Tuesday, February 21, 2012

ఆవిష్కరణ సభలో వేమూరి రాధాకృష్ణ ప్రసంగం....సరదాకి

ఏ టీ ఎం కార్డులో నుంచి పద్దెనిమిది వేలు మిస్ అయిన బాధ, ఆ ఫిర్యాదును ఎవ్వడూ పట్టించుకోలేదన్న కోపం, రెండు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలకు హాజరు కావాలన్న హడావుడి లో పావు తక్కువ పదకొండు గంటలకల్లా బషీర్ బాగ్ లో ఉన్న ప్రెస్ క్లబ్ కు వెళ్లాను..ఆదివారం నాడు. అక్కడకు వెళ్ళింది...మన వేమూరి రాధాకృష్ణ ఏమి మాట్లాడతారో చూద్దామన్న కుతూహలం, సరదాకి రచయిత రాజగోపాల్ గారిని అభినందించాలన్న సంకల్పం. ఈనాడు జర్నలిస్టులు తప్ప...అన్ని పత్రికలు, చానల్స్ లో పెద్ద జర్నలిస్టులు అక్కడకు వచ్చారు.  


గంజి బాగా పెట్టిన తెల్ల షర్టు తో, జుట్టుకు దట్టంగా పట్టించిన నల్ల రంగుతో రాధాకృష్ణ చాలా ఉత్సాహంగా ఉన్నారు. తన పత్రికలో ఎడిటర్ గా పనిచేసి ఇప్పుడు హెచ్ ఎం టీ వీ కి ద హన్స్ ఇండియాకు ఎడిటర్ ఇన్ చీఫ్ గా ఉన్న కే.రామచంద్ర మూర్తి పక్కపక్కనే కూర్చొన్నారు. ఈనాడు లో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు  ఎన్..టీ.వీ.లో విశ్లేషణలు చేస్తున్న కొమ్మినేని శ్రీనివాస రావు గారు టక టక మాట్లాడి అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయారు. రాధాకృష్ణ గారు మాట్లాడే వంతు వచ్చింది. తన టీ.వీ.చానల్లో తెగ మాట్లాడే రా.కృ.చాలా సంక్షిప్తంగా మాట్లాడారు. 'చాన్నాళ్ళకు  ప్రెస్ క్లబ్ కు వచ్చాను. కాకపొతే ఒకటే తేడా...ఇదివరకు అక్కడ కూర్చునే వాడిని (వేదిక ముందు ఆహూతుల సీట్లలో), ఇప్పుడు ఇక్కడ (వేదిక మీద) వున్నాను...." తో మొదలయ్యింది ప్రసంగం.

రాజగోపాల్ చాలా కస్టపడి ఆంధ్ర జ్యోతి లో సరదాకి కాలం రాసే వాడని చెబుతూ..."బాగ కష్టపడే వాడు. ప్రసవ వేదన పడే వాడు. రాసిన మర్నాడు బాగా దగ్గే వాడు. దగ్గి దగ్గి...అది నోట్లో కొట్టుకునే వాడు. ఏందయ్యా...అది...(నోటి దగ్గర తన చేయి పెట్టుకుని బొటన వేలు వొత్తుతున్నట్లు సైగ) కొట్ట్కుకునే వాడివి..." అని రచయిత రాజగోపాల్ ను అడిగాడు మన రా.కృ. 

ఆస్తమా ఇన్హేలర్ అని వేదిక మీద ఉన్న ఒకరిద్దరు చెప్పే లోపే...'ఆ...ఆ...అదే...' అని ఇంకొకటి రెండు మాటలు చెప్పి ప్రసంగం ముగించారు. తర్వాత...సభ జరుగుతుండగానే...మధ్యలోనే వెళ్ళిపోయారు రా.కృ.
తర్వాత...మూర్తి గారి వంతు. హాస్య రచయితలూ...సత్తా వున్నా...ఎడిటర్లు కాలేక పోయారని చెబుతూ...వారిలో 'కిల్లర్ ఇన్ స్టింక్ట్' లేకపోవడమే దానికి కారణం కావచ్చని...విశ్లేషించారు. రాధాకృష్ణ, మూర్తి గార్లు కరచాలనం చేసుకుంటున్న ఫోటో ఇక్కడ ఇచ్చాను.
నేను ఇంకొక గంట ఉండి కార్యక్రమం ముగిసాక...ఇంటి ముఖం పడుతుండగా....చేతిలో రెండు సరదాకి ప్రతులతో జర్నలిస్టు ఉద్యమ నాయకుడు దేవులపల్లి అమర్ హడావుడిగా దిగుతూ కనిపించారు. ఎవరో అడిగారు....'రెండు తీసుకున్నారా....?' అని...'అవును...రెండోది కొట్టేసా..' అని ఆయన ఒప్పుకున్నారు. అది నికార్సైన జర్నలిజం అంటే. ఇక ఇంటికి పోదామని...మెట్లు దిగి ప్రెస్ క్లబ్ బైట పెట్టిన బండి దగ్గరకు వెళ్ళాను. దానికి తగిలించిన నా బంగారం లాంటి హెల్మెట్ ను ఎవరో కొట్టాశారు. బతుకంతా...కొట్టేయడమో...కొట్టేయించుకో బడటమో కదా...

4 comments:

సుజాత వేల్పూరి said...

ఇంతకీ డబ్బు సంగతి ఏమైంది సర్? బాంక్ వాళ్ళు ఫిర్యాదు మీద స్పందించారా? వాపస్ వచ్చిందా?

Ramu S said...

అంతా గమ్మత్తు గా ఉంది మేడం...
ఆదివారం నాడు 18 వేలు కట్ అయ్యాయి. వాళ్లకు కంప్లైంట్ చేశాను. ఒక 24 గంటలు వేచి చూడమన్నారు. నిన్న వెళ్లి చూస్తే...ఆ డబ్బు మళ్ళీ నా ఖాతాలో వచ్చి పడి వున్నది. ఇదేమి వ్యవహారమో నాకు తెలియలేదు. అన్ని స్లిప్పులు (రేసీట్స్) పట్టుకుని వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి.
రాము

ddtv said...

ATM vyavaharalu choose employee ki edo avasaram vachi vaadi untaadu lendi.. malli tirigi vachinanduku santosham.

kattashekarreddy said...

Ramugaru,

Kashtaalannee meeke endukochaayo aaroju! Mee Narration chalaa baguntundi. Kashtam gurinchi cheppinaa navvochindi.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి