వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయం...జిల్లాకో యూనివర్శిటీని ఏర్పాటుచేయాలనుకోవడం, అందులో భాగంగా పలు జిల్లాలలో యూనివర్శిటీలు ఏర్పాటు చేయడం. యూనివర్శిటీ విద్యను ప్రజల చెంతకు తేవాలన్న ఆలోచనలో భాగంగా ఆయనీ నిర్ణయం తీసుకుని ఉంటారు కానీ పలు లాజిస్టికల్ సమస్యలను ఆయన పట్టించుకోలేదు.
అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని వాడుకుని...కనీస మొత్తంలో నిధులు కేటాయించి లోకల్ గా యూనివర్శిటీలను ఏర్పాటుచేశారు. వైస్ ఛాన్సలర్ లు చాలా వరకు రాజకీయ నియామకాలే. అధ్యాపకుల నియామకాల్లోనూ నాణ్యతకు పెద్దపీట వేయలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. తాజాగా మచిలీపట్నంలో ఉన్న యూనివర్శిటీలో పోస్టులు ఇప్పిస్తానని ఒకాయన పది లక్షల వరకూ నొక్కేసి పారిపోయాడట. ఇందులో బాధితులు పోలీసు ఫిర్యాదు ఇవ్వడంతో విషయం బైట పడింది.
రాష్ట్రంలో ఉన్న పెద్ద యూనివర్శిటీలలోనే నాణ్యతా ప్రమాణాలు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. బాగా బోధించే ప్రొఫెసర్లు లేక మనం సతమతమవుతుంటే....జిల్లాకో యూనివర్శిటీ అన్నది ఎంత మూర్ఖపు ఆలోచనో చెప్పలేం. పైగా సిబ్బందిని నియమించుకోవడానికి ఈ స్థానిక యూనివర్శిటీలకు నిధులు లేవు. సదుపాయాలూ లేక పంతుళ్లూ లేక యూనివర్శిటీ వాళ్లు కోర్సులను ఎలా నడుపుతారు?
ఈ నిర్ణయం వల్ల పిల్లలకు దీర్ఘకాలంగా జరిగే నష్టం అంతా ఇంతా కాదు. యూనివర్శిటీ సెటప్ ఏర్పడింది కాబట్టి స్థానికంగా ఉన్న టీచర్లతో బండి నడుపుతారు...పిల్లలకు డిగ్రీలు ఇస్తారు. ఆ పిల్లలు అధిక సంఖ్యలో పోటీ పరీక్షల్లో దెబ్బతింటారు. దీన్ని పట్టించుకునే నాథుడే లేడు.
1 comments:
Before going to set up university in each and every district, the AP govt department of School education should strengthen the Priamry Schools, High Schools, Junior colleges and UG colleges in those districts.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి