ఈనాడు జర్నలిజం స్కూల్ (ఈజేఎస్) లో 1996-97 లో జర్నలిజం అభ్యసించి వృత్తిలో నిలబడిన మిత్రులు ఈ ఏడాది కూడా సమావేశమయ్యారు. గత సంవత్సరం జులై రెండో వారంలో హైదరాబాద్ లో కలిసిన ఈ బ్యాచ్ సభ్యులు... ఈ సారి నెల్లూరులో కలిసారు. తెలుగు మీడియా ప్రపంచం చాలా గడ్డుకాలంలో ఉన్న ఈపరిస్థితుల్లో వీళ్ళంతా జమకావడం, రెండు రోజుల పాటు గడిపి మంచీ చెడూ మాట్లాడుకోవడం ముదావహం. నిజానికి ఇది సరైన సమయంలో జరిగిన మంచి మీటింగ్.
ఈ సందర్భంగా, తమకు జర్నలిజం బోధించిన డాక్టర్. బూదరాజు రాధాకృష్ణ గారికి పుష్పాంజలి ఘటించారు. "రెండు రోజుల పాటు అన్నింటినీ మరచి అపూర్వంగా ఆనందంగా గడిపాం. గురువుగారు బూదరాజు గారికి నివాళులు అర్పించాం. మేమంతా ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారకులైన మా గురువులు శ్రీ తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి, శ్రీ పోరంకి దక్షిణామూర్తి, శ్రీమతి భారతీలక్ష్మి గార్లను మననం చేసుకున్నాం," అని ఈ బృందంలో ఒకరైన కోవెల సంతోష్ మాకు పంపిన మెయిల్ లో రాసారు. ఈయన పంపిన ఫోటోలు ఇవి.
వీళ్ళంతా కలిసి... కృష్ణపట్నం పోర్టు ను, శ్రీహరి కోటను సందర్శించారు. "జీవితంలో మరపురాని ట్రిప్ ఇది.ఎంతరాసుకున్నా అనుభూతికి అందని భావోద్వేగం అది. 18 సంవత్సరాలైనా చెరగని స్నేహం జర్నలిస్ట్ లలో ఉండటానికి మా బ్యాచ్ తప్ప మరే ఉదాహరణ కనిపించదు. తెలుగునాట సగర్వంగా చెప్పుకునే స్నేహ కుటుంబం మాది," అని ఆయన చెప్పుకొచ్చారు.
"We passed a resolution to build up good communicate network within the group with an aim to help each other in the event of financial, health or any other problems. Also we decided to celebrate our 20th year of journalism in a befitting way and the venue is Konaseema tentatively," అని సంతోష్ రాసారు. ఈ ఆపత్సమయంలో ఇలాంటి సమాగామాలు కొంత ఊరట ఇస్తాయండంలో సందేహం లేదు.

1 comments:
thank u verymuch anna
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి