లక్డి-క-పూల్ లోని హనీ పాట్ సెంటర్ లో నిర్వహించిన ఈ సమావేశంలో దాదాపు డెబ్భై మంది హాజరు కావడంతో నిర్వాహకులు మూడు వేర్వేరు గదుల్లో మీటింగ్స్ నిర్వహించాల్సి వచ్చింది.
"మేము పడిన శ్రమ నెరవేరింది. చాలా మంది రావడం ఆనందం కలిగించింది. కొడవటిగంటి కుటుంబరావు గారి కుమార్తె శాంత సుందరి కూడా వచ్చారు," అని నిర్వాహకులలో ఒకరైన బీ.సుజాత గారు చెప్పారు.
'ఈనాడు' సిటీ ఎడిషన్‌లో నిన్న వచ్చిన వార్త, ఈ రోజు ఎంగేజ్మెంట్ కాలంలో వచ్చిన ప్రకటన బాగా ఉపయోగపడ్డాయని ఆమె తెలిపారు.
e-తెలుగు పక్షాన శిరీష్ కుమార్ తుమ్మల (చదువరి), వీవెన్, సుజాత, సతీష్ యనమండ్ర, సత్యప్రసాద్ అరిపిరాల, రవిచంద్ర ఇనగంటి, శ్రీనివాస రాజు దాట్ల, శ్రీనివాస కుమార్ రచయితల అనుమానాలు తీర్చే ప్రయత్నం చేశారు. ఎవరిస్తారండీ...ఈ-జ్ఞానం (సీ.డీ), మిత్రత్వం, చల్లని కూల్ డ్రింక్ నవ్వుతూ...ఉచితంగా!?
నేను జాన్ హైడ్ గారిని మాత్రం మిస్ అయ్యాను. మహేష్ కుమార్ కత్తి వంటి వారిని కలవడం ఆనందం కలిగించింది. నాకు తెలిసిన జర్నలిస్టు మిత్రులు కలవడం, ఈ బ్లాగ్ గురించి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించాయి. ఈ సతీష్ గారితో కలిసి కాసేపు బైటకు వెళ్ళడం వల్ల నేను...ఈ సమావేశం ఉపయోగం పై రచయితల వెర్షన్ తీసుకోలేకపోయాను.
శిరీష్ కుమార్ అంజర్జాలంలో తెలుగులో వస్తున్న మార్పులు, తెలుగు వికీ పిడియ గురించి మాట్లాడగా... వీవెన్ తెలుగు సాఫ్ట్ వేర్లు, ఫాంట్లు, ఉపకరణాలు మొదలైన సాంకేతిక అంశాల గురించి వివరించారు. బ్లాగు ఎలా తయారు చేసుకోవాలి, దానివల్ల ప్రయోజనాలు ఏమిటి?...అన్న అంశాన్ని సత్యప్రసాద్ వివరించారు. రవిచంద్ర, శ్రీనివాస రాజు బ్లాగెలా తయారు చేసుకోవాలో ప్రత్యక్షంగా చూపించారు.
సమావేశానికి హాజరయిన వారిలో చాలా మంది ఆసక్తిగా తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.
నిర్వాహకులు అందించిన జాబితా ప్రకారం...సదస్సుకు హాజరైన ప్రముఖ రచయితలు/త్రులు....శాంతసుందరి (
"ఇంకా ఎవరైనా ప్రముఖులున్నారేమో, అందర్నీ ప్రత్యక్షంగా కలవడం కుదరలేదు. అంతే కాక, యువభారతి, వికాస ధాత్రి వంటి సాహితీ సంస్థల సభ్యులు కూడా వచ్చారు," అని నిర్వాహకులు తెలిపారు.
జర్నలిస్టుల కోసం నిర్వహించిన సమావేశం కంటే ఎక్కువమంది జర్నలిస్టులు ఈ రచయితల సదస్సుకు హాజరు కావడం విశేషం! ఆ మధ్యన జర్నలిస్టుల కోసం నిర్వహించిన సమావేశానికి పట్టుమని పది మందైనా రాలేదు.
Photo courtesy: Sujatha
18 comments:
Congrats to eTelugu team!
ఈ- తెలుగు రచయితల సమావేశానికి నేను హాజరయ్యాను. సంఘ నిర్వహణ, బోధన తదితర విషయాల్లో నిర్వాహకుల్లో సరయిన అవగాహన లేనట్లు అనిపించింది. అయితే నిజాయితీకి లోటు లేదు. అందులోనూ ముదురు రచయితలాయే. తెలుగు చచ్చిపోతోందంటూ తెగ తెగ ఆంగ్లంలో వాపోయిన ఆంగ్ల దొరలకు అక్కడ కొరవ లేదు. నావరకు నాకు అంతగా ఈ సమావేసం వుపకరించలేదు. ప్రాధమిక సమాచారం ఎక్కడ దొరుకుతుందో తెలిపి, దానిని చదువుకొని సమావేశానికి రమ్మంటే బాగుండేది. నేరుగా బ్లాగు రూపకల్పన, టైపు, టపా నేర్పిస్తే కొంత ఫలితం దక్కవచ్చేమో. నిర్వాహకులు పరిశీలించాలి. నాకు బ్లాగ్ వుంది. ఇంగ్లీష్ టైపు రాదు. యాపిల్ కీబోర్డ్ పై అనుతో వేగంగా తెలుగు మాత్రమే వచ్చు. తపా యెలాగో తెలియటం లేదు. యెవరన్నా సాయం చేస్తారా.????
నన్నార్లు (శిబిరంలో నేర్చుకున్నాను)
వెంకట సుబ్బారావు కావూరి
ఓ వావ్.కొండేపూడి నిర్మల గారు కూడా వచ్చారా? ఆవిడ రాసిన కొన్ని కవితలు నాకిప్పటికీ గుర్తే, అలాగే తనెప్పుడో రాసిన కధ కూడా..పైన ఉన్న పిక్చర్స్ లో తనున్నారా అండి?
మీ ప్రయత్నం అభినందనీయం.
నేను ఈసారి కూడా రాలేకపోయాను.
సారీ మై డియర్ ఫ్రెండ్స్..
నా తప్పేమీ లేదు.
సతీష్ యనమండ్ర నన్ను సికింద్రాబాద్‌లో వదిలి వెళ్ళిపోయాడు!!
Congrats to eTelugu Team!!
చాలా శుభ పరిణామం . ఈకృషిలో పాల్గొన్న వారందరికి శుభాకాంక్షలు .
‘జర్నలిస్టుల కోసం నిర్వహించిన సమావేశం కంటే ఎక్కువమంది జర్నలిస్టులు ఈ రచయితల సదస్సుకు హాజరు కావడం విశేషం!’- జర్నలిస్టులెప్పుడూ ఇంతే! :)
ఐ న్యూస్ పీకలోతు అప్పుల్లో కూరుకుపోయింది. బయట పడేందుకు నానా కష్టాలు పడుతున్నారు. మీకు తెలుసా? అర గంట పాటు టీవీ ఆగిపొయింది. డబ్బులు కట్టలేక పోవడంతో సిగ్నల్ ఆపేశారు. రాజశెఖర్ హ్యపీస్ అట. ఎన్ టీవీ ఆదుకుంది పాపం. 90 లక్షలు కట్టాల్సి వచ్చింది. అయినా ఐ న్యూస్ ను ఎమి చేస్తారో. వాసు చానల్‌ను ఇద్దరికి అమ్మేసాడు. ఓకరు ఎన్ టీవీ వారు. రెండొది ఎన్ ఆర్ ఐకి.... మద్యలొ ఉన్నది జీవీ రావు. అట. అయనకి 9 శాతం వాటా అట. డబుల్ గేంలో వాసు తర్వాతె ఎవరైన. ఆట ఎవరు ముగిస్తారో. చూడాలి.
నరేష్...
సతీష్ గారిది మరీ ఇంత దుర్మార్గమా? నీ గురించి నాకు అంత బాగా చెప్పి ఈ అకృత్యానికి ఒడిగట్టారా?
రాము
నరేష్,
మీరు తప్పక వస్తారని అనుకున్నాను. కానీండి!
రాము గారూ,
ఈ సదస్సు విజయవంతం కావడానికి సహకరించిన మీడియా మిత్రులకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం!వారి సహకారం వల్లనే ఇంతమంది రచయితలు సదస్సుకు వచ్చారు.
నాకు శనివారం తెలిసింది మీటింగు వుందని. రావాలని అనుకున్నాను. ఒకే సమయంలో రెండు కార్యక్రమాలు ఎదురయ్యాయి. ఇక్కడికి వస్తే నేను ఒక్కడినే. చర్చికి నా ప్రక్కటెముకతో, సాయంకాలం ఎలాగూ నెలనెలావెన్నెలకు వెళ్ళాలి. ఎండ, ప్రయాణాలు దేనికి మొదటి ఫ్రిఫరెన్స్ ఇవ్వాలనేది తేల్చుకోలేకపోయాను. చివరికి నా ప్రక్కటెముకతో కలిసి చర్చికి వెల్లడం జరిగింది.
అందుకే రాలేకపోయాను.
నన్ను గుర్తుచేసుకున్నందుకు సర్వదా ధన్యవాదములు. మీ రిపోర్టు చదివిన తర్వాత నేనూ వచ్చివుంటే బాగుండేది అనిపించింది.
ఏదో ప్రణాలికాలోపం
నాకు శనివారం తెలిసింది మీటింగు వుందని. రావాలని అనుకున్నాను. ఒకే సమయంలో రెండు కార్యక్రమాలు ఎదురయ్యాయి. ఇక్కడికి వస్తే నేను ఒక్కడినే. చర్చికి నా ప్రక్కటెముకతో, సాయంకాలం ఎలాగూ నెలనెలావెన్నెలకు వెళ్ళాలి. ఎండ, ప్రయాణాలు దేనికి మొదటి ఫ్రిఫరెన్స్ ఇవ్వాలనేది తేల్చుకోలేకపోయాను. చివరికి నా ప్రక్కటెముకతో కలిసి చర్చికి వెల్లడం జరిగింది.
అందుకే రాలేకపోయాను.
నన్ను గుర్తుచేసుకున్నందుకు సర్వదా ధన్యవాదములు. మీ రిపోర్టు చదివిన తర్వాత నేనూ వచ్చివుంటే బాగుండేది అనిపించింది.
ఏదో ప్రణాలికాలోపం
జాన్ హైడ్ గారూ...
సర్, మీ మెయిల్ కు థాంక్స్. నేను కూడా నా ప్రక్కటెముకను ఈ సమావేశానికి రమ్మన్నాను. రాలేదు. రాకపోవడమే నాయమయ్యింది---వారి కుటుంబ సభ్యులు భోజనానికి వచ్చారు. మరొక సారి మనం కలుసుకుందాం.
రాము
Sujatha gaaru,
One of our friends wishes to know who Ms.Kondepudi Nirmala is? Please tell her. Is she in the picture?
ramu
kondepudi nirmala is there sat infornt of Santha Sundari with a dark saree in 1st pic
రాము గారు, మొదటి ఫోటోలో ముందు వరుసలో కూచున్న యువతి వెనుక ఉన్నారు నిర్మల గారు! కళ్ళజోడు పెట్టుకుని చేతులు కట్టుకుని ఉన్నారు కదా, ఆమే!
నా అజ్ఞానాన్ని మన్నించి నిర్మల గారిని ఫోటో లో గుర్తుపట్టేలా సూచనలు చేసిన జాన్ హైడ్ గారికి, సుజాత గారికి కృతఙ్ఞతలు.
జాన్ హైడ్ గారూ...మరిచాను సార్...నేను ఈ మేడం (సుజాత) గారే మీరు రాకపోవడం గురించి మాట్లాడుకున్నాం.
రాము
కావూరి వెంకట సుబ్బారావు గారికి,
మీ స్పందనని తెలియజేసినందుకు నెనర్లు.
ఇది మాకు రెండవ సదస్సు మాత్రమే. నిర్వహణ మరియు బోధనలు ప్రభావవంతగా ఎలా ఉండాలో ఇంకా నేర్చుకుంటున్నాం. మొదటి సదస్సు కంటే దీన్ని మెరుగ్గా నిర్వహించాం.
ఇక వచ్చిన వాళ్ళకి ఇప్పటికే ఈ విషయాల గురించి ఎంతవరకూ తెలుసో మాకు తెలియదు కాబట్టి (అందరికీ అదే స్థాయిలో తెలిసివుండకపోవచ్చు కూడా) సాధారణీకరణ తప్పలేదు. మేం ఊహించిన దానికంటే, పెద్ద సంఖ్యలో రచయితలు హాజరైనందున అందరినీ సంభాళించడానికి ప్రయత్నించాం. అందరి సందేహాలూ అక్కడికక్కడే తీర్చలేకపోవడానికి అదీ ఒక కారణం.
మీరు ఇప్పటికే, అనూ యాపిల్ లేయవుటుని ఉపయోగించి తెలుగు టైపు చెయ్యడం వచ్చు అంటున్నారు కాబట్టి, ఈ ఉపకరణాన్ని దింపుకుని స్థాపించుకోండి. దీనిలో యాపిల్ కీబోర్డులోని అక్షర స్థానాలే ఉంటాయి, కాకపోతే సంయుక్తాక్షరాలు టైపు చెయ్యడానికి చిన్న సర్దుబాటు అవసరం. (ఆ పేజీలో గమనికలు కూడా చదవండి.)
ఇక బ్లాగులో టపా చెయ్యడానికి వీటిని చూడండి: ఇది మరియు ఇది.
నందం నరేష్,
దుర్మార్గుడా.... :) గళ్ ఫ్రెండ్ పుట్టిన రోజు అని నాకు చెప్పి నన్ను సికింద్రాబాద్ లో దింపమని చెప్పి ఇక్కడ మాత్రం తప్పు నా మీదకు తోసేస్తున్నావా? ఈ సారి కనపడు అప్పుడు చెప్తాను నీ సంగతి.... :)
రాము గారు,
మన ఈ తెలుగు కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవగలిగాను... చాలా ఆనందంగా వుంది. నందం నరేష్ మీద ఇప్పటి వరకు మంచే చెప్పాను.... ఆయన మాటను నమ్మకండి సర్.... :) కార్యక్రమానికి వచ్చినందుకు నెనరులు!!!
భవదీయుడు,
సతీష్ కుమార్ యనమండ్ర
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి