తెలుగు జర్నలిస్టులు, మీడియా టెక్నీషియన్ల అంతటి చేతగాని చచ్చు దద్దమ్మలు ఈ భూప్రపంచంలో ఉండరు. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి... వాళ్ళ హక్కులు... వీళ్ళ హక్కులు... అంటూ రకరకాల కథనాలు వండివార్చే వీళ్ళు... తమ ఉద్యోగాలను యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా పీకేస్తే.... ఏడుస్తూ ఇళ్ళకు వెళ్తారు తప్ప "నీ యబ్బ... ఇదేమి అన్యాయం..." అని గొంతుఎత్తరు. పోరాటం అనేది రక్తంలో లేని పిరికి సన్నాసుల బ్యాచ్ ఇది. ప్చ్.
అందుకే...యాజమాన్యాల అడుగులకు మాడుగులొత్తుతూ దయా దాక్షిణ్యాలు లేకుండా... ఈ చిన్ని నా బొజ్జ శ్రీ రామ రక్ష అనికునే ఫాల్తు సీ ఈ ఓ లు, ఎడిటర్లు దాదాపు నాలుగు వేల మంది జర్నలిస్టులు, టెక్నీషియన్ల ఉద్యోగాలు పీకేశారు గత మూడేళ్ళలో. అయినా బాధితులు నోరు మెదపలేదు, జర్నలిస్టు సంఘాలు ఏమీ చేయలేదు.
ఇలాంటి చేవచచ్చిన జనాలకు... కనువిప్పు/స్ఫూర్తి "టీవీ న్యూ" అనే ఛానెల్ లో చేరి వంచనకు గురైన కేరళ జర్నలిస్టులు. ది న్యూస్ మినిట్ కథనం ప్రకారం....కేరళ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గత ఏడాది జనవరిలో అట్టహాసంగా ఈ ఛానెల్ ను ఆరంభించింది. అన్ని చోట్ల మాదిరిగానే... మంచి పాకేజ్ లకు ఆశపడి జర్నలిస్టులు, టెక్నీషియన్లు అందులో పొలోమంటూ చేరారు. ఒక్క ఏడాది లోనే అది మూతపడే పరిస్థితి దాపురించింది.
నాలుగు నెలలుగా ఉద్యోగులకు జీతాలు లేవు.
ఇదే పరిస్థితి ఎదురైతే మన తెలుగు వీర జర్నలిస్టులు, టెక్నీషియన్లు ఏమి చేస్తారు? అది ఊహించడం పెద్ద కష్టం కాదు. కనిపించిన ప్రతి ఒక్కడికీ... తమ దుస్థితి గురించి చెప్పుకుని కన్నీరు కారుస్తారు కొందరు. మరి కొందరు... "ప్లీస్... కనీసం ఒక నెల జీతం ఇప్పించండి..." అని బతిమాలి అది తీసుకుని ఐ డీ కార్డు, ఫోన్ చిప్పు గప్ చిప్పుగా అప్పగించి ఇళ్ళకు పోతారు. మరి కొందరు కార్యశూరులు ప్రెస్ క్లబ్ కు వెళ్లి రెండు రోజులు మందు కొట్టి... మరుసటి వారం ఎవడివో కాళ్ళు పట్టుకుని మరొక ఛానెల్ లో తక్కువ జీతానికి చేరి ప్రజా సేవ మొదలు పెడతారు.
దీనికి భిన్నంగా కేరళ జర్నలిస్టులు యజమానుల పరువు పంచనామా చేసి కొమ్ములు వంచే పనికి శ్రీకారం చుట్టారు. జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకు ఆ ఛానెల్ ఉద్యోగులు కొందరు నిరసనగా... తమ మకాంను ఆఫీసుకే మార్చారు... ఇళ్ళకు జీతాలు చెల్లించే స్థోమత లేక. స్టూడియో లోనే వంటా వార్పూ చేస్తున్నారు.
అయ్యా తెలుగు జర్నలిస్టులూ...మీరు కూడా మనుషులే. మీకూ కొన్ని హక్కులనేవి ఏడుస్తాయి. పోరాడాలంటే కొన్ని పరిమితులు ఉంటాయని అందరికీ తెలుసు. అన్యాయాలకు వ్యతిరేకంగా కనీసం గొంతెత్తక పొతే మనం ఈ వృత్తికి పనికిరామని అర్థం. మరి మీ ఇష్టం.

4 comments:
When our Telugu journalists are habituated to all sorts of earnings underhand through various methods from officials,politicians and business people they never dare to do same with their managements! What a contrast? What happened to their intelligent tactics with managements?
@యాజమాన్యాల అడుగులకు మాడుగులొత్తుతూ...ఇది అన్ని వృత్తుల్లో ఉందండీ....పైకి చెప్పుకోలేరు...మీరు ఒక ప్లాట్ఫాం తయారు చేసారు కాబట్టి,ఈ వృత్తిలో ఉన్న దారుణాలు ప్రపంచానికి తెలుస్తున్నాయి...ఈ బూట్లు నాకినోళ్ళు పై స్థాయికి చేరుకోవడం,టాలెంట్ ని తొక్కేయడం..అన్ని రంగాల్లో ఉంది!
meeraithe emi chesundayvallu.
ఎవరో కొందరు చంకలు నాకారని అందరినీ కలిపి ఇక్కడ వాయించడం అంత కరెక్ట్ కాదు..ఇది రాసిన వారు కూడా జర్నలిస్ట్ అయి ఉంటే అతను కూడా దద్దమ్మేనా...
యాజమాన్యం నుంచి ఎంప్లాయ్ దాకా మీడియా రంగంలోకి ప్రవేశించేవారు ముందు ఇక్కడ పరిస్థితులను తెలుసుకుని అవగాహనకు రావాలి. ఏదో అలా పెట్టేసి లాభాలు వస్తే నడిపిద్దాం లేకుంటే మూసేద్దాం అన్న ధోరణిలో యజమానులు అలాగే డబ్బులు ఎక్కువ ఇస్తే జంఫ్ అవుదామని జర్నలిస్టులు అనుకోవడం కరెక్ట్ కాదు..
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి