Monday, July 15, 2013

చాగంటిపై వివాదానికి TV-9 ప్రయత్నం

అద్భుతమైన ప్రవచనాలతో మానవ ధర్మాన్ని ప్రచారం చేస్తున్న చాగంటి కోటేశ్వర రావు గారి మీద టీవీ నైన్ ఛానల్ కన్నుపడింది. ఆయన్ను గబ్బు పట్టించే కార్యక్రమానికి ఈ సాయంత్రం ఈ ఛానెల్ "పారాయణం లో పిడికల వేట" అనే లైవ్ షో ద్వారా శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం నడిపిన విధానం చూస్తే ఒక కుట్ర, దురుద్దేశం దీని వెనుక ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతుంది. సాయి బాబా భక్తులను రెచ్చగొట్టి ఒక రెండు రోజుల పాటు హడావుడి చేయాలన్న కుత్సితం ఇందులో ఉంది. ఇది దిక్కుమాలిన జర్నలిజమ్.  

తుచ్ఛమైన కోరికలతో పారాయణం చేయకండి... అని చాగంటి గారు చెప్పిన మాటను పట్టుకుని బుర్ర తక్కువగా ఈ ప్రోగ్రాం నడిపారు. సాయిబాబా తత్వాన్ని అర్థం చేసుకోండని ఆయన అనడం తప్పు ఎలా అవుతుంది? ఒక వ్యక్తిని స్టూడియో లో కూర్చోబెట్టుకుని రచ్చ చేయాలనుకోవడం దారుణం. తనతో చాలా మంది మాట్లాడి బాధను తెలిపారని ఆయన గారు అనడం, ఆ వివాదం కోసం పాకులాడడం దౌర్భాగ్యం.  

మానవ విలువలు నిర్వీర్యమై పోతున్న సమయంలో చాగంటి ప్రవచనాలను స్వాగతించాల్సింది పోయి చాగంటి పై బురద చల్లాలనుకోవడం టీవీ నైన్ బృందం చేసిన పాపం. 

13 comments:

JE said...

పడకపోతే న్యూస్ ..పదిథె న్యూస్ ఏముంది వాళ్ళ నిజమే అంత .. ఎవరినైనా
ఏమైనా చేయగలం అనుకున్తరు. ఇప్పుడు మీ బ్లాగ్ గురిచి కూడా ఏదోకటి ఎప్పుడో అప్పుడు
పడతారు చుడండి

Blogger said...

TV9మరీ ఇంతకు దిగజారడం ధారుణం.. మతాన్ని మత విశ్వాసాలను తరచూ అభాసుపాలు చేస్తున్న TV9పై చర్య తీసుకోవాలి..

శ్యామలీయం said...

తాయిలాలిచ్చి వరాలు కొనుక్కోవాలనుకునే మందబుధ్ధులకు చాగంటి వారి వంటి పెద్దల మందలింపులు బాధకలిగిస్తాయంటే ఆశ్చర్యం లేదు. అటువంటీ బేరసారాల భక్తులలో వేయింట ఒకరికైనా కనువిప్పు కలిగితే మంచిదే. మిగతావారు తమ ఆధ్యాత్మికమైన పురోగతిమీద తమకే అవగాహన గురీ లేనివారు. వారి గురించి వారికే లేని నిజమైన పట్టింపు మనకేల?

ఇక TV9 ఛానెళ్ళవాళ్ళకు కావలసింది ప్రచారం. అది ఎలా వచ్చినా సరే వారికి పట్టింపు లేదు. జనతిరస్కరణ మాత్రమే వారికి తగిన శిక్ష.

astrojoyd said...

పోగాలము దాపురించిన మూర్ఘులు వినరు..కనరూ..వూర్కొనరు అని విష్ణుశర్మ గారు ఏనాడోచేప్పారు కదండీ..విపరీతకాలం వచ్చినపుడు ఇలాంటి విపరీతపు పెదబుద్ధ్హులే పుడతాయి మరి..వారి చావు వారికే వదలండి.

durgeswara said...

ఈ ఊపులో ఈసమయంలోనే వాల్లు [భగవంతుని మాయతోనైనా]ఇతరమతం గూర్చి వాగితే బాగుండు . జ్ఞానంతో పాటు ఒకేసారి వీరికి కపాల మోక్షం కూడా ప్రాప్తిస్తుంది

Truely said...
This comment has been removed by the author.
Truely said...

భగవంతుడు తనని నిదించిన, ఎన్ని తప్పలు చేసినా క్షమిస్తాడు కాని భగవత్ భక్తులని బాధ పెట్టినప్పుడు క్షమించడని మన చరిత్ర పురాణాలూ చెప్తున్నాయి. నేటి సమాజం లో పడిపోతున్న మానవతా విలువలను తెలియచేస్తూ, మన సనాతనా ధర్మం యెక్క గొప్పతనాని వివరిస్తూ సమాజ మార్పు కోసం ని స్వార్ధం గా శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ప్రవచనం చేస్తూవుంటే అది విన్న సామాన్య పౌరుడు సైతం చేతన్యాన్ని పొందుతుంటే దానిని ప్రశంసించటం పోయి ఆ భగవత్ భక్తుడని బాధ పెట్టటం చెప్పనలవి కానంత .....

Saahitya Abhimaani said...

చాగంటి వారి ప్రవచనాలను చూసినంతమంది తమ దిక్కుమాలిన చానెల్ ను చూడటం లేదన్న ఏడుపు వల్ల ఈ పని చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇవ్వాళ టి వి న్యూస్ చానెళ్ళన్నీ కూడా జర్నలిజం అనే మాటను భ్రష్టుపట్టిస్తున్నాయి. డబ్బులు వస్తున్నాయి కాబట్టి అందులో పనిచెసే "ఉద్యోగులు" కిమ్మనకుండా చెప్పింది చేస్తున్నారు. ఇలా తలా తోకా లేని కార్యక్రమాలు చెయ్యటమా మీడియా అంటె, ఇకా మరేదో భ్రమలో ఉన్నాము మరి!

Hemu's said...

I am always surprised to see TV9 as no1 in AP ... does that mean telugu people like controversies and unethical journalisam stories that TV9 cook.

Unknown said...

Evarunundi emi aasichunkunda samajamu lo manava sambandalu penchi anduru eham lonu paralokam lo kuda bagudali ani korukene manchi manishi pl abhandalu veyadam ekkade tv9 variki chellindi
Journalism ante eduti vykula manbhavalunu kinchaparachi avamanichadam kadu ani andaru telusukovali

artcomsekhar said...

నేను టీవీ-9 రవి ప్రకాష్ గారిపై దాడి జరిగిన నేపథ్యంలో పేస్ బుక్ లో ఒక Pic తయారు చేసిపెట్టా ! అందులో - దాడి చేసిన వ్యక్తి రవి ప్రకాష్ గారు కాళ్ళు పట్టుకోవడం ఫోటో కూడా పెట్టి, నా అభిప్రాయాన్ని పెట్టి, కామెంట్స్ అడిగా ! ( ఆ ఫోటోలో రవిప్రకాష్ గారి బాడి లాంగ్వేజ్ అవమాన పరిచేటట్టు, దాడి చేసిన వాడితో బెదిరించి కాళ్ళు పట్టించుకున్నట్లు ఉంది. నా ఉద్దేశంలో మన సంస్కృతిలో ఎవరైనా కాళ్ళను పట్టుకుంటే తిరస్కరించే విధంగా ప్రవర్తిస్తారు. కానీ మీడియా అధినేత, మీడియా ద్వారా నీతులు వల్లించే ఉన్నతమైన వ్యక్తి సంస్కార హీనంగా ప్రవర్తించారని నా భావం) .... ఫేక్ బుక్ లో నేను పెట్టిన Pic కు విపరీతమైన స్పందన వచ్చింది. ఒకిటిన్నర రోజులోనే 230 Shares అయి, కామెంట్స్ కూడా విపరీతంగా (99% బూతులే) వచ్చాయ్. దాన్ని సదరు టీవీ-9 రవి ప్రకాష్ & కో. తట్టుకోలేక పోయారు. వెంటనే పేస్ బుక్ వారికి అభ్యంతరం చేసి నా అనుమతి లేకుండా తీసి వేయించారు. అంతేగాక నా మెయిల్ కు '' వార్నింగ్ '' మెసేజ్ కూడా పంపారు .... అది ఏమంటే ....
We have removed or disabled access to the following content that you have posted on Facebook because we received a notice from a third party that the content infringes their copyright(s):

Photo from Album: "Timeline Photos", "Please Comment !", uploaded on May 22nd, 10:51am PDT

Facebook is not in a position to adjudicate disputes between third parties. If you believe that this content should not have been removed from Facebook, you can contact the complaining party directly to resolve your issue:

Notice #: 338523166276265

Contact Information
Name: Suresh Suthari
Email: legalnotice@tv9.net

shyama krishna said...

ఫోన్లో పెద్దవాల్లు చెప్పినదానికి అడిగినదానికి మొహంల రక్తం చుక్కలేదు ఆ గెస్టుకి ఛానెల్ వాల్లకి. గురువుగారి ప్రవచనములు విన్నాంక సాయి భక్తులందరూ గడబిడ పారాయణలు మాని నియమంతో ఎంతో పద్ధతిగా పారాయణ చేస్తూ ఉన్నారు ఇంతకు ముందు ఈ విశ్వ చైతన్య అందరి ఇళ్లలోకి వెళ్ళి పూజలనీ, వ్రతం అనీ ఒక్కరోజులో పారాయణ అనేది చేసేవాడు ఇప్పుడు దీనివల్ల ఆయనని ఎవరు ఒకరోజులో పారాయణకి పిలుస్తలేరు. సరిగ్గా పారాయణ చేసి ఇంకా మంచిగా సాయిబాబాను కొలుస్తున్నారు. అందుకు ఈయన కుళ్ళు. ఇంక TV9 ఎట్లాగు రెడీగ ఉంటది కదా అది ఎప్పుడూ మనకి opposite గానే వేరే మతం వాల్లకి సపోర్ట్ చేస్తది. మొహంలో బొట్టుకూడ లేకుండ సాయి బాబా మీద చర్చకొచ్చింది ఆమె ఈయనకి ఆమె సపోర్ట్ ఆమెకి ఈయన సపోర్ట్. చిన్న పెద్ద లేకుండా ఇంటిపేరు పెట్టి పిలుస్తుంది. అందరు బాబా భక్తులు గురువుగారి పూర్తి ప్రవచనం వినండి వీల్లు చెప్పినట్లు one liners కాదు... మీకే అర్థం అవుతుంది.... వీల్లు రాజకీయ నాయకుల statementsని కట్ చేసి చూపించినట్లు ట్రై చేసినారు. ఏదో కుట్ర చేసి D-Fame చేద్దామని ట్రై జేసి బొక్క బొర్ల పడ్డారు.

Vasu said...

ఇది దిక్కుమాలిన జర్నలిజమ్.

Very true.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి