Thursday, October 12, 2017

"ఈనాడు" లో సొల్లు వార్తలకు మంచి ఉదాహరణిదీ!

మీడియా కట్టు కథలు, అర్థ సత్యాలు, అసత్యాలతో వర్ధిల్లడం సహజం! తమ తమ కులాలకు చెందిన రాజకీయ పార్టీల జెండా మోయడం, అధికార పార్టీల అడుగులకు మడుగులొత్తడం తప్పనిసరైన వాతావరణంలో ఉన్నాం మనం.

సంప్రదాయ పత్రికలను తలదన్ని ఆధునిక తెలుగు జర్నలిజంలో ఒక చరిత్ర సృష్టించిన 'ఈనాడు' ఈ మధ్యన మరీ సిల్లీ వార్తలు ప్రచురిస్తూ... చవకబారు పత్రికలతో పోటీ పడడం ఆ పత్రిక అభిమానులకు బాధకలిగిస్తుంది. నాగ చైతన్య, సమంత ల పెళ్లి గురించి అందరికన్నా ఉత్సాహంగా 'ఈనాడు' ఎక్కువ వార్తలు, ఫోటోలు, వీడియోలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. సరే, వివిధ కారణాల రీత్యా అది వారిష్టం. కానీ ఈ రోజున పత్రిక వెబ్ ఎడిషన్ లో ప్రముఖంగా కనిపిస్తున్న ఈ వార్త (స్రీన్ షాట్ ఇక్కడే ఉంది) చూడండి. దీని శీర్షిక: సామ్, చై కి వూహించని సర్ ప్రైజ్. 


నవ దంపతులకు హీరో పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రత్యేకంగా తయారుచేయించిన ఉంగరాలు పంపారన్నది దీని సారాంశం. సరిగ్గా పెళ్లి సమయానికి  అందేట్లు చేశారని టాలీవుడ్ వర్గాలను ఉటంకించారు. ఈ గిఫ్ట్ చూసి ఇద్దరూ సర్ ప్రైజ్ అయ్యారని కూడా చెప్పారు.
కానీ ఇదే వార్త చివరి పేరా ఇలా ఉంది:
... అయితే అందులో ఏమాత్రం నిజం లేదని మరికొందరి వాదన. పవన్‌ కానీ త్రివిక్రమ్‌ కానీ వారిద్దరికీ ఎలాంటి కానుకలు పంపలేదని ఇతర వర్గాలు అంటున్నాయి. 
ఇలాంటి విషయాల్లో.... బహుమతి ఇవ్వడమో, ఇవ్వకపోవడం... రెండే ఉంటాయి. ఇచ్చారని ఘనంగా శీర్షిక పెట్టి... వార్త వండి వార్చి... చివరకు ఈ వార్తలో ఎంత మాత్రం నిజం లేదన్న వాదన ఉన్నట్లు చెప్పడం! ఇదేమి జర్నలిజం రా నాయనా.... 

2 comments:

K.S.Chowdary said...

గుడ్ పోస్ట్. ప్రతీ పత్రిక ఇలానే మారిపోయాయి. అందుకే నేను వార్తా పత్రికలూ చూడడమే తగ్గించివేసాను.
మరిన్ని పోస్టులు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.@ K.S.చౌదరి

astrojoyd said...

రాధాకృష్ణ-శ్రీరామచంద్ర మూర్తి ఆధ్వర్యంలో వస్తున్న దినపత్రికలు ఇలాంటి వార్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.మరి వాటిని ఎత్హి చూపరేమి.

జయదేవ్.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి