Sunday, May 27, 2012

'ఈనాడు' పైశాచిక జర్నలిజం...


మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్న నేపథ్యంలో 'ఈనాడు' కవరేజ్ గతి తప్పుతున్నది. జర్నలిజం మౌలిక సూత్రమైన నిష్పాక్షికత గాల్లో కలిసింది. వార్తలు వ్యాఖ్యల మాయమై పోతున్నాయి. యజమాని ఇష్టపడే కార్టూన్లు వేయడమే పరమావధిగా ఉజ్జోగం చేసే శ్రీధర్ కార్టూన్లు శృతి మించుతున్నాయి. వెరసి 'ఈనాడు' లో పైశాచిక ఆనందపు జర్నలిజం వర్ధిల్లుతున్నది. గత మూడు రోజుల 'ఈనాడు' కవరేజి చూస్తే ఇది తెలుస్తుంది. 

శుక్రవారం కవరేజి
"ఓదార్పు కరవు" అనే శీర్షికతో బ్యానర్ ప్రచురించారు. ఆ 'ఓదార్పు' అక్షరాలకు ఎర్రరంగు వేశారు. ఓదార్పు పేరుతో జగన్ యాత్ర చేపట్టడానికి, జగన్ మధ్యంతర ముదస్తు బెయిల్ పిటిషన్ ను ఒక కోర్టు తిరస్కరించడానికి లింక్ ఏమిటి? ఇదేమి సృజనాత్మకత? 

ఆ వార్త కింద చుక్కలు కనిపిస్తూ చెమటలు పట్టిన జగన్ ను సీ.బీ.ఐ. అనే తాడు బందించినట్లు, జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు పెద్ద కార్టూన్ వేశారు శ్రీధర్. ఇది నీతిమాలిన, మతితప్పిన, అమర్యాదకరమైన జర్నలిజం. దర్యాప్తు సంస్థలను, కోర్టుల మాటలకు వక్రభాష్యం చెప్పడమిది. 

ఈ మొదటి పేజీలో  శ్రీధర్ గారి మార్కు 'ఇదీ సంగతి' లో జగన్ ఎప్పుడు అరెస్టు అవుతారా....అన్న కార్టూనిస్టు ఆతృత కనిపిస్తుంది. జగన్ ఒక పక్క మైకులో '...త్వరలో రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి..' అని అంటుండగానే....బేడీలు పట్టుకుని ఒక ఇన్స్పెక్టర్ '...వచ్చేసాయి సార్...' అంతో పరిగెత్తుకుంటూ జగన్ వాహనం వైపు వస్తుంటాడు. జగన్ ను చెండాడుతూ పలు కథనాలు ఉన్నాయి ఈ రోజు పత్రికలో. 

'చేసుకున్నవారికి చేసుకున్నంత' అన్న శీర్షికతో వచ్చిన ఎడిటోరియల్ లో ప్రతి అక్షరం వై.ఎస్.పై, ఆయన సన్ పై విషం చిమ్మింది. ఇదేమీ తప్పు కాదు. సంపాదకీయంలో ఇలా పత్రిక అభిప్రాయాన్ని రాయడాన్ని తప్పు పట్టరు. సంపాదకీయంలో పాటించాల్సిన కనీస మర్యాదలు బోధించే జర్నలిజం కోర్సులు చదవని వారు రాసిన సంపాదకీయం అది. అయినా నో ప్రాబ్లం. 

శనివారం కవరేజి
'నేడు మరో ? రౌండు' అన్న శీర్షికతో బ్యానర్ స్టోరీ వేశారు. అందులో సీ.బీ.ఐ.అధికారి లక్ష్మినారాయణ, జగన్ ల బొమ్మలు వేసిన దాన్ని బట్టి చూస్తే...అదేదో వారిద్దరి మధ్య పోటీ అన్నట్లు ఉంది. దర్యాప్తు సంస్థల అధికారుల, న్యాయమూర్తుల ఫోటోలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకూడదన్నది థంబ్ రూల్. జర్నలిజం కోర్సులు, ప్రపంచ మీడియా సంప్రదాయాలు తెలియని ఒక మందమతి నిర్ణయం కాక ఇదేమిటి? రామోజీ రావును సీ.బీ.ఐ. రమ్మంటే....ఇదే తరహా కవరేజ్ ఇస్తారా? 

ఆ స్టోరీ లోనే విద్వాన్ శ్రీధర్ గారి కార్టూన్ పెద్దది ఒకటుంది. సీ.బీ.ఐ.ఆఫీసు నుంచి జగన్ వస్తుంటే...బైట ఆయన అభిమానులు 'సార్ ని అరెస్టు చేయలేదు. తిరిగోచ్చాడోచ్..." అని సంబరం చేసుకునే దృశ్యమిది. అలాగీ...'ఇదీ సంగతి' ఏడ్చింది. జగన్ పారీ అభ్యర్ధి తన భార్యతో చెబుతాడు...."అరెస్టు కాలేదట. అవుతాడేమో ఆ పేరున మరో నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయని ఆశ పడ్డాను డియర్.' ఇదే పేపర్ లో వడ దెబ్బకు ఇరవై మంది చనిపోయిన వార్త ఒక ఎనిమిది లైన్లు ఉంది. 'మైసూరాస్త్రం' తుస్..అన్న మరొక తిక్క వార్త కూడా ఉంది.

ఆదివారం కవరేజ్ 
ఎప్పటి లాగానే ఫస్టు పీజీ సింహభాగాన్ని జగన్ కు కేటాయించారు. 'ఉ.10  గం - సాయంత్రం 6 గం. c/0 దిల్ కుషా' అన్న వ్యంగ్య కాప్షన్ను జగన్ ఫోటో కింద పెట్టారు. లోపలి పేజీలో శ్రీధర్ కార్టూన్లు ఇవి. 


"నిన్న వర్జ్యం ఉందట. మొన్న చవితి కదాని చర్య తీసుకోలేదట సార్...సీ.బీ.ఐ." అనే ఈ కింది చిన్న కార్టూన్...ఒక ఇమ్మెచ్చూర్ కార్టూనిస్టు ప్రయత్నం. మూడో రోజు జగన్ మునగాలన్న కుత్సితం ఇందులో లేదా? కార్తూనిస్తుకు ఇంట ఆరాటం ఎందుకు? జగన్ అరెస్టయితే...న్యాయం బతికిందని లోపల సంతోషించే 'సాక్షి' జర్నలిస్టులూ వుండకపోరు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ శిక్షపడాలని జర్నలిస్టులు కోరుకోవాలి.జర్నలిజాన్ని జర్నలిజంగా బతకనిస్తే ప్రజాస్వామ్యానికి మేలు చేసిన వారవుతారు. 

సారా ఉద్యమం అప్పుడు సారా నిషేధించాలన్న రామోజీ డిమాండ్ మేరకు నెలకు పైగా సారాపై తప్ప వేరే కార్టూన్లు వేయని శ్రీధర్ నిషేధం ఎత్తేసాక ఆ విషయం గురించి పట్టించుకోలేదు. యజమాని అడుగులకు మడుగులొత్తవచ్చు కానీ...మరీ ఇంత దారుణంగా వ్యవహరించకూడదు. 'ది హిందూ' లో సురేంద్ర వేస్తున్న కార్టూన్లు చూసి శ్రీధర్ నేర్చుకోవాల్సింది ఎంతైనా వుందని నా  వ్యక్తిగత అభిప్రాయం. అర్థ రూపాయికి పడి రూపాయల యాక్షన్ చేస్తూ....ఆత్మలను అమ్ముకునే...ఇలాంటి కార్టూనిస్టులు, జర్నలిస్టుల వల్లనే తెలుగు నెల మీద జర్నలిజం వన్నె తగ్గింది. జనం జర్నలిస్టుల నోట్లో ఉమ్ముతున్నారు. బరితెగింపు జర్నలిజం ఆపండి బ్రదర్స్. 

(నోట్: జగన్ కు అన్యాయం జరుగుతున్నదని ఈ రచయిత భావించడం లేదు. తన తప్పులకు శిక్ష పడాల్సిందే కానీ...మరీ మీడియా రూల్స్ మార్చి పైశాచిక పోకడలు జర్నలిజం లో చొప్పించడం అన్యాయమని, అది దీర్ఘ కాలం లో ఫోర్త్ ఎస్టేట్ కు మంచిది కాదని చెప్పడం ఈ వ్యాసం ఉద్దేశం.)
Cartoons courtesy: Eenadu, Sreedhar     

31 comments:

Sudhakar said...

you are right...but i think this is not new for eenadu. Eeenadu has been slipping off the line since long. Now Sakshi had ignited the pichaachi in eenadu with it's worst possible and childish journalism. Now even though i get eenadu everyday, I dont see much to read in it. Sakshi is anyway tastes like rotten grass to cattle.

Alapati Ramesh Babu said...

అసలు రామోజిరావు గారిది పాముపగ, కనీసము పాము కన్నా దయ వుంటుంది వీళ్ళకు అదేమి వుండదు. మరి తన భూములు రింగు రోడ్డులో పొయి,తను, తన మార్గదర్శి బజారున పడటాని కారణమయిన వై.స్. కాబట్టి ఇంత పగ.
పొని జగన్ సాక్షి పేపర్,టీ.వి. తో వూరుకుంటే బాగుండేది తన కోడుకును తన మీదకు వుసికొలిపి మొదటి పేజీలో ఇంటర్వుయు వేసి మొత్తము సిగ్గు తీస్తే రామోజి సహించుటయా భరించుటయా అబ్బే సిగ్గు యెగ్గు అన్ని వదలి దుర్మార్గ కుట్రలు చేయాలి, చేస్తాడు.

Unknown said...

yes i'm also observing the thing from days why eenadu i making Jagan is only the problem to the state. There are many issue in tate like price hike,education etc.
They need to change their mind set and follow the journalism values.

Truth Seeker said...

ఈనాడు అనేది ఒక కుల పత్రిక. రామోజీ రావు తన కులపోల్ల కడుపాత్రం సల్లబడటానికి అలా రాసుకుంటాడు. పెరుగుట విరుగుట కొరకే. రేపటి రోజు ఉంటుంది అని మర్చి పోయి రాస్తున్నాడు అనుకుంటా. అన్నీ తన రోజులు కావు అని గుర్తిస్తే మంచిది.

satya said...

"వైయస్ పై వ్రాసేటప్పుడు అన్నీ వదిలేస్తాడు"... అని సింబాలిక్ గా రామోజిరావుకి బట్టలు లేకుండా కార్టూన్ వేసిన విషయం మరిచారా? ఇంక చంద్రబాబు బొమ్మనైతే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటారు.. వీటన్నిటి మీద మీరు సాక్షి పైశాచికత్వం అనే పోస్ట్ ఎప్పుడైన వ్రాసారా? జర్నలిజం లోనే కాదు.. వాటిపై విమర్శలు చేసేప్పుడు కూడా నిష్పక్షపాతం గా ఉండాలి.. సాక్షి వచ్చాక, అది డిమాండ్ చేసినట్లు రేటు తగ్గించలేదు గాని, పేపర్ విలువలు మాత్రం తగ్గించారు ఈనాడు లో..

వైయ్యస్ ది కాని, సాక్షి ది కాని ఒకటే సిద్దాంతం.. "Either be my friend..or be a foe" ఇది ఒకరకమైన మార్కెటింగ్.. ఇందులో ఆలోచనా శక్తి కి తావుండదు.. కేవలం loyalty నే.. అందుకే ఈనాడు పై అయిష్టత ఉండి వేరే పేపర్ చదివేవాళ్ళు చాలమంది సాక్షి కి మారారు..

satya said...
This comment has been removed by the author.
Ramu S said...

సాక్షి ఓవర్ యాక్షన్ మీద కూడా గతంలో నేను రాసాను. చూసుకోగలరు.
రాము

Anonymous said...

Today the more i am reading eenadu, one thing I realized is the new pattern in their stories. believe it or not...they are now seriously copying Sakshi raatalu. Sakshi is well known to use worst possible angles of a story...only to raise un-related emotions. I can see the same reflecting in district edition news on 100 buses burning...+ how much it takes to come from kotha peta to moosa peta...

I kicked out sakshi only after 1 month of trial. Now i am in a dilemma if i have to kick eenadu out as well. I think i will have to.

satyam said...

రాము గారూ,
ఈనాడు వార్తల పై మీ వ్యాఖ్యానం చాలా బాగుంది. చాలా కాలంగా నాకు ఇదే అభిప్రాయం.
ఈనాడు ఉద్దేశాలతో కాదు గానీ, ఈనాడు ప్రొఫెషనలిజం పై నాకు చాలా గౌరవం ఉండేది.
ఈకాలంలో అది పూర్తిగా పోయింది. జగన్ లేదా ఇతరులను అరెస్టు చేయొద్దని కానీ,
వాళ్ళు నీతిపరులు అని కానీ ఎవరూ చెప్పారు. అదే టైములో జర్నలిజం అనేదానికి అర్థం ఉండాలి కదా....
అది లేకుండా పోయింది. జనాలను తెలివితక్కువవాళ్ళుగా చూడటం, చేయటం చాలా తప్పు.
ఇక ఆంధ్రజ్యితి గురించి చెప్పక్కర్లేదు. దాన్లో రాసిన విషయాలను ఒక్క పట్టాన ఎవరూ నమ్మరు.
మొన్నటి వరకూ ఈనాడుకు ఉన్నంత క్రెడిబులిటీ ఈ పత్రిక్కి లేదు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి జగన్ కి వ్యతిరేకంగా ఎంతకైనా తెగించేలా ఉన్నాయి.
ఈ కథ కొద్ది రోజుల్లో ముగిసిపోతుంది. దానికోసం పత్రికా విలువలకు పాతర వేయటం అభిలషణీయం కాదు.

Puranam said...

డియర్ రాము,

గత వారం నేను మీకు రామోజీ రావు మీద ఉన్న అక్కసు గురించి ఓ కామెంటు వ్రాసాను, ఇంతలో మీరు నాకు మళ్ళీ పని పెట్టారు. ఈనాడు జీతాలు గురించి వ్రాసేప్పుడు ఎవరో ఓ పాత మిత్రుడు జగన్ జైలుకు పంపుతున్నారనే పైశాచిక ఆనందంలో జీతాలు పెంచారని అన్నాడు అని వ్రాసారు, ఇప్పుడు మీరు వ్రాసిన పుటకు అదే పైశాచిక పదం వాడారు. గత వారం మీ మిత్రుడు చెప్పిన పైశాచిక పదం మీ బుర్రలో అలాగే ఉండిపోయిందో లేక ఆ మిత్రుడు మీ ఊహాజనితమో మీకే తెలియాలి . ఇక ఈ రోజు మళ్ళీ ఈనాడు పై మరియు శ్రీధర్ పై కూసంత ఎక్కువగానే మండి పడుతూ వ్యాసాన్ని వ్రాసారు, ఇదే కోపం రామోజీ రావు బట్టలు వూడతీసి కార్టూన్ వేసినప్పుడు ఏమయిందండి ? గతంలో ఓ బ్యానర్ ఆర్టికల్ పై నల్ల బొల్లి మాటలు అంటూ నీచంగా చంద్రబాబు పై బ్యానర్ పెడితే మీరు ఎందుకు మిన్నకుండి పోయారు ? ఈనాడు చేస్తున్నది తప్పే, ఆ పేపరు సంపాదకత్వం ఓ పార్టీకి కొమ్ముకాస్తోంది అని ఆంధ్రాలో ఉన్న అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరికి ఎలాంటి వార్తలు కావాలో అది వాళ్లకు అందివ్వడమే వ్యాపార సూత్రం, ఈ విషయంలో ఈనాడైనా సాక్షిఅయినా ఒకే తానులోని గుడ్డలే. కానీ మీరు ఈనాడు పేపరు పై ఇలా వారానికి ఓ సారి ఏహ్యభావాన్ని ప్రకటించడం ఏదో కొంత అసౌకర్యంగా ఉంది, అలాగే ఎవరన్న మీ వ్యాసాలపై ఏక పార్శ్వంగా ఉంది అంటే మీరు " ఎవరు ఎంత మొరిగినా " అని చాలా "పైశాచికంగా" జవాబు ఇస్తున్నారు, ఎందుకో మీరు కొంత బ్యాలన్సు తప్పుతున్నారని అనిపిస్తూ ఉంది. మీ బ్లాగులోని అన్ని వ్యాసాలను చదివాను, ఈనాడు , ఆంధ్రజ్యోతి , రామోజీ మరియు రాధాకృష్ణను తప్ప ఎ ఇతర పత్రికనుకాని , దాని యజమాని గురించి కానీ విమర్శిస్తూ ఎన్ని వ్యాసాలూ వ్రాసారో ఓ సారి మీకు మీరు చూసుకొంటే మంచిది. ఎందుకో మీ బ్లాగ్ పై మీరు వ్రాసుకున్న సూత్రాలు మీరే చదివి కొంత కాలమైనట్లు ఉంది, జాగర్త సుమా.

sreeramsreenivas said...

journalisam values eenadu ku gani unte ........................

anni vishayalu vishaya pradhanyatha prakaram prachurinchali...............


jagan odarpu yatra eenadu lo kavar chesava ...............

kani jagan pi kesu pettinappati nundi ........ kesula vishayam matram cover chestunnaru .........

idena journalisam ...........

kamma journalisam

Anonymous said...

జగన్ చేసింది తప్పే - అతనికి శిక్షపడటం కూడా కరక్టే అని నమ్మే తటస్థులూ మేధావులుకూడా ఇదే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పుపట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఒక కేసులో ఏ వన్ గా చూపినవాణ్ణి అరెస్ట్/ ప్రశ్నించడం చెయ్యడానికి చార్జ్‌షీట్లు దాఖలు చేసేసి కోర్ట్ కు హాజరు కమ్మని స్వయానా కోర్టే సమన్లు పంపిన తర్వాత, ప్రత్యేకంగా సీబీఐ ప్రశ్నించాల/ అరెస్ట్ చెయ్యాలనుకోవడం అవివేకమే.
చార్జ్‌షీటుకు ముందు ప్రశ్నించి, అవసరమనుకుంటే అరెస్టైనా చేసుండొచ్చుకదా? పోయి పోయి ఉప ఎన్నికల ప్రచార హడావిడిలో ఉండగా ఈ తంతు చెయ్యడం నిజంగా వివేకమేనా?
వ్యక్తి ఎలాంటివాడైనా, దొంగ సొమ్ముతో పార్టీ పెట్టాడనుకున్నా ఆయన్ను నమ్ముకుని ఓ డజనున్నరమంది ఉన్నప్పుడు వారికోసం ప్రచారం చేసుకోనివ్వకపోవడం ఏం నీతి? పోనీ ఈ 15రోజుల్లోనే ఆయన ఏదేశానికైనా పారిపోతారనుకున్నారా??
ఆయనపై ఉన్న కసికొద్దీ ఎప్పుడైతేనేమి లోనేసెయ్యడానికి అనే వారికీ, ఆయన పెట్టిన పార్టీయే అవినీతి డబ్బుతో కనుకన్నూ, ఆయనకోసం పార్టీ ఫిరాయించినవారందరూ మహా అవినీతిపరులవ్వడంవల్లనూ వాళ్ళకు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసుకొనేంత స్వేచ్ఛ కూడా ఇవ్వనవసరం లేదందామా అంటే - దేశంలో ఏపార్టీ స్వచ్ఛమైన డబ్బుతో/ మనుష్యలతో నడుస్తుందో చెప్పగలరా??

Praveen Mandangi said...

శ్రీరంగ నీతులు ఎందుకు రాము గారు? ఒకప్పుడు జగన్ తన పత్రికలో రోజూ తెలంగాణాకి వ్యతిరేకంగా సమైక్యవాద వ్యాసాలు వ్రాయింవేవాడు. తెలంగాణాలో సాక్షికి సర్క్యులేషన్ తగ్గిపోయిన తరువాత సమైక్యవాద వ్యాసాలు నిలిపివెయ్యించాడు. జగన్ బహిరంగంగా ఒక ప్రాంతంపై విషం చిమ్మినప్పుడు మీకు అనైతిక జర్నలిజం గుర్తు రాలేదు కానీ ఈనాడు పత్రిక జగన్‌పై విషం చిమ్మడం మాత్రం అనైతికంలాగ కనిపించిందా?

గతంలో ఈనాడు దిన పత్రిక తన ప్రత్యర్థి పత్రిక అయిన ఉదయం పత్రిక ఎడిటర్ మాగుంట సుబ్బరామిరెడ్డికి చెందిన బాలాజీ డిస్టిలరీస్ కంపెనీకి ఆంధ్రాలో మార్కెట్ లేకుండా చెయ్యడానికి రోజూ మధ్య నిషేధ ఉద్యమాన్ని సమర్థిస్తూ వ్యాసాలు ప్రచురించింది. NTR సంపూర్ణ మద్య నిషేధం ఫైల్‌పై సంతకం పెట్టేంత వరకు ఈనాడు పత్రిక రోజూ మద్య నిషేధానికి సపోర్ట్‌గా వార్తలు వ్రాసేది. ఇప్పుడు ఈనాడు పత్రిక సాక్షి విషయంలో అలాంటిదే చేస్తోంది. ఇక్కడ ఈనాడు పత్రిక చేసినది వ్యక్తులపై దాడి. కానీ జగన్ తన పత్రిక ద్వారా తెలంగాణా ఉద్యమంపై విషం చిమ్మి ప్రాంతంపై దాడి చేశాడు. అది రామోజీరావు చేసిన పని కంటే నీతివంతమైన పని కాదు కదా.

జగన్ తెలంగాణా రాకుండా అడ్దుకుని ఒక ప్రాంతంవాళ్ళ మనోభావాలు దెబ్బతియ్యాలనుకున్నాడు. జగన్ జైలుకి పోతే కోస్తా ఆంధ్రలో ఉన్న కొంత మంది జగన్ సానుభూతిపరులు బాధపడతారేమో కానీ తెలంగాణాలో మాత్రం ఎవరికీ చీమకుట్టినట్టు ఉండదు. ఈనాడు చేసినది అనైతిక జర్నలిజమే. ఇందులో సందేహం లేదు. కానీ ప్రాంతంపై విషం చిమ్మే జగన్ లాంటివాళ్ళ మీద ఎంత విషం చిమ్మినా అది తక్కువే.

eblroagjger said...

Seems your article had an effect. Todays sridhar cartoon is much gentle

Praveen Mandangi said...

ఈనాడుని కుల పత్రిక అంటున్నారు. దోచుకోవడానికి కులంతో పనేమిటి? జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్ కమ్మవాడు కాదా? రామోజీరావుకి తన సొంత అన్నదమ్ముల పిల్లలని కూడా మోసం చేసిన చరిత్ర ఉంది. అలాంటి వాడు తన కులాన్ని మాత్రం ఉద్దరిస్తాడా?

sndp said...

Sir,ikada matram meru chepindi correcte kani..

Ikada problem sridhar da?leka eenadu da?

Ramu S said...

సాధారణంగా కార్టూన్లలో ఉండాల్సినవి వ్యంగ్యం, ఎత్తి పొడుపు. ఇవి పాటిస్తూ కార్టూనిస్టు ఒక సందేశాన్ని పంపవచ్చు. కొన్ని చురకలు వేయవచ్చు. దానికి భిన్నంగా...జగన్ కు బేడీలు వేసిన కార్టూన్ గీయడం శ్రీధర్ గారి తప్పు, ప్రచురించడం 'ఈనాడు' తప్పు అని నా అభిప్రాయం. మరీ ప్రత్యక్ష దాడి చేస్తునట్లు కార్టూన్లు ఉండడం మంచిది కాదన్నది నా అవగాహన.
రాము

vinod said...

Ramoji ki battalu lekunda cartoons vesinappudu emaindi paisachika jounalisum viluvalu...
every body in the blog world know u r a pro jagan cand & anti Eenadu guy..but u proclaimed urself as a newutal man...

vinod said...

ayina Sridhar me lanti one sided hatred journos nunchi nerchukone antha neecha sthayi lo ledu...
The Hindu is best in india and eenadu is better in AP. Bolli ane padanni direct ga vadina sakshi vadi meeda okka article padaledu, kani jagan meeda real ga jariguthunna vishayala meeda cartoon vesthe abimanam tannukuchachindi...
Get some life

Anonymous said...

నిజమే. ఇలాంటి నాసిరకం కార్టూన్లు ఈనాడు, సాక్షి, జ్యోతి, టివి9 లలో మామూలే.

Ramu S said...

నిజానికి సాక్షి వాడు ఇలాంటి కార్టూన్లు వేసినా తప్పే. సాక్షి పత్రికే ఒక రాజకీయ పార్టీ కి బహిరంగ బాకా. వాళ్ళు ఏమి చేసినా మనం పట్టించుకోవడం దండగ. రామోజీ గారు కూడా...'ఈనాడు' మాస్ట హెడ్ మీద చంద్రబాబు బొమ్మ పెట్టి ఇష్టమొచ్చిన కార్టూన్లు వేసుకుంటే...నేనీ పోస్టు రాసే వాడినే కాదు. నా దృష్టికి వచ్చినప్పుడల్లా నేను సాక్షి గురించి కూడా రాసాను. నేను 'ఈనాడు' 'ది హిందూ' మాత్రమే చదువుతాను కాబట్టి...కొన్ని అంశాలు మిస్ అయ్యే అవకాశం ఉంది.
శ్రీధర్ గారంటే నాకు కోపం ఏమీ లేదు. అలాంటి అద్భుతమైన కార్టూనిస్టు ప్రొఫెషనలిజం వదలకూదదన్నది నా అభిప్రాయం.
రాము

Jai Gottimukkala said...

రాము గారూ, ఇదేమీ అంత కొత్త విషయం కాదు. అరుణ్ శోరీ అంతటివాడే ఇదే రకంగా ప్రవర్తించాడు. ఆయన బోఫోర్సు గురించి రాసిన విధానం చూస్తె ఆయన చీఫ్ ఎడిటారా బోఫోర్సు కేసు కవర్ చేసే ప్రత్యెక విలేకరా అనే అనుమానం కలిగేది. 1983లో ఈనాడు పత్రికను చూస్తె అదీ TDP/NTR కరపత్రం లానే కనిపిస్తుంది.

ఇక కార్టూనులంటారా అంబేద్కర్ కార్టూన్ పై చెలరేగిన దుమారం చూస్తె ఒక విషయం అర్ధం అవుతుంది. ఒకరికి ఆమోదయోగ్యం అనిపించినిది మరొకరికి అభ్యంతరంగా తోచవచ్చు.

Unknown said...

Praveen Mandangi Garu,

U seem to be jagan hater to the core. antaku minchi mee messages lo emi kanapadadu... ippudu ade hatred ni telangana message to cover chestunnaru...
asalu TG ki against ga sakshi news rasindeppudu??? alaa ani evaraina TRS vallu kani pro-tg vallu kani annaraa????

K V Ramana said...

Why didn't you take the same line when Sakshi had interviewed one Mr Appa Rao, who is definitely not a recongisable face in AP, or the TV actor Prabhakar or Ramoji's son? Don't you think the interviews were done with the sole motive of maligning Ramoji Rao? Did you forget the way Sakshi went overboard in covering Undavalli's attempt to attack Margadarsi? Why didn't the same opinion was expressed when there was an all out attack on the Film City? I think all of us should not get into the analysis of content either in Sakshi or Eenadu. Both of them have their set of priorities and agenda.

Praveen Mandangi said...

నాయనా Unknown, నేను ఒక బలమైన తెలంగాణావాదినే. నేనేమీ జగన్ మీద ద్వేషంతో తెలంగాణావాదం ముసుగు వేసుకోవడం లేదు.

Anonymous said...

@రామోజీ గారు కూడా...'ఈనాడు' మాస్ట హెడ్ మీద చంద్రబాబు బొమ్మ పెట్టి ఇష్టమొచ్చిన కార్టూన్లు వేసుకుంటే...నేనీ పోస్టు రాసే వాడినే కాదు"
well said.

vinod said...

http://i46.tinypic.com/9jzq1c.jpg
just check this, today's Sh*it cartoon..

Unknown said...

K V Ramana Garu,

I believe Margadarsi episode is 2006/07... where as sakshi came in 2008.. I may be wrong too..

I agree with u that, both papers have their own agenda.. but.. as some blogger saying, people would have no objection if eenadu prints with tdp/cbn logo on it... like saamna for shivsena or sakshi for jagan....

Sudhakar said...

ee vekili haasyam choosi tarinchandi..

http://www.sakshi.com/Main/WeeklyDetails.aspx?Newsid=42597&Categoryid=11&subcatid=22

shrigo said...

eenadu.. sakshi.. dondu... donde...

Vamsi Maddipati said...

రామూ గారు, మీరు కూడా మీకు రామోజీ & ఈనాడు మీద ఉన్న అక్కసును ఇక్కడ ప్రదర్శిస్తున్నారు..... తెలుగులో ఉన్న పతికలలో ఈనాడు కంటే బాగా చదవదగిన పత్రిక లేదు, నైతిక విలువలు దిగజార్చిన సాక్షి కంటే ఈనాడు చాలా బెటర్

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి