ఒక రెండు దశాబ్దాల పాటు మీడియాలో పనిచేసినా...వివిధ అంశాలలో మీడియా చిత్తశుద్ధి పట్ల నాకు పెద్దగా నమ్మకం కుదరదు. ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఐతే మరీ. వీళ్ళ కథనం లేదా చర్చనీయాంశం మహిళ (అదీ ఒక అందమైన మహిళ లేదా బాలిక) అయితే...దాన్ని సాగతీసి పీల్చిపిప్పిచేసి ఆనందిస్తారు. తెలుగు చానెల్స్ లో పలు చానెల్స్ ఈ విద్యలో ఆరితేరాయి. ఈ మీడియానే సర్వరోగ నివారిణి అని భ్రమించి ఎవరి భార్యో ఏ తెలుగు చానెల్ ఆఫీసుకు వెళ్లి 'మా ఆయన నన్ను రకరకాలుగా హింసిస్తున్నాడు. లైవ్ ఏర్పాటు చేయండి' అని అడిగితే...వాళ్ళు ప్రత్యక్ష ప్రసారానికి వెనుకడుగు వేయరని నాకు నమ్మకం. ఇలాంటి కేసులు తెలుగు ప్రేక్షకులు ఎన్ని వీక్షించలేదు?
ప్రేక్షకులను కట్టి పడేసే మసాలా దినుసులు ఇలాంటి స్టోరీ లలో, చర్చలలో బోలెడు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిని టీ వీ ఛానెల్స్ వదలవు. "అన్నా...టీ వీ వినోదం కోసం ఉన్నది. ఇలాంటి ఎలిమెంట్లు వినోదానికి ముఖ్యం," అని అబద్ధాలే జీవితంగా ఈ విద్యలో ఆరితేరిన ఒక సీ ఈ ఓ నాతొ అన్నాడు ఒక రెండేళ్ళ కిందట. సమస్య పరిష్కారం కోసం మీడియా ప్రయత్నించాలి లేదా సమస్యను ప్రొజెక్ట్ చేసి సమాజ అంతరాత్మను కదిలించాలి తప్ప టీ ఆర్ పీ కోసం కక్కుర్తి పడడం బాధ్యతను మరవడమే. పైగా ఇప్పటికే అడుగడుగునా దారుణ వివక్షకు గురవుతున్న మహిళలు, బాలికల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే బాగుంటుంది.
సరే...నా ఈ ఏడుపు ఎలా ఉన్నా...నాకు కాస్త తీరిక దొరికి పొద్దుపోక నిన్న (ఫిబ్రవరి ఐదో తేదీ) రాత్రి ఇంగ్లిష్ చానెల్స్ చూసాను. ND-TV, CNN-IBN, TIMES-NOW, BBC మార్చి మార్చి చూసాను. ఇందులో మొదటి రెండు చానెల్స్ లో "marital sex" అనే అంశం మీద సుదీర్ఘ చర్చలు జరిగాయి. మామూలుగా జరిగే రేప్ ల సంగతి అలా ఉంచితే...సమ్మతి లేకుండా భర్త భార్యను సెక్స్ కోసం బలవంతం చేస్తే అదీ రేపే అవుతుందని, అందుకు గానూ అతన్ని శిక్షించాలని ND TV బర్ఖా దత్ వాదించారు. ఒక పదేళ్ళు కాపురం చేసాక.. 'మా ఆయన నన్ను నిన్న రాత్రి రేప్ చేసాడు' అని భార్య కేసు పెడితే...పోలీసులు దీన్ని ఎలా నిరూపిస్తారని CNN-IBN సాగరిక అనుమానం వ్యక్తం చేసారు. చర్చలో పాల్గొన్న వాళ్ళు తమ వాదనలను బలంగా వినిపించారు. నిజంగా ఇలాంటి చట్టం అవసరం ఎంతైనా ఉందని వాదిస్తూ..'మహిళ మగవాడిని రేప్ చేసిన ఘటనలు ఉన్నాయా?' అని ఒక విద్యావంతురాలు ఆవేశంగా ప్రశ్నిస్తే....'మేడం...మహిళలు రేప్ చేసిన కేసులు అనేకం ఉన్నాయి....' అని ఒక పురుషుడు కౌంటర్ వేసాడు. భర్త మీద రేప్ కేసు వేసే వెసులుబాటు భార్యకు ఇస్తే...కొంప కొల్లేరు అవుతుందని, సంసారాలు గుల్ల అవుతాయని ఇంకొక బాధితుడు బలంగా వాదించాడు. ఈ చర్చతో నా మతి పోయింది.
రెండేళ్ళ లోపు వయసున్న తన కూతురును తన భర్త (ఫ్రెంచ్ దౌత్యవేత్త) లైంగికంగా ఎలా వేధించిందీ ఒక మహిళ వివరించే ఏర్పాటు మొదటి చానెల్ లో కలిగించింది. చర్చకు దూరంగా అనిపించినా ఈ ఘటన చాలా ఆవేదన కలిగించింది. ఈ సమయంలోనే...TIMES-NOW లో అర్ణబ్ గోస్వామి కాశ్మీరీ బాలికలు గాన కచేరీలు ఇవ్వకుండా ఫత్వా జారీ చేసిన అంశం మీద అందరినీ కడిగి పారేస్తుండగా...BBC లో స్వలింగ సంపర్కుల పెళ్లిని అంగీకరించే బిల్లు మీద బ్రిటన్ పార్లమెంటులో జరుగుతున్న చర్చ మీద మంచి కథనం ప్రసారమయ్యింది.
మొత్తం ND-TV, CNN-IBN చర్చలలో ఎంతసేపటికీ 'మారిటల్ సెక్స్' గురించి పలు కోణాలలో ఆసక్తికరమైన చర్చ జరిపారు తప్ప...అద్భుతమైన కుటుంబ, వివాహ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఈ నవీన మానవుడు ఏమి చేయవచ్చో మాటమాత్రంగా నైనా ప్రస్తావించలేదు. సెక్స్ విద్యలేకుండా, సెక్స్ జీవితం ప్రాముఖ్యం తెలియకుండా బతుకుతున్న సమాజానికి కావాల్సిన చర్చలు ఇవేనా? ఏమో?
అయ్యలారా...అమ్మలారా...ముందుగా పరమ హేయమైన రేప్ లను నిరోధించేలా ప్రభుత్వాలు నడుం బిగించేట్లు ఒత్తిడి తెండి. ఆడపిల్లల మీద అనుక్షణం జరుగుతున్న దాడుల నిరోధానికి ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేయండి. మన ఆడపిల్లలు, మహిళలు జంకూ గొంకూ లేకుండా రోడ్ల మీద హాయిగా తిరిగే పరిస్థితి కల్పించండి. ఇది తక్షణావసరం.
7 comments:
రెండేళ్ళ లోపు వయసున్న తన కూతురును తన భర్త (ఫ్రెంచ్ దౌత్యవేత్త) లైంగికంగా ఎలా వేధించిందీ ఒక మహిళ వివరించే ఏర్పాటు మొదటి చానెల్ లో కలిగించింది.
It's a fake case. Clear misuse of the law. Please check your facts.
From Rediff...
evidence though the medical report given by the Baptist Hospital allegedly indicated there was sexual abuse on his minor daughter, the same does not link him".
He submitted since 2005, his wife Suja Jones (the second respondent) was "not happy with him and used to frequently quarrel with him".
French diplomat seeks quashing of rape case against him
I read some articles about this, I will give some more details later.
But what's your take on Marital Rape? you didn't gave any satisfiable answer. Do you support law on Marital Rape? Or Not?
Dear Srikanth,
To be frank, in our patriarchal society, to the best of my knowledge it is man who takes initiative for sex in marital life. If the same initiative is seen as a force/intimidation to have sex, then it will be very difficult to deal with. I don't know how they will deal the issue of marital rape.
Ramu
On any matter too much analysis leads to paralysis. That is what is going to happen to all these TV and drawing room discussions. Nothing concrete will come out of it. May be a few will be able to setlle old scores exploiting the present atmosphere and tendency.
In any society there should be fear of punishment and such society should be able to clearly demarcate right from wrong. Presently, no such fear nor any demarcation between good or bad is discernable. There are people to justify anything in many silly and absurd manner. TV discussions are the lest reflection of the society at large as only a few handful repeat "Panel Artists" (yes Artists only as we see the same set of people every time) sit there to go on grind the old record of ther opinions on and on. It is better no mention of these TRP centric discussions are brought into fore if you intend any serious discussion on any matter.
May be a few will be able to setlle old scores exploiting the present atmosphere and tendency.
A few is not a big problem sir, but what happens if it became another 498A? That's the fear of men. After 498A, men are scared of any law that is called pro-woman. Not because they are perpetrators of those crimes or they want those crimes to be maintained as it is, just because they may be implicated falsely and lose their life or part of it completely. And being called as a rapist is not a small thing, we must notice that.
I request all to Please go through the article"Why the intellectual is on the run" by Harish Khare in The Hindu 6/2 on TV debates.
JP.
@Srikanth
Any law is made to protect those who cannot protect themselves and as to the apprehension that such laws may be or can be misused, the society has to live with such apprehension, till society at large behaves itself.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి