ఒక ఘోరం జరిగినా, ఒక మంచి జరిగినా ప్రకృతి వెంటనే స్పందిస్తుంది. హిరణ్యకశ్యపుడి ఛాతి చీల్చగానే ఉరుములు మెరుపులు వణికిస్తాయి. సీతారామ కల్యాణం కాగానే...ఆకాశం నుంచి పూలు పడతాయి. ఇలాంటి ఉదాహరణలు సినిమాలలో కోకొల్లలు. మొన్నటి దాకా వీపు పగిలిపోయే ఎండలు భగభగ లాడించగా...అంతలోనే 'లైలా' చల్లగా రావడం...కొంపలు కొల్లేరు చేయడం వెంటవెంటనే జరిగిపోయింది. దీనికి కారణం...తెలుగు నేల మీద ప్రభవించి దేదేప్యమానంగా వెలిగిపోతున్న రెండు ప్రధాన పత్రికలు.
'ఈనాడు' కు పోటీగా తెలుగులో వెలిగిపోతున్న 'ఆంధ్రజ్యోతి' లో ఏప్రిల్ 24 న మన ఆదిత్య అలియాస్ వేమూరి రాధాకృష్ణ గారు ఒక 'కొత్తపలుకు' పలికారు. ఛీ...ఛీ..అసలీ మీడియా ఏమిటి ఇలా దరిద్రంగా, నీచ నికృష్టంగా అయిపోయింది? అని బాధపడుతూ వేమూరి మాంచి వ్యాసం రాసారు. అందులో ఆణిముత్యాలు ఇక్కడ నీలం రంగులో ఉన్నాయి.
"సమాజాన్ని చదివినవారు, సామాజిక సమస్యలను ఆకళింపు చేసుకున్నవారు మాత్రమే ఉండవలసిన మీడియాలో వాణిజ్య దృక్పథం మాత్రమే కలిగిన వ్యక్తులు ప్రవేశించడం వల్ల పరిస్ధితులు మరింత వేగంగా క్షీణిస్తున్నాయి."
"మీడియా ఆరోపణలకు గురవుతున్న వారు తలదిన్చుకోవలసింది పోయి ఎదురు దాడికి దిగేందుకు సాహసం చేస్తున్నారు. ఇది దుష్ట సంస్కృతి..."
"మీడియాలో పరిణామాలు ఇలాగే కొనసాగితే అంతిమంగా నష్టపోయేది సమాజం-ప్రజలే. ఈ ముప్పును నివారించగలిగేది జర్నలిస్టులు మాత్రమే. ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది...పరిస్ధితులు మరింత విషమిస్తే జర్నలిస్టులను అంతరించిపోతున్న జాతిగా గుర్తించవలసిన పరిస్ధితులు ఏర్పడడం తథ్యం"
కిందనుంచి చటుక్కున ఎదిగిపోయిన వేమూరి సారు ఇంతమంచి మాటలు చెబితే ప్రకృతి పులకరించక చస్తుందా? నిజానికి ఆ రోజే వాతావరణం కాస్త చల్లబడింది. రోళ్ళు పగిలే ఎండాకాలంలో ఈ గాలులేమిటా...అని తర్కించుకొని ఆ గాలికి ఇంట్లో నుంచి కొట్టుకువచ్చి కాళ్ళకు తగిలిన 'ఆంధ్రజ్యోతి' లో ఎడిట్ పేజీ చూసి నాకు విషయం బోధపడింది.
అంతేనా...ఆ వ్యాసానికి కొనసాగింపుగా మే ఫస్టు నుంచి 'మీడియా-ఆత్మశోధన' అనే కాలాన్ని ఆంధ్రజ్యోతి ఆరంభించింది. "మీడియాలో ఇంత చెడు ఎందుకొచ్చి చేరిందనేది అందరం ఆలోచించాల్సిన ప్రశ్న.." అని కూడా చెప్పిందీ పత్రిక. ఈ చర్చలో....వేమూరి గారికి ఇన్నాళ్ళు తెలియని చాలా విషయాలు బైటికి వచ్చాయి. అసలు...మీడియా ఎందుకు, ఎవరి వల్ల, ఎలా బ్రష్టు పట్టిందో ఆయనకు ఇన్నాళ్ళూ తెలియకనే కదా...'మీడియా--అత్మశోధన' అని పెట్టి ప్రజలను స్పందించమన్నారు. ఇది అద్భుతమైన మంచి విషయం కనుక ఇక ప్రకృతిలో చాలా మార్పులు వచ్చాయి. అక్కడక్కడా జల్లులు మొదలయ్యాయి.
ఇంతలో...ఈ వారం ఒక రోజున...మళ్ళా ఇంట్లో నుంచి ఒక పేపర్ కొట్టుకు వచ్చి మెడకు చుట్టుకుంది. అది కాంగ్రెస్ ఎం.పీ.జగన్ మోహన్ రెడ్డి గారి 'సాక్షి' పేపర్. ఈ ఉపద్రవానికి కారణం ఏమిటా...అని ఎడిట్ పేజి తీసి చూస్తే...అక్కడ 'ఏది నిజం' అన్న కాలంలో ఒక పెద్ద స్టోరీ ఉంది. వేమూరి వారిది 'కొత్త పలుకు' అయితే...వై.ఎస్.జే.గారిది "ఏది నిజం?."
ఈ కాలంలో 'సాక్షి' చాలా మంచి విషయాలు స్పష్టం చేసింది. "కాంగ్రెస్ ను మా పేపర్ ఇప్పుడు ఉతికి ఆరెయ్యడమేమిటి?...అసలు వై.ఎస్.బతికి ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ ను తిడుతున్నాం...." అని ఆ పేపర్ చాటి చెప్పింది. ఆ వాదన నిజమని చెప్పుకోవడానికి కొన్ని పాత పేపర్ల క్లిప్పింగ్స్ కూడా ప్రచురించింది. అందులో చివరి వాక్యం ఏమి చెప్పిందంటే..."ఇప్పుడే కాదు...రేపు జగన్ ముఖ్యమంత్రి అయినా....మేము ప్రజల పక్షానే ఉండి ప్రశ్నిస్తాం..."
మీరు చెప్పండి...ఇంత మంచి విషయం చెబితే ప్రకృతి ఆగగలదా? ఈ నిజాలను ప్రకృతి తట్టుకోగలదా? దానివల్ల కాలేదు. ఎండ లేదు, గిండ లేదు అని...కాల ధర్మాన్ని పక్కనబెట్టి....ముందు చిరు జల్లుగా ఆరంభమై...చివరకు లైలా వరకు దారితీసింది. పేపర్లు మరీ ఇన్ని సత్యాలు చెబితే ఎలా? ప్రకృతి మాతా....పాపులను క్షమించి...శాంతించు తల్లీ!
Thursday, May 20, 2010
Subscribe to:
Post Comments (Atom)
13 comments:
అనవసరంగా సాక్షి, జ్యోతి పేపర్లను ఆడిపోసుకోకండి. అసలు విలన్ కేసీఆర్. ఆ మహానుభావుడు వస్తాననగానే ఆంధ్రాని తుపాను ముంచెత్తింది. ఇక ఆయన అడుగు పెడితే ఏమవుతుందో,ఖర్మ..
దేవుడా దేవుడా దేవుడా..
hahaha nice one.........
మీడియాలో పెడ ధోరణులను నిలువరిద్దాం.
2 days inti daggara choosaanu......tv9 and sakshi and abn.........ammo nijam a.p vaallu chala great ela sahistunnaro gani.
Hi Freinds,
It is a well known point to all you friends but I want to bring one more point how media totally neglects congress and give so much importance to other party opninons..
Regarding the recent LILA storm congress was first party to give call to its party members asking voluntarily help people who r affected by floods..and later in the evening TDP leader mr CBN and chiru have given statements to its cadre...
so i was watching ETV2 to c how they give coverage..
they first started with TDP and then with chiru ..
for TDP they gave full coverage showing entire CBN speech and then came chiru's speech and he too got good coverage but less than mr CBN..then congress statement but only video that too for one second...
i was literally schocked h much biased this yello media is...
u can be biased but not to this extent...
if some tom dick and harry (you wouldnt have heard this persons name in ur life time earlier) makes any comment against ys or jagan or gali then these people will be starting telecasting no of times...what is this ...
if somebody makes some comments against them then they start saying attack against press...is this freedom of press..
boss dont lick shoes of ur management...be fair dont be so much biased...
be truthful to ur self ..
u guys dont know whatever promises made by mr CBN r not possible then y did u guys gave so much coverage...
we all know that yello media is eating shit atleast as journalists u shud bring some truth into light guys..
and also u media personal shud come out of caste clutches otherwise our future generations will lose hope on our society guys..
dont work for sensationalism but work with some sense to make our society progress without inequalities..
bye
Niranjan
hi sir,
ippdu valla mater manaku yenduku ???
yenduku meru prathi sari Andhrajyothi , saakshi ni adi posukuntaru...
yenduku media boss lanu tittu kuntaru..
a boss lu leka pothey mana journlist laku 4 vellu lopalaki vellava???
inko nijam cheppana 1st jounrlist laku salaries yela undevi ,migatha channels and papers vachaka ippudu yela unnaye
ye boss ayena okatey korukuntadu migata vati meda tana samstha mundu undali ani andulo tappu ledu kada..
kani kontamandhi journalist lu creatvity leka satta leka adda darilo pike vachey panulu chesi boss la meppu kosam try chesthuntaru auna kada??
e blog chaduthunnapati nunchi naku okati ardam ayendi meru manchi valley kaka pothey konchem tikka yekkuva yevraina direct mimmalani vimarsa chesthey dani oppukoru auna kada
any way blod bagundhi contunue cheyandi kani okkalu meda adey paniga yekkuva vimarsalu cheyadhu plz
ఆంధ్రజ్యోతి,సాక్షి లేమి ఖర్మ,బ్లాగుల్లో కూడా మీడియా గురించి ఈ మధ్య తెగ ఊదరగొడొతున్నారు లెండి.ఈ బ్లాగు ని మంచి ఉద్దేశ్యం తో నిర్వహిస్తున్నాము అని కాకమ్మ,పిచుకమ్మ కబుర్లు చెప్పి తమ అసలు తత్వాన్ని ఆ పోస్టు లలో ఆవిష్కరిస్తున్నారు.
నీట మునిగిన గ్రామాలు,పడిపోయిన చెట్లు చూపించి,భీకర ప్రళయ ఘోష మ్యూజిక్ పెట్టి సేం టూ సేం వార్తలు రిపీట్ చేస్తూ ఇదే తుఫాను కవరేజీ అని చెప్పుకునే స్టేజీ నుండి మీడియా ఎదగదు కూడా.
Ramu garu,
Have you responded to AJ's discussion on media?Some people have written very nicely how the media in these days has lost track of values resulting ommercialisation etc.If not responded try to respond with your point that is expressed in this blog.
JP.
Dear JP gaaru,
Namaste.
Sir, "media-atmasodhana" is yet another column to fool people. Vemuri doesn't know where he goes wrong? Doesn't his editorial team know what they are doing? Who is resorting to blackmail journalism? Who is supporting their caste party for political gains?
Don't we know who made huge money by encouraging 'paid news'?
He is also to be blamed for the present condition of the AP media.
Its like దయ్యాలు వేదాలు వల్లించడం. That is way I thought it is meaningless to send a letter to these people.
By the way, did they publish your piece?
see you
Ramu
dayyalu vedaalu vallinchadamane maata saripodu sir inkemainaa vunte vethakaali, bhasha sariponikaalamidi
prashanth
hi ramu
though its a satire for me it sounds of bad taste. No denying that publications have dubious methods and their own agenda you have forgotten to mention 9 years of CBN rule. One daily was hellbent to support all his programmes. But Nature responded in a different way. 7 years of drought. if it pours some may loose but many will gain. if its drought all are loosers
sir,
gud post.
congrats ramu you are a lakhpati, you have crossed one lakh guests.
shailesh reddy
superb satire.
Dear Mr.Sailesh
Thanks a lot. Thanks for your words of encouragement.
Ramu
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి