Wednesday, July 7, 2010

జర్నలిస్టులను బెదరగొట్టడానికే హేమంత్ పాండే హత్య?

నేను 'ది హిందూ' విలేకరిగా ఉన్నప్పుడు...ఒక అగ్రశ్రేణి మావోయిస్టు నాయకుడి నుంచి ఒక రాత్రి పూట ఫోన్ వచ్చింది. ఒకసారి లొంగిపోయి పోలీసులు, నయీం ముఠా తో నరకయాతన పడి మళ్ళీ అడవిబాట పట్టిన యువకుడతను. 'అన్నా...నేను మళ్ళీ లొంగిపోతాను. నువ్వు చాలా సిన్సియర్ జర్నలిస్టువని మాకు సమాచారం ఉంది. నీ ద్వారా లొంగి పోతాను, నువ్వు సాయం చెయ్యాలి,' అన్నాడు. నాకు ఒక టాప్ లీడర్ అలా ఫోన్ చేయడం అదే మొదటి సారి. ఇది ఎలా డీల్ చేయాలా అని నేను తర్జనభర్జన పడుతుండగానే...పావు గంటలో మరొక నంబర్ నుంచి ఫోన్ చేస్తానని చెప్పి లైన్ కట్ చేశాడు. 

నేను వృత్తిలో బాగా టెన్షన్ పడిన రాత్రి అది. నాకు పూర్తి నమ్మకం...ఈ సమాచారం తెలిస్తే...పోలీసులు అతన్ని బతకనివ్వరు. పొరపాటున నేను...ఎస్.పీ.ఆఫీసుకు తీసుకుపోయాక...అతన్ని 'ఫేక్ ఎన్ కౌంటర్' చేసే ప్రమాదం ఉంది. దానివల్ల నేను మావోయిస్టుల హిట్ లిస్టు లో పడే ప్రమాదం అలా ఉంచితే...నా వల్ల ఒక వ్యక్తి (అదీ...సమాజానికి ఏదో చేయాలన్న పిచ్చి కాంక్షతో తాను నమ్మిన ఒక పంథా పట్టిన యువకుడు) తూటాలకు నేలకు ఒరగడం నేను భరించలేను. అది జీవితాంతం నన్ను వెంటాడుతుంది.

ఆ క్షణంలో నా మనసు నన్ను వేసిన ప్రశ్నలు రెండు.
ఒకటి) పది పన్నెండు హత్య కేసులు, రాజ్యం లెక్క ప్రకారం పలు బీభత్సకాండలతో సంబంధం ఉండి...మనం రాసుకున్న రూలు బుక్కు (రాజ్యాంగం) ప్రకారం ఉరిశిక్షకు అర్హుడైన వాడిని మట్టుపెట్టడానికి ఇదే అదను. పోలీసులకు సహకరించకుండా ఎలా వుంటావు? 
రెండు) వ్యవస్థ బ్రష్టు పట్టిపోతుంటే...ఈ దుస్థితికి కారణమైన దగాకోరు రాజకీయ నేతలకు పహారా కాస్తున్న పోలీసులు కూడా వారి అడుగులకు మడుగు లొత్తుతుంటే....వారి గుండెల్లో దడ పుట్టిస్తూ మరో ప్రపంచం కోసం ప్రాణాలు ఒడ్డుతున్న వాడికి సహకరించకుండా ఎలా వుంటావు?
నా మనసు రెండో ప్రశ్నకే సమాధానం చెప్పాలని చెప్పింది. ఒక పక్కా ప్లాన్ వేసి...అది ఎలా అమలు చేయాలో చెప్పాను. ఒక రెండు రోజుల్లో కథ సుఖాంతం అయ్యింది. మావోయిస్టు అగ్రనేత ఆజాద్ తో పాటు పోలీసులు హేం చంద్ర పాండే (హేమంత్ పాండే) ను కూడా ఆదిలాబాద్ జిల్లాలో 'ఎన్కౌంటర్' లో హతమార్చడం చూశాక ఈ ఘటన గుర్తుకు వచ్చింది. 

అరుంధతి రాయ్ ఎవ్వరికీ కనిపించకుండా చత్తీస్ గడ్ వెళ్లి 'అవుట్ లుక్' లో మావోయిస్టులకు అనుకూలమైన భారీ వ్యాసం రాసాక కేంద్ర హోం మంత్రిలో నిస్పృహ ఎక్కువయ్యింది. దాని పర్యవసానమే...ఈ హత్య అని నా నమ్మకం. ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్ గడ్ జిల్లా దేవల్తాల్ పట్టణానికి చెందిన పాండే కుమౌన్ యూనివెర్సిటీ లో పీ.హెచ్డీ. రిజిస్టర్ చేయించుకున్నాడు. 'నయీ దునియా', 'రాష్ట్రీయ సహారా', 'దైనిక్ జాగరణ్' వంటి హిందీ పత్రికలకు ఫ్రీ లాన్స్ జర్నలిస్టు. అతను చాలా మంది జర్నలిస్టుల మాదిరిగా మావోయిస్టు సానుభూతిపరుడు. ఒక సంస్థ ప్రచురించే 'చేతన' అనే పత్రికకు ఢిల్లీ లో పనిచేస్తున్నాడు అనేందుకు...సాలరీ స్లిప్పులు సాక్ష్యం. 

ఇలాంటి వాడిని...ఆజాద్ తో ఉన్నాడు కదా...అని కాల్చిపారెయ్యడం దారుణం. ఆజాద్ హైదరాబాద్ లో ఉన్నాడని తెలిస్తే....జర్నలిస్టు అన్నవాడు ఎవడైనా కలుస్తాడు. వృత్తి ధర్మం లో భాగంగా జర్నలిస్టులు ఎందరినో కలుస్తారు, సమాచారం సేకరిస్తారు. అంతమాత్రాన...మొత్తం మీడియా ను భయపెట్టాలని ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం అవివేకం. 

చాలా మంది సిన్సియర్ జర్నలిస్టులతో మావోయిస్టులు మాట్లాడుతూ ఉంటారు. ఈ బాధ్యతాయుత జర్నలిస్టులు...పోలీసు కదలికలు ఏమీ వారికి లీక్ చేయరు. కేవలం సమాచారం మాత్రమే తీసుకుంటారు. ఇక్కడొక ఉదాహరణ చెబుతాను. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న అగ్రనేత సాంబశివుడు లొంగిపోయేందుకు ముందు... ముందుగా సమాచారం వచ్చింది...హేమకు. ఆమె అప్పట్లో తాను పనిచేస్తున్న N-TV లైవ్ లో అనౌన్స్ చేసే దాకా ఈ విషయం నరమానవుడికి తెలియదు. నిఘా విభాగం అధిపతులు, పెద్ద పెద్ద క్రైం రిపోర్టర్లు కూడా ఇది విని అవాక్కయ్యారు, కొందరైతే ఈ సమాచారం నమ్మలేదు. అంతమాత్రాన...ఆ సమాచారం పొందిన జర్నలిస్టుకు, మావోయిస్టులకు సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణకు వస్తే ఎలా?
 
జర్నలిస్టులు....మావోయిస్టులను కలిసి తెచ్చే (ప్రచురించే/ ప్రసారంచేసే) సమాచారం ఉపకరిస్తుందని పోలీసులు ఎందుకు అనుకోరు? వారి ప్రతాపం జర్నలిస్టుల మీద ఎందుకు చూపుతారు? మరో గొంతు వినకూడదని అనుకోవడం, ఆ గొంతు నులమాలని చూడడం అమానుషం. హేమంత్ పాండే...అమర్ హై.

17 comments:

Saahitya Abhimaani said...

ఒక జర్నలిస్టుగా ఎవరినైనా కలువ వచ్చు. నిజమే. వ్రాసే వ్రాతలలో జర్నలిస్టు సొంత పార్టీ నమ్మకాలను ప్రచారం చేయటానికి చేతిలో ఉన్న మీడియాను వాడుకోవటం ఎంతవరకు సబబు. చదివే/ చూసే పాఠకుడికి/ప్రేక్షకుడికి కూడ కొన్ని హక్కులుంటాయి. వాటిల్లో ముఖ్యమైనది తనకు నిస్పాక్షికమైన సమాచారాన్ని కోరుకోవటం. ఈ రోజున ఈ హక్కును మీడియా కాల రాస్తున్నది. ప్రీ ప్రెస్స్ తమకే కాని పాఠకులకు అక్కర్లేదని, అసలు అటువంటి హక్కు ప్రజలకు ఉందని ఎంతమంది గుర్తిస్తున్నారు. ప్రింటులో వచ్చినదంతా నిజం, టివిలో చూపించినది అంతా నిజం కావక్కర్లేదని ఎంత మందికి తెలుసు?

ప్రస్తుత విషయం మీద, ఆ చనిపోయిన ఆయన జర్నలిస్టా లేక ఆ వేషంలో ఉన్న నక్సలైటా అన్న విషయాలు తెలియవలసి ఉన్నది. అసలు ఆయన జర్నలిస్టు వేషంలో ఉన్న నక్సలైటు అయితే అతన్ని చంపారా లేక కాల్పుల్లో మరణించాడా. లేక అమాయక జర్నలిస్టు వార్త కోసం వెంపర్లాడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడా. ఈ విషయాలు ఎప్పటికన్నా వెలుగు చూస్తాయా. నిస్పాక్షికంగా ఇటువంటి విషయాలమీద అటు ప్రభుత్వం కాని, ఇటు మీడియా కాని ప్రజలకు నిజాలను తెలియచేసే స్థితిలో ఉన్నాయా అన్నది సామాన్య ప్రజల ప్రశ్న

కెక్యూబ్ వర్మ said...

మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రెస్ క్లబ్ లో పాండే దేహాన్ని వుంచడానికి అభ్యంతరం పెట్టి రోడ్డుపై పడేసిన మన జర్నలిస్టు మిత్రులు ఎలా ఆలోచిస్తున్నారో చూడండి. ముందురోజు జరిగిన సంతాప సభకు వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నుండి ఒక్కరూ హాజరు కాలేదంట. అదీ మన వాళ్ళు ఓ జర్నలిస్టుకిచ్చే గౌరవం. ఎక్కడ ప్రభుత్వం ఇచ్చే స్థలాలు, RTC buspass లు పోతాయోనని భయం.

Anonymous said...

అమ్మయ్య! ఇన్నాళ్ళకి ప్రొఫైల్ ఫుటో చూడముచ్చటగా ఉంది.

హరికృష్ణ పులుగు said...

జర్నలిస్టులు మావొలకు అనుకూలంగా ఉండవచ్చునా...చర్చ జరగాలి

Harish said...

I do not know what actually Naxals are fighting for. Communism is not a practical solution.

Krishna K said...

"జర్నలిస్టులు....మావోయిస్టులను కలిసి తెచ్చే (ప్రచురించే/ ప్రసారంచేసే) సమాచారం ఉపకరిస్తుందని పోలీసులు ఎందుకు అనుకోరు? వారి ప్రతాపం జర్నలిస్టుల మీద ఎందుకు చూపుతారు? మరో గొంతు వినకూడదని అనుకోవడం, ఆ గొంతు నులమాలని చూడడం అమానుషం. హేమంత్ పాండే...అమర్ హై." Good points

నాణేనికి రెండో పక్క చూద్దాం

"నక్సలైట్స్ వారి ప్రతాపం సామాన్యులు, చిన్న వ్యాపారుల మీద, rmp డాక్టర్స్ లాంటి వాళ్ల మీద ఎందుకు చూపుతారు? చిలకలూరిపేటలో ఆ పోలీసు ముసలి తల్లి ఏ పాపం చేసింది అని తనని కాల్చి చంపారు? నెల్లూరులో జనార్ధనరెడ్డి మీద జరిపిన దొంగ దాడిలో ఎ పాపం చేసారని సామాన్యులను బలి పెట్టారు? కాకతీయ భొగీలో సామాన్యులు ఏ పాపం చేసారని తగలెట్టి మరీ చంపారు? అది collateral damage అనుకుంటే, హెమంత్ ది క్కూడా అలంటిది అని ఎందుకనుకోకూడదూ? "

మీరు నిజమయిన మానవతావాది అయితె ఒక్క "హేమంత్ పాండే...అమర్ హై" అనే కాదు, నక్స్లైట్ల దాడిలో చనిపోయిన లెక్కలేనన్ని పోలీసు సానుభూతి పరులు, అమాయకులు కూడా అమర్ రహే " అనండి.

నక్సలైట్ సానుభూతిపరుడి ప్రాణమయినా, పోలీసు సానుభూతి పరుడి ప్రాణమయినా విలువ ఒక్కటే అనే నా పాయింట్.

Ramu S said...

We condemn the brutal, mindless killing of Maoists too. We did it many times
Ramu

Vinay Datta said...

If he's really working for 'chetan', why is the organisation disowning him? Why has the entire Hindi media declared that he didn't write for them even once? Why did the Maoists declare him as 'their person'?

WitReal said...

from a researcher perspective, you wouldn't be making such hypothesis.

your null hypothesis lacks all kinds of validity!

premade jayam said...

వృత్తి ధర్మానికి మద్దతు పలికితే చాలు. అమర్ రహే... ఎక్కువైనట్లుంది.
జర్నలిస్టు భావోద్వేగానికి గురి కాకూడదు.
ఆయన మావోయిజం మత్తులో ఉన్న జర్నలిస్ట్ మాత్రమే. అన్ని వర్గాల వారి జర్నలిస్ట్ కాదు.

Unknown said...

పాండే విలేఖరేనా? విలేఖరి గా చేస్తూ, మావోలకి సహాయం చేస్తూ, ద్వి పాత్రాభినయం చేస్తున్నాడా అనేది చూడాలి.
లేటెస్ట్ పేస్లిప్ ఉన్నంత మాత్రాన, అతనికి మావోలతో సంభందాలు లేవు అని ఎలా అనగలం. నేను ఏదో పేపర్ లో చూసాను (ఆంధ్రజ్యోతి అనుకుంట) పాండే - మావో ల సంబందాల ఆరోపణలు గతం లో కూడా ఉన్నట్లు, వేరే రాష్ట్రము లో పోలీసులు గతం లో FIR కూడా రిజిస్టర్ చేసినట్లు చూసాను. ఒకసారి ఒరిస్సా లో అరెస్ట్ ఐన మహిళా నక్సల్, పాండే సతీమణి పేరు చెప్పినట్లు కూడా కేసు రిజిస్టర్ అయ్యింది అంటున్నారు. మొదట ఎవరైనా గుర్తించవలసింది, వేరే వాళ్ళ మనవ హక్కులు హరించే వాళ్ళకి, హరిన్చటమే పనిగా పెట్టుకున్న వాళ్ళకి, నా హక్కులు హరిస్తున్నారు అని గోల పెట్టే హక్కు ఎలా ఉంటుంది?
శ్రీనివాసరావు

Rohith said...

http://www.koumudi.net/gollapudi/071210_ayyo.html

Gollapudi gaaru adiginattu (naalaanti anamaakudugu adigithe pattinchukoru kadaa 'media' vaallu anduke evaro oka pedda manishi article raase daaka aagi vaari article choopinchi adigithe ayinaa evaina samadhaanam dorukutundi ani chinna aasa.)

Azaad chachaadani chesina hungaama... dantewada lo ye paapam erugani jawaanlu chachinappudu okka mediaa ayinaa chesindaa? maoist champaaru anna maataku minchi okka media samstha kooda noru ettaledu. Ademani adigithe, gaayam cinema lo kota srinivas rao anattu "em chestaam? Khandistaam" ani chetulu dulupukunnaaru. deeni batti artham avutondi entante, media lo unna vaallu andaru piriki pandalu, government ko ledaa maoists ko bhayapadadame. Antha bhayapade vaallu media jobs enduku vastaaro, vachi media hakkula gurinchi enduku oo tega OA chestaaro naakaithe artham kaadu.

కెక్యూబ్ వర్మ said...

ఇక్కడ చాలా మంది మానవతావాదులు నక్సల్స్ హింస పట్ల స్పందిస్తున్నారు. కానీ దండకారణ్యంలో ఆదివాసీ తెగలపై పారామిలటరీ, సల్వాజుడుం, హర్మద్ వాహినీ, శాంతిసేనల పేరుతో జరుపుతున్న హత్యలు, అత్యాచారాలు, గృహదహనాలు గురించి తెలిసి మాటాడలేకపోతున్నారో, తెలియకో తెలియడంలేదు. చత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాలలో మీడియానుకూడా అనుమతించడంలేదు. ఆదివాసీ స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు గురించి వారు బయటకు వచ్చి చెప్పినా చిరునవ్వుల దివంగత సి.ఎం. ఎలా స్పందించారో తెలియదా? డబ్బైఏళ్ళ ముసలి ఆదివాసీ స్త్రీ స్తనాలను కోసి హత్యచేసిన పోలీసుల గురించి చదివారా? వార్తలను తొక్కిపెట్టమని రమణ్ సింగ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను విన్నారా? అసలు కల్లోలిత ప్రాంత చట్టం పేరుతో జరిగే విశృంఖల అరాచక అధికార దుర్వినియోగం గురించి మీకు తెలుసా? ఇవన్నీ తెలిస్తే సిఆర్.పిఎఫ్ పై జరిగిన దాడిపై మీ స్పందన వేరుగా వుంటుంది. పోలీసు క్యాంపులు వున్న వూర్లో స్త్రీల పరిస్తితి ఎలావుంటుందొ తెలియని వారు ఇలా మాటాడుతారు. అక్కడి ప్రజలే వాళ్ళకు క్యాంపుకు వుపయోగపడుతున్నాయని తమ స్కూళ్ళను కూలగొట్టుకొంటున్న సంఘటనలు వున్నాయి. హెల్మెట్ లేదనో, etc.. చలానా కడితేనే తిట్టుకుంటున్న మీరు తమ జీవితాలపై నేరుగా మోపిన ఉక్కుపాదం పట్ల జనం ఎలా స్పందించాలో కాస్తా ఆలోచించండి.

Saahitya Abhimaani said...

"....ఇక్కడ చాలా మంది మానవతావాదులు నక్సల్స్ హింస పట్ల స్పందిస్తున్నారు...."

మానవతావాదులు ఎప్పటికీ నిస్పక్షపాతంగా విషయాలను చూడలేరేమో!!!?. ఒకపక్క మానవతావాదులు నక్సలైట్ల హింసను విస్మరిస్తారు. మీరేమో మరోరకం మానవతావాదులు కూడా ఉన్నారు, వాళ్ళు పోలీసు హింసను విస్మరిస్తున్నారు అంటున్నారు. మీడియా రెండిటి మధ్య సమన్వయంగా వార్తలను అందించాలి. జర్నలిస్టుకు ఉన్న సొంత "ఇజాలను" చదివె వాళ్ళ నెత్తిన రుద్దటానికి యత్నించకూడదు అని నా అభిప్రాయం.

Anonymous said...

ఏ కారణం చేతనో ఈ దేశంలో మీడియావారి మానవతావాదం కేవలం అసాంఘికశక్తుల కోసం, జాతిద్రోహుల కోసం రిజర్వు చేయబడింది.

Kurmanath said...

kcube response choosi raastunna. sagam informationtho raasinattu vundi.
daadapu 400 mandi journalistlu hemachandra pandey ki nivali arpincharu. vaallalo chaala mandiki plots levu, buspasslu kooda vunnayi. akkadiki raanidi, object chesindi journalist nayakulu. vaallu expose ayyaru. vaallaki bus passlu avasaram ledu.

Kurmanath said...

(PS: dear blog manager, please add this to my earlier comment.)
Kcubeki inkaa cheppedi yemitante, buss passlu pothayemo ani bbhayapadani journalistlu hemachandra panday dead body manchiryala nunchi raavadaaniki, madhyalo policelu yennisarlu apinaa ambulanceni press club daaka teesuku vachcharu. Generic comments chesemundu konchem alochiste baguntundi.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి