Wednesday, May 2, 2012

బూదరాజు గారి జయంతి రేపు


తెలుగు జర్నలిజానికి ఆణిముత్యాల లాంటి జర్నలిస్టులను అందించిన బహు భాషావేత్త, శాసనాలను అధ్యయనం చేసిన దిట్ట, సాహితీ విమర్శకుడు, 'ఈనాడు జర్నలిజం స్కూలు' మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి ఎనభయ్యో జయంతిని ఆయన శిష్యులం రేపు (మూడో తేదీన) హైదరాబాద్ లోని సోమాజిగూడ లో 'ఈనాడు' పత్రిక ఆఫీసు ఎదుట ఉన్న ప్రెస్ క్లబ్ లో నిర్వహిస్తున్నాము. పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. బూదరాజు గారి శిష్యులు, అభిమానులు, సాహితీ వేత్తలు ఈ కార్యక్రమం లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. 


గురువు గారి జయంతి రోజునే Press Freedom Day కావడం విశేషం. ఈ సంస్మరణ సభకు వక్తలుగా అప్పటి 'ఈనాడు జర్నలిజం స్కూలు' బోధకులు డాక్టర్ డీ.చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ కాకాని చక్రపాణి, 'సాక్షి జర్నలిజం స్కూల్' మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ గోవింద రాజు చక్రధర్, 'ఈనాడు జర్నలిజం స్కూలు' ప్రిన్సిపాల్ మానుకొండ నాగేశ్వర రావు గార్లను ఆహ్వానించాము. దయచేసి ఈ సమాచారాన్ని నలుగురికి పంచాల్సిందిగా కోరుతున్నాము. ఈనాడు నుంచి ఒకరు వస్తే బాగుంటుందని నాగేశ్వర రావు గారిని పిలిచాము. ఒక కార్యక్రమం వల్ల రాలేనని ఆయన చెప్పారు. కేతు విశ్వనాథ రెడ్డి గారిని ఇతరులను పిలుద్దామని కొందరు చెప్పారు. బూదరాజు గారికి పరిచయం ఉన్న అందరినీ పిలుద్దాం. ఇందులో మనకు అజెండాలు ఏమీ లేవు.  

బూదరాజు సారుకు సంబంధించి ఒక కార్యక్రమం చేసి తీరాల్సిందే అని నేను పట్టిపట్టి అనుకున్నదే తడవుగా తన సమయాన్ని వెచ్చించిన మా బ్యాచ్ మేట్లు పీ.మధుసూదన్ (CEO, ధాత్రి కమ్యూనికేషన్), విజయ్ కుమార్ (News Editor, HM TV) లకు ప్రత్యక కృతఙ్ఞతలు. అహం గిహం విడిచి అన్ని పనులు పక్కన పెట్టి ఈ ప్రోగ్రాం మనది అనుకుని పాల్గొనాల్సిందిగా బూదరాజు గారి శిష్యులను, అభిమానులను, జర్నలిస్టు మిత్రులను కోరుతున్నాం. 


నోట్: ఇప్పటిదాకా చలనం లేకుండా ఉన్న  కొందరు తమ అభిప్రాయాలను పంచుకోవడం మొదలుపెట్టారు బూదరాజు గారి విషయంలో. ఇది మంచి పరిణామం. మనం అందరం కలిసి ఇంకా ఏమి చేయవచ్చో రేపు కలసి మాట్లాడుకుందాం. దయచేసి ప్రోగ్రాం చెడగొట్టాలని మాత్రం చూడవద్దని మనవి.  

2 comments:

Unknown said...

హాట్సాఫ్!

K V Ramana said...

Congrats annayya. The programme was too good. I agree...we should have all participated in organising it. But thanks to you, Madhu and Vijay there was beginning somewhere. Let's take it forward. Let us plan for a meeting to do something permanent and longterm.
Ramana

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి