Tuesday, February 22, 2011

యాంకర్ కిరణ్ పై లైవ్ షోలో జర్నలిస్టు పాశం యాదగిరి ఆగ్రహం

ఆంధ్రా ప్రాంతానికి చెందిన యాంకర్లపై ఉన్న కోపాన్ని సీనియర్ జర్నలిస్టు, తెలంగాణా ఉద్యమ నేత పాశం యాదగిరి గారు నిన్న రాత్రి HM-TV లైవ్ షో లో సీనియర్ యాంకర్ కిరణ్ పైన వెళ్ళగక్కారు. "తెలంగాణాకు వ్యతిరేకంగా పనిగట్టుకుని పనిజేస్తున్న చానెల్స్" ను బహిష్కరించాలని కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్ణయించడంపై 'కేబుల్ ట్రబుల్' పేరిట  హెచ్-ఎం.టీవీ చర్చ నిర్వహించింది. తెలుగు టెలివిజన్ చరిత్రలో మొట్టమొదటి నంది అవార్డును గెలుచుకున్న కిరణ్ దీనికి యాంకర్ గా వ్యవహరించారు. 

ఇద్దరు తెలంగాణా కేబుల్ ఆపరేటర్స్, యాదగిరి గారు సహా ఆరుగురు ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చలో తన అభిప్రాయాలు వెల్లడించడానికి సరైన అవకాశం ఇవ్వలేదని యాదగిరి గారికి ఆగ్రహం వచ్చింది. చర్చ చివర్లో...చర్చ నుంచి వైదొలగబోయిన యాదగిరి గారికి కిరణ్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. అప్పుడు...కిరణ్ ఆంధ్రా ప్రాంత యాంకర్ కాబట్టే తనకు అవకాశం ఇవ్వలేదని, అన్ని చానెల్స్ లో ఇదే పరిస్థితి వుందని యాదగిరి గారు ఆగ్రహంగా విమర్శలు చేసారు. తనకు గానీ, చానెల్ కు గానీ అలాంటి ఉద్దేశం లేదని కిరణ్ చెప్పినా యాదగిరి గారి కోపం చల్లారలేదు. ఆంధ్రా యాంకర్లు తెలంగాణా గళం వినిపించకుండా చేస్తున్నారని, ఇలాంటి వాళ్ళను నియమించుకోకూడదని తర్వాత కూడా ఆ ఛానల్ చీఫ్ ఎడిటర్ రామచంద్ర మూర్తితో కూడా అన్నారని సమాచారం.

చురుకైన భావాలు, మంచి రచనా శక్తి, అద్భుతమైన అవగాహనా శక్తి ఉన్న యాదగిరి అన్న కిరణ్ ను అలా అనకుండా వుండాల్సిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. కిరణ్ పై ఆగ్రహంతో ఊగిపోవడాన్ని, లైవ్ లో రూడ్ గా వ్యవహరిస్తూ అలాంటి మాటలు అనడాన్ని నేను ఖండిస్తున్నాను. యాదగిరి అన్నది ధర్మాగ్రహమే అనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కొన్ని చానెల్స్ లో ఉన్న (ఉదాహరణకు....TV-9 యాంకర్  రజనీకాంత్)  యాంకర్స్, మోడరేటర్స్ పక్షపాతంతో చర్చలు జరుపుతారని ససాక్ష్యంగా ఇదే బ్లాగ్ లో నేనూ పోస్టులు రాసాను. అంటే...అలాంటి వాళ్ళను అనాలి గానీ...కిరణ్ ను అవమానించాలని చూడడం ఏ మాత్రం పధ్ధతి కాదు. 

కిరణ్ ఏదో HM-TV లో చేస్తున్నారు కాబట్టి నేను ఇది రాయడం లేదు. తనను నేను 'ఈ-టీవీ' రోజుల నుంచీ చూస్తున్నాను. తను నాకు ఈ మధ్యనే పరిచయం అయ్యాడు. నెల్లూరులోనో, ఏలూరులోనో సిటీ కేబుల్ లో న్యూస్ రీడర్ గా చేరి...తన ప్రతిభకు మెరుగుపెట్టుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిన యాంకర్ కిరణ్. ఈనాడు మీడియాను శాసిస్తున్న ఏ అగ్రకులానికీ చెందకపోయినా, గాడ్ ఫాదర్స్ లేకపోయినా....కేవలం స్వయంకృషి, పట్టుదల, ఏదో సాధించాలన్న తపనతో యాంకరింగ్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న కిరణ్ ను నొప్పించడం దారుణం. 

యాదగిరన్నా...HM-TV అన్ని జిల్లాల నుంచి లైవ్ ద్వారా ప్రసారం చేసిన...'దశ-దిశ' కు ప్రధాన యాంకర్ కిరణ్. ఏనాడూ...తొణక్కుండా బెణక్కుండా కేవలం యాంకర్ గా తన విధి తాను నిర్వర్తించిన ప్రొఫెషనల్ కిరణ్ అని మీకు బహుశా ఎవరూ చెప్పి వుండరు. మీరు ఈ పోస్ట్ చదివితే....ఒక్కసారి కిరణ్ తో మాట్లాడి సారీ చెబితే బాగుంటుంది.

10 comments:

shrigo said...

I dint watch this program but I know about Pasham Yadagiri, he is the firt generation genuine Telanganite who stood still for the cause.

At the same time, I am not blaming Kiran but prathi chota vertical division vachinappudu Kiran kooda aa vaipu ku moggi unte undavachchu.

Ika vere chanels vishyaniki vaste TV9 lo Rajanikanth, NTV lo Kommineni, Sakshi lo Madam Swapna, TV5 lo Venkata Krishna(migilina vallatho poliste konchem better) lu choope pakshapatam antha intha kaadu. Veella aagadaalu choodaleke ee cable trouble program vachindi.

Unknown said...

Ramu Annayya,

Mee vyakhyalato poortiga ekkebhavistunnanu….endukante
Kiran naaku 2001 nunchi parichayam....Kiran Citicable Hyd lo News Reader ga unnapudu nenu C - Channel lo news reader ga chestunnanu.....Nenu show chudaledu kani Yadagiri garu Aaagraham velibuchadam badha naipinchindi….Naku Yadagiri gaarante chala gauravam ….aina vaaru ala ankunda undalsinidi anukuntunna…any way ……

Kiran ki mitrudiga ee spandana…mitrama badhapadaku
Anand(News Anchor)
Induru Muddu bidda

Anonymous said...

గురూజీ!
@"ఏనాడూ...తొణక్కుండా బెణక్కుండా కేవలం యాంకర్ గా తన విధి తాను నిర్వర్తించిన ప్రొఫెషనల్ కిరణ్"...నిజమే. దశ-దిశ అన్ని ఎపిసోడ్ లలోనూ, మరెన్నో లైవ్ లలోనూ నేనూ చూసాను కిరణ్ ను. ఆంధ్రా అయినా తెలంగాణా అయినా మరోచోటైనా ప్రాంతీయాభిమానంతో సంబంధం లేకుండా తన విధి నిర్వాహణ చేసే కిరణ్ లాంటివాళ్ళను మెచ్చుకుని తీరాల్సిందే.
గొప్ప యాంకర్లుగా పేరుతెచ్చుకున్నంత మాత్రాన రజనీలూ, గజనీలూ వృత్తి ధర్మాన్ని సరిగా నిర్వర్తించడంలేదు. పైగా వాళ్ళేం చేసినా చెల్లుబాటవుతోంది. కానీ, ఎవరైనా తనపై నిరాధార ఆరోపణలు చేసినా సౌమ్యంగా ఖండించడం తప్ప మనసులో పెట్టుకుని మాటకుమాట (గజనీలా:) అనని కిరణ్ ను నిన్నటి చర్చలో చూసి నాకు ముచ్చటేసింది.
అయితే పాపం నిన్నటి చర్చలో యాదగిరి గారు స్టుదియోలో లేకపోవడం వల్ల కావచ్చు, మరేమైనా సాంకేతిక కారణాలు కావచ్చు ఆయన వాణి సరిగా వినిపించ అవకాశం రాలేదు. పక్షపాతమే అయ్యేట్లయితే స్టూడియోలో ఉన్న సహానీకి, మరొకరు (ప్రభు నో, రాజో - పేరు సరిగా గుర్తులేదు)కు ఎక్కువ అవకాశం దక్కనిచ్చేవారు కాదు. కిరణ్ కూడా అదే విషయం చెప్పి బాధపడ్డారు.
అయితే తొండి ఆట ఆడుతున్న కొందరు గజనీలను చూసి విసిగిపోయిన పాశం అన్న అలా స్పందించియుండొచ్చు గానీ అది కరక్టైతే కాదు.

vijay said...

అవ్ రెడ్డన్నా! తెలంగానోల్లకి షో టైములో 42% కేటాయించాలని డిమాండ్ చేస్తున్నా.. దీనికోసం 72 గంటల బంద్ షురూ చెయ్యాలా.

Anonymous said...

@Vijay
సీరియసా? జోకా?? సెటైరా???
క్లారిటీ ఉండాలిగదా ముందు:)

Raj Karsewak said...

రాము నీకు సీమంధ్ర లోని నిన్నటి మొన్నటి జర్నలిస్టులు తెలుసు వారి జీవిత చరిత్ర తెలుసు , కానీ 30 సంవత్సరాల నుండి జర్నలిస్ట్ వృత్తీ లో వున్నా పాశం యాదగిరి మాత్రం నీకు తెలీదు . మీరు ఎన్ని సంవత్సరాలు మా తెలంగాణా(హైదరాబాద్) లో నివసించిన మమ్ములును కానీ మా సంస్కృతి ని అర్ధం చేసోలేరు .

Thirmal Reddy said...

సర్ జీ
కిరణ్ గురించి నన్నడగండి నేను చెప్తా. ఒకేసారి కెరీర్ ప్రారంభిన్చినవాళ్ళం.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Swarupa said...

Ramu Garu...! Kiran gurinchi baga chepparu. Entho Kashtapadi, enno rajakiyalanu edurkoni kiran vrutthiparanga edigadu. Discussions kuda baga handle chestadu. ETV lo vunnappudu nenu enno storieski Kiran tho VO cheppichanu. Thanu aa storyki pranam posthadane nammakam naku. Hey Kirru...! Nenu gurthunnana...? Marchipoye vuntavle... Anyway Idi neeko manchi experience. Oka manchi patham neruchukunna anuko. All The Best To U.

ఓరుగల్లు పిల్లాడు said...

అలా కాదన్ది విజయ్ గారు...42% మరి ఎక్కువ కదఃఅన్ది...అంతా వారికె ఇస్తె మనకు ఎమ్ మిగులుథున్దన్ది మరి మీరు. ఎదొ 1-2% ఇస్థమ్ అనన్ది బాగున్టున్ది

sree n sree said...

రాము గారి గొడవేంటో నాకు అర్థం కావటం లేదు... మీరు కిరణ్‌ను దగ్గరుండి గమనిస్తే.. ఆయనలో ఉన్న సమైక్యాంధ్ర షేడ్ అర్థమవుతుంది.. అయినా.. పాశం యాదగిరి అన్న గురించి, ఆయన డిగ్నిటీ, అనాలసిస్ గురించి తెలంగాణ వాళ్లకే కాదు.. తెలంగాణేతరులకు కూడా బాగా తెలుసు... అలాంటిది ఆయనకే ఆగ్రహం వచ్చేలా చేశాడంటే... ఆయనను ఎంతలా విసిగించారో అర్ధం చేసుకోవచ్చు. ofthesociety.blogspot.com

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి