Saturday, January 28, 2012

ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియాల మధ్య ప్రకటనల యుద్ధం

 లలితా సహస్ర నామ పారాయణం చేసి పట్టుచీర కట్టుకుని సాయంత్రం కాగానే దేవళానికి వెళ్లే ఆడపడుచు లాంటి ది హిందూ పత్రికకు, నాలుగైదు బొక్కలు పడిన బ్రాండెడ్ షార్ట్ వేసుకుని చేతులో సిగరెట్ తో సాయంత్రం బార్ లో మాత్రమే కనిపించే సుందరాంగి లాంటి టైమ్స్ ఆఫ్ ఇండియాల మధ్య ప్రకటనల యుద్ధం తారస్థాయికి చేరుకుంటున్నది. మార్కెట్ గిమ్మిక్కులలో ఆరితేరిన టైమ్స్ దక్షిణాత్యుల ఆరాధ్య దైవం లాంటి ది హిందూను సద్దివార్తల భోషాణమని అర్ధమొచ్చేలా ఒక ప్రకటన విడుదల చేయడంతో పోరాటం ఆరంభమయింది. దానికి ప్రతిగా ది హిందూ....టైమ్స్ పాఠకులు బుర్ర తక్కువ జనాలనే అర్ధం వచ్చేలా ఒక ప్రకటన గుప్పించింది. ఆ పోరాట పరంపరలో ఒక భాగం ఇది. చూడండి. 

7 comments:

Zilebi said...

I stay ahead of the Times!!

cheers

zilebi.

సుజాత వేల్పూరి said...

నేను హిందూ వాళ్ల యాడే చూశాను. Times వాళ్ళది ఇప్పుడే చూశా! ఈ మధ్య నేనీ రెండూ చదవడం మానేసి...రెండింటికీ ahead గా ఉన్నా!

కానీ ఈ పత్రికలు ఇలా యాడ్స్ ఇచ్చుకోడంలో ఎథిక్స్ ఎలా ఉన్నా,ప్రేక్షకులకు నవ్వూ, విచారం రెండూ తెప్పిస్తున్నాయి, ఎంతకు దిగజారార్రా బాబూ అని!

SHANKAR.S said...

ఒకరు మొదలెడితే అవతల వాళ్ళు రిటార్ట్ ఇచ్చే తీరాలిగా సుజాత గారూ. నా దృష్టిలో ఈ విషయంలో ముందుగా ఇలాంటి చౌకబారు ప్రకటనల ఆలోచనతో వచ్చిన తప్పు టైమ్స్ వాడిది. హిందూ వాడు దీటుగా జవాబిచ్చాడు అంతే.

y.v.ramana said...

నాకు యాడ్స్ రెండూ బాగున్నాయ్.

వెరీ క్రియేటివ్!

ఆ మాత్రం పోటీ ఉండాల్లేండి.

తెలుగులో కూడా ఇట్లాంటివి వస్తాయని ఆశిస్తున్నాను.

Sudhakar said...

I agree with hindu...times is little unethical for sure.

Subramanya Shastry said...

పోలికలు సూపర్‌... ఒకప్పుడు Deccan Chronicle పత్రిక పూర్తిగా బరితెగించిపోయింది. తరువాత ఏమి జ్ఞానోదయమయ్యిందోకానీ, మళ్ళీ కోలుకుంది. అది ఖాళీ చేసిన స్థానాన్ని Times of India ఆక్రమించుకున్నట్టు, DC ని కూడా తలదన్నే విధంగా హద్దులను కొలవడం మొదలు పెట్టింది. పొద్దున్నే వార్తా పత్రికలు చదవటం "మంచి అలవాటు" అనే నమ్మకాన్ని వమ్ము చేసేంత. వీరి యుద్ధం బాగానే ఉంది కానీ, The Hindu పత్రిక అలా బురద మీద రాయి విసిరిఉండకుండా ఉండాల్సింది. దాని హోదా వేరు.

Anonymous said...

*తెలుగులో కూడా ఇట్లాంటివి వస్తాయని ఆశిస్తున్నాను*
తెలుగు పత్రికలలో moదటి పేజిలో, సంచలన వార్తను రాయటానికి తాటికాయంత యెర్రని పెద్ద అక్షరాలతో పోటి పడతారు కదా!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి