తప్పు జరిగినప్పుడు ఇది తప్పని ఠక్కున చెప్పినవాడే నికార్సైన నీతిమంతుడు, దమ్మున్న మొనగాడు. అట్లాకాకుండా... తప్పులో భాగస్వామి అయి బాగా లాభపడి పట్టుపడ్డాక తప్పుకు వేరే వాళ్ళను బాధ్యులను చేస్తూ తోడు దొంగలపై గగ్గోలు పెట్టేవాడ్ని ఏమనాలి?
టీవీ 9 ఏర్పాటు సమయంలో మారిషస్ నుంచి ఫెమా నిబంధనలకు విరుద్ధంగా రూ. 60 కోట్ల నిధులు వచ్చాయని.. ప్రస్తుతం టీవీ 9లో వాటాను విక్రయించిన సందర్భంలో కూడా హవాలా మార్గాల్లోనే నిధులు తరలించారని ఆ ఛానెల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ చేసినట్లు వస్తున్న ఆరోపణలు దిగ్భ్రమ కలిగిస్తున్నాయి.

దురుద్దేశాలతో ప్రభుత్వం తనను వెంటాడుతోందని వాదిస్తూ... అప్పట్లో కశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులను తరలించే మార్గాల్లో ఈ నిధులను తరలించారంటూ అయన చెబుతున్నారట.
ఈ ఘోరాలపైన దర్యాప్తు చేయాలని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లకు తాను ఇటీవల ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం తనను వెంటాడుతోందన్నది అయన అభియోగం. అప్పుడుఅంత ఘోరం జరిగితే...ఇంతపెద్ద తురం ఖాన్ జర్నలిస్టు ఎందుకు కిమ్మనకుండా కూర్చునట్టో బోధపడడంలేదు!
ఇదంతా పిచ్చి, డొల్ల వాదన. ఇప్పుడు ఈ ప్రకటన చేయడం ద్వారా రవిప్రకాశ్ తాను జర్నలిజం మౌలిక సూత్రాన్ని (సత్యాన్ని దాచుకోకుండా అందరికీచెప్పడం) తుంగలో తొక్కినట్లు ప్రపంచానికి చాటినట్లు అయ్యింది.
నిజంగా రవిప్రకాశ్ ఇట్లా అన్నారో లేదో రూఢి కాలేదు కానీ, ఇదే నిజమైతే ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు!
0 comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి