గత రెండేళ్లుగా 'సాక్షి' ఛానెల్ కు ఢిల్లీ లో బ్యూరో చీఫ్ గా ఉన్న సీనియర్ జర్నలిస్టు పి.వాసుదేవన్ ఆశ్చర్యకరమైన రీతిలో ఆ ఉద్యోగం వదులుకుని జెమిని ఛానల్ లో హైదరాబాద్లో ఇన్ పుట్ ఎడిటర్ గా చేరారు...రెండు రోజుల కిందట.
పలు తెలుగు, ఇంగ్లిష్ పత్రికలలో నాణ్యంగా పనిచేసి సుదీర్ఘ అనుభవం సంపాదించిన వాసు గారు 'సాక్షి' కి వెళ్ళడానికి ముందు....టీ.వీ.-నైన్ లో పనిచేసారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన అద్భుతమైన ఫీచర్స్ చేసారు. ఒక అసైన్ మెంట్ లో భాగంగా శ్రీ లంకలో పర్యటించి యుద్ధ వాతావరణం నుంచి తను చేసిన కథనాలు నాకు బాగా గుర్తు ఉన్నాయి.
వృత్తిపరంగా ఎన్నో పరిమితులు ఉన్నప్పటికీ 'సాక్షి' లో కూడా వాసు మంచి స్టోరీ లు అందించారు. ఎన్నికలప్పుడు ఉత్తరాదిలో పర్యటించి చేసిన కథనాలు బాగున్నాయి. చక్కని తెలుగులో....మంచి నుడికారంతో కథనాలు రాయగలిగిన అతి కొద్ది మంది జర్నలిస్టులలో వాసు ఒకరు. వ్యంగ్యం, సమయస్ఫూర్తి మేళవమైన వాసుదేవన్ విశాఖపట్నంలో 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో పనిచేస్తున్నప్పుడు మంచి స్టోరీలు అందించారు. మాటిమాటికీ సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరి, దాని ఆధారంగా స్టోరీలు రాసి చాలా మందిని అక్కడ విసిగించారాయన. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నేనూ 'ది హిందూ' రిపోర్టర్ గా ఆర్.టీ.ఐ.చట్టం కింద కాలుష్య నియంత్రణ మండలి నుంచి సమాచారం తీసుకున్నా కానీ....దాన్ని సరిగా వాడుకోలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతూ వుంటాను.
తెలుగు జర్నలిజాన్ని మాత్రమే నమ్ముకుంటే...ఇంతే సంగతులు...ఇంగ్లిష్ జర్నలిజంలో కూడా ప్రవేశం ఉంటే ఎలాగోలా బతికేయవచ్చు...అని నాకున్న గట్టి అభిప్రాయమే వాసు గారికి కూడా ఉంది. ఢిల్లీ నుంచి ఏదైనా ఇంగ్లిష్ ఛానెల్ రిపోర్టర్ గా వస్తాడనుకున్న వాసు గారు మళ్ళీ ఒక తెలుగు ఛానెల్ కు రావడం నాకు కొద్దిగా నిరాశ కలిగించింది. కుటుంబ కారణాల వల్ల ఆయన ఇక్కడకు వచ్చినట్లు ఉన్నారు. వారి పాప అముక్తమాల్యదకు ఇప్పుడు పండగే పండగ.
కొత్తగూడెంలో నేను 'ఈనాడు' కంట్రిబ్యూటర్ గా పనిచేసినప్పటి నుంచి ఆయనను నేను చూస్తున్నాను. రెండు భాషల్లో పట్టు ఉండి...అవకాశం ఇస్తే...అటు ప్రింట్ లో, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నత స్థాయి బాధ్యతలు ఏవైనా సమర్థంగా నిర్వహించే సత్తా వున్న అతి కొద్ది మందిలో వాసు ఒకరు. ఆయనకు మేలు జరగాలని ఆశిస్తున్నాను.

4 comments:
నాకు అత్యంత సన్నిహితుడు వాసు. మాది హైస్కూలు నాటి నుండి ఉన్న స్నేహం. ఏనాడు తనదైన వృత్తిని, ప్రవృత్తిని వదలలేదు. తనకు మాత్రమే సొంతమైన హాస్యం, సమయస్ఫూర్తితో తను వ్రాసిన కథనాలు, ముఖ్యంగా తెలుగులో వ్రాసినవి అనితర సాధ్యం. శ్రీలంక, చత్తీస్ ఘర్ లలో తను అందించిన కథనాలు స్ఫూర్తివంతమైనవి.
I welcome Vasu back to AP.
W/Regards - Saikiran
Hello Ramu gaaru - I have given the link of your article in Facebook. Hope you don't mind.
W/Regards - Saikiran
Yes, Vasu is a journalist with integrity ans lovable friend. He is known for wit and humor. I still remember few of his catchy, rhyming headlines that he gave for news stories while working in Andhra Prabha, Vizianagaram two decadeds ago. Hearty welcome to Vasu.
Hearty Congrats Vasudevanji. I am confident that you will show your class in this role as well.
Upadrasta Kameswara Rao,
kaamesh.u@gmail.com
9010242220
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి