Wednesday, November 19, 2014

ఒక "ఐ-న్యూస్" ఉద్యోగి ఆవేదన

మేము " ఐ-న్యూస్"లో వర్క్ చేస్తున్నాం. గత ఆగస్టు వరకూ ఏ విషయంలోను ప్రాబ్లం రాలేదు, కానీ ఒక మూడు నెలల నుండి జీతం టైంకు ఇవ్వటంలేదు. కనీసం ఏ డేట్ కు జీతం ఇచ్చేదీ చెప్పడం లేదు. మా స్టాఫ్ లో చాలా మంది సిటీ ఔట్ స్కర్ట్స్ నుండి వస్తారు. పెట్రోల్ కి ప్రాబ్లం అవుతుంది. వచ్చేదేమో తక్కువ జీతం, అదీ ఎప్పుడు ఇస్తారో అని ఎదురుచూపులు.  అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఎప్పుడు జీతమొచ్చేదీ తెలియకపోవడం వల్ల బయట డబ్బులు కట్టాల్సిన వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది.  రేపటికి 2 నెలలు శాలరీలు రాక. కానీ ఇప్పటి వరకూ కచ్చితమైన డేట్ కూడా చెప్పలేదు. 

అది ఒక రకమైన ఆవేదన అయితే... గత రెండు నెల్ల నుంచి డ్యూటీ టైం ఎనిమిదిన్నర గంటలు పెంచారు. కానీ సాలరీ మాత్రం పెంచలేదు. ఒక 15 నిమిషాలు లేట్ గా వచ్చినా జీతం కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టైం ని 9 గంటలు చేసారు. షిఫ్టుల వివరాలు ఇలా ఉన్నాయి. 
  A -6:00 am to 3:00 pm
  B -2:00 pm to 11:00 pm
  C -10:00 pm to 6:30 am
ఈ టైమింగ్స్ వుంటే బస్సులు దొరకడం కష్టంగా ఉంది. మాకు మీ రవాణా తో సంబంధం లేదు... అని అంటున్నారు. కొద్దిగా ధైర్యం చేసి అడగటానికి ముందుకు వెళ్ళే వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. అదీ కాక... కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు. ఆఫీసులోకి మొబైల్స్ తీసుకొని రాకూడదట. ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే ఎలా అంటే... అది మాకు అనవసరం అంటున్నారు. 
వర్క్ విషయంలోకూడా చాలా టార్చర్ పెడుతున్నారు. ఫీడ్ సరిగా ఇవ్వరు, కానీ అవుట్ పుట్ మంచిగా రావాలంటారు.  ఎఫెక్టివ్ గా వర్క్ చేయమంటారు. చిత్ర హింసలు పెట్టి ఉద్యోగులను పంపాలని చూస్తున్నారు. మా బాధలను అర్ధం చేసుకుంటారని ఆసిస్తూ ఇది రాస్తున్నాను. 

(నోట్: యాజమాన్యం ప్రతినిధులు దీనిపై వివరణ ఇస్తే ప్రచురించడానికి ఈ బ్లాగ్ బృందం సిద్ధం) 

2 comments:

raki color said...

dikkumalina samsthaku ....karmakalina workerluuu...
bagupadedhennadu...baguparichedevvaru

Nandu said...

యజమానులు మాత్రం ఆడి, బెంజ్ కార్లల్లో తిరుగుతారు,లాభాలు వచ్చినప్పుడు,ఛానల్ తో రకరకాల ఒప్పందాలు చేసుకున్నప్పుడు గళ్లలేగురేస్తారు.మేమేదో నవ సమాజ స్థాపనకే ఛానల్ ని ప్రారంభిచామని చెప్తారు,ప్రపంచంలో లేని సూక్తులు అన్ని వీరే చెబుతారు.కాని సొంత ఉద్యోగుల బాధలు మాత్రం వీరికి పట్టవు , రెండు మూడు నెలల జీతం వారి వద్ద పెట్టుకొని ఉద్యోగిని బానిసని చేస్తారు.వీడు శాలరీ ఇవ్వడు ఇచ్చేకాడికి వెల్దామంటే మాడు నెలల జీతాలు యజమానికి వదుకోవాల్సి వస్తోంది.కోట్లు కూడబెట్టుకున్న వీళ్లు, శ్రమశక్తిని దోచుకుంటూ జర్నలిస్టులను నిర్వేదంలోకి నెడుతున్నారు. కనీసం 2 నెలల జీతాలు ఇచ్చినా ఇంకా రావాల్సిన జీతాన్ని టిప్పుగా యజమానికిచ్చి వెళ్లే వారు చాలా మంది వున్నారు.