Monday, December 27, 2010

తెలుగు మీడియాకు స్వీయనియంత్రణ కీలకం

వివాదాస్పద తెలంగాణా అంశంపై శ్రీ కృష్ణ కమిటీ నివేదిక రానున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ...హైదరాబాద్ లో భారీ ఎత్తున బలగాలు దిగుతున్నాయి. రాష్ట్ర రాజధానిలోని కాలనీలలో ఉండే కమ్యూనిటీ హాల్స్ ను   కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారేట్లు ఉంది.

కమిటీ ఏమిచెప్పినా, దాని అభిప్రాయంతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఒక్క ప్రాణమైన పోవడానికి వీల్లేదు. ప్రాంతీయ విద్వేషాలకు తావు లేకుండా ప్రజలు కలిసిమెలిసి ఉండాలి.  ముఖ్యంగా మీడియా సొంత అజెండాలు మాని...శాంతిని కాపాడాలి. ఇప్పుడున్న పరిస్థితులలో మీడియాను నియంత్రించడం చాలా కష్టం కాబట్టి...ఎడిటర్లు, జర్నలిస్టులు స్వీయనియంత్రణ పాటించాలి. యాజమాన్యాలను రెచ్చగొట్టి అగ్గికి ఆజ్యం పోయకుండా...శాంతిని కాపాడడమే అందరి కర్తవ్యం కావాలి. 

'ఆచితూచి వ్యవహరించండి' అని పిలుపునిచ్చిన న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపును తు.చ.తప్పకుండా పాటించాలని ఛానెల్స్ కు  విజ్ఞప్తి చేస్తున్నాం. నాగరికంగా ఎలా మెలగాలో...మనకు మనం నిరూపించుకోవడానికి...ఇది మంచి తరుణం. ప్రజాస్వామ్యయుతంగానే గళం విప్పి...సామరస్యంతో మెలుగుదాం. శాంతి భద్రతలను కాపాడుకుందాం.
---------------------------------------------------------------------------
ఈ పోస్టు పెట్టిన తర్వాత...ప్రముఖ బ్లాగర్ (సాహిత్యాభిమాని) శివ గారు ఈ కింది సూచనలు పంపించారు...రాము 
మీరుచేప్పే స్వయం నియంత్రణకు నాకు తోచిన పది సూత్రాలు.
1. న్యూస్ లైవ్ కార్యక్రమాలను పూర్తిగా మానెయ్యాలి. ఈ లైవ్ కార్యక్రమాల వల్ల అదుపులేని వాగుడు ప్రసారం అవుతున్నది. కొన్నిసార్లు ఈ వాగుడే ఉద్రిక్తలకు దారి తీస్తాయి.
2. ఏమాత్రం కూడ అపార్ధం చేసుకోవటానికి వీలులేని భాషలోనే వార్తలను వ్రాయాలి చదవాలి. ఈపని లైవ్ లో మన వాళ్ళకు చేతకాదు. నోటికొచ్చినట్టు వాగుతారు. అందుకని లైవ్ ఉండకూడదు. నిష్ణాతులైన సంపాదకుల ఆధ్వర్యంలోనే వార్తలను ప్రసారం చెయ్యాలి.
3. విలేఖరి తన వార్తను లేదా రిపోర్టరుగా పిలవబడుతున్న అతని/ఆమె మాటలను రికార్డుచేసి అప్‌లింక్ ద్వారా పంపితే అందులో అతను/ఆమె చెప్పిన విషయాలు చూసి ప్రసారం చెయ్యోచ్చా లేదా నిర్ణయించి సంపాదకులు అనుమతించినాకే ప్రసారం చెయ్యాలి.
4. బ్రేకింగు న్యూస్ అనే మాట వాడకాన్ని, పదే పదే బ్రేకింగు న్యూస్ అంటూ ఏదో జరిగిపొయ్యింది అన్న భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రసారాలు చెయ్యటం నిషేధించాలి.
5. పొరబాటున ఏ ప్రాంతలోనైనా ఏదైనా సంఘటన జరిగితే, ఆ విషయం వెనువెంటనే రాష్ట్రం అంతా చాటింపు వెయ్యక్కర్లేదు. అక్కడకు వెళ్ళి నిజానిజాలు కనుక్కుని, ఒక సమగ్రమైన వార్తగా రూపొందించి, ఎడిట్ చేసి, ఎంతవరకూ చూపించాలో అంతవరకే చూపించాలి. ఎంతవరకు అన్న విషయం అంభువజ్ఞులైన సీనియర్ సంపాదకులకు తెలుసు. వాళ్ళకు వదిలెయ్యాలి. యాజమాన్యం తరఫున ఉండే కుర్ర ఎం బి ఏలు మానెజర్లుగా పిలవబడే వాళ్ళు ఈ ప్రొఫెషనల్ విషయాల్లో తల దూర్చకూడదు. వితండవాదం చేస్తూ తా బట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే జర్నలిస్టులకు ఈ సంపాదకత్వం ఇవ్వటం మానాలి.
6. పోలీసులను మాటి మాటికి చూప కూడదు. వారి దగ్గర ఉన్న ఆయుధాలు, ఎక్కడ ఉంటున్నారు వంటి విషయాలు చూపే ప్రయత్నాలు మానాలి. టివి లు అసాంఘిక శక్తులకు గూఢచారులు కాదు, కాకూడదు కదా!
7. ఎక్కడన్నా విధ్వంసం జరుగుతుంటే ఆ పని చేస్తున్న వ్యక్తుల ముఖాలు స్పష్టంగా చిత్రీకరించి చూపాలి. టి.వి రిపోర్టింగులో వీళ్ళకి ఉన్న నైపుణ్యమంతా ఇలాంటి విధ్వంసకారులను పట్టుకోవటానికి వీలుగా వీరి కవరేజి ఉండేట్టు చూసుకోవాలి. అంతేకాని ఊరికే మండుతున్న బస్సులు, పగిలిపోయిన షాపు అద్దాలు చూపించటాలు మానాలి. ఈ ఊళ్ళొ ఇన్ని బస్సులు, ఆ ఊళ్ళొ ఇన్ని బస్సులు అని లెక్కలు కట్టి ప్రసారం చెయ్యకూడదు. రాయలసీమలో ఒక ఫ్యాక్షనిస్టు(2005 జనవరిలో అనుకుంటాను)హత్య జరిగినప్పుడు ఇలాంటి భాధ్యతలేని అనవసరపు లైవ్ టెలికాస్ట్ వల్ల అనేక సంబంధం లేని ప్రదేశాల్లో హింస చెలరేగింది.
8. ఒక నాయకుడో, మంత్రో ఒక మాట అనంగానే, అది పట్టుకుని పరుగులు పెట్టుకుంటూ ఆ వ్యక్తి ప్రతిపక్షం దగ్గరకు వెళ్ళి చూడండి అతను ఇలా అన్నాడు, మీ అభిప్రాయం ఏమిటి? మీ స్పందన ఏమిటి అని అడుగుతూ తంపులు పెట్టే జర్నలిజం మానాలి. మీడియా వార్తలను రిపోర్టుచెయ్యాలికాని, వార్తలను తమకు తామే వండకూడదు, తయారుచెయ్యకూడదు.
9. ఎజెండాలు పెట్టుకుని ఒక వర్గం వైపో లేదా ఒక పార్టీ వైపో వాలిపొయ్యి ప్రసారాలు, వ్రాతలు లేకుండా చూసుకోవాలి. ఇది చేస్తే దాదాపు అన్ని పేపర్లు మూసెయ్యాలి, అన్ని చానెళ్ళు భక్తి గీతాలు చూపాలి ఇవ్వాళ. ఖర్మ!
10. నాయకులు అని చెప్పుకునేవాళ్ళు బాధ్యత లేగుండా గాలిగా, చెత్త వాగుడు వాగుతుంటే, అమాయక ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నంగా ఉన్నవి లేనివి కల్పించి విద్వేషాలు చెలరేగేట్టుగా ప్రవర్తిస్తుంటే వాళ్ళకు కవరేజీ ఏమాత్రం ఇవ్వకూడదు.

ఇవన్ని నాకు అనిపించిన కొన్ని సూత్రాలు. ఒక్క తెలంగాణా ఉద్యమం, శ్రీ కృష్ణా కమిషన్ రిపోర్టు సమర్పణ సమయం దగ్గరపడేప్పుడు మాత్రమే కాకుండా, మీడియా అని పిలవబడుతున్న ఈనాటి కాయితాల మీద అక్షరాలు ప్రింటుకొట్టే యాజమాన్యాలు, సాటిలైటు సమయం కొనుక్కుని, తమ చిత్తం వచ్చినట్టు ప్రసారాలు చేస్తూ ఇవ్వే వార్తలు అని చెప్పుకునే చానేళ్ళు సదా పాటించాలి. భారత దేశంలో మీడియా ఇంత గొప్పగా ఉన్నది, ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించటంలో ఎంతో కృషి చేసింది అన్న పేరు తెచ్చుకోవాలి కాని, వాళ్ళే గొడవలకు కారణం అయ్యారు, గొడవలని ఇంకా ప్రేరేపించి పెంపొందించారు తద్వారా వాళ్ళు టి ఫి ఆర్ రేటింగులు పెంచుకున్నారు అన్న ఆరోపణలకు గురికాకూడదు.
 

21 comments:

chanukya said...

భ్రష్టుపట్టిన ఈ ఛానెల్స్ మీ మాటను నిజంగా వింటాయా?

ఓరుగల్లు పిల్లాడు said...

I agree with (సాహిత్యాభిమాని) శివ gaaru...Tv channels has be in control like Ayodya issue....The Govt should issue a order to control the channels....

శరత్ కాలమ్ said...

పై పది సూచనలు ఎందుకులే గానీ ఓ పది రోజులు వార్తా ఛానళ్ళు అన్నీ మూసివెయ్యాలంతే.

Srikanth said...

మంచి సూచనలే. కాని ఈ చెత్త చానల్లకి ఇవన్నీ పడతాయా సర్?

చిలమకూరు విజయమోహన్ said...

మంచి సూచనలు.ఇంతకూ పాటిస్తారా?

Anonymous said...

డియర్ రాము!
ఈ క్రింది కామెంట్ ను నేను గతంలో కూడా వ్రాసాను. తరువాత " కొత్త పోస్టులు మీరు రాస్తూ పోవడం, మేము కామెంట్లు వ్రాస్తూ పోవడమేనా, పాత వాటిపై మేము వ్రాసిన (చర్చ అవసరమనిపించే) కామెంట్లవైపు కూడా చూసేదేమైనా ఉందా? ఒక్కసారి "సినిమా పిచ్చి బాగా ముదిరిన పోరంబోకు ఛానెల్స్...."
లోని చివరి రెండు కామెంట్లు చూసి స్పందించగలరు" అంటూ నేను తదుపరి రెండు మూడు టపాలలో వ్రాసినా మీరెందుకోగానీ స్పందించలేదు. అదే కామెంటును మళ్ళె ఇక్కడ వ్రాస్తున్నాను.
మనం ఎంత మొత్తుకున్నా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. బహుశా ముందు ముందు ఇంకా జుగుప్సాకరంగా కూడా ఉండొచ్చు. కానీ, మీరు మాటి మాటికీ ఇలా ఆవేదనగా వ్రాయడం, తరువాత అది (వ్రాసి ఊరుకోవడం) అలవాటుగా మారడం నాకెందుకో సరి అనిపించడం లేదు.
ఎందుకంటే-మనిషికోమాట గొడ్డుకో దెబ్బ అనే స్థాయి దాటి మన మెడియా హోజుల తోలు దొడ్డుదైపోయినప్పుడు ఇలా సుతిమెత్తగా చురకలు వేయడం కాకుండా సర్కస్‌లో కౄరమృగాలను హంటర్ తో బాది దారికి తెచ్చినట్లు 'మీడియా ఆంబుడ్స్‌మన్ ' వంటి ఒక పటిష్ఠ వ్యవస్థ ద్వారా నియంత్రించాలి. నేను గతంలో కూడా ఈ విషయంపై రెండు మూడు సార్లు మీకు వ్రాసినా మీరెందుకో దానిపై చర్చ జరపలేదు!
శిశుపాల ప్రవృత్తిగల రిపోర్టర్లు, సంపాదకులను, ముఖ్యంగా మీడియా హౌజు లను నడిపేవారిని వెంటనే శిక్షించే ఒక వ్యవస్థ ఉండి తీరాలి. గతంలో అనేక సంధర్భాలలో నేను ఇదే పాయింట్ మీద 'మీడియా ఆంబుడ్స్‌మన్ ' వంటి వ్యవస్థ వుండాలనీ, ఫిర్యాదు కోసం ఎదురు చూడకుండా స్వతంత్రంగా మీడియా మొత్తాన్ని మానిటర్ చేస్తూ, తిక్క తిక్క ప్రసారాలను చేసినప్పుడు నిస్పక్ష వైఖరతో చర్యలు తీసుకోగల సత్తా గల పెద్దలతో ఉండాలి అనే దానిపై చర్చను ఆహ్వానించండి. మన బ్లాగులోనే కాకుండా మీకందుబాటులో ఉన్న హెచ్.ఎం టీవి వంటిదాంట్లో విస్తృత చర్చ (ఏ.పి దశ, దిశ లాగ) జరిపితే బాగుంటుందేమో?
బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్ ఆంబుడ్స్‌మన్ వ్యవస్థలు పటిష్టంగానే పనిచేస్తున్న అనుభవం మన దేశంలో ఉంది కనుక, మరియు మీడియా లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నిఖార్సైన జర్నలిస్ట్‌లు ఇంకా మిగిలే ఉన్నారు కనుక అటువంటివారి ఆధ్వర్యంలో మీడియావారే అందరికీ అమోదయోగ్యంగా 'ఆంబుడ్స్‌మన్ ' లాంటి వ్యవస్థ ఏర్పరుచుకొని తీరేలా ప్రభుత్వం ఒక చట్టం తీసుకువచ్చినా తప్పుకాదేమో? అంటే ఇదేదో అనవసర ప్రభుత్వ జోక్యానికి దారితీస్తుందనో లేక మీడియా స్వేచ్చకు భగం వాటిల్లుతుందనో భావించనవసరం లేదు. ఈ అతి స్వేచ్చకు బ్రేకులు వేస్తుంది. ఎందుకంటే నిర్ణీత గడువులోగా వ్యవస్థను ఏర్పరుచుకునేలా నిర్దేశించడం మాత్రమే ప్రభుత్వ పని. అందరికీ ఆమోదయోగ్య విధి విధానాలతో మీడియ స్వయంగానే అలాంటి వ్యవస్థను ఏర్పరుచుకునే స్వేచ్ఛ ఎటూ వారికుంటుంది.
ఇటువంటి వ్యవస్థ ఒకటి వుంటే ఎవరికి సమస్య వచ్చినప్పుడు వారు వ్యక్తిగతంగా పోరాడటం కాకుండా దాని ద్వారా సహేతుక న్యాయాన్ని ఆశించవచ్చు. పైగా మీడియా హౌజుల 'అతి' ని కూడా అది నియంత్రించగలదు.

astrojoyd said...

RSReddy garu very nicely said

Raj Karsewak said...

Ramu ji ,

In simple words you want to Black Out Telangana agitation. Unlike Samayikandhra puppet show,TG agitation is not Media centered nor driven by Plutocrats. No matter to what extent Seemanadhra media Black Out . Live or No Live streaming on TV channels makes no diff for masses. Tg sentiment is LIVE in the hearts of 4 crore Telanganites, your censorship will make no difference .

Ramu S said...

రాజ్...
అపార్థం చేసుకోకండి. ఉద్యమం ఆపమని కాదు కానీ...పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేలా, ఇన్నాళ్ళూ కలిసిపనిచేసిన వారు శత్రువులుగా మారేలా సీన్ సృష్టించవద్దని చెప్పడం నా ఉద్దేశ్యం. మీడియా కవరేజ్....ప్రాణాలు తెసేదిగా ఉండరాదు.
రాము

katta jayaprakash said...

I fully agree with Shiva garu and RS Reddy garu and it is the need of the hour to have an ombudsman and vigilance over the media to make it ethical,moral and proffessional and for the welfare of the people.
It is better to ban the live discussions by some xyz who have no social or natinal responsibility while airing their narrowminded ,immature views which irritate every one,

JP.

Saahitya Abhimaani said...

రామూజీ,

ఇప్పటి మీడియా ప్రవర్తన వారు ప్రసారం చేసే తీరు, ఏ ఉద్యమానికైనా సరే అప్రదిష్ట తెచ్చేదిగానే ఉన్నది. ఒక్క ఉద్యమాల గురించి వార్తలనే కాక, మొత్తం మీద మీడియా ప్రవర్తన చాలా "అతి" గా ఉండటం వల్లే చాలా మంది న్యూస్ చానెళ్ళు చూడటం మానేశారు. న్యూస్ చానెళ్ళు చూడకుండా ఉంటే బి పి అదుపులో ఉంటున్నది అని అనేకమంది చెప్తున్న మాట.

అందుకనే నేను నాకు తోచిన పది సూత్రాలు వ్రాశాను. అంతేకాని ఏదో ఉద్యమాల నోరు నొక్కే పద్ధతులను చెప్పటానికి కాదు. ఉద్యమాలను ఆపగలిగే శక్తి మీడియాకు లేకపోయినా, ఉద్యమాలకు చెడ్డపేరు తీసుకురాగల శక్తి మటుకు మీడియాకు ఉన్నది. అందుకనే నియంత్రణ అని చెప్పేది. సామాన్య ప్రేక్షకులం మనమే కాదు వారి సంఘాలే చెప్తున్నాయి. కాని డబ్బు సంపాదనలో కళ్ళు మూసుకుపోయిన ఈ మీడియా యజమానులు వింటారా, Career Orientation లో పడి కొట్టుకుపోతున్న వారి ఉద్యోగులు (వాళ్ళని జర్నలిస్టులు అని పిలవ బుద్ది వెయ్యటంలేదు)నియమాలనేవి ఉంటాయన్న స్పృహలో ఉన్నారా అసలు.

కాబట్టి, రెడ్డిగారు సూచించినట్టుగా MEDIA OMBUDSMAN ఏర్పాటుకు ప్రయత్నాలు జరగాలి. ఆ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. పునాది గట్టిగా పడాలి. ఈ దిశగా విస్త్రత చర్చలు జరగాలి. ఈ విషయంలో హెచ్ ఎం టి వి వారు ఎమన్నా రాష్ట్ర వ్యాప్తంగా దశ-దిశ నిర్వహించినట్టుగా, ఈ విషయంలో కూడా చొరవ తీసుకుని, మీడియాలో ఉన్న "లంపెన్ ఎలిమెంట్ల" పనిపట్టేట్టుగా అంబుడ్స్మాన్ వ్యవస్థ ఏర్పడేట్టుగా మొత్తం మీడియాను కదిపి ఒక దిశ చూపిస్తే, మీడియా సవ్యమైన "దశ" కు మళ్లించబడుతుంది అని నా భావన, ఆశ.

Unknown said...

Check this http://www.youtube.com/watch?v=5NIS_V9Yyfw&feature=player_embedded

Already started irresponsibly, what else can be expected from this media?

Prashant said...

I would like to highlight the declining journalistic credibility. Not only the media head honchos but also small time stringer journos who earn money based on the length of the news published resorting to extortion of local doctors,politicos and other businessmen for not publishing the derogatory "news" pertaining to them.
"Paid" news is another rogue concept which needs to be weed out from the sector.
NDTV editor Burkha Dutt who is considered as an epitome of journalistic credibility also fell into the trap of power mongers and became a "courier" for lobbyist Radia.So is Vir.
What is the most blaring act by all media houses is ignoring to highlight the malaise involving fellow journalists as if they taken oath collectively to support each other in troubled times.
Whatever the allergy developed in the industry can only be eradicated institutionally as the government is averse to bring any regulatory nodal agency to streamline this faltering industry.

katta jayaprakash said...

N.Ram,Editor in Chief of The Hindu is the only person who has been campaiging for an internal news ombudsman and to prevent paid news culture in both prtint and news channels.He is preaching after practiing as he had long back started an internal news ombudsman in the form of Readers Editor which has been rendering goood service.Some time back readers had adsversely commented on one editorial for which N.Ram had to give a big explanation covering centre page and had to convince the readers of the policy of The Hindu and it';s impartiality.Every we come across many comments from readers of good,bad and ugly of the paper.But no one is following the policy of The Hindu.

JP

Saahitya Abhimaani said...

రామూ గారూ!

ఇన్నాళ్ళూ మీరు బ్లాగులో వ్రాయటం బ్లాగులోకంలో కొంతమంది ఇక్కడకు వచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పటం జరుగుతూ ఉన్నది. మీరు బ్లాగు మొదలు పెట్టిన ధ్యేయం నెరవేరాలంటే, హెచ్ ఎం టి వి వారిని మీడియా ఆంబుడ్స్‌మాన్ గురించి తప్పకుండా చొరవ తీసుకునేట్టు మీరు చెయ్యగలగాలి. మీరు, మీ వెనుక కొంతమదిమి కలిసి ఎంతో ముఖ్యమైన ఈ పనికి ఒక్క చిన్న అడుగు వేస్తే చాలు, మనం ఇన్నాళ్ళూ బ్లాగుల్లో వ్రాసుకున్న వాటికి కొంతలో కొంతవరకు న్యాయం చేసినట్టు అవుతుంది. ఆలోచించండి.

katta jayaprakash said...

The Hindu has given good coverage on Sumalatha who has been anchoring Sakhi programme of ETV 2.She is a senior anchor with all good perforamance.Congratus to her and her betterhalf Thirmal Reddy.A good ending of 2010 and good luck in 2011 to her.

JP.

katta jayaprakash said...

I WISH A HAPPY,HEALTHY,WEALTHY,PEACEFUL NEW YEAR 20111 TO ALL OUR FRIENDS OF Ramu's blog and let us FORGET THE BAD AND UGLY FACE OF 2010 and hope and pray for a better if not best 2011.Lets us make this blog a constructive one with positive thinking without hurting any one at any time by bringing good,bad and ugly of ap media and it's kaburlu and it's effect on the society and people at large.
Happy New Year to Ramu,Hema and kids.

JP.

srikanth said...

Ramu sir vaadu... Off the Topic, ee madhya Nellore lo jarigina journalist la sabha visheshalu cheputara konchem.

Thirmal Reddy said...

@Katta Jayaprakash

Thanks for mentioning the article in The Hindu. Here's the link http://hindu.com/2010/12/30/stories/2010123051110200.htm

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Saahitya Abhimaani said...

మీకు పంపిన ఫది సూత్రాలు మా అబ్బాయి శ్రీనివాస ప్రసాదుకు కూడా మెయిలులో పంపాను. వాడి స్పందన ఇలా ఉన్నది:

"చాలా బాగుంది !!!
ఈ సూత్రాలు నిజంగా పాటించగల రోజు వస్తే, ఆ రోజు మనకి నిజమైన పత్రికా స్వేఛ్చ (PRESS నుంచి మనకి FREEDOM అన్నమాట!!!!) లభించినట్లు....."

విజయ్ అనంగి said...

'మీడియా సొంత అజెండాలు మాని...శాంతిని కాపాడాలి'. ఈసూక్తి చాలా బాగుంది. కానీ... ఇప్పటి పరిస్థితుల్లో... సొంత అజెండా లేని మీడాసంస్థలు ఎన్ని ఉన్నాయ్.. ఒకటీ అరా ఉన్నా... బ్రేకింగ్ ల హోరులో చిన్నగొంతుకలు జనానికి వినిపించేనా... అయినా.. శివాగారు చెప్పిన సూత్రాలు కనీసం ఒకటి రెండైనా పాటించాలని కోరుకుందాం.. రేపు 6వ తారీఖున గుప్పిట విప్పనున్న చిదంబరం ఏంచెబుతారో.. తర్వాత ఏ మీడియా సంస్థ ఎంత సంయమనం పాటిస్తుందో చూడాలి మరి.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి