Wednesday, February 18, 2015

ఎన్డీ టీవీ కి బర్ఖాదత్ ఇప్పుడు 'కన్సల్టింగ్ ఎడిటర్'!

భారత  దేశ టెలివిజన్ జర్నలిజం చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని నిర్మించుకున్న ఎన్డీ టీవీ గ్రూపు ఎడిటర్ పద్మ శ్రీ బర్ఖాదత్ ఇరవై ఏళ్ళ పాటు పని చేసిన ఆ ఉద్యోగం నుంచి వైదొలిగారు. ఆ సంస్థ కోసం 'కన్సల్టింగ్ ఎడిటర్' గా పనిచేస్తూనే... ఒక మల్టీ మీడియా కంపెనీ ని, ఒక పాలసీ గ్రూప్ ను సొంతగా నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు. 

ఈ  మేరకు ఎన్డీ టీవీ వ్యవస్థాపకులు ప్రనొయ్ రాయ్, రాధికా రాయ్ సంస్థ ఉద్యోగులకు ఈ కింది మెయిల్ రాసారు. 
"Barkha Dutt was only 23 when she joined NDTV as a young reporter cum producer. NDTV was the first place she ever worked in and for two decades we have seen her evolve into one of our most prolific reporters. She has been a key member of the NDTV family and a big part of our memorable journey from a production house that created a nightly news bulletin for doordarshan to what we are today. She has worn many hats for NDTV: journalist, anchor, editor and NDTV has been both her learning ground and her second home.
Now twenty years later we wish her all the very best as she embarks on yet another role with us. Barkha will be moving to the role of Consulting Editor. She will remain as closely associated with NDTV as she has all these years as the anchor for Buck Stops Here on weeknights and We The People on weekends. She will also be available as always for analysis and inputs on big news events and stories. While her TV relationship with NDTV remains unchanged, in her new role she will be setting up her own multi media content company and policy group. We have literally seen barkha grow from a child to an adult professional and look forward to our close bonds only strengthening further as she embarks on this new venture.
I know you will join us in wishing Barkha the very very best."

'బక్ స్టాప్స్', 'వుయ్... ద పీపుల్' కార్యక్రమాలకు బర్ఖా యాంకర్ గా వ్యవహరిస్తూనే ఉంటారని ప్రనొయ్ దంపతులు తెలిపారు. దేశ రాజధానిలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ చేసాక, న్యూ యార్క్ లోని ప్రపంచ ప్రఖ్యాత కొలంబియా యూనివెర్సిటీ లో జర్నలిజం అభ్యసించిన చేసిన బర్ఖాదత్ గ్రౌండ్ రిపోర్టింగ్ ను కొత్త పుంతలు తొక్కించారు, ఎందరో యువ జర్నలిస్టులకు స్ఫూర్తి ప్రదాత అయ్యారు. 1999 లో కార్గిల్ పోరాటం కవరేజ్, 2002 లో గుజరాత్ అల్లర్ల కవరేజ్ బర్ఖా కు మంచి పేరు తెచ్చాయి కానీ 2010 లో రాడియా టేపుల్లో చిక్కుకోవడం ఈ అద్భుతమైన జర్నలిస్టు ప్రతిష్టను దెబ్బ తీసింది. ఎన్డీ టీవీ కి పేరు రావడంలో రాజ్దీప్ సర్ దేశాయ్, అర్నబ్ గోస్వామి, శ్రీనివాసన్ లతో పాటు బర్ఖా ముఖ్యపాత్ర పోషించారు.  
బర్ఖా మాతృమూర్తి ప్రభా దత్ 1965 లో భారత్-పాక్ యుద్ధాన్ని హిందూస్తాన్ టైమ్స్ పత్రిక కోసం కవర్ చేశారు.

1 comments:

katta jayaprakash said...

Bharka Dutt indeed ows much to NDTV from transforming an young reporter to an adult journalist with national fame.She desires to have her own empire in media.Ofcourse it is risky and stressful but she got confidence in her with her proffessional talent and experience.
Why no Bharka Dutts in Telugu media?

JP.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి