Sunday, July 25, 2010

Reproductive Right అంటే...అచ్చోసిన ఆంబోతు హక్కా?

కోచ్ కౌశిక్, స్కూల్ అడ్మినిస్ట్రెటర్ అయూబ్ ల విషయంలో నేను రాసిన గత పోస్టు (ఈ నరరూప కీచకులకు బతికే హక్కు ఉందా?) పై వివిధ కోణాలలో జరిగిన/జరుగుతున్న చర్చకు కొనసాగింపు ఇది. ఈ విషయంలో ఇటు ఆంధ్రా నుంచి తాడేపల్లి గారు, అటు అమెరికా నుంచి శరత్ గారు ఎంతో శ్రమకోర్చి కామెంట్స్ పంపుతున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. 'ఏ.పీ.మీడియా కబుర్లు రాముడు మంచి బాలుడు' అన్న లెవల్లో తెగ బుద్ధిమంతుడిగా నటిస్తూ...పాత చింతకాయ పచ్చడి పెళ్లాన్నే కసిగా చూస్తూ...వంటి మాటలు కూడా శరత్ గారు వాడారు.

ఈ కోర్ట్ షిప్, ఫామిలీ సెట్ అప్, మ్యారేజ్ సిస్టం గురించి 'ఆన్త్రోపాలజి' లో నేను ఒకప్పుడు విపరీతంగా చదివి ఉన్నాను. పలు దేశాలలో ఈ వ్యవస్థల పనితీరు, బలాబలాలు చూస్తూ వచ్చాను. మొన్నామధ్య అమెరికా టూర్ లో కొందరు  ప్రొఫెసర్లు,  నాతో పాటు వచ్చిన ఒక కెన్యా జర్నలిస్టు వంటి వారితో ఈ అంశాల మీద చర్చ జరిపాక....నాకు భారతీయ వివాహ వ్యవస్థ ఒక వండర్ అనిపించింది. "ఒక ఆడ-ఒక మగ-ఒక జీవితం" సూత్రం అన్ని రకాలుగా బెస్ట్ అని నిర్ధారణకు వచ్చాను.

వివాహితులు (ఆడామగా) చాలా బాధ్యతాయుతంగా వివాహ బంధానికి కట్టుబడి ఉండాలని, భార్యకు తెలీకుండా ఇంకో అమ్మాయితో తనవు పంచుకోవడం తప్పని మన సమాజంలో చాలా మంది త్రికరణశుద్ధిగా నమ్ముతారు, పాటిస్తారు. దీనివల్లనే మన తాతలు, తండ్రులు, అమ్మమ్మలు, నానమ్మలు చచ్చే వరకు పతియే/పత్నియే దైవం అని బతికేశారు. పెళ్ళైన వాడు...అందంగా కనిపించిన అమ్మాయిని మానవ సహజమైన వికారంతో చూడడం వేరు...సెక్స్ కోసమని ప్రపోజ్ చేయడం, ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం వేరు. జీవితాంతం వేగలేమురా ఈ భార్యతో అనిగానీ...సెక్స్ సుఖం కోసం రోజుకో కొత్త భార్య కావాలని గానీ అనుకుంటే...హాయిగా విడాకులు తీసుకుని ఇంకొక ప్రయత్నం చేసుకోవడం ఉత్తమం. ఇంట్లో భార్యను ఉంచుకుని....ఆఫీసులో ఇంకొక అమ్మాయి (లేదా వివాహిత) ను ముగ్గులోకి దింపడం నా దృష్టిలో క్షమించరాని నేరం. అన్నీ ఎలా వున్నా...ఇది పెళ్లి నాటి బాసలను నమ్మి మనతో ఉంటున్న భార్యను దారుణంగా వంచించడం. ఈ వంచన హత్యాసాదృశ్యం. నాకు తెలిసి అన్ని మతాలూ....నమ్మకంతో కలిసి ఉంటామనే....జంటతో ప్రమాణం చేయిస్తాయి తప్ప...ఇంకొక సుందరి/సుందరుడు కనిపిస్తే....లేచిపోవచ్చు లేదా సెక్స్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇవ్వవు.  
 అదే భార్య...పరాయి పురుషుడు బాగా నచ్చి ప్రపోజ్ చేసి...కొత్త సెక్స్ సుఖం పొందితే ఏ భర్తా భరించలేడు. 'మా ఆమెకు (భార్యకు) నచ్చితే...వేరే మగాడికి ప్రపోజ్ చేసుకుని ఒకటి రెండు రోజులు గడిపి రావచ్చు. అప్పటిదాకా నేను పిల్లలను చూసుకుంటూ ఇంట్లో ఉంటా," అనే నయా సాంస్కృతిక వాదులు ఒట్టి అబద్ధాలకోర్లని నా అభిప్రాయం. సెక్స్ అంటే...ఒక్క భౌతిక సుఖం మాత్రమే...స్వచ్ఛమైన ఆత్మీయత, కట్టుబాటు, అనురాగాలకు ఇందులో ప్రమేయం లేదు...అనుకునే అల్పస్వభావుల వల్ల రకరకాల వితండవాదనలు వస్తున్నాయి. వివాహేతర సంబంధాలు కేంద్రంగా ప్రోగ్రామ్స్ చేసే ఈ బాధ్యతారహిత టీ.వీ.ఛానెల్స్ ఒక మంచి వ్యవస్థను సమాధి చేస్తున్నాయి. అంతిమంగా...ఈ గేమ్ లో ఒక ఆట వస్తువుగా, లూజర్ గా మిగిలేది అబలే కావడం....ఏ పరిణతి చెందిన వాదానికి రుజువు?

"ఒక ఆడ మనిషికి, ఒక మగ మనిషి" perfect equation అని నేను నమ్ముతాను. పాశ్చాత్య, గే & లెస్బియన్ సంస్కృతి విస్తరిస్తున్నా...ఈ సమీకరణ ను మార్చాల్సిన పనిలేదు. కోరికలు గుర్రాలు...వాటికి పగ్గాలు వేయకుండా..విచ్చలవిడి శృంగారం కోసం వెంపర్లాడితే శారీరక, ఆర్థిక నష్టాలు. పైగా ఒక అద్భుతమైన వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది పాత చింతకాయ పచ్చడి వాదనలా అనిపించవచ్చు...బర్గర్ బాబులకు. పాత చింతకాయలో ఉన్న మజా జుర్రుకోలేని వాడికి రేపు బర్గర్ పైనా మొహం మొత్తుతుంది. వాడి అన్వేషణ అంతా...బర్గర్ కు మించిన సుఖం కోసం. ఈ క్రమంలో సుఖం, శాంతి ఆవిరి అవుతాయి. ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది.

కౌశిక్ లాంటి కోచ్, ఆయూబ్ లాంటి టీచర్ గురించి నేను రాస్తే...తాడేపల్లి గారు...ఈ కింది వాక్యాలు రాసారు. 
"ఆడదానికి గర్భధారణ చేసే హక్కు ఎంత సహజమైనదో ఆడదాన్ని courtship చేసే పురుషత్వ హక్కు కూడా మగవాడికి అంత సహజమైనది. అది ఆడదాని Reproductive Right అయితే ఇది కూడా మగవాడి Reproductive Right. గర్భధారణ చేసినందుకు ఆడదాన్ని శిక్షించడం న్యాయం కానప్పుడు ఆమెని courtship చేసినందుకు మగవాణ్ణి శిక్షించడం కూడా అన్యాయమే. Man has a right to manliness."

"ప్రేమకీ, పెళ్ళికీ, సెక్సుకీ, వెంటపడ్డాలకీ హోదాలూ, వయసులూ, డిజిగ్నేషన్ లూ అడ్డం కావు."

ఇదొక అడ్డగోలు వాదన. కచ్చితంగా...కోచ్ లు, టీచర్లు, బాసులు అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి. కౌశిక్, అయూబ్ లు చేసింది ముమ్మాటికీ తప్పు (ప్రాథమిక సమాచారాన్ని బట్టి). వారికి వెంటనే గట్టి శిక్ష పడాలి.

 అయ్యా....ఆడది", "మగాడు" అన్న లెక్కన చూస్తూ మీ వాదన ప్రకారం పోతే...వయస్సు వచ్చిన కన్నకూతురు కు కూడా ప్రపోజ్ చేయడం తప్పు ఎలా అవుతుంది? అనే వాదన చేసే మహానుభావులు పుట్టుకొస్తారు. "Reproductive Right" కు చాలా పరిమితులు ఉన్నాయి. అది ఒక పెద్ద బాధ్యతతో కూడిన హక్కు. అంతే తప్ప అచ్చోసిన ఆంబోతు వ్యవహారం కాదు.

43 comments:

హరి said...

"courtship చేసే పురుషత్వ హక్కు కూడా మగవాడికి అంత సహజమైనది. అది ఆడదాని Reproductive Right అయితే ఇది కూడా మగవాడి Reproductive Right"

చాలా అసమంజసమైన వాదన. సంఘజీవనం, నాగరికత, వివాహ వ్యవస్థ లేని జంతు సమాజానికి ఇది వర్తిస్తుందేమో కాని, ఇప్పుడున్న మన వ్యవస్థకు కాదు. ఈ పునరుత్పత్తి హక్కును రాజ్యాంగంలో ఎక్కడా నిర్వచించి నట్టు కనపడదు. వీలయితే ఎవరైనా మరింత విశ్లేషించ గలరు. నా ఉద్దేశంలో ఇది రాజ్యాంగం ప్రసాదించిన మిగతా హక్కుల పరిధిలో, ఇతరుల హక్కులకు భంగం కలుగకుండా సాధించు కోవలసిన సామాజిక బాధ్యత.

Praveen Mandangi said...

ఒక స్త్రీ తన కంటే వయసులో చిన్నవాడైన పురుషుడిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదు అనే చెప్పేటప్పుడు పెళ్లికి వయసు అడ్డురాదు అని అంటారు. విలియం షేక్స్పియేర్ తన కంటే 8 ఏళ్లు పెద్దైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఉదాహరణ. కానీ ఇక్కడ తాడేపల్లి గారు చెపుతున్నది వేరు. సెక్స్ కి పిలిస్తే రాలేదని డబల్ మీనింగ్ లు మాట్లాడే ముసలి కీచకుడిని జస్టిఫై చేసేలా మాట్లాడుతున్నారు. ఆడది మగవాడిని పిలిస్తే ఆమె చెడిపోయింది అని అంటారు. మగవాడు ఆడదాన్ని పిలిస్తే చెడిపోయాడని అనరు. సమాజంలో ఇలాంటి ద్వంద్వ నీతి ఉన్నప్పుడు మగవాళ్లు పిలిస్తే వెళ్లడానికి ఆడవాళ్లు ఎలా ఒప్పుకుంటారు?

Unknown said...

రాము గారు కరెక్ట్ గా చెప్పారు .యిలా వెంపర్లాడే వాళ్ళంతా
భార్య దగ్గర సరైన సహకారం లేకే అని ముసుగు వేసుకుని ముందుకు పోతుంటారు .
ఆయుబ్ కుడా పోలీసులకి ఇచ్చిన వాగ్ములం లో
భార్య తో దూరం గా వుండడం తో చపల చిత్తం తో చేసానని వొప్పుకున్నాడు .
నన్నడిగితే యి సమస్యకి వొకటే పరిష్కారం
,సెక్స్ అన్నది యిరవై అయిదు ముప్పయి అయిదు మద్య లో వున్న
వయసు వాళ్ళకి మాత్రమె కలిగేలా మందులు కని బెడితే
తొంబై శాతం నేరాలు ప్రపంచం లో తగ్గి పోతాయి .

Anonymous said...

true sir!

Anonymous said...

రామూగారూ ! గతంలో నేను ప్రేమికగారికి సమాధానంగా ఇచ్చిన వ్యాఖ్యని మీరు ప్రచురించలేదు. మీ బ్లాగు మీ ఇష్టం. కాదనడం లేదు. ఇదైనా ప్రచురిస్తారని ఆశిస్తున్నాను.

మారిన మనుషులతో, మారిన కాలం తో పాటు మన కాన్సెప్టులు మారాలి. పాత నీతులు వల్లెవేయడం వల్ల ఈ రోజుల్లో ఏమీ ప్రయోజనం లేదు. Even as you and me are staunch sticklers to the old school of sexual morality, it is unrealistic to ignore the emerging new forms of man - woman equation and also their variegated dimentions which are coming to light. మగవాడి పట్ల ఆడవాళ్ళ దృక్పథంలో చాలా విప్ప్లవాత్మకమైన మార్పొచ్చింది. అలాగే ఆడవాళ్ళ పట్ల మగవాళ్ళ దృక్పథంలో కూడా మార్పు రాక తప్పదు. "అది రావచ్చు. కానీ ఇది రాకూడదు" అని మీరు వాదిస్తున్నారు. Good luck. మీకూ నాకూ ఇష్టమున్నా ;లేకపోయినా ముందో వెనకో ఆ మార్పు వచ్చి తీఱుతుంది. ఫెమినిస్టు చట్టాలు రాలేదా ? అలాగే ఇదీను.

సెక్సుకోరికల విషయంలో మనిషికీ జంతువుకీ ఏ తేడా లేదు. "ఉందని నమ్ముతాను మీరు అని భీష్మిస్తే అది మీ ఇష్టం". నిజానికి మనుషులు ఆ విషయంలో జంతువుల కంటే అధములు కూడా ! మగవాడి ప్రకృతిసిద్ధమైన కోర్ట్‌‍షిప్ హక్కుల్ని తిరస్కరించాక ఇక ఆడ-మగ సంబంధంలో ఏం మిగిలింది ? ఒక ఆడ - ఒక మగ అనేది ఈ రోజుల్లో రాజకీయంగా సాధువైన స్టేట్‌మెంట్ మాత్రమే. ఇది నా వ్యక్తిగత జీవితంలో నేను కూడా నమ్మేదే. కానీ చరిత్ర అలా చెప్పడంలేదు. కానీ మన ఇష్టానిష్టాల్ని ఎవఱి మీద రుద్దగలం ? ప్రజాస్వామ్యంలో మన వ్యక్తిగత ఇష్టానిష్టాల్ని చట్టాలుగా చేయడంలో గల ఔచిత్యం ఏంటి ? ప్రపంచంలో ఒక ఆడ- ఒక మగ మాత్రమే లేదు. అనేక రకాల conjugal preferences ఉన్నాయి. అనేక రకాల Sexual preferences ఉన్నాయి. అందులో మీరు పేర్కొన్నవి కూడా ఉన్నాయి. వాళ్ళందఱినీ నేఱస్థులుగా ప్రకటించి ఉరితీద్దామా ? చంపేద్దామా ? In what way are our sexual urges nobler than theirs ?

మన దేశంలో మన యొక్క తరతరాల మతపరమైన బ్యాక్ గ్రౌండ్ వల్ల, మనం లైంగికశీలానికి ఆపాదించే అగ్నిసదృశమైన పవిత్రత వల్లా మనుషులు లైంగిక కుంభకోణాలకి (అని తాము అనుకుంటున్నవాటి) కి స్పందించినంతగా గగ్గోలు పడినంతగా ఆర్థిక కుంభకోణాల పట్ల, నేఱాల పట్లా స్పందించరు. అందుచేత మనకి లైంగిక పోఖిరీలే అందఱికంటే దారుణమైన నేఱస్థుల్లా కనిపిస్తారు. నిజానికి, మనం కళ్ళు బార్లా తెఱుచుకొని, దేనికి ఇవ్వాల్సిన విలువ దానికి ఇవ్వగలిగితే sexually deviant behaviour అన్ని రకాల ఇతరనేఱాల కంటే తమ ప్రభావరీత్యా చిన్నతరహా నేఱాలని గమనిస్తాం. We deem only them to be horrific because as a nation, we are a sex-starved country. And also on this acount, some are jealous that others are able to enjoy more variety sex than themeselves, and also because, here in this coutry, everyone considers himself to be a born-keeper of others' sexual morality, especialy that of women.

Domestic Violence Act లో మగవాడితో Live-in రిలేషన్‌షిప్పే కాక అతనితో ఏ విధమైన లైంగిక సంబంధం కలిగి ఉన్న ఆడదైనా అతని మీద Domestic Violence case పెట్టొచ్చునని నిర్వచించారు. ఏది మఱి, ఆడ-మగ అంటే కేవలం భార్య-భార్త అని, కోర్ట్‌షిప్ అంటే వారిమధ్యనే ఉండాలని చెబుతున్న మీ నిర్వచనానికి భారత కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉండడం లేదేమి ? భార్యాభర్తలు కానివారిమధ్య కూడా కోర్ట్‌షిప్ కి కేంద్రప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు ఇందుమూలంగా స్పష్టం కావడంలేదా ? మఱి ఏది మన పాత ప్రపంచం ? ఏవి మన పాత విలువలు ? ఏవి మన పవిత్రతానిర్వచనాలు ? చెప్పండి. నేను కోర్ట్‌షిప్ విషయంలో భార్యభర్తల్ని పరిగణనలోకి తీసుకోకపోవడంలో ఏమైనా తప్పుందా ?

సుజాత వేల్పూరి said...

మీ అభిప్రాయాలతో 100% ఏకీభవిస్తున్నాను. శరత్ అటువంటి మాటలు వాడినా తర్వాత క్షమాపణలు చెప్పారు గాబట్టి వారి స్పోర్టివ్ నెస్ కి అభినందించాల్సిందే!

ఆదిమానవుల స్థాయి అభిప్రాయాలకు అంత విలువ మీరు ఇవ్వాల్సిన పని లేదు. వాటిని ఎవరూ కూడా పట్టించుకోరు. "నీతి"అనేది ఒకటి సమాజంలో ఇంకా బతికుందనీ అది విచ్చలవిడిగా తిరిగే మనుషుల(అది ఆడైనా మగైనా సరే)దగ్గర లేకపోయినా మామూలుగా బతికే సామాన్య జనులకుంటుందనీ గ్రహించక, అందరికీ ఒకేరకంగా అప్లై చేయాలని చూసే వాదనలు నిలబడవు,.

స్కూలు ప్రిన్సిపాల్ అయూబ్ విషయంలో కూడా "ఆ విద్యార్థినులే వాడికి ప్రపోజ్ చేసి ఉంటారు లేకపోతే అతడికేం పని?"అన్న వాదనలు ఇంకా లేవనందుకు సంతోషించాలేమో ఇక!

Krishnarjun said...

Source : http://www.indiatogether.org/

What Is Sexual Harassment?

According to The Supreme Court definition, sexual harassment is any unwelcome sexually determined behaviour, such as:-

Physical contact
A demand or request for sexual favours
Sexually coloured remarks
Showing pornography
Any other physical, verbal or non-verbal conduct of a sexual nature.
Sexual Harassment takes place if a person:


subjects another person to an unwelcome act of physical intimacy, like grabbing, brushing, touching, pinching etc.
makes an unwelcome demand or request (whether directly or by implication) for sexual favours from another person, and further makes it a condition for employment/payment of wages/increment/promotion etc.
makes an unwelcome remark with sexual connotations, like sexually explicit compliments/cracking loud jokes with sexual connotations/ making sexist remarks etc.
shows a person any sexually explicit visual material, in the form of pictures/cartoons/pin-ups/calendars/screen savers on computers/any offensive written material/pornographic e-mails, etc.
engages in any other unwelcome conduct of a sexual nature, which could be verbal, or even non-verbal, like staring to make the other person uncomfortable, making offensive gestures, kissing sounds, etc.
It is sexual harassment if a supervisor requests sexual favours from a junior in return for promotion or other benefits or threatens to sack for non-cooperation. It is also sexual harassment for a boss to make intrusive inquiries into the private lives of employees, or persistently ask them out. It is sexual harassment for a group of workers to joke and snigger amongst themselves about sexual conduct in an attempt to humiliate or embarrass another person.

Quid pro quo and hostile work environment are the two broad types of sexual harassment.

Sexual harassment at workplace is generally classified into two distinct types. 'Quid pro quo', means seeking sexual favours or advances in exchange for work benefits and it occurs when consent to sexually explicit behaviour or speech is made a condition for employment or refusal to comply with a 'request' is met with retaliatory action such as dismissal, demotion, difficult work conditions. 'Hostile working environment' is more pervasive form of sexual harassment involving work conditions or behaviour that make the work environment 'hostile' for the woman to be in. Certain sexist remarks, display of pornography or sexist/obscene graffiti, physical contact/brushing against female employees are some examples of hostile work environment, which are not made conditions for employment.

Unwelcome:

UNWELCOME is the key in defining sexual harassment. It is the impact and effect the behaviour has on the recipient that will define the behaviour as sexual harassment.

Praveen Mandangi said...

కౌశిక్ కేవలం మగవాడు కనుక అతన్ని జస్టిఫై చేస్తున్నారు. ఒక ఆడ కోచ్ ఒక మగ క్రీఇడాకారుడిని అలా పిలిచి ఉంటే జస్టిఫై చేసేవారా? సమాజం మారిపోయింది, స్త్రీలు బరితెగించేస్తున్నారు అని బాధపడేవారు.

Pavani said...

తాడేపల్లి గారి blog చదివాక నాకర్ధమైన్ది ఏమిటన్టే, he writes and thinks at a different plane. నేను US లో వున్టా. Sexual harassment అనేది ఇక్కడ male and female ఇద్దరికీ వర్తిన్చే విషయము. But India లో మగవాళ్ళు మాత్రమె harass చేస్తారు, ఆడవాళ్ళు చెయ్యరని ఇద్దరూ నమ్ముతారనుకున్టా! Such thinking leads to obvious bias. ఉదాహరణకి అమ్మాయిలు అబ్బాయలను ప్రేమిన్చి మోసమ్ చెసారని నేనెక్కడా చదవలేదు. అన్టే, చెయ్యరా? నాకే కొన్ని examples తెల్సు. World Over stereo types about gender are fast changing. But they may not have been recognised yet everywhere. For example study after study in US and UK shows girls drink, smoke, steal, indulge in early and casual sex and turn aggressive more than boys. In India, I agree girls haven't changed so much but there is every reason to believe that the direction is towards what is happening everywhere. If you notice, in India laws, media, politicians and ofcourse feminists are all gender biased. I think Tadepalli gaaru was irked by such stereo typing.
Coming to the main news item Koushik's harassment, I do not really know or follow much. May be Koushik has misused his position and authority. If it is true, he needs to be punished. However, arguement sake, if the girl has proposed her coach in return of some favours and the coach took action on her citing misconduct(which is impossible BTW), I doubt he gets any support. In fact there is a chance that the girl may have complained similar way anyway and getaway unscratched. The current system provides that oppertunity. Some women do misuse. Don't ask me how many girls do like that. i don't know the percentage. And I do believe you don't know either. But the direction is clear. Attributes that are
once totally male domain are now apply to both genders. It is foolish to ignore that simple fact.

అన్దుకే, Dear Ramu gaaru, I do not like the caption (వీళ్ళకసలు బతికే హక్కున్దా?) , It may be politically correct statement but silly.

krishna said...

@ రాము గారు,
మీరు చెప్పిన విషయాలు అందరికి ఆచరణీయమే! అలా ఆదర్శవంతంగా మన ప్రపంచం/ దేశం/ రాష్ట్రం వుందనుకుంటే అదొక మనశ్శాంతి. కానీ అలా లేదెమో?
టీచర్ - విధ్యార్ధిని విషయంలో ఎవరు మీ అభిప్రాయాలని తప్పు పట్టడం లేదు.ఎందుకంటే చాలా వరకు విధ్యార్ధినిలు మైనర్లు కాబట్టి.
కానీ కోచ్ , సాఫ్ట్‌వేర్ జాబులలో టీం లీడర్..మిగిలిన ప్రొఫెషన్లలో సీనియర్లు చేసె పని చేస్తాడు.తనకి తెలిసిన పనిని / ఆటని ఇతరులకి నేర్పడం! ఇక్కడ గురు శిష్య సంబంధం .. ప్రతి దగ్గరా వున్నట్టే! కాకపోతే విషయం ఇద్దరు మేజర్లకి సంబందించినిది.
బలహీనతలు అందరికి వుంటాయి. అవి బయటకి రానివ్వకపోవడం సంస్కారం.
తమలోని కోరికలని తీర్చుకోవడం తప్పు కాదు,ఇద్దరికి ఇష్టపూర్వకమైతే!
ప్రతి మగాడికి స్త్రీకి తమ పార్టనర్ తో సర్వ సుఖాలు దొరికేస్తాయా?
ఒక ఆడది నపుంసుకుడు అయిన భర్త వలన సుఖం పొందలేక పోతె , విడాకులు తీసుకునే పరిస్థితి లేకపోతే అప్పుడు సుఖం కోరుకోవడం తప్పు కాదు కదా!
బహుశా మొగుడిని వదిలెయ్యమంటారా? పోషణ కోసం భర్త మీద ఆధారపడిన స్త్రీ అలా చెయ్యగలదా? ఆమెకి సుఖం అక్కరలేదా?
శారీరక సుఖం కూడా అవసరాలలోకి రాదా?
మీడియాలో వున్న విపరీత ధోరణి మీలో కూడా వున్నట్టు వుంది. నిందితుడిని నేరస్థుడిని చేసెసి , వారి బతికే హక్కులని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలు చెప్పిన వెర్షన్ లో కూడా కౌశిక్ కేవలం ప్రపోజ్ చేసాడని , తాను ఏమి చెప్పలేదని వుంది. ఆమె నిరాకరించకపోతే అతడికి ఎలా తెలుస్తుంది? డైరెక్ట్ గా కేసు పెట్టేముందు ఆమె అతడిని ఒకసారి మందలించి చూడవలసింది అని మీకు అనిపించడం లేదా?

Ramu S said...

ఎల్.బీ.ఎస్.గారు...
మీరు ప్రేమిక గారి కి స్పందనగా పంపిన కామెంట్ నాకు అందలేదు. వీలయితే మళ్ళీ పంపండి. కామెంట్స్ కిల్ చేసే అలవాటు నాకు లేదు. అది web readers' right.
Cheers
Ramu

సత్యాన్వేషి said...

శ్రీ తాడేపల్లి గారు మతాన్ని సమర్ధిస్తూ తమ బ్లాగులో ఇలా రాసుకున్నారు:

"ఎందుకంటే పెళ్ళినీ, కుటుంబవ్యవస్థనీ సృష్టించినది మతమూ, మతవిశ్వాసాలూ మాత్రమే."
"మతాన్ని తొలగించి వాటిని పరికించినప్పుడు, అసలు పెళ్ళెందుకు చేసుకోవాలో, చేసుకుంటే ఒక్కఱినో ఎందుకు చేసుకోవాలో, చేసుకున్నంతమాత్రాన బయటి వ్యక్తులతో ఎందుకు ఆనందించకూడదో, పిల్లలకు తల్లిదండ్రులు ఎందుకు బాధ్యత వహించాలో, తల్లిదండ్రులు తమ పిల్లలతో సెక్స్ ఎందుకు అనుభవించకూడదో ఏమీ అర్థం కాకుండా పోతుంది. "
"పెళ్ళి, కుటుంబజీవితమూ, వావి-వరుసలూ - ఇవన్నీ నిగ్రహమూ, స్వార్థ పరిత్యాగమూ అనే కాన్సెప్టుల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ కాన్సెప్టుల్ని బోధించినది మతం. మతాన్ని తీసేస్తే ఈ కాన్సెప్టులు మరణిస్తాయి. వాటితో పాటు ఈ వ్యవస్థలు కూడా మరణిస్తాయి."


మతాన్ని ఇంతగా ప్రేమించే ఈ వ్యక్తి ఇప్పుడు వావి వరసలు మరిచి పెళ్ళై, పిల్లలు కలిగిన ఒక యాభై ఏల్ల కోచ్ తన సిశ్యురాలిని తనతో సెక్స్‌లో పాల్గొనమని వేధిస్తుంటే చక్కగా సమర్ధిస్తున్నాడు.

Praveen Mandangi said...

కృష్ణ గారు. భారతీయ సామాజిక పరిస్థితులు వేరు, ఇతర దేశాలలో సామాజిక పరిస్థితులు వేరు. విదేశాలలో పెళ్లైన తరువాత కూడా ఇతర వ్యక్తులతో సెక్స్ చేస్తారు. భార్య, భర్త పరస్పర అంగీకారంతోనే ఇతర వ్యక్తులతో సెక్స్ చేస్తారు. కానీ ఇండియా పరిస్థితి వేరు. మగవాడు తాను పరాయి ఆడవాళ్లతో తిరగడం మగతనం అనుకుంటాడు. తన భార్య పరాయి మగవాడితో తిరిగితే విడాకులు ఇచ్చేస్తాడు.

UG SriRam said...

*కౌశిక్ లాంటి కోచ్, ఆయూబ్ లాంటి టీచర్ గురించి నేను రాస్తే...తాడేపల్లి గారు...*

మీరు తాడెపల్లి రాసిన దాని సరిగ్గా అర్థం చేసుకోలెదని తెలుస్తోంది. నిజం గా వారు చెసింది అన్యాయం ఐనప్పుడు చట్టం ఉంది కదా. మళ్ళీ మీడియా వారు ఇలా గగ్గోలు పెట్టటం అవసరమా?

-------------------------------------------
మీరు ఒకప్పటి మధ్యతరగతి మన్స్తత్వం తో (1970-1990 మధ్య కాలం) ఇప్పటి పరిస్థితులను బేరీజు వేస్తున్నారు. మీ వాదన ప్రకరాం ఆలోచిస్తూ పొతె తల్లిదండ్రులు వయసొచ్చిన అమ్మాయిలను(<15 సం||) చదువు పేరిట ఎక్కడొ దూరంగా ఉన్న స్కులు లో ఎలా చెర్పిస్తారు? మీరు ఆ స్కులు పిల్లలకు జరిగింది చూసి తెగ వర్రి కావలసిన అవసరం లేదు. అదేమి వీధి బడి కాదు, దానిలో ఉన్న అంతర్జాతీయ ప్రమాణలను చూసి వారి తల్లిదండృలు చేర్పించారు. రాము గారు ఇప్పటి కాలం తల్లిదండ్రులు మీరు అనుకున్నట్టుగా అంతా 100% అంత మంచి వారు కాదు. చాలా డబ్బున్న ఇళ్ళలో వారికి పిల్లలు ఒక పెద్ద బరువు అందువలన వారిని ఇటువంటి స్కుళ్ల లో చెరిపిస్తారు. పాత రోజులలో లా పిల్లలు పట్టిచుకునే ఓపిక తల్లిదండృలకు ఇప్పుడు లేదు. ఇటువంటి తల్లిదండ్ర్లకు మన బోటి వారం మన ఊరులో ఎన్నొ మంచి బడులు ఉండగా ఆవూరులో ఎందుకు పిల్లల్ను ఒంటరిగా హాస్టల్స్ లో చెర్పిస్తున్నారు అని అడిగితె వారు ఈ స్కుల్ గొప్పలని మనకి ఎకరువు పెట్టి మనకే ఎమి తెలియదని స్పష్టం చేస్తారు. ఎక్కువ మాట్లాడితె మీకు ప్రస్తుత ట్రెండ్ ఎలా ఉందో తెలీయదని వట్టి పాత చింతకాయ పచ్చడాని నిరుపిస్తారు. చూడ బోతె మీరు దుర్గెశ్వర రావు గారు జర్నలిస్ట్ ఐతె ఎలా ఉంటారొ అలా ఉన్నారు.

ranjani said...

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు తన బ్లాగు అడ్రసుని ఇక్కడ
ఇచ్చినా ఆయన బ్లాగు వ్రాతలని ఇక్కడ పేర్కొని వాదించడం
వల్ల ప్రయోజనమేమీ కనిపించడం లేదు. ఇక్కడ ఆరోగ్యకరమైన
చర్చ కంటే అనవసరపు వాదనలు (నా భావనలే సరైనవి అని
గెలవాలని !) చేయడమే కనిపిస్తోంది నాకు !!

RG said...

@Tadepalli garu

"మన దేశంలో మన యొక్క తరతరాల మతపరమైన బ్యాక్ గ్రౌండ్ వల్ల, మనం లైంగికశీలానికి ఆపాదించే అగ్నిసదృశమైన పవిత్రత వల్లా మనుషులు లైంగిక కుంభకోణాలకి (అని తాము అనుకుంటున్నవాటి) కి స్పందించినంతగా గగ్గోలు పడినంతగా ఆర్థిక కుంభకోణాల పట్ల, నేఱాల పట్లా స్పందించరు. అందుచేత మనకి లైంగిక పోఖిరీలే అందఱికంటే దారుణమైన నేఱస్థుల్లా కనిపిస్తారు. నిజానికి, మనం కళ్ళు బార్లా తెఱుచుకొని, దేనికి ఇవ్వాల్సిన విలువ దానికి ఇవ్వగలిగితే sexually deviant behaviour అన్ని రకాల ఇతరనేఱాల కంటే తమ ప్రభావరీత్యా చిన్నతరహా నేఱాలని గమనిస్తాం."

Hear hear sirs !!

UG SriRam said...

@సత్యాన్వేషి , ఊరకనే సత్యాన్వేషి అని బ్లాగుకు పేరు పెట్టుకోవటం కాదు. కళ్ళు తెరచుకొని ప్రపంచాన్ని చూడు తాడేపల్లిని విమర్సించే ముందు.

సంఘజీవనం, నాగరికత, వివాహ వ్యవస్థ లేని జంతు లేని జంతు సమాజానికి ఇది వర్తిస్తుందేమో కాని, ఇప్పుడున్న మన వ్యవస్థకు కాదు.
@ హరి దోర్నాల గారు, మీరు రాసిన టపాలు చదివితె హెతువాదిలా కనిపిస్తారు కాని మీరు తాడెపల్లి వ్యాఖ్యను విమర్సించటం చూస్తుంటె నవ్వొస్తున్నాది. మీలో పాతుకు పోయిన భూస్వామ్య భావజలం/ సంస్క్రుతి మీరు గుర్తించినట్టు లేదు. పైకి సామ్యవాదం,సైన్స్ లాంటి వాటిని మద్దతిస్తూ మాట్లాడే మిరు సెక్స్ విషయం వచ్చెసరికి వివాహ వ్యవస్థ అనే ఎన్నో వేల సంవ|| పాత వ్యవస్థన్ని పట్టుకొని నాగరికత,సంఘజీవనం అనే ముసుగులో అదే విధంగా కొనసాగించు కోవాలంటం మీలొని అసలు మనిషిని చూపిస్తున్నాది. వివాహ వ్యవస్త కి మతానికి దేశ సంస్కృతికి అవిభాజ్యమైన సంబందం ఉంది. మీ బోటి ఆధునికులు ఇంకా ముక్కిపోయిన ఎప్పుడొ వేల సం|| కాలం లో మతలో భాగం గా ప్రతిపాదించిన వివాహ వ్యవస్తను నెత్తికెత్తు కోవటం ఎమి బాగా లేదు.

katta jayaprakash said...

It is better to keep full stop to the discussion on sexual harasment as it is deviating from the main track of media kaburlu into kaburlu on sex and sexual relationships.It is an undending discussion without any final conclusion or goal wit unanimity.Let us change the subject to thevcurrent affairs in the media.
JP.

Unknown said...

dear ramu
I am observing the blog for long time. Earlier I thought it’s elementary. Your understanding of journalism and your comments lacks depth. But I thought that you are having some kind of sincerity and sensibility. But later you proved me wrong. After initial posturing you started to play to gallery. You are fallowing Telugu cinema tactics to attract viewers. How can you rate bosses depend on some perceptions. How can you brand somebody with superlatives like utthama and chetta basing on some bloggers? When we take the cynicism prevailing in Telugu media in to consideration it is easy to expect what kind of comments you may get. Many a times perceptions deceive truth. Don’t you know this basic fact? And now this batike hakkunda comment? Undemocratic is very small word to describe your attitude. A journalist shouting for blood! A journalist shouting for instant justice basing on some media reports! Wow! Viva ramu bhai!
And it is disgusting to read the comments and your response. A wrong debate is going on about rights. It is not the question of productive or reproductive right. The basic question is using your position and power for personal favors. *Black*mailing your colleagues by using your position for personal favors. It is nothing to with eka patni vratamu, mariyu thokka tolu debate. thank you

Ramu S said...

journalist 1972,
True boss, your observation is correct. My understanding of journalism lacks depth. Now I found thorough you that I don't have sincerity and sensibility.

Meanwhile, what is this "Black"mailing? Here I can't buy your observation.
May God bless you
Ramu

సత్యాన్వేషి said...

@రమ

>>>సంఘజీవనం, నాగరికత, వివాహ వ్యవస్థ లేని జంతు లేని జంతు సమాజానికి ఇది వర్తిస్తుందేమో కాని, ఇప్పుడున్న మన వ్యవస్థకు కాదు.

మతాన్ని నేనెప్పుడూ సమర్ధించలేదు. ఆ విషయం చెప్పింది తాడేపల్లి గారు, కాబట్టి మీరు పై విషయం ఆయనకు చెప్పండి. ఆ మాటలు కోట్ చెయ్యడంలో నా ఉద్దేషం: మతం లేకపోతే వావి వరసలు మిగలవని చెప్పి మతాన్ని సమర్ధించిన పెద్దమనిషి ఇప్పుడు మతంపై తన అభిప్రాయాన్ని మాంచుకున్నాడా, లేక ఆయన సిద్ధాంతాన్ని మార్చుకున్నాడా అని అడగడమే నా ఉద్దేషం.

Anonymous said...
This comment has been removed by the author.
Saahitya Abhimaani said...

Ramuji,

Why we come to your blog is that there is exclusive discussion on media.

This is to inform that you are deviating from your focussed area and going towards the run of the mill.

Praveen Mandangi said...

నాస్తికులు పెళ్లి చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రార్ ఆఫీస్ లో మతంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. వివాహ వ్యవస్థ నాస్తికత్వానికి వ్యతిరేకం కాదు. ఇక్కడ విమర్శిస్తున్నది అవసరమైనప్పుడు మతాన్ని, అవసరం లేనప్పుడు నాస్తికత్వాన్ని వాడుకునేవాళ్లనే. అంతే కానీ నాస్తికత్వాన్ని విమర్శించడం లేదు.

Anonymous said...

వావివరుసల గుఱించి అసలు ఈ సందర్భంలో నేను వ్రాయనే లేదు. ఈ టాపిక్ ఎందుకెత్తుతున్నారో అర్థం కావడంలేదు. నేను వ్రాసినదల్లా స్త్రీపురుష సంబంధాలకు వయసు, హోదా లాంటివి నియమాల్ని ఏర్పఱచజాలవు అని ! ఒక కాంటెక్‌స్టూ అదీ ఏమీ లేకుండా ఎక్కణ్ణుంచో ఏదో ఉటంకించి ఈ సందర్భానికి అన్వయించ బూనుకోవడం మేధోనిజాయితీ అనిపించుకోదు. ఇక్కడ మన కాంటెక్‌స్టులో ముసలివాళ్లు పడుచువాళ్ళని ప్రేమించవచ్చు. పడుచువాళ్ళు ముసలివాళ్ళనీ ప్రేమించవచ్చు. మనకేంటి అభ్యంతరం ? అలాగే విద్యార్థినులుగా మొదలై భార్యలైనవాళ్ళు ఉన్నారు (అంటే గురువులుగా మొదలై భర్తలైనవాళ్ళు కూడా ఉన్నారు). ఒకే భర్తని పెళ్ళి చేసుకొని ఒకే కప్పు కింద కాపరం చేస్తున్న భార్యలూ ఉన్నారు. అక్కడ ఉభయసమ్మతి ఉంది కనుక అది బానే ఉంది. ఇక్కడ లేదు కనుక వివాదాస్పదమవుతున్నది. అటువంటప్పుడు ఒకాయన కోచ్ అయిన కారణం చేత, లేదా ఇప్పటికే పెళ్ళయింది కనుక ఒక ఆడదాన్ని ప్రేమించకూడదు/ కామించకూడదు అంటే నాకు సహజంగానే విచిత్రంగా అనిపిస్తున్నది. ఇందులో పశుత్వం ఏంటో నేనర్థం చేసుకోలేక పోతున్నాను. హోదాని దుర్వినియోగం చేయడమంటున్నారు. హోదా లేని మగవాణ్ణి ఏ ఆడది ప్రేమిస్తుంది ? ఏ హోదా లేని ప్రేమికుడు సాధారణంగా ఒక సగటు ఆడదాని దృష్టిలో ఒక పనికిమాలినవాడే అవుతాడు. కాబట్టి ఆడదాని ప్రేమని పొందే ప్రయత్నంలో భాగంగా మగవాళ్ళు తమ హోదాల్ని ఉపయోగిస్తారు. కాబట్టి అందులో కూడా నాకెలాంటి తప్పూ కనిపించడం లేదు. Man-woman romantic chemistry లో ఇలాంటివి చాలా ఉంటాయి.

వివాహమే కాదు, మనకు తెలిసిన అన్ని వ్యవస్థలూ - (ప్రభుత్వంతో సహా) మతంలో భాగంగా, మతబోధల అనుసారం జన్మించినటువంటివే. ఆ తరువాత ఎప్పుడో ఏ కాలంలోనో అవి మతపరిధి నుంచి బయటపడి లౌకికం (సెక్యులర్) అయ్యాయి. మొదట్లో మతగురువే రాజుగా కూడా ఉండేవాడు. గురువు దైవస్వరూపం కనుక రాజు కూడా దైవస్వరూపమయ్యాడు. నేను మతవాదిని కదా అని ఇప్పుడు మతగురువుల్ని రాజులుగా చెయ్యమని అడగలేను కదా ! అలాగే నేను మతవాదిని కదా అని ఇప్పుడు రూపే మార్చేసుకొన్న, అన్నివిధాలా భ్రష్టుపట్టిపోయిన వివాహవ్యవస్థని సమర్థించలేను కూడా ! ఇంత భ్రష్టవ్యవస్థలో భాగమై బతికే బదులు Back to basics అనుకుంటూ అంతా మొదట్నుంచి మొదలుపెట్టుకు రావడం మంచిది. అందుకే గ్లామర్ కోల్పోయిన ఈ "భార్యాభర్తలు" అనే పదాల్ని పరిమితంగా వాడుతున్నాను.

మారింది నేను కాదు బాబూ. మనుషులు మారారు. ఆడవాళ్లు మారారు. మతాదర్శాల నుంచి సుదూరంగా జఱిగిపోయారు. నా మతభాష వారికి అర్థం కావడం లేదు. అందుకని నేను వారి యొక్క ఆధునికభాషలోనే మాట్లాడదల్చుకున్నాను. తప్పా ?

Anonymous said...

వావివరుసల గుఱించి అసలు ఈ సందర్భంలో నేను వ్రాయనే లేదు. ఈ టాపిక్ ఎందుకెత్తుతున్నారో అర్థం కావడంలేదు. నేను వ్రాసినదల్లా స్త్రీపురుష సంబంధాలకు వయసు, హోదా లాంటివి నియమాల్ని ఏర్పఱచజాలవు అని ! ఒక కాంటెక్‌స్టూ అదీ ఏమీ లేకుండా ఎక్కణ్ణుంచో ఏదో ఉటంకించి ఈ సందర్భానికి అన్వయించ బూనుకోవడం మేధోనిజాయితీ అనిపించుకోదు. ఇక్కడ మన కాంటెక్‌స్టులో ముసలివాళ్లు పడుచువాళ్ళని ప్రేమించవచ్చు. పడుచువాళ్ళు ముసలివాళ్ళనీ ప్రేమించవచ్చు. మనకేంటి అభ్యంతరం ? అలాగే విద్యార్థినులుగా మొదలై భార్యలైనవాళ్ళు ఉన్నారు (అంటే గురువులుగా మొదలై భర్తలైనవాళ్ళు కూడా ఉన్నారు). ఒకే భర్తని పెళ్ళి చేసుకొని ఒకే కప్పు కింద కాపరం చేస్తున్న భార్యలూ ఉన్నారు. అక్కడ ఉభయసమ్మతి ఉంది కనుక అది బానే ఉంది. ఇక్కడ లేదు కనుక వివాదాస్పదమవుతున్నది. అటువంటప్పుడు ఒకాయన కోచ్ అయిన కారణం చేత, లేదా ఇప్పటికే పెళ్ళయింది కనుక ఒక ఆడదాన్ని ప్రేమించకూడదు/ కామించకూడదు అంటే నాకు సహజంగానే విచిత్రంగా అనిపిస్తున్నది. ఇందులో పశుత్వం ఏంటో నేనర్థం చేసుకోలేక పోతున్నాను. హోదాని దుర్వినియోగం చేయడమంటున్నారు. హోదా లేని మగవాణ్ణి ఏ ఆడది ప్రేమిస్తుంది ? ఏ హోదా లేని ప్రేమికుడు సాధారణంగా ఒక సగటు ఆడదాని దృష్టిలో ఒక పనికిమాలినవాడే అవుతాడు. కాబట్టి ఆడదాని ప్రేమని పొందే ప్రయత్నంలో భాగంగా మగవాళ్ళు తమ హోదాల్ని ఉపయోగిస్తారు. కాబట్టి అందులో కూడా నాకెలాంటి తప్పూ కనిపించడం లేదు. Man-woman romantic chemistry లో ఇలాంటివి చాలా ఉంటాయి.

వివాహమే కాదు, మనకు తెలిసిన అన్ని వ్యవస్థలూ - (ప్రభుత్వంతో సహా) మతంలో భాగంగా, మతబోధల అనుసారం జన్మించినటువంటివే. ఆ తరువాత ఎప్పుడో ఏ కాలంలోనో అవి మతపరిధి నుంచి బయటపడి లౌకికం (సెక్యులర్) అయ్యాయి. మొదట్లో మతగురువే రాజుగా కూడా ఉండేవాడు. గురువు దైవస్వరూపం కనుక రాజు కూడా దైవస్వరూపమయ్యాడు. నేను మతవాదిని కదా అని ఇప్పుడు మతగురువుల్ని రాజులుగా చెయ్యమని అడగలేను కదా ! అలాగే నేను మతవాదిని కదా అని ఇప్పుడు రూపే మార్చేసుకొన్న, అన్నివిధాలా భ్రష్టుపట్టిపోయిన వివాహవ్యవస్థని సమర్థించలేను కూడా ! ఇంత భ్రష్టవ్యవస్థలో భాగమై బతికే బదులు Back to basics అనుకుంటూ అంతా మొదట్నుంచి మొదలుపెట్టుకు రావడం మంచిది. అందుకే గ్లామర్ కోల్పోయిన ఈ "భార్యాభర్తలు" అనే పదాల్ని పరిమితంగా వాడుతున్నాను.

మారింది నేను కాదు బాబూ. మనుషులు మారారు. ఆడవాళ్లు మారారు. మతాదర్శాల నుంచి సుదూరంగా జఱిగిపోయారు. నా మతభాష వారికి అర్థం కావడం లేదు. అందుకని నేను వారి యొక్క ఆధునికభాషలోనే మాట్లాడదల్చుకున్నాను. తప్పా ?


ఎందుకో మీ బ్లాగులో వ్యాఖ్యాల్ని టపా చేయడం యమయాతనగా ఉంది. మీ బ్లాగ్ సెట్టింగుల లోపమో, నా కంప్యూటర్ లోపమో తెలియడం లేదు.

Anonymous said...

ముందసలు మగవాడికంటూ కొన్ని పురుషత్వ హక్కులున్నాయని సమాజం గుర్తిస్తే గదా, వాటిని రాజకీయపత్రాలలో కోడిఫై చేసేది. ఆడదాని హక్కులకు లభించిన ప్రచారం మగవాడి హక్కులకు లభించలేదు. అసలవి ఏంటి అనేది ఎవఱికీ తెలియదు. వాటి గుఱించి ఆడవాళ్లు మహిళాసంఘాల రూపంలో ఆర్గనైజ్ అయినట్లుగా మగవాళ్ళు ఆర్గనైజ్ కాలేదు. కాలేకపోతున్నారు, తాము మగవాళ్ళమనే స్పృహ పూర్తిగా లోపించడం వల్లను, ఇంకా ఆడవాళ్లు తమ చెప్పుల కింద తేళ్ళలాగానే ఉన్నారనే పాతకాలపు భ్రమల్లో కొనసాగుతూండడం వల్లనూ ! అందుకని వాటి గుఱించి ప్రస్తావిస్తేనే విచిత్రంగా ఉంది. కానీ ఈ ఆధునిక ఆర్గనైజ్డ్ ప్రపంచంలో హక్కుల ప్రస్తావన లేకుండా ఒక వ్యక్తిగా గానీ, కులంగా గానీ, మతకమ్యూనిటీగా గానీ, జెండర్ గా గానీ బతకడం అసాధ్యం.

హరి said...

రమ గారు,

నా వ్యాఖ్య హేతువాదానికి ఏవిధంగా వ్యతిరేకమో మీరు చెప్పలేదు.

"వివాహ వ్యవస్థ అనే ఎన్నో వేల సంవ|| పాత వ్యవస్థన్ని పట్టుకొని..."

వివాహ వ్యవస్థ ఎన్నో ఏళ్ళనాటిది కాదు, ఇప్పుడున్నదే. అంతకన్నా మంచి వ్యవస్థ ఉంటే అది ఏమిటో మీరు చెప్పండి. బాగుంటే దానికోసం కృషి చేద్దాం.

Sujata M said...

రాము గారు... అభినంధనలు. చాలా చక్కగా రాసారు. ఆడపిల్లల తండ్రులకు కూడా సెన్సిటివిటీ లేకపోవడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. అది అధైర్యం వల్ల కలిగిందా లేక సంకుచితత్వం వల్లనా అనేది అర్ధం కాలేదు. ఇలాంటిదే వాళ్ళ పిల్లలకు గానే భార్యకు గానీ ఎదురయితే, ఎంతవరకూ వాళ్ళకు ఆలంబన గా నిలుస్తారో తెలీటం లేదు. మీతో 100% ఏకీభవిస్తున్నాను.

హరి said...

రమ గారు,

హేతువాదం అంటే సమాజంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉండకూడదని చెప్పడం కాదు. నియమ నిబంధనలు హేతుబద్ధంగా ఉండాలని చెప్పడమే.

Jagadeesh Reddy said...

ఈ విషయంలో నేను 100% రాము గారిని సమర్ధిస్తూ రాసిన టపా... పిల్లల్ని ప్రేమించాలి గాని... కామించకూడదు...

http://saradaa.blogspot.com/2010/07/blog-post_25.html

Pavani said...

(Female) Gender fanatism is sweeping India now. May be feminists and their sympathisers are thinking it is the payback time for the centuries of unjust. For example, when I was young I too used to think women including models, female actors are exploited lot and thats why they are forced to shed clothes. Later I realized women enjoy as much as if not more the flesh show. In NJ there is a discussion going on weather to make clothing optional at a local beach to pump up the city fortunes. 67% of the females agree to that vs 50% of males. In fact looking sexy and desirable always is an ultimate goal to many. Thats why stereo typing is dangerous. In India people do not believe both genders think and behave similar. Laws are so terrorizingly against males in India, US governament has actually gave a travel warning to its male citizens to be careful dealing with any woman while in India, after receiving a several complaints on how they were exploited by women.
Thats why Ramu's captions are outdated. 85% of soldiers are males while similar percentage of prostitutes re females. If anybody draws conclusion that males protect and sacrifice while females are pleasure objects--I don't support such view. Though figures overwhelmingly support that fact. their lies our objective thinking.

Unknown said...

Ramugaru, What happened to the best and the worst boss poll? You were to publish them on the 25th. Regards.

బ్లాగు బాబ్జీ said...

రాము గారూ, వాట్ డూ యూ మీన్ ఆంధ్రా నుంచీ తాడేపల్లి గారు? మీరు ఆంధ్రాలో లేరేంటి? తెలంగాణా వేరుపెట్టేసారా?

బ్లాగు బాబ్జీ said...

ఎందుకొచ్చిన ఖర్మ ఇది తాడేపల్లి గారూ, వేఱే వాళ్ళ బ్లాగులకొచ్చి మరీ తిట్టించుకుంటారు?

బాలు said...

నమస్తే రాము గారు మీరు రాసిన ఈ నరరూప కీచకులకు బతికే హక్కు ఉందంటారా? అనే పోస్ట్ నేను చదివాను చాల బాగా చెప్పారు ....అయిన కొంత మంది వితందవాదన చేయడం నాకు కొంచం భాద కలిగించింది వాళ్ళు ఒక్క సెక్స్ కే ప్రాదాన్యత ఇస్తున్నారు కానీ మానవతా విలువలకు ఇవ్వటం లేదు......ఒక్క విషయం ఆలోచించండి సర్ "అగ్గిపుల్ల విలువేనది అన్నారు శ్రీ శ్రీ ఆపాటి విలువలేనిదా నేటి సమాజం లో స్త్రీ ?" మీతో వితండ వాదన చేసేవాళ్ళకు నేను అడిగే ప్రశ్న ఇదే సర్.......

బాలకృష్ణ.

ప్రేమిక said...

రాము గారికి నమస్తే..

ఇక తాడేపల్లి గారు నాకు పంపిన సమాధానం ఉంచాల్సింది. అయన ఏం పంపారో మరి...
సరే అందరికి నెనొక కథ చెప్పాలనుకున్నా..
ఒక యుక్త వయసులో ఉన్న అమ్మాయి తప్పు చెసింది
ఆ అమ్మాయి పెళ్లై పోయింది.. ఒక కొడుకో కూతురో పుట్టింది
ఆ అబ్బాయికి ఆ నిజం తెలిసి... అమ్మ నాకు ఒకరే నాన్న కాదా? ఇద్దర లెక ముగ్గురా? అని అదిగితే ఆ స్త్రీ తల ఎక్కడ పెట్టుకొవాలి?
అలాగె ఒక నాన్న కు తన పదిహెడేళ్ల కొడుకు ఇంట్లొకి వచి నాన్నా గుమ్మం బయట
నా తమ్ముదినంటు ఒకదు వచి నిలబడ్డదు నిజమేన? అని అడిగితే ఆ తండ్రి గుండె ఏమవుతుంది?
నిన్న ఒక సినిమా చూసను.. పోసాని gentleman అందులో ఒక పాత్ర ఇలాగె మట్లాడుతుంది
అచ్చు తప్పులుంటే మన్నించండి..................

Pavani said...

ఫ్రేమిక గారు,

తాడేపల్లి గారు ఏమన్టారో నాకు తెలియదు. కాని మీ ప్రశ్నలకు answers are very easy. ఆ కథ western countries లో జరిగున్టే,
జస్ట్ నిజమ్ చెప్తారు. Legal గా responsibility ఏమున్టున్దో అది తీసుకున్టారు. మీ నాన్న ఫలాన..లెదా ఎవరో తెలియదు...అలాగన్న మాట. India లో అయితే , వాళ్ళ దారిన వాళ్ళను వదిలేస్తే ఎలాగో సర్దుకో పోతారు. నిజమో అబద్ధమో చెప్పి. But media నోట్లో పడితే ఆ అమ్మయి ప్రేమికుడు లేదా ఆ నాన్న ఎవరైనా మొగ వాళ్ళు మాత్రమే అన్దరి నోళ్ళళ్ళో పడి మట్టికొట్టుకో పోతారు.
నిజమ్ చెప్పాలన్టే మీ కథ గానీ ఆ ప్రశ్నలు కానీ ఎన్దుకో దేన్ని ప్రూవ్ చెయ్యటానికో నాకర్థమ్ కాలేదు. మన్నిచన్డి.

జయహొ said...

ముందుగా తాడెపల్లి గారికి నా ధన్యవాదాలు. ఆయన వాదన తో నేను 100% అంగీకరిస్తాను. ఆయన ప్రస్తూత సమస్యను వివిధ కోణాల నుంచి ఆలోచించి తన అభిప్రాయలు స్పష్టంగా, చట్టం దృస్ష్టి లో ఉంచుకొని చక్కగా చెప్పారు.
* ఇప్పటికే పెళ్ళయింది కనుక ఒక ఆడదాన్ని ప్రేమించకూడదు/ కామించకూడదు అంటే నాకు సహజంగానే విచిత్రంగా అనిపిస్తున్నది. ఇందులో పశుత్వం ఏంటో నేనర్థం చేసుకోలేక పోతున్నాను.*
ఇది చదివిన తరువాత నాలు 1985 భారతి రాజ దర్శకత్వం లో శివాజి గణేశన్ ,రాధ నటించిన ముతల్ మరియాదై (ఆత్మ బంధువు) అనే సినేమా వచ్చింది . ఆ సినేమాలో హీరొ హీరొయిన్ కి వయసులో చాలా వ్యత్యాసం ఉన్నా సినేమా అంతా ఒకరి మీద ఒకరి మక్కువని చూపుతారు. మరి ఈ సినేమాకి భారత ప్రభుత్వం నుంచి ఉత్తమ చిత్రం అవార్డ్ కూడా వచ్చింది. ఇది చెప్పటానికి కారణం ప్రేమకు వయసు,హోదా తో సంబందం ఉండదు. అది ఎప్పుడైనా,ఏ వయసులో ఐనా పుట్టవచ్చు. శేఖర్ కపూర్ వయస్సు లో సగం వయస్సు ఉన్న సుచిత్ర క్రిష్నమూర్తి అతనిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు, నేను ఒక ఇంటెర్వ్యు లో చదివాను సుచిత్ర చిన్నపుడు శెఖర్ కపూర్ ని అంకుల్ అని పిలిచేదని ఆ తరువాత అతనినే పెళ్ళి చేసుకుందని. ఇటువంటి వి ఎన్నొ జరుగుతూంటాయి. రెండు సం|| క్రితం బీహార్ లో ఒక ప్రొఫెసర్ ని ఆయన దగ్గర చదువుకునే విధ్యార్దిని ఇష్ట పడి పెళ్ళి చేసుకుంటె అతని గయ్యాళి మొదటి భార్య మీద పడి కొట్టటాన్ని టి.వి. చానల్స్ లో పదే పదే చూపించారు. పెద్ద చర్చ జరిగింది. కాని ఆ విధ్యార్థిని నేను అతనిని ప్రేమించాను పేళ్ళి చేసుకున్నాను మధ్యలో మీ గోల ఏంది అని అడిగింది.
---------------------------------------------------
*హోదా లేని మగవాణ్ణి ఏ ఆడది ప్రేమిస్తుంది ? ఏ హోదా లేని ప్రేమికుడు సాధారణంగా ఒక సగటు ఆడదాని దృష్టిలో ఒక పనికిమాలినవాడే అవుతాడు. *
చాలా బాగా చెప్పారు. ఉద్యోగం లేని మగ వారికి ఎవరైనా పిల్ల నివ్వటానికి ముందుకొస్తారా? ఎవ్వరు రారు. మగ వారు పెళ్ళి చేసుకోవాలంటె ఆయనకి ఉధ్యోగం/హోదా+నికర ఆదయం అతనికి ఉండాలి. ఇవి లేక పోతె మగ వారికి 99% పెళ్ళి జరగదు. ఎవ్వరు మగ వారికి పెళ్ళి ఊసు కూడా ఎత్తరు. ఇక్కడఏ కాదు చైనా లోను ఇదే పరిస్థితి. ఇదే ఆడవారి విషయానికి వస్తె ఆమేకు ఉద్యోగం అనేది పేళ్ళి చేసుకోవటానికి తప్పనిసరి కాదు కదా. పెద్దలు కుదిర్చిన పెళ్ళి లోనె పిల్ల నిచ్చె వారు పే స్లిప్ చూసి, ఆఫీసుకు వచ్చి అబ్బాయి వివరాలు హోదా కనుకొనే వారిని ఎంతో మందిని చూసాను. మరి నచ్చిన అమ్మాయిని ప్రపోస్ చేసే వారు హోదాను చూపక పోతె ఎమీ చూసి ఆమే ఇతనిని ప్రెమిస్తుంది, ప్రిఫేరెన్స్ ఇస్తుంది.

వీర said...

@ప్రేమిక,
*ఒక యుక్త వయసులో ఉన్న అమ్మాయి తప్పు చెసింది.ఆ అమ్మాయి పెళ్లై పోయింది.. ఒక కొడుకో కూతురో పుట్టింది. ఆ అబ్బాయికి ఆ నిజం తెలిసి... అమ్మ నాకు ఒకరే నాన్న కాదా? ఇద్దర లెక ముగ్గురా? అని అదిగితే ఆ స్త్రీ తల ఎక్కడ పెట్టుకొవాలి? అలాగె ఒక నాన్న కు తన పదిహెడేళ్ల కొడుకు ఇంట్లొకి వచి నాన్నా గుమ్మం బయట నా తమ్ముడినంటు ఒకడు వచ్చి నిలబడ్డాడు నిజమేన? అని అడిగితే ఆ తండ్రి గుండె ఏమవుతుంది?*
--------------------------------------------------------
ప్రపంచము లో నీ లాంటి ద్వంద స్వభావం గల వారితో వచ్చిన చిక్కే యిది. నిన్నే తీసుకో "ప్రేమికా" అని పేరు పెట్టుకున్నావు నీకు ప్రేమించటం తెలియదు. కనీసం ప్రేమను అర్థం చేసుకోవటం కూడా రాదు. "యుక్త వయసులో ఉన్న అమ్మాయి తప్పు ..." చేస్తె పెద్ద మనసు తో దానిని తప్పును అర్థం చేసుకోవాలి. తప్పును క్షమించాలి అది తప్పు చిన్న వయసులో చేసింది కనుక. ఆ స్త్రీ తల ఎక్కడొ పెట్టు కో నవసరం లేదు ఉన్న వాస్తవాన్ని ఒప్పుకుంటె చాలు.
*ఆ తండ్రి గుండె ఏమవుతుంది?*
ఎమీ కానవసరం లేదు. పిల్లలకి అర్థమయ్యె విధం గా చేప్పాలి అంతే. ప్రేమికా మనిషి నాలుగు రోజులు ఈ భు ప్రపంచకం మీదా ఆనందం తో గడిపేలా ఉండాలి, కాని మా తాతా ల కాలం నాటివి సామజిక నియమాలను మొండిగా అమలు జరపటానికి కాదు.
---------------------------------------
నేనే దో ఊహాజనితంగా/ వేళా కోలం గా రాస్తున్నాని అనుకోకు. కళ్ళు తెరచుకొని చూస్తే మనకు చాలా మంది కనిపిస్తారు. ఒక సారి కమల్ హాసన్ జీవితమే చూడు అతను నేను నా ఆస్థి లో వాటాని గౌతమి కూతురికి(మొదటి భర్త ద్వార పుట్టిన) కూడా ఇవ్వాలనుకుంట్టున్నాను అని చేప్తె అతని ఇద్దరు కూతుర్లు దానికి వొప్పుకున్నారని చదివాను.రెండు భాగల కమల్ ఆస్థి ఇప్పుడు మూడు భాగలు గా పంచుకొంట్టునారు. వాళ్ళు గౌతమీతో కలసి సినేమా ఫంక్షన్లకి వస్తారు. వాళ్ళు వయసులో చిన్న పిల్లలైనా మనుషులను పరిస్థిలను అర్థం చేసుకొనారనిపిస్తొంది. ప్రేమించటమంటె ఎమీటొ తెలిసిన వారు, కనుకనే అలా చేయగలిగారు, లేక పోతె పదవుల కోసం కరుణానిధి పిల్లలు కొట్టుకునంట్లు నువ్వు సంపాదినిచిన ఆస్థి గౌతమీ కూతురికి ఎందుకివ్వాలి అని వాదనకు దిగలేదు. దిగినా కమల్ హాసన్ చేసెది ఎమీలేదు. అప్పుడు రోజుకొక వార్త మీడీయాలో రావటం తప్ప. ఇలా చూస్తె నీకు ఒక మహేష్ భట్ , నాగర్జున లాంటి ప్రముఖులు ఎందరో కనిస్పిస్తారు.

Thirmal Reddy said...

@జెస్సి
మీ వాదనలో తప్పు ఒప్పుల సంగతి పక్కనపెడితే, ఉదాహరణలతో సహా మీరు వాదించిన తీరు నాకు బాగా నచ్చింది. పైన రాసిన చాలా కామెంట్లలో భావోద్వేగం, sex గురించి culture shock ఎక్కువగా కనిపించాయి. ఎదుటి వ్యక్తి వాదనలు ఖండించడం కంటే ఆ వ్యక్తినే ఖండించడానికి ఎక్కువగా ఆసక్తి చూపినట్టు కనపడింది. మంచి వాదనకు థాంక్స్.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

ప్రేమిక said...

@pavani
nenu foreigncountries gurinchi matladaledu......
@jessi
good meeru cheppindi correcte..
kani nenu situation gurinchi matrame cheppanu. intaku mundu post ki comment rasinappudu kuda chepppanu sex is not a sin.. nijam ga pillalaki arthamayyela cheppagalama?

Unknown said...

Dear ramu
I didn’t mean to hurt you. Just I want to tell the truth without mincing words. What you mean when you wrote veellaku batike hakkunda? Do you mean police should kill them without trail! Or people should take law in to their hands? What is the difference between the novice reporter who provoked the people and gave legitimacy to police to kill 3 rouge youth in Warangal and a senior journalist who worked for Hindu and teaches journalism?
Out bursting anger and emotions is not good for journalism. I don’t need to tell you.. I suppose
And the *black* mail comment is not about you ram. It is aimed at kousik and ayub etc. I am furious about the way the discussion is going on. The key point is using ones position and power for personal favors. It may be sexual or financial. In what way it is related to ekapatnivratam, vivaha vyavasta and that sort of things. You may allow all comments, but you should intervene when the debate is trivialized. Instead of that you are also trivializing by dragging the debate into morals and ethics.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి