Mahaa-TV లో ఈ రాత్రి పుట్టపర్తి సత్యసాయి బాబాపై... "వారసుడెవరు?" అన్న శీర్షికతో వచ్చిన లైవ్ షో తలాతోకా, అర్థంపర్థం లేకుండా సాగింది. ముందస్తు కసరత్తు, ప్రణాళిక లేకుండా లైవ్ షో చేస్తే ఎంత చెత్తగా ఉంటుందో ఈ కార్యక్రమం చూస్తే అర్ధం అవుతుంది. అసలీ....గోగినేని బాబు గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ కు ఎందుకు వెళ్లి అభాసుపాలవుతారో నాకు అర్థం కావడంలేదు.
ఈ ప్రోగ్రాం శీర్షిక ప్రకారం....సాయిబాబా గారి వారసుడెవరు? అన్న అంశంపై చర్చ జరగాలి. ఇది మంచి సబ్జెక్టు. ఒక పదేళ్ళ కిందట ప్రశాంతి నిలయంలో కొన్ని రోజులు ఉన్నప్పుడు నాకు వచ్చిన సందేహం ఇది. హేమ తండ్రి గారు పదవీ విరమణ అనంతరం స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఆ వూరికి ఎప్పుడు వెళ్ళినా ఈ ప్రశ్న నన్ను వేధిస్తూ ఉంటుంది. ఇన్ సైడ్ ఏమైనా ఇస్తారేమో అని నేను ఆసక్తిగా చూస్తూ కూర్చుని టైం వేస్టు చేసుకున్నాను. ఇంత మంచి సబ్జెక్టును చెడగొట్టి పారేసారు.
ఈ చర్చకు బీ.జే.పీ. అధికార ప్రతినిధి ఎన్.వీ.ఎస్.ప్రభాకర్, శ్రీ సేవా ఫౌండేషన్ తరఫున మంజుల శ్రీ, అంతర్జాతీయ హేతువాద సంఘం అధ్యక్షుడు గోగినేని బాబు పాల్గొన్నారు. యాంకర్ గారు...ఆరంభంలో ఒక లీడ్ చెప్పి...చిలుకూరు బాలాజీ టెంపుల్ కు చెందిన రంగ రాజన్ అనే అర్చకుడు ఫోన్ లైన్ లో...సాయి మహిమల గురించి మాట్లాడేసరికి డంగై పోయారు. "మేము ఇతర బాబాలతో సాయి బాబా ను పోల్చడం లేదు. ఆయన వారుసుల మధ్య జరుగుతున్న పోటీ గురించి చర్చ," అని యాంకర్ ప్రకటించారు.
నిజానికి ఆ చర్చ పెద్దగా జరగకుండా...మిగిలిన ఇద్దరు గోగినేని బాబు గారిని కార్నర్ చేసేలా షో సాగింది. మధ్యలో ఆ బీ.జే.పీ. ఆయన...బాబు గారిని ఉద్దేశించి..."మీరు 35 ఏళ్ళ జీవితాన్ని వృధా చేసుకున్నారు," అని అన్నారు. ఇది దారుణం. ఆ యాంకర్ దీన్ని నివారించలేదు. ప్రభాకర్ మాటిమాటికీ బాబు గారిని ఎద్దేవా చేస్తూ...తాను నమ్మే.... కావలి అవధూత గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అసలీ యాంకర్లు ఇలాంటి దాడిని చాకచక్యంగా నిలువరించాలి. తన అభిప్రాయం వెలిబుచ్చే ప్రయత్నం చేస్తున్న ఒక ప్రముఖ గెస్టు ను అలా మిగిలిన గెస్టు లు కించపరచడాన్ని అనుమతించకూడదు.
ఈ కార్యక్రమం అంతా...'వారసుడి' సంగతి తేల్చకుండా సాగింది. ఒక దశలో...."మహా టీ.వీ. ఎడిటర్ నేను చెబితే వినాలి అని నాకు ఉంటుంది. అలా నేను అనుకుంటే...జరిగిపోతుందా?" అని మంజుల గారు ఒక వుదాహరణగా చెప్పారు. వారు...సాయి తదితరులను పొగడడం...బాబు గానిని ఖండించడం సాగిపోయింది. వారసుడి చర్చ నుంచి దారి తప్పాం...అన్న స్పృహ ఆ నలుగురికి కొరవడింది.
ఛానల్ వారు సాయి సేవా కార్యక్రమాలను అద్భుతంగా రికార్డు చేసి ..వారు చేస్తున్నది అద్భుతమైన సేవ అని అర్థం వచ్చేలా ప్రోగ్రాం నడిపారు. మధ్యలో సత్యసాయి ట్రస్టు కన్వీనర్ ఏ.పీ.రంగా రావు గారి బైట్ వాడారు. ఇలా ఛానల్ వారు భక్తిని ప్రమోట్ చేయదలుచుకున్నారా? అన్న సందేహం అడుగడుగునా కలిగింది. ఆ ట్రాప్ లో పడిపోయిన బాబు గారు...అమెరికా ప్రభుత్వం ఇచ్చిన 'ట్రావెల్ అడ్వైజరీ' గురించి, సాయి యూనివర్సిటీ లో చదువుల గురించి మాట్లాడారు.
ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే....మధ్యలో చానెల్ వారు 'బ్రేకింగ్ న్యూస్' అంటూ పెద్ద మ్యూజిక్ తో వచ్చిపోయ్యే పెద్ద డబ్బాలో బ్రేకింగ్ న్యూస్ ఇవ్వకుండా...సాయి బాబా వివరాలు, ట్రస్టు చేసిన పనులు, ఆయన ఎన్నేళ్ళు బతుకుతానని చెప్పిందీ....ప్రేక్షకులకు అక్షర రూపంలో అందించారు. ఇదొక తిక్క పనిగా నాకు అనిపించింది.
అసలీ ప్రోగ్రాం కు పెట్టాల్సిన శీర్షిక "వారసుడెవరు?" అని కాదు. దీని శీర్షిక..."సాయిబాబాను తిట్టాలా? పొగడాలా??"
Wednesday, May 12, 2010
Subscribe to:
Post Comments (Atom)
19 comments:
maha evaru chustunnaru? aa channelku pedda samasya dani nirvahakule. employees manchivare unnaru kani dynamism ledu. chala slow. venkatrao garu manchivaru. evarinee emi anaru. sekhar reddy,kesav manchivare kani speed ledu. daily journalismlo speed kavali. anduke adi venakapadipoyindi. mundu aa chanalnu house environment nunchi marchali. tarvata edyna... ias officer intlo channel office emiti...chetta nirnayam kakapote..
The question of vaarasudu completely belongs to puttaparthy Baba, all the others are spectators, some of them, followers. So, this kind of a programme should involve only those who are involved with the trust and close associates of Baba with quotes from Baba.
I donot know anything about Manjula garu. But I can definitely say that BJP and Gogineni have no place there. BJP is neither a representative of the Hindu society nor official representative of Puttaparthy Baba. And Gogineni is not needed because the topic is not about devotion or atheism.
Channels charchallo viluvala gurinchi matladukunte... gongatlo tintoo... annatte. So don't waste time.
what are the happenings in ETV2? Recently they hiked salries calmly. Any other developments?
raaamu gaaru
meeru modati saari mahaa neews post chesaaru ...ippatiki ayina aa channel mee drusti ki vbachhinaduku santhosham..aite meeru cheppina danilo konata vastavam undi undavachhu ..kakapothe anchor sariga handle cheyakapoi undi vachhachu ....but prastutam kalki nd kaleswer baba gurnchi utiki aresina channel MAHAA ..kaani adi mee drustiki ippati varaku raaakapovatam sochaniyam...aaa taruvat so called tv9 nd abn hadavudi chesaai meeru tv9 choosi vuntaaru ore kalki ni vellu bale adukunnare anukoni vuntaaru..but kalki battalu udaadisindi maatram mahaa tv ne..idi nijam kavalante mee source dwara verify chesukovachhu..
inko vishayam prastutam viluvalu journalist lanu konchem gouravam gaa choostunna channel mahaa tv oakkatee ...ide meeru verify chesukovachhu
meeru vimarsha chesaaru gud mari manchi prgrms ni pogadaali kada..
mee hectic schedule lo anni channels meeru choodaleru kaabatti naagasoori venugopal laaa 2 r 3 manushulanu peetukondi channels watch chesi meeku inputs
cheppataaniki appudu inkaa qwality items post chjeyavachhu
మురళి కృష్ణ గారూ...
థాంక్స్ ఫర్ యువర్ కామెంట్. నిజమే అండీ...మీరు అన్నట్లు ఒకరిద్దరికి చానల్స్ చూసే బాధ్యత అప్పగించాలి.
మీరు చెప్పిన పాయింట్లు నోట్ చేసుకున్నాను.
థాంక్స్
రాము
మీ బ్లాగులో ఎలాగో అనామకుల బెడద తప్పటంలేదు.తెలుగును ఆంగ్లంలో వ్రాయటం ఎక్కువయ్యింది. కనీసం తెలుగును తెలుగులోనే వ్రాయలేనివారు, ఆంగ్లంలో తెలుగు వ్రాయటం దేనికి? అదేదో ఆంగ్లంలోనే వ్రాయవచ్చుకదా. తెలుగును ఆంగ్ల లిపిలో చదవాలంటే ఎంత చీకాకు, కష్టం. లేఖిని ఉండగా ఇలా తెలుగును ఖూని చేస్తూ అంగ్లంలో వ్రాయటం మానుకోమని మీరు కూడా ఒక విజ్ఞప్తి చేయండి, లేదా అలా తెలుగును ఖూని చేస్తున్న వ్యాఖ్యలను ప్రచురించకుండా ఉంటే ఎలా ఉంటుంది అలోచించండి.
ఇక సాయిబాబా వారసుడు ఎవాడైతే మనకేమిటి. ఈ నాస్తిక సంఘాల వాళ్లకి వేరే పనేమీ లేదు. ఊరికే అందరూ పూజించే దేవుళ్ళను తెగడటం తప్ప. అందుకే చెత్త చానేళ్ళకి కూడా తగుదునమ్మా అని తయారయ్యి తమ విషం కక్కి పోతుంటారు. వీళ్ళకి డబ్బులు ఎక్కడినుంచి వస్తుంటాయి గురించి ఈ చానెళ్ళ వాళ్ళు ఆరా తీస్తే బాగుండు. వాళ్ళు చెయ్యరు ఆ పని.ఎందుకంటే ఆ తానులో గుడ్డలేగా వాళ్ళు కూడా.
లేఖిని కూడా అవసరం లేదు. గూగుల్ transileration అనే టూల్ ని దిగుమతి చేసుకుంటే మీరు నేరుగా తెలుగు లోనే టైపు చెయ్యవచు ఎక్కడైనా. మీ స్వంత కంప్యూటర్ కాకపోతే http://www.google.com/transliterate/ ఇక్కడికి వెళ్ళండి. గూగుల్ సహాయకారి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మీరు కొంచెం అటు ఇటుగా టైపు చేసినా అది సరి చేస్తుంది
http://www.google.com/transliterate/
http://www.google.com/ime/transliteration/
English ni telugu lo raayatam chaala mandiki alavaatu ayyindi sir... Kopam enduku daani meeda
Siva garu's comment on writing telugu in english language is right. It's being very very difficult to read those comments. It causes lot of strain to the eyes.These reasons make us (readers) overlook lengthy comments. Kindly do something about it.
I've been thinking why Siva garu and JP garu are not posting their comments now a days.
తెలుగును ఇంగ్లిష్ లో ట్రాన్స్లిటరేట్ చేసి పంపితే చదవడం నిజంగానే కష్టంగా ఉంది. కూడపలుక్కుని చదవడానికి చాలా ఇబ్బంది గా ఉంది. పైన బాబీ గారు చెప్పినట్లు చేస్తే బాగుంటుంది.
అలాంటి వాళ్ళు కనీసం ఇంగ్లీష్ లో పంపినా బాగుండు.
రాము
Bobby. Thanks for the link to transliteration tool provided by you. I hope it would be useful for those who wish to write Telugu in Telugu with the help of English key board.
కోపం కాదు మాష్టారూ. చీదర. చక్కటి మన తెలుగును, వేరే భాషలో వ్రాయాలని, వేరే భాషలో చదవాలని ఏమిటీ "అలవాటు"! అవకాశం లేనప్పుడు ఎలాగో ఆంగ్లంలోనే వ్రాయటం జరిగింది. మీరే చెప్తున్నారు, అవకాశాలు ఎన్ని ఉన్నాయో. అవి వాడుకుని తెలుగును తెలుగులోనే వ్రాయమని నా విన్నపం. లేదూ, ఆంగ్లంలో వ్రాయాలని ఉన్నదా, హాయిగా ఆంగ్ల భాషలోనే వ్రాయండి. చివరకు మనం వ్రాసేది చదివే వారు చదవాలి కదా!! నాకు మటుకు నేను, మాధురి గారు చెప్పినట్టు, తెలుగును ఆంగ్ల లిపిలో వ్రాస్తే చదవటానికి వెనకాడుతాను. కారణం, తెలుగును తెలుగులో కాని, ఆంగ్లాన్ని ఆంగ్లం లో కాని చదవటానికి కన్నా పట్టి పట్టి చదివి శ్రమపడాలి. అది సంగతి.
Sorry Ramuji, subject is getting diverted.
రాము గారు, మహా టీవి చర్చ పై మీ విశ్లేషణ బాగుంది.
మురళి గారు చెప్పినట్లు కల్కి, కాళేశ్వర్ అక్రమాల్ని బ్రేక్ చేసింది
కూడ మహా టీవి నే... ఇక చర్చలో పాల్గొనేవారు కూడ కొంత
విచక్షణ, సమ్యమనంతో మెలగాలి... అప్పుడే నిర్వహణ రక్తి కడుతుంది
కల్కి, కాళేశ్వర్ చర్చల్ని నడిపింది కూడ ఆ యాంకరే...(బహుశా మీరు చూడలేదేమో)
కానీ ఇక్కడ బాబు, ప్రభాకర్, మంజుల ముగ్గురూ హుందాగ ప్రవర్తించలెదేమో...
చర్చ ముగింపు చూస్తే ఇది అర్థమౌతుది... ముగింపు ఇవ్వమంటే వారు వ్యక్తిగతంగా విమర్శలకు
దిగితే వెంటనే చర్చ ముగించారు.... ఇక ట్రస్ట్ తరపు వారు ఎవరైనా చర్చకు
రావడనికి సిద్ధపడతారా...??? మీరే చెప్పాలి...
ఆయన యాంకర్ కాదు... మహా టీవి అవుట్ పుట్ ఎడిటర్ కేశవ్
ఆయన్నే ఫోన్ చేసి అడగాల్సింది...?!?!
మహా టీవీ మురళి కృష్ణ ఈనాడులో ఉండగా కొలీగ్. మంచి మిత్రుడు. ఆయన రాసింది చదవాలని ఉన్నా ఆంగ్లం తెలుగు చాలా ఇబ్బందిగా అనిపించి వదిలేశా. గూగుల్ టూల్ గురించి ఈనాడులో ఆర్నెల్ల క్రితమే రాసారు. అప్పటినుంచి ఇదే వాడుతున్నా. చాలా బాగుంది. తెలుగు భాషకు గూగుల్ ఇచ్చిన వరం. అందరు ఫాలో కావాలని విజ్ఞప్తి.
శ్రీనివాస్
Bobby garu, Srinivas garu,
Thank you.
ఆ మురళి కృష్ణ ఈ మురళి కృష్ణ ఒకరు కాదు బాబు...!
I'm so happy dat u r watching mahaa tv atlast.....am an employee in mahaa tv...i read all ur posts n i really appreciate ur efforts and i cant help praising u regarding ur deep study about the channels n present burning issues....
Sir please do watch mahaa tv n give us ur impartial opinion on our bulletins, discussions n other good programs like "NENU", "PAGALE VENNELA", "OSCAR CLASSICS" etc.,...there are many other good programs in mahaa tv...plz do watch them n give ur feedback! thank u....
ఈ న్యూస్ పేపర్ లు టీవీ చానల్స్ చుస్తూ ఇంకా మీడియా నిక్ష్పక్షపాతం గా పని చేస్తుంది అని ఎలా నమ్మమంటారండీ, అందుకే మమ్ములను ఏది ఆశ్చర్య పరచదు. మాకు ఈ మహా టీవీ తెలియదు కాని టీవీ9 వస్తుంది, అది చూస్తుంటే ఇంతకు ఈ టీవీ9 వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్తానం వాళ్ళను ఎత్తేసి గవర్న్మెంట్ వాళ్ళు ఆ ప్లేస్‌ను తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోందా అని అనుమానం వస్తోంది. నిజమేనా?
తెలుగులో టైప్ చెయ్యడానికి మైక్రోసాఫ్ట్ ఇండిక్ ఇన్పుట్ లాంగ్వేజ్ టూల్ http://specials.msn.co.in/ilit/Telugu.aspx బాగా పని చేస్తుంది
నివాస్
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి