాదులకు గానీ ఒక్క వార్త వ్యతిరేకంగా రాయాలన్నా భయపడుతోంది. గత రెండు సంవత్సరాలుగా పత్రికలో వార్తలు వస్తున్న తీరు చూస్తే మీకు అర్థమౌతుంది. అలా ఎందుకు రాయదో మీకు తెలియని విషయం కాదు. కానీ.. ఆంధ్రజ్యోతిగానీ, ఏబీఎన్ గానీ ఆ పని ఎందుకు చేస్తున్నాయంటే.. వీటి యజమాని రాధాకృష్ణకు దమ్ము, ధైర్యం ఉన్నాయి కాబట్టే. ఆయన
మరి ఈ విషయాన్ని ఆ ఛానల్లో పదే పదే చెప్పడం వల్ల జనానికి వచ్చే నష్టం ఏమైనా ఉందా.. అంతెందుకు ప్రతి ఛానల్ కూడా వారి వారి గొప్పతనాన్ని చెప్పుకుంటూనే ఉన్నాయి. కాకపోతే ఏబీఎన్ లో ఎక్కువ సంచలనాత్మక కథనాలొస్తాయి కాబట్టి వారు దమ్మున్న ఛానల్ అనే ప్లేట్ వేస్తున్నారు. అదేదో మహా నేరమైనట్లు.. అలా వేస్తున్నారు కాబట్టి ఎవరూ ఆ ఛానల్ చూసేందుకు ఇష్టపడరనీ మీరు ప్రచారం చెయ్యడం ఎందుకు..? అయినా చివరిలో వి రిపోర్ట్ యు డిసైడ్ అంటూ చివర్లో మీలాంటి జనానికే వదిలిపెడుతున్నారు కదా..? మరి పైన స్పందించిన వారికంతా ఎందుకంత కడుపునొప్పి.. అవినీతి వార్తల్ని రాజకీయ నాయకులకు అమ్ముకుంటున్న చానళ్లను మీరు బ్లాగులో దుమ్ము దులపండి. అంతేగానీ.. దమ్ముతో వార్తలు బయటపెట్టేవారిని కించపరిచి.. జర్నలిస్టుగా మీకు దమ్మూ ధైర్యం లేవని నిరూపించుకోకండి.

Ramu S said...

తులసి చందు గారూ...
మీ వ్యాఖ్య నాకు బాగా నచ్చింది. చక్కగా రాసారు. మీరు కచ్చితంగా జర్నలిస్టు అయి వుంటారు. ABN కచ్చితంగా దమ్మున్న ఛానెల్... నేను కాదనడం లేదు. మంచి కథనాలను ఓవర్ గా డ్రమటైజ్ చేయడం వల్ల సీరియస్ నెస్ దెబ్బతిని అనుకున్న ప్రయోజనం నెరవేరదని నా అభిప్రాయం.
ఇతర చానెల్స్ గురించి సమాచారం ఇవ్వండి. తప్పకుండా రాస్తాను. నాకు రాగ ద్వేషాలు లేవు. నిజానికి.... నేను మాటి మాటికీ చెప్పుకోను గానీ ఇది కూడా 'దమ్మున్న బ్లాగ్.'
గుడ్ లక్
రాము

Unknown said...

ఏబీఎన్‌ దమ్మున్న ఛానల్‌ అని చెప్పుకోవడం చంకలు గుద్దుకోవడమే ఐతే... టీన్యూన్‌ నంబర్ వన్‌ న్యూస్‌ ఛానల్‌ ఇన్‌ తెలంగాణ అని చెప్పుకోవడాన్ని ఏమనాలి..? తొడలు చరవడం అని చెప్పుకోవాలా..?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి