Thursday, May 10, 2012

కలవరపరుస్తున్న 'సాక్షి' పరిణామాలు


సీ.బీ.ఐ. ఉన్నట్టుండి జగన్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడంతో 'సాక్షి' పేపర్, ఛానెల్ లలో పనిచేస్తున్న జర్నలిస్టులు, టెక్నీషియన్లు ఒక్కసారిగా బెంబేలెత్తారు. ఈ పరిణామంతో భయ పడాల్సిన పనిలేదని యాజమాన్య ప్రతినిధులు హామీ ఇస్తున్నా....గత మూడు రోజులుగా ఈ విషయం గురించే చర్చ జరుతున్నది. 'సాక్షి' లో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులు ఎందుకైనా మంచిదని ఇతర ఛానెల్స్ వైపు చూస్తున్నారు. తమ గాడ్ ఫాదర్స్, వెల్ విషర్స్ సహాయంతో.... కొత్తగా వస్తున్న ఛానెల్స్ లో అవకాశాల గురించి ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఇమేజ్  ఛానెల్ కు రద్దీ పెరిగింది. 'మీ బ్లాగులో మా ఛానెల్ గురించి రావడం, ఇంతలోనే సాక్షి లో పరిణామాలతో మాకు దరఖాస్తులు, విన్నపాల సంఖ్య పెరిగింది. ఇప్పుడు సప్లయ్ పెరగడంతో డిమాండ్ తగ్గింది. జర్నలిస్టుల జీతాలు పడిపోయే అవకాశం వున్నది," ఇని ఇమేజ్ తో సంబంధాలు వున్న ఒక మిత్రుడు చెప్పారు. 
అయితే...సాక్షి కి జరిగింది..నిజంగానే ప్రెస్ పై దాడిగా పరిగణించాలా? అన్న చర్చ జరుగుతున్నది. దీని మీద మీ అభిప్రాయాలు రాయండి.     

59 comments:

శ్యామలీయం said...

దొంగసొమ్ముతో లేదా దొంగసొమ్ముగా అనుమానించబడుతున్న సొమ్మతో ఒక వ్యాపారసంస్థ నడుస్తూ ఉంటే దానిని స్తంభింపజేయటంలో న్యాయవైరుధ్యం యేమీ ఉండదు. అది ఒక పత్రిక అయినంతమాత్రాన పత్రికాస్వేఛ్ఛకు సంబంధించిన విషయం ఐపోదు.

Unknown said...

ఇది చాలా జాగ్రత్తగా మూలాల నుంచి ఆలోచించాల్సిన విషయం. 4th ఎస్టేట్ లో అక్రమ పెట్టుబడులు, మాఫియా పెట్టుబడులు, లంచాలను పెట్టేసి, ప్రెస్ కి వున్న గౌరవాన్ని అడ్డుపెట్టుకుని, ఎవరైనా ఆ అక్రమ పెట్టుబడులను గురించి ప్రశ్నిస్తే దానిని ప్రెస్ మీద దాడిగా చూపుతున్నారేమో ? ఇలాంటి వ్యవస్థ బలంగా వేళ్లూనుకుంటే పెకిలించటం చాలా కష్టం. మొదటి నుంచి కూడా సీబీఐ చిట్టాలో జగతి పబ్లికేషన్ ఒక ముద్దాయిగానే వుంది. ఒక ముద్దాయి కి సంబందించిన చర్య తీసుకుంటే అది ప్రెస్ అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ఒకటే...ఇపుడు సాక్షి పత్రికా స్వేచ్చ కి వచ్చిన నష్టం ఏమీ లేదు. దానిని ఏమీ మూసివెయ్యలేదు కదా ? ప్రచురిస్తూనే వున్నారు కదా. క్రిమినల్ వ్యవస్థలు మీడియాలోకి మనీ ని పంప్ చేస్తూ దాని ద్వారా ప్రజలను ప్రభావితం చెయ్యాటమో, తిమ్మిని బమ్మి చెయ్యాటమో మొదలుపెడితే జర్నలిస్టులకు, డైలీ లేబర్ కు తేడా లేదు. చెప్పింది రాసుకుంటూ పోవటమే..

G.P.V.Prasad said...

అబద్దానికి సాక్ష్యంగా నిలబడితే అంతే గతి.

Praveen Mandangi said...

చంద్రబాబు పాలనలో ఎంత అవినీతి జరిగిందో నేను కళ్ళారా చూశాను. కొంత మంది ఉద్యోగుల ఉద్యోగాలు పోకుండా ఉండేందుకు రాష్ట్రాన్ని దోచుకు తినాలనుకుంటున్న ఒక అవినీతిపరుని బ్యాంక్ అకౌంట్‌లు బ్లాక్ చెయ్యకుండా ఉండాలా?

Praveen Mandangi said...

సాక్షి ఉద్యోగులు వేరే రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు చూసుకోవచ్చు. వాళ్ళ భవిష్యత్ కోసం రాష్ట్ర భవిష్యత్‌ని పాడు చెయ్యలేము.

Praveen Mandangi said...

నేను సాక్షి అకౌంట్‌లని బ్లాక్ చెయ్యడాన్నే సమర్థిస్తాను. రాజశేఖరాసురుడు ఒక అవినీతి కాంట్రాక్టర్‌కి కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల మా పక్క జిల్లాలో ఒక బ్యారేజ్ పనులు ఆగిపోయాయి. తోటపల్లి రెగ్యులేటర్ నుంచి మా జిల్లాలోని కొన్ని గ్రామాలకి కూడా కాలువలు ఉన్నాయి. మా అమ్మమ్మ గారి ఊరికి కాలువ నీళ్ళు వచ్చేది తోటపల్లి రెగ్యులేటర్ నుంచే. తోటపల్లి రెగ్యులేటర్‌ని బేరేజ్‌గా అప్‌గ్రేడ్ చేసే పనులు ఆగిపోవడం వల్ల మా అమ్మమ్మ గారి ఊరి రైతులు కూడా నష్టపోయారు. ఆ కాంట్రాక్టర్ బేరేజ్ పనులు ఆపెయ్యడంతో పాటు అధికారుల సహాయంతోనే తన మెషీన్‌లని తీసుకెళ్ళిపోయాడు. ఆ బేరేజ్ పనులు పూర్తయ్యేంత వరకు రెండు జిల్లాలలోని నాగావళి పరివాహక గ్రామాల ప్రజలు కరువుతో కడుపు కాల్చుకోవాలి లేదా కూలీ పనుల కోసం వేరే జిల్లాలకి పోవాలి. అవినీతి కాంట్రాక్టర్‌లని మేపడానికి ప్రజలని ఆకలిమంటల్లోకి తోసేసిన రాజశేఖరాసురుడి కొడుకు ఎన్నికలలో పోటీ చేస్తే వాడికి సపోర్ట్ ఇవ్వాలా? సాక్షి పత్రిక & టివి చానెల్ మూత పడితే పోయే ఉద్యోగాల సంగతి సరే. రాజశేఖరరెడ్డి మేపిన అవినీతి కాంట్రాక్టర్‌ల వల్ల ప్రత్యక్షంగా నష్టపోయిన లక్షలాది మంది రైతుల సంగతి ఏమిటి?

Srinivas Addanki said...

"సాక్షి కి జరిగింది..నిజంగానే ప్రెస్ పై దాడిగా పరిగణించాలా? దీని మీద మీ అభిప్రాయాలు రాయండి"

... actually I was waiting for your views on this since couple of days. But you've asked about the same to the readers. I might have opened your blog for at least 3-4 times to see how the journalists are thinking about this issue.

Please do let us know your views as a senior journalist.

Praveen Mandangi said...

అద్దాల మేడలో ఉంటూ ఇతరుల మీదకి రాళ్ళు విసరడం జగన్ చేసిన తప్పు. అది కాంగ్రెస్ తప్పు ఎలా అవుతుంది?

Praveen Mandangi said...

ఒక మాఫియా లీడర్ ఒక మత్తు మందుల ఫాక్టరీ పెట్టాడు. ఆ మత్తు మందులు కొని వేలాది మంది తమ జీవితాలని పాడు చేసుకుంటున్నారు. ఆ మత్తు మందుల ఫాక్టరీ మూసేస్తే వందలాది మంది ఉద్యోగాలు పోతాయి. ఈ వందలాది మంది భవిష్యత్ కోసం వేలాది మంది భవిష్యత్‌ని పాడు చెయ్యగలమా? జగన్ అవినీతి రాష్ట్ర భవిష్యత్‌కి సంబంధించినది కనుక అతని పత్రిక & టివి చానెల్ యొక్క బ్యాంక్ అకౌంట్‌లు బ్లాక్ చెయ్యడంలో తప్పు లేదు.

Unknown said...

There were umpteen allegations on jagan (sakshi) made by eenadu,CBN, congress... and freshly CBI in the form of chargesheets.

Mind you, these are mere allegations.... so it's definitely attack on freedom of press to freeze sakshi accounts "without proving those allegations."

Someone commented that its just freezing and not closing of sakshi... sorry sir, both ends with same final result.

Unknown said...

just because your political rivals suspects you or make allegations ... is it right to close your business???
atleast law sofar hasn't taken that course of action.

Unknown said...

btw.. there is huge difference b/w eenadu episode and sakshi episode.

in EENADU episode, attack was never on eenadu, its always on RFC (abt assigned lands) and margadarshi (abt illegal deposit collection).

In case of sakshi, its the opposite.... its attack on sakshi to close it.

Unknown said...

To Praveen,

if factory is certified as toxic by pollution control board, factory should be CLOSED>

if the owner is proved as mafia, GOVT should takeover that factory....

However, nothing should be done just based on speculations and allegations.

Praveen Mandangi said...

CBI దగ్గర ఆధారాలు లేవని ఎందుకు అనుకోవాలి? ఇదేమీ పల్లెటూరిలో గ్రామ పెద్దలు లేదా కుల పెద్దలు పెట్టే ప్రైవేట్ పంచాయితీ కాదు. ప్రైవేట్ పంచాయితీలు పెట్టేవాళ్ళ దగ్గర ఆధారాలు లేవు అని వాదించినంత సులభంగా CBI దగ్గర ఆధారాలు లేవని వాదిస్తారా?

Praveen Mandangi said...

జగన్ మీద సానుభూతి చూపించడానికి అతనేమైనా సంఘసంస్కర్తా? మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి రాచరిక వారసత్వంలాగ ముఖ్యమంత్రి పీఠం నాకే కావాలి అని డిమాండ్ చేశాడు. బ్యాంక్ మేనేజర్ చనిపోయిన తరువాత అతని కొడుకు ఉద్యోగానికి అప్లికేషన్ పెడితే అతనికి క్లర్క్ ఉద్యోగం ఇస్తారు కానీ డైరెక్ట్‌గా మేనేజర్ ఉద్యోగం ఇవ్వరు. ముఖ్యమంత్రి పదవి మాత్రం చనిపోయిన వ్యక్తి కొడుక్కి స్వంత ఆస్తిలాగ వారసత్వం పేరుతో ఇచ్చెయ్యాలట! CBI దర్యాప్తు చేస్తే జగన్ ఎంత అవినీతి చేశాడో తెలుస్తుంది. మనమే prejudice (ముందస్తు నిర్ణయం) చేసి జగన్‌కి క్లీన్‌చిట్ ఇవ్వాల్సిన పనిలేదు.

appalnaayudu said...

అన్ నోన గారు
ఈనాడు మీద దాడి పత్రికా స్వేచ్ఛ మీద దాడి కాదు. అది ఆర్ ఎఫ్ సీ మీద దాడి అంటారు. ఆర్ ఎఫ్ సీలో అస్సైన్డ్ లాండ్స్ ఉన్నాయి కాబట్టి దానిమీద దాడి సహజమేనంటారు.
ఇదే లాజిక్ సాక్షికి వర్తిస్తుంది. సాక్షిలోకి వచ్చిన పెట్టుబడులు అక్రమ పెట్టబడులు కాబట్టి సాక్షి మీద దాడి పత్రికా స్వేచ్ఛ మీద దాడి కాదు.

ఇది ఊరికే లాజిక్ కోసం చెప్పింది.

ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం.
వైఎస్సార్ క్లియర్ కట్ గా రామోజీని టార్గెట్ చేసి ఆయన ఆర్థికమూలాలను కొట్టేప్రయత్నం చేశారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్టు... ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే విద్యను ఆయన కుమారుడు జగన్ పై ప్రయోగిస్తోంది.
వాళ్లని సమర్థించి.. వీళ్లని సమర్థించి.. మధ్యలో వెర్రిగొర్రెలమయ్యేది మనమే.

appalnaayudu said...

అన్ నోన్..

రామోజీని క్లియర్ కట్ గా టార్గెట్ చేసి వైఎస్ ఆయన ఆర్థికమూలాల మీద కొట్టే ప్రయత్నం చేశారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇప్పడు తనకు ఎదురుతిరిగిన వైఎస్ కొడుకుపైనా అదే విద్యను ప్రయోగిస్తోంది.

పైన మీరు చెప్పినట్టు.. సాక్షి ఖాతాలను మూసినా, సాక్షినే మూసేసినా రెండూ ఒకటే అన్నట్టు, రామోజీ ఆర్థికమూలాల మీద దెబ్బకొట్టినా ఈనాడును మూసేసినా ఒకటే.

ఇది చాలా సింపుల్ లాజిక్.

అటు రామోజీని సమర్థించి.. ఇటు రాజకీయ పార్టీలను సమర్థించి.. ఇంకోవైపు జగన్ను సమర్థించి.. మధ్యలో వెర్రిగొర్రెలయ్యేది జనమే.

రామోజీ ఆర్థికమూలాల మీద వైఎస్ దాడి.. జగన్ ఆర్థికమూలాల మీద కాంగ్రెస్ దాడి..
రెండు సందర్బాల్లోనూ ఉన్నది రాజకీయమే తప్ప నూటికి నూరుపాళ్లూ పత్రికాస్వేచ్ఛమీద దాడికాదు.

అయితే,గియితే.. వైఎస్ రాజశేఖరరెడ్డి పత్రికలను అదుపుచేసే నల్లచట్టం ఒకటి తెచ్చాడు గుర్తుందా? పత్రికలన్నీ ఆందోళన చేసి దాన్ని రానీయకుండా అడ్డుకున్నాయి..? అది నిజంగా పత్రికా స్వేచ్ఛ మీద దాడి.

శ్యామలీయం said...

unknown లేదా అజ్ఞాత గారి వాదనకూడా బాగానే ఉంది. వారు తమపేరు యెందుకు దాచుకుంటున్నదీ తెలియదు.

వారి వాదన ప్రకారం దొంగసొత్తుతో ఏర్పడినట్లుగా లేదా నడుస్తున్నట్లుగా భావించబడుతున్న వ్యాపారాన్ని, అది దొంగసొత్తు అని నిరూపణ అయేంతవరకూ, వేలెత్తి చూపటం కాని స్తంభింపజేయటం కాని తప్పు. భలే. దొంగసొత్తేనని ఒకవేళ్ నిరూపణ అయినా, అది చేతులు దాటిపోయేందుకు అన్నివిధాలా పరోక్షంగా ప్రభువత్వమూ, ప్రజలూ, చట్టమూ సహకరించాలని వాదిస్తున్నారు! నిందపడిని ఆస్తిని సమాజశ్రేయస్సు దృష్ట్యా తప్పక అదుపుచేయవలసినదే. ఇందులో తర్జనభత్జనలు చేయటం ఎందుకు?

ఒక వ్యక్తి మీ యింట్లో భారీ చోరీ చేసాడ్నుకోండి. మీరు ఫిర్యాదు చేసారు. ఆ వ్యక్తి ఆ సొత్తును చేతులు దాటించకుండా నియంత్రించి విచారణ జరపటం అక్రమమని యెవరైనా అంటే మీ కెలా ఉంటుంది? అతడి యిష్టాతాజ్యంగా ఉండనిచ్చి తీరా మీరు గెలిచినా అప్పటికే ఆ సొత్తు నామరూపాలులేకుండా పోతే మీకెంత నష్టం. వ్యాపారాలు చేసాను - పోయింది - మీ యిష్టం అనేస్తే, ఓ పదిరోజుల శిక్ష పదితే మీకు న్యాయం జరిగినట్లేనా? కోంచెం ఆలోచించి మాట్లాడండి.

Prashant said...

Mr.Unknown,Your point that freezing accounts is akin to closing down the newspaper,it is absurd.If bank accounts are frozen, you can open another account for which there is no restriction.
The man Jagan had a spectacular rise within span of few years.One power plant(as far as I know),steel,news paper,channel,mining,real estate(Mantri)...all this in span of 5 years.I don't think the scale of rise can be matched even by Tata & Ambanis.
Running a newspaper itself costs a bomb.On top of that cost incurred in printing all pages in color is unimaginable.However, Sakshi's ambitious start with all color pages demands a Godzilla size investment.This may not be dared by any entrepreneur unless there is ill gotten wealth to splurge.Hence the promoter(s) of paper must be prosecuted by all means and track flow of funds.For this, stagnating accounts is mandatory.This can't be construed as an attack on the freedom of press.
Sakshi newspaper hasn't yet shut shop and doesn't shut also.If at all situation demands, there can be auction and a new promoter will acquire it.

Bullabbai said...

జగన్ అక్కౌంట్ తో పాటు, మార్తాండ గూగుల్ అక్కౌంట్ కూడా ఎవరైనా సీజ్ చేసేస్తే బాగుండు!

buddhamurali said...

రాధ కృష్ణ తన జీతాన్ని జాగ్రత్తగా పొదుపు చేసి పత్రిక, చానల్ చాలా నిజాయితిగా పెట్టారు. అందరూ అలా చేయవచ్చు కదా వచ్చిన జీతం అంతా ఎందుకు ఖర్చు చేస్తారు పొదుపు చేయండి రాధ కృష్ణ లా చానల్, పేపర్ పెట్టండి

యధార్ధవాది said...

(However, nothing should be done just based on speculations and allegations)
కోర్టుకు సమర్పించిన ఛార్ఝిషీట్లు, ఇన్నాళ్ళుగా చేసిన విచారణలు, పదుల సంఖ్యలో విచారణలు..ఇవన్ని కేవలం ఊహాగానాలా? పత్రికల్లో వార్తలు చూసి ఛార్జిషీట్లు తయారు చేయడం, దానికి కోర్టులు విచారణకు స్వీకరించడమే జరిగితే...ఈ పాటికి జగన్ జైల్లో ఉండాలి. మన వ్యవస్థలను మనం ఇంత ఘనంగా చూస్తున్నామన్నమాట.

యధార్ధవాది said...

అయ్యా..దేవులపల్లి అమర్ గారూ, శ్రీనివాసరెడ్డిగారూ...మీరు చేస్తున్న పోరాటం జర్నలిస్టుల కోసం కాదు...పత్రికల యాజమాన్యాల కోసం.ఛానళ్లలో జీతాలు లేక నెలల తరబడి అర్ధాకలితో మాడుతున్న వారు...ఇంకా ఉన్నారు.జగన్ కు కడుపు నిండా తిండి ఉంది. ఆయన కోసం కాదు మీరు పోరాడాల్సింది. మహా మహా ఛానళ్ల ఉద్యోగులే జీతాలు రాక అవస్త పడుతున్నారు. ఒక్కసారి అక్కడికి వెళ్లి పోరాడండి

vara said...

Inko adugu mundhuku vesi........edinaa case lo media vaallani add cheyatame.patrika swetcha pi daadi ani cheppandi........ee idea work out ayithe...prapancham lo vunna black money, mafia money mothaaniki media manchi safe heaven ayyidhi

యధార్ధవాది said...

భాను, సూరిలాంటి అమాయకులకు ఇలాంటి ఐడియాలు వచ్చిచావవు.సాక్షిలాంటి దిక్కుమాలిన పత్రికొకటి పెట్టి... ఓ వందమందిని పోషించి....ఎవడైనా కేసులని, అరెస్టులనీ తిక్కవేషాలు వేస్తే...ఎంచక్కా పత్రికా స్వేచ్ఛని అడ్డం పెట్టుకుని బయటపడి పోవడం చాలా ఈజీ. అవును ఇటీవల నెట్లో సెర్చింగ్ చేస్తుంటే...ఓ వార్త కనబడింది. అప్పట్లో మార్గదర్శి ఇష్యూ అయినప్పుడు...రామోజీకి సమర్ధనగా...ది హిందూ అప్పటి ఎడిటర్ ఎన్.రామ్ తనను కూడా రామోజీ తరఫున కేసులో ఇంప్లీడ్ చేసుకోమని కోర్టును కోరాడట. మరి సోకాల్డ్ పత్రిక స్వేచ్ఛా ప్రేమికులైన దేవులపల్లి అమర్ గారు, శ్రీనివాసరెడ్డిగారు, డీసీ కృష్ణారావు గారు, తానూ ఇన్నాళ్ల తర్వాత..నిబద్ధతగల జర్నలిస్టుగా అభివర్ణించుకున్న కేశవరావు గారు తమనూ జగన్ తరఫున ఇంప్లీడ్ చేసుకోవాల్సిందిగా కోరితే బాగుండు. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యే తప్ప...జగన్ ఏపాపం ఎరుగని అమాయకపు బిడ్డ అని నమ్మేవాళ్లు...అయ్యా మీరు కూడా జగన్ తరఫున సీబీఐ కేసులో ఇంప్లీడ్ అయ్యి...శ్రీమాన్ జగన్ గారిని కడిగిన ముత్యంలా బయటకు తీసుకొస్తే... శంకర్రావు చెప్పినట్లు...33 రోజుల తర్వాత ఈ రాష్ట్రం
స్వర్ణయుగంలోకి ప్రవేశించడం ఖాయం.....

satya said...

Watch this video:

http://www.youtube.com/watch?v=EM5SDfOYnhM

యధార్ధవాది said...

(in EENADU episode, attack was never on eenadu, its always on RFC (abt assigned lands) and margadarshi (abt illegal deposit collection).

అయ్యా UNKNOWN గారు...ఆనాడు ఈనాడు కూడా మార్గదర్శి కోసం పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడింది. కానీ..అది తప్పని అంతా వాదించారు. మంచిదే. మార్గదర్శి మీద దాడి మీడియాపై దాడి ఎంత మాత్రం కాదు.కానీ...ఇక్కడ తప్పు జరిగిందే జగతి పబ్లికేషన్ లో. కోట్ల రూపాయలు వచ్చి చేరింది జగతిలో, ఇందిరలో, జననీ ఇన్ ఫ్రాలో. మరి అక్రమాలు జరిగిన ఎకౌంట్లు కాకుండా....వేరే ఎకౌంట్లను ఎలా ఫ్రీజ్ చేస్తారో కాస్త వివరించి చెప్పగలరా? పైగా చట్టబద్ధంగా తనకు రావాల్సిన యాడ్స్ మాత్రం రావాలంట..కానీ చట్టబద్ధంగా జరిపే ఫ్రీజ్ లను, సీజ్ లను మాత్రం చేయొద్దంట. జగన్ గారి న్యాయం. తన తండ్రి మాత్రం కేవలం తనను విమర్శిస్తున్నారన్న అక్కసుతో( ఇక్కడ సదరు మీడియా సంస్థలపై కేసులు కూడా లేవు. పైగా ఆ జీవో అన్ని పత్రికలకు, మీడియా వాళ్లను కంట్రోల్ చేసేందుకు తయారు చేసిన చట్టంగా నాకు గుర్తు) పత్రికలను అణచి వేయడానికి జీవోలు తెచ్చి....తీరా గగ్గోలయ్యాక నేను దాన్ని చూడలేదని వై.ఎస్. అబద్ధమాడటం ప్రజలు మరిచిపోలేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు పత్రికా స్వేచ్చ గురించి మాట్లాడే హక్కు ఎలా ఉంటుంది. విమర్శించడం మీ హక్కే. కేవలం ఇందిరకాలం నాటి ఎమర్జెన్సీనే కాదు.....వై.ఎస్.నాటి ఎమర్జెన్సీని కూడా గుర్తు చేసుకోవాలి.

జాలాక్షుడు said...

ఇంతకీ రాము గారూ, మీ అభిప్రాయం చెప్పలేదే? సమర్ధించడం ఇబ్బందిగా ఉందా? వ్యతిరేకిస్తే తలనొప్పులు తెస్తుందేమోననా? లేక, అభిప్రాయం చెప్పకపోవడమే మీ అభిప్రాయమా? మొత్తానికి జర్నలిస్ట్ అనిపించారు.

ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను..
ఇదే పని ఈనాడుపైనో, ఆంధ్రజ్యోతిపైనో జరిగుంటే మంచిగైంది మమ్చిగైంది అంటూ దాన్ని సమర్ధించి ఉండేవారు. అదే హెచ్ఎం టీవీపై జరిగి ఉంటే పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ శోకాలు పెట్టి ఉండేవారు. సాక్షి విషయంలో మాత్రం ఎటూ చెప్పలేక, గోడ ఎక్కేసి కూచున్నారు.

మీరు రాసుకున్నదే ఒకసారి మీకోసం......

"మీడియాలో పెడ ధోరణులను నిలువరిద్దాం.
చెడుపై పోరాడుదాం, మంచిని ప్రోత్సహిద్దాం."

ఎందుకీ శ్రీరంగనీతులు? ఏదీ సాక్షిపై మీ పోరాటం? లేక, సాక్షిలో మంచి ఏదైనా కనిపించిందా?

ఈ గోడమీది పిల్లి వాటం ఎన్నాళ్లు సార్?

Raj said...

These above arguments are just focused hatred on Jagan and Sakshi. Name which news paper in Andhrapradesh working for welfare of society or for the sake of protecting interests of 4th estate of democracy.

Mafia money involvement in media houses not started with sakshi but the same existing for decades. How come reliance invested in eenadu why at that costly price ? Does Vemuri Radha krishana deserve the post to be an editor any street side person is eligible.

Here the question under given conditions does any one dream to start a news paper..absolutely no the one who have lump sums of bloc money or a politician who wants his agenda to be floated will thrive.
Question who made this media business like this ?

When all given is true and deeds of Ramoji is great for media industry and Vemuri Radhakrishan icon for next generation editors there is nothing wrong with Sakshi. In a pond Lotus thrive under mud not tulasi . Everyone knows the same smell of mud and expect a very few such as Sakshi to be Tulasi.

I want to strongly condemn the way comparison between a journalist and daily labour, never tries to malign or corrupt people ideas or less prevailed but his or her job makes your journalist job run properly.

Praveen Mandangi said...

జగన్ అవినీతి చెయ్యలేదు అని మనమే సర్టిఫై చేస్తే అది prejudice (ముందస్తు నిర్ణయం) అవుతుంది. విచారణ చెయ్యకుండా శిక్ష వెయ్యడానికీ, విచారణ చెయ్యకుండా నేరస్తుణ్ణి విడిచిపెట్టడానికీ మధ్య తేడా ఏమీ లేదు. జగన్ మీద CBIవాళ్ళు రిపోర్ట్ వ్రాస్తే దాన్ని పల్లెటూర్లలో ప్రైవేట్ పంచాయితీలు పెట్టేవాళ్ళు ఇచ్చే జడ్జ్‌మెంట్‌లని చూసినట్టు చూడడం బాగాలేదు.

Praveen Mandangi said...

ఈనాడు పత్రిక స్వేచ్ఛని ఎంత దుర్వినియోగం చేసిందో, సాక్షి కూడా పత్రిక స్వేచ్ఛని అంత దుర్వినియోగం చేసింది. రామోజీరావు పేరు వ్రాసేటప్పుడు రావణోజీరావు అని వ్రాసేవాళ్ళు సాక్షి పత్రికలో. ఎంత వ్యాపార ప్రత్యర్థి అయితే మాత్రం నిజ జీవితంలోని వ్యక్తిని ఒక పురాణంలోని ప్రతినాయకునితో పోల్చడం వ్యాపారంలో ఒక అనారోగ్యకరమైన ట్రెండ్ అని సాక్షివాళ్ళకి తెలియదా? పత్రిక స్వేచ్ఛని ఇంత దుర్వినియోగం చేసి ప్రభుత్వం మా స్వేచ్ఛని హరిస్తోంది అని సాక్షివాళ్ళు ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు.

Unknown said...

yadarthavadi garu,

if we clear the smoke..i.e.,
CBI leaks (comments), eeandu/aj/tv9 writings, tdp/congress allegations.... so far nothing moved from just allegations..

when SC ordered CBI to handover preliminary report to accused, if u file FIR based on that report.. CBI clearly replied to court that, FIR is filed based on initial allegations and NOT BASED ON PRELIM REPORT. So far, Govt didnt reply to the legality/fairness of GOs issued. neither CBI ordered for cancellation of GOs.
infact, jagan is guilty ONLY IF those GOs are proved to be unfair/illegal..

until then, all these comments like "this man invested ONLYBCOS got benifit thru this GO" will be our prejudices alone.

-sree

Unknown said...

appalanaidu garu,

im talking abt logic alone, everybody's (eenadu/cbi/ysr/jagn/tdp) intentions are pretty clear. things are to be done in legally correct manner in legal cases.

RFC case, revenue officer notified those assigned lands and gave notice to RFC and after NOREPLY land is taken back... similar to case of YSR returning his land.

Margadarsi: there is violation of RBI act & hence RBI told them not to collect deposits.

coming to act by YSR: correct if im wrong, there is no denying that media is biased/ going overbored.... the act is abt putting the "onus on the paper itself to prove the allegations they make...."

Anonymous said...

/జగన్ అక్కౌంట్ తో పాటు, మార్తాండ గూగుల్ అక్కౌంట్ కూడా ఎవరైనా సీజ్ చేసేస్తే బాగుండు!/
:D :))))

Praveen Mandangi said...

మెరుగైన సమాజం కోసం పాటు పడుతున్నామని చెప్పుకునే జర్నలిస్ట్‌లే సాక్షిపై విచారణని కక్ష సాధింపు అని విమర్శిస్తున్నారా? చెప్పేవి శ్రీరంగ నీతులూ, దూరేవి బోగం గుడిసెలూ అంటే ఇదే. (బోగం కులంవాళ్ళు క్షమించాలి. మిమ్మల్ని అవినీతిపరులతో పోల్చి కించపరచడం తప్పే కానీ వేరే సామెత దొరకలేదు)

Praveen Mandangi said...

Please read this: http://4proletarianrevolution.mlmedia.net.in/129940593

Praveen Mandangi said...

జగన్ చేసినది సాధారణ అవినీతి కాదు. చంద్రబాబు తొమ్మిదేళ్ళలో చేసిన అవినీతిని జగన్ ఆరేళ్ళలోనే చేసి చూపించి చంద్రబాబు యొక్క రికార్డ్‌ని బద్దలుగొట్టాడు. జగన్ పార్టీ ఈ ఉప ఎన్నికలలో గెలిస్తే 2014లో రాష్ట్రం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే అవుతుంది.

Praveen Mandangi said...

ప్రభుత్వం ఫ్రీజ్ చేసినవి మూడు అకౌంట్లు మాత్రమే. జగన్‌కి పంతొమ్మిది బ్యాంక్ అకౌంట్‌లు ఉన్నాయని సాక్షి టివి ఇడి చెప్పుకున్నాడు కనుక సాక్షి ఉద్యోగుల ఉద్యోగాలు పోవడం అనేది జరగదు.

satya said...

@Samara, Lets keep things simple.. either there will be a fair game or an unfair game.

Lets talk about fair game..
In fair game there are undocumented rules that everyone will follow.. That is Ramoji can write whatever he want and let YSR start his own paper and write what ever he wants.. and let people decide. Dont bother about investments.

But Who changed this???????????

Isn't the YSR who targeted the financial inputs of Eenaadu group?

Now it changed to unfair game and there are no rules here.. Sakshi has to face the same fate what YSR tried to give eenadu. Why to cry foul now?

Raj said...

Mr Praveen Mandangi
You mentioned couple of arguments including from CBI to YSr corruption. The very first argument you brought why we need to think there is no evidence against Jagan with CBI . If you have some third eye you might believe no one cares but what matters is why CBI is waiting for these many days to show this is the evidence just produce before court. In my view neither CBI nor central congress are interested really eliminate corruption its just a political farce. If Jagan won't do the same thing under his father regime Botsa will do or Kiran kumar Reddy will do or some x will do. How much money CBN made under TDP regime? How much money NTR looted .The political corruption not started now it is there right from Nehru and his family, which got the richest Swiss bank account till today.
Here intelligent people like you with biased inclination choosing any one available corrupt side and expecting other one to be clean. But we are not moving collectively towards political corruption free society in a pragmatic way. If your intention is to blame Jagan/Sakshi under corruption quota it applies to all political parties. Selective hatred making paralyze the anti corruption movement. For instance when Chandra babu claims to follow Anna hazare shamelessly people just rejected. Why ? they know the facts system is like that .
People are not trusting eenadu and Andhrajyothy as well why ? just because they know all these are different lotus flower under some mafia propaganda. Here every news paper has its own agenda if any corruption we have tolerate only our party leader not anyone else. If Jagan not started sakshi someone else could have done the same way because that is the most practical model to launch a news media. Eenadu enjoyed lavishness of govt. spared news print paper to acquiring 3000 acres of land, a remarkable feat of creating a modern Landlord after independence using the same model
The real solution to this is real intention to corrupt free not selective hatred and couple of pragmatic approaches to clean the educated illiterate’s brains like us in India. The first and foremost goal in this anti corruption movement is seed the concept in every Indian, things will change but not the selective hatred.

Ramu S said...

I am going to give my opinion on this episode tomorrow, Saturday.
Cheers
Ramu

Chinna said...

Can you tell me who the real owner of Andhra Jyothy is?
Rada Krishna salary was 8000/month and how could he start paper without Babu’s black Money?

Chinna said...

Can you tell me who the real owner of Andhra Jyothy is?
Rada Krishna salary was 8000/month and how could he start paper without Babu’s black Money?

Chinna said...

Can you please convince your Honest Babu to write letter to CBI to probe his 9 years rule?
We will know the real facts then.
But Babu should not meet Home Minister Chidambaram,Ex-law Minister etc?

Praveen Mandangi said...

CBN is also a big corrupt. His world bank debts made 70 thousand cores and zizya tax should be imposed on people to repay those debts. If we also feed worse corrupts like Jagan, then worse taxes than zizya should be imposed in our state.

Praveen Mandangi said...

Studio N నుంచి 70 మందిని ఉద్యోగాల నుంచి పీకేసినప్పుడు ఈ సోకాల్డ్ పాత్రికేయ సంఘాలు ఆందోళనలు చెయ్యలేదు. ఎందుకంటే ఆ సంఘాల నాయకులు సీనియర్ జర్నలిస్ట్‌లు, వాళ్ళ ఉద్యోగాలు అంత తొందరగా పోవు కాబట్టి. ఇప్పుడు సాక్షి ఉద్యోగుల విషయంలో దొంగ కన్నీళ్ళు కారుస్తున్నారు. గతంలో నా కామెంట్లని వెంటనే పబ్లిష్ చేసిన రాము ఇప్పుడు నా కామెంట్లని పన్నెండు గంటల తరువాత అప్రూవ్ చేస్తున్నాడు. CBIవాళ్ళు ఫ్రీజ్ చెయ్యించినవి మూడు బ్యాంక్ అకౌంట్లే. జగన్‌కి మరో పంతొమ్మిది బ్యాంక్ అకౌంట్‌లు ఉన్నాయని సాక్షి పత్రిక ఇడియే చెప్పుకున్నాడు. మూడు బ్యాంక్ అకౌంట్‌లు ఫ్రీజ్ అయినంతమాత్రాన సాక్షి ఉద్యోగుల ఉద్యోగాలు పోవు.

Anonymous said...

/Can you please convince your Honest Babu to write letter to CBI to probe his 9 years rule?
We will know the real facts then./

:D Should everybody go to CBI to probe them to prove their integrity?!!! haa haa haa.

You go to CIA to prove that you are not AlQueda. :D

Ok, saying Jagan and YSR are corrupt doesn't mean CBN is honest. It is stupid arguement often used by Jagan and KCR etc intheir attempt to save their skin, as they have nothing else sensible to defend themselves.

Please stop such senseless arguements, you can argue with Dr.Marthanda (Brain surgeon) for such stuff. :P

Anonymous said...

ఈ పైన ఒకఱు" How much money NTR looted ?" అని వ్యాఖ్యానించారు. ఇది బాధాకరం. దివంగత రామారావుగారు తెలుగుజాతి గర్వించదగ్గ మహామనిషి. ఆయన వ్యక్తిగతంగా ధర్మదాత కాకపోవచ్చు కానీ తన అధికారం ద్వారా పేదవాడికి ఎంతోకొంత ఉపశమనం కలిగించాలనే ఆయన ప్రయత్నించారు. ఈనాటి ప్రభుత్వపథకాలన్నీ ఆయన ప్రారంభించినవే. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఇంత ధనికరాష్ట్రం కాదు. ముఖ్యంగా ప్రభుత్వం ఆర్థికంగా అత్యంత బీదగా, దీనావస్థలో ఉండేది. అలాంటి రోజుల్లో (నిధులివ్వని కేంద్రంతో నిరంతరాయంగా పోరాడుతూ) ఆయన ఈ పథకాలన్నీ సాహసోపేతంగా ప్రారంభించారని మఱువరాదు.

ఆయన రాజకీయాల్లోకి రాకముందే కొన్నివందలకోట్లు సంపాదించారు. రాజకీయాల ద్వారా సంపాదించుకునే అగత్యం ఆయనకి లేదని మనవి చేస్తున్నాను. ఆయన పేరుతో ఆయన చుట్టూ చేఱినవాళ్ళు కొందఱు బాగుపడ్డారేమో గానీ ఆయనేమీ కొత్తగా బాగుపడలేదు. ఆయన బతికున్న రోజుల్లో కూడా ఆయన మీద ఏ విధమైన అవినీతి ఆరోపణలూ రాలేదు. ఆయన ఆస్తుల్లో ఒక్కటి కూడా వివాదాస్పదం కాదు. ఇప్పుడు ఆయన చనిపోయిన 16 ఏళ్ళకి ఇలా ఆరోపణలు చేయడం అవివేకమే కాక దుర్మార్గం కూడా. ఈ ఆరోపణలకి సమాధానం చెప్పుకోవడానికి ఆ పెద్దమనిషి బ్రతికిరాలేడు.

జాతికి icons అయినవాళ్ళందఱిమీదా బుఱద జల్లడం ఈమధ్య కనిపిస్తున్న పెడపోకడ. ప్రతిజాతికీ కొందఱు icons ఉంటారు. వాళ్ళని గౌరవించుకోవడం మనల్ని మనం గౌరవించుకోవడమే. వేఱే వేఱే అసంతృప్తులేవో మనసులో పెట్టుకుని, వాళ్ళ కీర్తిని పనిగట్టుకుని మలినం చేస్తే చివఱికి ఇతర జాతులకి చూపించడానిక్కూడా మనకెవఱూ మిగలరని గుర్తించగోరుతున్నాను.

Unknown said...

currect

navin said...

Tadepalli Garu,

Corruption doesn't mean earning for urself... it means abuse of power in any means to benifit anyone...

As you pointed out, lot of people benifited by the abuse of power of NTR....

coming to his corruption,favoritism... case if PROVED and judgement is given in highcourt of AP.. however, since he is dead by then, that case is takenout.......

u r saying making allegations on deadman is not fair.... which applies to everyone....

thx
sree

navin said...

Tadepalli Garu,

I agree that, ONLY SOME of schemes are started by NTR.
However, if u want to see the truth, MGR is the inspiration and source for all such schemes (e.g, 2/kg rice)....

Anonymous said...

ఆర్యా ! ఎవఱిని స్ఫూర్తిగా తీసుకున్నారనేది అసందర్భం, అనవసరం. ఆ మనిషి ద్వారానే కదా అవి ఏ.పి.లో అమలయ్యాయి ? కొన్ని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజుల రీ-ఇంబర్సుమెంటు తప్ప మిగతా అన్నీ (పేదలకు ఇళ్ళు, కిల్కో రు.2 ల బియ్యం పథకం, ఎస్సీ కాలనీలకు ఉచిత కరెంటు మొ||వి) ఆయన హయాములో అమలైనవే.

రామారావుగారిని తుగ్లక్, అసమర్థుడు, మూఢవిశ్వాసపరుడు, డ్రామారావు అని నిందించడం విన్నాను. ఎవఱైనా ఆయన్ని అవినీతిపరుడని నిందించడం నేనెప్పుడూ వినలేదు. హైకోర్టులో కేసు అన్నారు. ఒక విషయం - ఒక వ్యక్తి పోయినా ఆ కేసులో తీర్పు ఇవ్వొచ్చు. ఏ సాంకేతిక అడ్డంకులూ లేవు. ఆ మనిషి మీద కాకపోతే అతని సహచరుల మీదా వారసుల మీదా వారంట్లు అమలు చేసే వెసులుబాటుంది. కానీ రామారావుగారి మీద ఆ స్థాయి కేసులు ఎవఱూ పెట్టలేదు. పెట్టడానికి అవకాశం లేదు. NTR నిప్పులాంటి నిఖార్సైన మనిషి. ఒక ప్రభుత్వాధిపతిగా తన హయాములో ప్రభు త్వభూముల్ని ఎవఱూ ఆక్రమించకుండా కాపలా కాశారాయన. "ఎవఱి కోసం కాపలా కాశారా ?" అని ఇప్పుడు బాధ కలుగుతోంది. ఎందుకంటే ఆ తరువాత వచ్చిన పాలకులు ఆ ప్రభుత్వ భూములన్నింటితోనూ బిజినెస్ చేసుకున్నారు. కాలేజి డొనేషన్ల రూపంలో, సినిమాల మీది పన్నుల రూపంలో మన డబ్బంతా ఇతరరాష్ట్రాలకు వెళ్ళిపోతోందని బాధపడేవాడాయన. తత్ఫలితంగా సినిమా పరిశ్రమ ఆయన హయాములోనే హైదరాబాదుకొచ్చింది. ప్రైవేట్ కాలేజిలు స్థాపించడానికి ప్రోత్సాహాన్నిచ్చి, అందుకు తగ్గ అనుమతులిచ్చి ఆయన మన విద్యార్థుల డబ్బు మన రాష్ట్రంలోనే ఉండేలా కృషిచేశారు. అలాగే అనేక విశ్వవిద్యాలయాల్ని స్థాపించారు. అసాంఘిక శక్తుల్ని ఎదుర్కోవడానికి మన పోలీసులకిస్తున్న శిక్షణ బొత్తిగా సరిపోదని గ్రహించి, గెరిల్లా యుద్ధం, తదితర సైనిక శిక్షణలున్న ఒక Elite Militia Force ని రూపొందించాలని నిశ్చయించుకొని గ్రేహౌండ్స్ దళాల్ని ప్రవేశపెట్టారు. స్త్రీలకు ఆస్తిహక్కు ప్రసాదించారు. ఎన్టీయార్ గారి సత్పరిపాలన గుఱించి ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు.

అధికారం లేకుండా ప్రజల్లో ఆడియన్సులా కూర్చుని నీతులు చెప్పడం చాలా సులభం. ఆ సీట్లో కూర్చుంటే తెలుస్తుంది, ఎన్నిరకాలుగా తల వాచిపోవడానికి, పిచ్చెక్కిపోవడానికి అవకాశముంటుందో ? ఎంత గొప్ప నాయకుడికైనా సన్నిహితులైన కొద్దిమంది మనుషుల అండదండలూ, సలహా-సహకారాలూ కావాలి. తనవాళ్ళంటూ చెప్పుకోవడానికి కనీసం ఒక 600 మంది కుక్కల్లాంటి (అత్యంత బలవంతులైన) విశ్వాసపాత్రులు కావాలి రాష్ట్రవ్యాప్తంగా, పైనుంచి కిందిదాకా ! ఆ కుక్కల చేత పనిచేయించుకోవాలంటే వాటికి బిస్కిట్లు వేయాలి. పస్తులుంచితే మొదటికే మోసం. తప్పదు. ఎంత నిజాయితీపరుడికైనా ఇది తప్పదు. కౌటిల్యుడు సైతం ఆమోదించిన ఈ రాజనీతిసూత్రం గుఱించి మీరు రామారావుగారిని తప్పుపడతానంటే, దీన్ని మీరు అధికార దుర్వినియోగం అని పిలుస్తానంటే నాదొక మనవి. ఇది చేయకుండా రాజ్యపాలన ఎలా చేయొచ్చునో మీరు కాస్త వివరించండి."రామారావుగారు చాలా తప్పుడు మనిషి" అని నా బ్లాగులోనే ఒక వ్యాసం వ్రాస్తాను. సరేనా ?

యధార్ధవాది said...

అయ్యా తాడేపల్లి గారూ....ఎన్టీయార్ వ్యవహారాలన్నీ కాపీ వ్యవహారాలే. తెలుగుదేశం పార్టీ పేరు నుంచి ఆత్మ గౌరవ నినాదం వరకు ఎమ్జీయార్ నుంచి కాపీ కొట్టినవే. ఒక్కటీ ఆయన సొంతం లేదు. తమిళం నుంచి అరువు తెచ్చుకున్నందుకు థ్యాంక్స్ చెప్పడానికన్నట్లు...మద్రాసుకు మంచి నీటి సరఫరా చేశాడాయన.ఆయన చాలా కొద్దిమందికి అంటే మీలాంటి వీరాభిమానులకు, ఒక వ్యక్తి ప్రభను అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో లాభపడదామని భావించే ఆయన జాతికి మాత్రమే ఆయన ఐకాన్. ఆయన చేసిన కొన్ని గొప్ప పనులతో పాటు రాష్ట్రాన్ని నాశనం చేసిన మా చెడ్డ పనులు కూడా ఉన్నాయి. వంగవీటి మోహనరంగా హత్యలో ఆయన పాత్ర ఎంతో మీలాంటి వారికి తెలియదా? కేవలం కుల బల ప్రదర్శన కోసం పరిటాల రవీంద్ర ఫ్యాక్షనిస్టుకు దన్నుగా నిలబడి రాయలసీమను రక్తసిక్తంగా మార్చిన ఘనత కూడా ఆయనదే. తాను ప్రైవేటుగా సాగించిన అక్రమ వ్యవహారాలను బయట పెడుతున్నారన్న దుగ్ధతో పింగళి దశరథరామ్ అనే జర్నలిస్టును నడిరోడ్డుపై హత్య చేయించిన ఘనత కూడా ఆ మహనీయుడిదే. ఐకాన్ అనేమాటకు ఎన్టీయార్ ఎంతమాత్రం తగడు. కేవలం సినిమా పాత్రల వల్ల జనం గుండెల్లో ముద్రవేసుకోగలిగాడు కానీ...రాజకీయాల్లో, పరిపాలనలో ఆయన వేసిన తింగరి వేషాలు.... ఆయన్ను బఫూన్ గా మార్చాయన్నది నిజం. ఆత్మగౌరవం అని అరిచిన ఆ పెద్ద మనిషి...చివరకు పదవి కోసం తన ఆత్మగౌరవాన్ని చొక్కా విప్పినంత ఈజీగా విప్పేసి...ఓ పత్రికాధిపతి ఇంటి ముందు దేహీ అన్నట్లు యాచించిన చరిత్ర ఆయనది. ఆయన మీకు, మీలాంటి వారికి, ఆయన జాతిలో కొందరికి ఐకాన్ కావచ్చు. కానీ అందరికీ కాదు....

Anonymous said...

అయ్యా యథార్థవాదిగారూ ! నేను వీరాభిమానినో, మఱొకటో... అది పెద్దగా సందర్భసహితం కాదు. అలాగే రామారావుగారి విజయాల మీదే తప్ప ఆయన ఎవఱిని కాపీకొట్టారనేదాని మీద ఆయన ప్రతిష్ఠ ఆధారపడి ఉండదు. అందఱమూ ఎంతో కొంత ఇతరుల్ని చూసి నేర్చుకునేవాళ్ళమే. మనకున్న పరిజ్ఞానమేదీ మనకు పుట్టుకతో వచ్చినది కాదు.

కానీ Howmuch Ramarao looted అని ఒకఱు ఈ బ్లాగులో చేసిన వ్యాఖ్యకి సమాధానంగా నేను వ్రాశాను. ఆ ఉద్ఘాటనని నిరూపించే సాక్ష్యాధారాలు మీ దగ్గఱేమైనా ఉంటే వాటికి హార్దిక స్వాగతం. లేనప్పుడు నాతో ఏకీభవించండి. ఆ వ్యాఖ్యని ఖండించండి.

--తాడేపల్లి

Unknown said...

Tadepalli Garu,

Corruption is not just abt looting people money.. it can take multiple forms,,, casteism, favoritism, .....

ranga murder case, rise of paritala ravi.. and biggest of all karamchedu incident where 7 SC people are burnt alive in karmachedu by kamma people lead by daggubari chenchuramaiah... yet no action taken by NTR>....

On top of it, free hand given to his people, who are now spread in every nook and every field....

Regarding high court case, verdict is delivered against NTR.... since he is not alive.. verdict is not implemented.... - courtesy senior journalist KrishnaRao.....

thx
sree

Anonymous said...

ఆర్యా ! నేను ఒక్కొక్కసారి వ్యాఖ్య వ్రాసినప్పుడల్లా ఒక్కో వ్యక్తి సమాధానమిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇవన్నీ ఒకే వ్యక్తి పెట్టుకున్న మాఱుపేర్లా ? అని సందేహం కలుగుతున్నది. ఒకవేళ వేఱువేఱు వ్యక్తులే ననుకున్నప్పటికీ అసలు విషయానికి రాకుండా వేఱే ఏవో ప్రస్తావనలు లేవనెత్తుతున్నారు. రామారావుగారు రాష్ట్రాన్ని దోచారా ? లేదా ? అనే ప్రశ్నకి సమాధానం చెప్పకుండా తమకే సరిగా తెలీని కోర్టుకేసు, సంబంధం లేని హత్యల గుఱించి వ్రాస్తున్నారు. ఒక వ్యక్తిపాలనలో జఱిగిన అన్ని హత్యలకీ ఆ వ్యక్తినే బాధ్యుణ్ణి చేయడం ఏ మాత్రం హేతుబద్ధం ? ఆలోచించండి. హత్యలకు గుఱైన వ్యక్తులు అంతకుముందే అనేక గొడవల్లో ఉన్నవారు. వారు తమ ప్రత్యర్థులు ఏ పార్టీలో ఉంటే దాని వ్యతిరేక పార్టీలో చేఱుతూంటారు. స్థానిక రాజకీయాల ప్రభావంలో వారు చేసుకునే పరప్సర దాడుల్ని నేరుగా ఆ పార్టీల అధినాయకులకు ఆపాదించడం తగదు. ఆ హత్యలకు గుఱైన వ్యక్తులు రామారావుగారికి ప్రత్యేకంగా శత్రువులు కారు. ఆ కాలంలో ఆయనకున్న క్రిటిక్స్ లో వారూ ఒకఱు. కానీ వారొక్కఱే ఆయన క్రిటిక్స్ కారు. కానీ మిగతా క్రిటిక్స్ అంతా క్షేమంగా ఉండి వారు మాత్రమే హత్యకు గుఱయ్యారెందుచేత ? ఎందుచేతనంటే వారు కేవలం రామారావుగారి క్రిటిక్స్ కారు గనక. వారు అంతకుముందే తమ నీచ, దరిద్ర పాత్రికేయశైలి లేదా రౌడీయిజమ్ కారణంగా చాలామందికి శత్రువులు. అలాంటివారిని ఎవఱో ఒకఱు హత్యచేసే బెడద తప్పకుండా ఉంటుంది. అవన్నీ తీసుకెళ్ళి కళాహృదయుడూ, సున్నితమనస్కుడూ అయిన రామారావుగారికి అంటగట్టడం హేయం.

కులవ్యవస్థ రామారావుగారితోనే పుట్టిందా ? అంతకుముందు లేదా ? కులాభిమానం రామారావుగారికి మాత్రమే ఉందా ? దేశంలో ఎవఱికీ లేదా ? ఒక పాలకుడుగా రామారావుగారు తన కులం పట్ల పక్షపాతం చూపించారనుకుంటే మఱి అంతకుముందున్న పాలకులు విశాలదృక్పథంతో వ్యవహరించారా ? బ్రాహ్మణరాజుల కాలంలో బ్రాహ్మణులకీ, వెలమరాజుల కాలంలో వెలమలకీ, యాదవుల కాలంలో యాదవులకీ, రెడ్డిరాజుల కాలంలో రెడ్లకీ ప్రాధాన్యం లభించలేదా ? ఒకవేళ మీరే పాలకులైతే మీ కులాన్ని మీరు ఉద్ధరించుకోరా ? ఉన్నతస్థితిలో ఉన్న కమ్మకులం రామారావుగారిని లేవనెత్తిందా ? లేక రామారావుగారు కమ్మకులాన్ని లేవనెత్తారా ? చారిత్రిక దృష్టితో, సవిమర్శంగా పర్యాలోచించండి. నా అభిప్రాయంలో, నాకు తెలిసి, రామారావుగారు పగ్గాలు చేపట్టక ముందే కమ్మకులం తన యొక్క శ్రమజీవనం, స్వయంకృషి కారణంగా సమాజంలో ఉన్నతస్థితిలో ఉంది.

Raj said...

Tadepalli garu,
Please don't preach NTR is a social revolutionist just like Kandhukuri Veresa lingam pathulu garu or Gurajada Apparao. For sure NTR is leader and inspiration of CM's of Andhrpradesh. There is a clear demarcation of leader with corruption to just a leader such as previous CM's . During NTR time politics laid foundation for many welfare schemes, which are inspired by MGR. Similarly YSR taken the welfare schemes to next level at the same expense both cases with respect to time the abuse of power for benefit party followers is same to flourish their respective political agenda.
I still don't understand why you gave that much strong reaction when said NTR looted money there are judgments given on similar lines. If you believe before coming to politics itself NTR made lump sum and just for sake of people he came to politics that is just keep with you don't rub on us as a generalization .His properties at Abids encroached govt. roads there are so many controversies, may be you see an idealist so you don't realize.
The essence is if you want to keep NTR at God stance its individualistic opinion but please do draw contours for social idealist when you are preaching in generic terms holy cow and must to accept

Unknown said...

Tadepalli Garu,

YSR IS BLAMED for paritala ravi murder & similarly NTR WILL BE BLAMED for radha murder and karamchedu incident ... Just because, in both cases strict legal action is not taken against wrongdoers... it shows intention of both the leaders...

Coming to Kamma development, there are several other caste-producers in TFI before NTR started dictating terms.... now its all Kamma domination.. same is the case with politics...

coming to caste politics... eppudo velama, reddy rajula gurinchi cheppakandi..
after independence, caste politics started by NTR in AP. before that, oka caste ni uddarinchadaniki evvaru kankanam kattukoledu......

Coming to highcourt case, meeku telsukovalanukunte try cheyandi.. I told the source also... NTR ni icon gane imagine chesukunta ante.. live in ur own world....

Anonymous said...

Most comments here are biased. All politicians including Nehru are corrupt. All media now is run with corrupt/ill gotten money. People also giving importance to caste, religion etc than social well-being. So, no need for these comments here except to make this blog familiar! If every one start to live saints' life there is no need for anyone cry for well-being of the society. As long as we cannot live truthful to ourselves we keep crying about bad-doing of others!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి