Friday, June 22, 2012

విలేకరులపై నింద...'సాక్షి' కి తగని పని


నాసిరకం జర్నలిస్టులు ఇచ్చే చచ్చుపుచ్చు సలహాల వల్ల కాబోలు...'సాక్షి' పత్రిక, ఛానల్ జర్నలిజాన్ని జనంలో మరింత చులకన చేస్తున్నాయి. సీ.బీ.ఐ. జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ గారిని బద్నాం చేసేపనిలో భాగంగా సాక్షి మీడియా సంస్థ ఇతర సంస్థలలో పనిచేస్తున్న విలేకర్లను ఇబ్బంది పెడుతున్నది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు...ఫోన్ కాల్స్ జాబితా ను విడుదల చేయడం...దాన్ని పదే పదే ప్రసారం చేసి విలేకరులను కుట్రదారులుగా చిత్రీకరించడం దారుణం. రెడ్డి-కమ్మ పోరాటంలో క్రైం జర్నలిస్టులను లాగడం తప్పు. ఇది పత్రికా స్వేచ్ఛ మీద ప్రత్యక్ష దాడి. నిన్నటి రోజు తెలుగు జర్నలిజంలో ఒక దుర్దినం.

తెలుగు మీడియా ఒక రాజకీయ మీడియా అనడంలో సందేహం లేదు. ఎల్లో ప్రెస్ మాత్రమే కాదు...అన్ని కలర్ల ప్రెస్ ఇక్కడ..జనాలను వెర్రోళ్ళను చేస్తూ వర్ధిల్లుతున్నది. కమ్మలు, అదీ ఒక ప్రాంతానికి చెందిన కమ్మ కులస్థులు మాత్రమే, ప్రభువులుగా ఉండాలని మీడియా ముసుగులో ఎవరో ఆదేశిస్తారు, ప్రచారం చేస్తారు, నమ్మ బలుకుతారు. ఈ మీడియా లాబీ వెర్రి ముదిరి పిచ్చి గా మారే సంక్లిష్ట సమయంలో 'సాక్షి' పుట్టుకురావడం...ప్రత్యామ్నాయ జర్నలిజం అందిస్తామని అది చెప్పడం మంచిదయ్యింది. అది నిజంగానే చారిత్రిక అవసరం. అది నికార్సైన జర్నలిజాన్ని అందిస్తుందని ఎవరూ ఆశించలేదు. ఎల్లో ప్రెస్ కు అది చెక్ పెట్టడం మంచిదని సత్యాభిలాషులు అనుకున్నారు. కానీ...జగన్ అరెస్టు తర్వాత 'సాక్షి' బాసుల నిస్పృహ, అసహనం పెరగడం...సీనియర్ జర్నలిస్టులు యాక్టివిస్టులుగా మారడం బాధాకరం. ఆ పత్రిక, ఛానెల్ రాతలు, కూతలు మరీ శృతి మించి రాగాన పడుతున్నాయని అనుకోవడానికి నిన్నటి ఆ సంస్థ చేసిన హంగామా ఒక ఉదాహరణ. 

వృత్తి నిర్వహణలో భాగంగా విలేకరులు దర్యాప్తు సంస్థల అధిపతులతో టచ్ లో ఉండడం...సర్వసాధారణం. ఒక చిన్న విషయం కోసం పలు మార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. ఆ కాల్స్ లిస్టు తయారు చేసి విలేకరుల పేర్లతో ప్రకటన విడుదల చేయడం వెర్రితనం. లక్ష్మి నారాయణ గారితో ఫోన్ లో మాట్లాడినంత మాత్రాన జర్నలిస్టులు కుట్రలో భాగం పంచుకున్నట్లా? ఇది విలేకరుల నిబద్ధతను ప్రశ్నించినట్లు కాదా? వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా కష్టపడి సంపాదించుకున్న మంచి పేరును ఒక్క దెబ్బతో కొట్టి పారేయడం ఏ తరహా జర్నలిజం? 

నిజానికి జే డీ గారి కాల్ లిస్టు సేకరించడం మంచి విషయం. అందులో బంపర్ స్టోరీ యాంగిల్ ఒకటి ఉంది. ఆ అమ్మాయి ఎవరితోనో...జే డీ గారు మాట్లాడిందని, ఆమె ఆంధ్రజ్యోతి అధిపతి తో టచ్ లో ఉండని 'సాక్షి' వాదించింది. నిజానికి అది కరెక్టు పాయింటు. జే.డీ. గారితో మాట్లాడిన క్రైం రిపోర్టర్ల మీద కాకుండా ఈ సింగిల్ పాయింట్ మీద దృష్టి పెడితే బాగుండేది. ఇప్పటికైనా...ఆ మహిళ -జే డీ-ఆర్కే లింకును  వదలకూడదు. 

తెలుగు క్రైం జర్నలిస్టులు...నిజానికి కష్టపడి పనిచేసే గుణం ఉన్నవారు. మహాత్మ (టీ.వీ.-నైన్), రమేష్ వైట్ల (ఎన్.-టీ.వీ.) వంటి జర్నలిస్టులను నేను చాలా ఏళ్ళుగా చూస్తున్నాను. వారికి వృత్తి మీద మమకారం ఉంది. లోగుట్లను బైట పెట్టడానికి వారు పడే కష్టం నాకు స్వయంగా తెలుసు. వారి మీద ఏమైనా ఆరోపణలు ఉంటే...యాజమాన్యాలు చూసుకుంటాయి. వారిని కుట్రలో ఇరికించాలని చూడడం అమానుషం. వై.ఎస్.కు కొమ్ము కాసిన జర్నలిస్టులకు తర్వాత ఆయన అధికారం లోకి వచ్చాక తాయిలాలు దక్కడం నిజం కాదా? అప్పట్లో వై .yes.చెప్పినట్లు రాయకుండానే వారు ఇంత మంచి పదవులకు ఎదిగారా? అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. కులం, వై.ఎస్.పట్ల భక్తి వుండడం తప్పు కాదు కానీ...అవి మూర్ఖంగా మారి సాటి విలేకరులను బలి చేసే ఉన్మాదంగా రూపు దాల్చడం ప్రమాదం. ఇప్పటికైనా తప్పెరిగి విలేకరులకు 'సాక్షి' క్షమాపణ చెప్పడం సముచితం. 

14 comments:

Anonymous said...

నిజమే ,సాధారణ విలేఖరులని బద్నాం చెయ్యకూడదు ,అసలు ఈ వాసిరెడ్డి చంద్ర బాల ఎవరో ,ఆమెకి ఈ లక్ష్మి నారాయణతో ,గ్రే హూన్డ్స్ చీఫ్ తోటి ,ఆంధ్ర జ్యోతి MD తో గంటల తరబడి సంభాషణలు ఏమిటో బయట పడాలి. సిబిఐ విచారించి నిందితులకి శిక్ష పడేటట్లు చెయ్యడం కన్నా మీడియా కు లీకులు ఇచ్చి ఒక పార్టీ ని బద్నాం చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. ఎస్ ,జగన్ ఒంటరి వాడు ,ఇవతల వైపున అన్ని రకాల దుష్ట శక్తులు పొంచి ఉన్నాయి. నాకు ఎందుకో జగన్ ది బతుకు పోరాటం ,ఈ ఎల్లో మీడియా ,సోనియా ,చంద్ర బాబు లది చెలగాటం లాగా అనిపిస్తుంది. ఒక్కోసారి తమని రక్షించుకోవడానికి ఇవి తప్పవేమో. ఒక్క సారి జగన్ వైపు నుంచి ఆలోచించండి . ఏది నిజం ,ఏది అబద్దం అనేది అతి త్వరలో కాలమే నిర్ణయిస్తుంది. ఒంటరి పోరు చేస్తున్న జగన్ కి ప్రజలే శ్రీరామ రక్ష.

www.apuroopam.blogspot.com said...

విలేఖరులు జె.డి. గారికి పోన్ చేయడం నేను తప్పు అని మేము అనడం లేదు అని అంబటి అనడం సాక్షి పదే పదే ప్రసారం చేసింది. జె.డి. గారు వారికి తనంతట తాను ఫోన్ మాట్లాడడం తప్పు అని పదే పదే ఘోషించేరు. ఈ విషయాన్ని వదిలేసి విలేఖరులు సమాచార సేకరణలో కష్ట పడతారు అంటూ ఏ వేవో విషయాలు రాయడం అసలు విషయాన్ని పక్కదారి పట్టించడమే. ఈ విషయంలో డ.డి. గారు చేసినది నైతిక మైతే ఆ మాట ఎవరైనా ధైర్యంగా చెప్పాలి అంతే కానిఅసలు విషయాన్ని వదిలేసి డొంక తిరుగుడుగా ఎవరు మాట్లాడినా ప్రజలు వారి మాటలు వినేంత వెర్రివారు కారు. ప్రజల్ని అమాయకులనీ గొర్రెలనీ అనుకోవడం వల్లనే రెండు పెద్ద పార్టీలు దెబ్బ తిన్నాయని గ్రహిస్తే ముందుముందు అందరికీ మంచిది.

Ram said...

కులం, వై.ఎస్.పట్ల భక్తి వుండడం తప్పు కాదు కానీ.

Wah..Wah...double standards ki example. Kulam patla bhakti undatam tappu kadanta...mari inni rojulu miru kulam patla bhakti undatam tappu ani cheppina subhashitalu anni fake ee naaa?

Sakshi ravadam manchidi anukunnaru anta....abbo!!!!
Evaru nayana anukundi...eenadu mida paaga tho unde milanti vallu anukunnaremo kaani..not outsiders like us....maaku telsu Sakshi entha nichathi level ki tiukelthundoo ani....

mi journos ni chusthu unte oka dialogue gurthuvasthundi...

vidu pothe vaadu, vadu pothe inkokadu ani something...ala undi mi pani..

eeenadu ni kottadaniki oka newspaper kavali...kotha vadu chesina chetta chusakaa...kallu teruchukoni...inko newspaper kavali ani anukovadam mi tappu kaadu le...

Bullabbai said...

full of contradictions అన్నాయ్. see the following paragraphs for instance....



తెలుగు మీడియా ఒక రాజకీయ మీడియా అనడంలో సందేహం లేదు. ఎల్లో ప్రెస్ మాత్రమే కాదు...అన్ని కలర్ల ప్రెస్ ఇక్కడ..జనాలను వెర్రోళ్ళను చేస్తూ వర్ధిల్లుతున్నది.
డం...............సీనియర్ జర్నలిస్టులు యాక్టివిస్టులుగా మారడం బాధాకరం

Vs

లక్ష్మి నారాయణ గారితో ఫోన్ లో మాట్లాడినంత మాత్రాన జర్నలిస్టులు కుట్రలో భాగం పంచుకున్నట్లా? ఇది విలేకరుల నిబద్ధతను ప్రశ్నించినట్లు కాదా?


pl. don't separate journalists from owners....you are not kids who are forced into this... you are part of the crime

Ramakrishna said...

మీరు ప్రతి విషయాన్ని కులం కోణంలొనే చూస్తునట్లున్నారు. ఒక సారి చెక్ చేసుకోండి. నాకు ఈ క్రింది విషయాలు అభ్యంతరకరమని అనిపించాయి.

1. లక్ష్మినారాయణ గారి కాల్స్ అయన వ్యక్తిగతం. ఆయన రాజకియనాయకుడు కాదు. ఆయన వ్రుత్తి ధర్మంలొ భాగంగా ఎంతొ మందితొ మాట్లాడవలసి రావచ్చు. దానికి కూడా విపరీతార్ధాలు తీయడం విడ్డూరం.

2. ఛంద్రబాల గారు ఈరోజు మీడియా ముందుకి వచ్చారు. ఆవిడ ఒక సాధారణ వుద్యొగి మరియు గ్రుహిణి. ఆవిడని కూడా ఈ రొంపి లొకి లాగడం అనవసరం.

3. జగన్ తప్పు చెసాడా లెదా అనేది కోర్టు నిర్ణయించాల్సిన విషయం. విచారణ తీరు బాగా లెకుంటె దాన్ని కోర్టులొ తెల్చుకోవాలి తప్ప దానికి CBI వాళ్ళని మీడియాలొ బదనాం చేయడం సరి కాదు.

kk said...

i think you are mistaken like others, no one blamed media people. i do not know how did you come to such conclusion, they said only one thing , the list is of calls made by JD to the media, please check your facts before publishing, do you accept is it right for JD to call selective media, and one more thing even when jagan was arrested CBI did not issue any press statement, they might have thought giving info to selected media is enough.

kk said...

i think you did not get the facts right, the main accusation is JD calling selective media and not the media persons calling JD, do you accept what JD did is right? if you recollect , when jagan was arrested CBI did not issue any press release, i think they might have thought giving info to selected to media orgns is enough, i think you should have checked the facts before publishing your opinion.

evadaite enti said...

nijamga journalists ni kutra lo bhagam ani sakshi media ante adi tappe..kani..jd lakshinarayana particular persons ke media leaks icharu..istunnaru annappudu aa particular persons evaro cheppalsina avasaram ledaa? poni valla perlu cheppakunda phalana ntv,tv9,abn reporters to vandalakodddi calls nadichayi ante objection undedhi kada?...

sandarbham vachindi kabatti o simple question....
...o vela evariana reporter scam cheste..athanu idivaralo nijayiti ga unnadu kabatti ika eppatiki athani peru cheppakudadhu anadam correctena?>>>Endukante konni rojullo arachaka journalists bhagotalu bayata padatayani o blog tega cheptondi..andukannamata...evaraina sare answer ivvandi

gvr said...

Sir,
Whatever saksi did was wrong in publishing phone numbers. But on YSRCongress part that was excellent catch.
I think u didn't see the press conference of Ambati and co. They clarified that was the outgoing call list of JD' mobile.
Still 300+ calls to a single mobile in the span of 3 months is too much. As u r a journalist u r backing ur fraternity. But as a comman man i have a question..dont YSJagan have privacy. Bedroom photos anni publish chesinappudu teleda privacy,ethics ani. jagan jail lo emchestunnadu vaallakavasarama. jail yoga chesukunte makemi,juice lu tagithe vellakenduku. ABN tv chudandi..cartoons vesi enthala chuspistharo
Sakshi media valla numbers matrame iccharu...yesterday vallu andaru media munduku vacchi faces kooda choopincharu. journalists andaru pedda patita laaga matladatunaru. I have many experiences with journalists. Valla entha corrupted ani andariki telusu. Okkasari janalloki velli adagandi telustundi.

kk said...

please get the facts right, no journo was accused, jd was accused of calling certain group of media, that is the main accusation, this not expected from you, i tried to post my comment, but it si not posted here,

GMR said...

రామ్ గారు మీరు కూడా జగన్ పేయడ్ మీడియా క్లబ్ లో మెంబెర్స్ ఐన గ్రేట్ ఆంధ్ర , దట్స్ తెలుగు వెబ్ సైట్ ల లాగానే మీరు కూడా అనుకున్నా కానీ కాదని ఇప్పుడు అర్ధం అవుతోంది ....

Ramu S said...

ఒక ముఖ్య వివరణ...
ఆ చంద్రబాల గారి పేరు బైటికి రాగానే రాసిన పోస్టు ఇది. తర్వాత....ఆమె తో కలిసి పనిచేసిన వారితో మాట్లాడితే తెలిసింది...తను చాలా సిన్సియర్ వర్కర్ అని. ఆమె గురించి చులకన భావం కలిగేలా నేను రాసి ఉంటే...సారీ.
రాము

Anonymous said...

@ఒక ముఖ్య వివరణ...
ఆ చంద్రబాల గారి పేరు బైటికి రాగానే రాసిన పోస్టు ఇది. తర్వాత....ఆమె తో కలిసి పనిచేసిన వారితో మాట్లాడితే తెలిసింది...తను చాలా సిన్సియర్ వర్కర్ అని. ఆమె గురించి చులకన భావం కలిగేలా నేను రాసి ఉంటే...సారీ.
రాము


మీకు మా జోహోర్లు ..పొరపాట్లు మానవ సహజం..సాక్షి చూసి మాకూ అనుమానం కలిగింది...ఎదో జరిగే ఉంటుదని.....తర్వాత చంద్రబాల గారి ఇంట్ర్వూ చూసాక ..ఇది ఒక బురద జల్లుడు కార్యక్రమమని అర్ధమయ్యింది.దొంగా్డికి ఊరంతా దొంగలుగానే కనబడతారు సహజం...ఆమె ఇంటర్వ్యూ చూసాక కూడా మేధావులు ఏమన్నారో ఒకసారి చూడండి....


2.అమ్మా చంద్రబాల గారు !

కేవలం ఒక తొక్కలో ప్రోగ్రామ్ కోసమే అయితే ఒక స్టింగర్ని సంప్రదిస్తే సరిపోతుంది – మించి పోతే జిల్లా రిపోర్టరుకు చెస్తే ఖతం. కాని దాని కవరేజి కోసం కేవలం మీడియా ఎం.డిలతోనే మాట్లాడాల్సిన పరిస్థితి/దుస్థితి ఎందుకు ఆవురించిందో చెప్పగలరా? ఇంకెంత మంది మీడియా ఎం.డిలతో మాట్లాడారో చెప్పగలరా?

3.అమ్మా చంద్రబాల గారు !

లక్ష్మినారాయణ సారు మీ క్లాస్ మెట్ అన్నారు , మీ ఫ్యేమిలి ఫ్రెండ్ అన్నారు. మరి మీతో మరెంతో మంది క్లాస్ మెట్స్ ఉంటారుకదా? వారిలో ఎంతమందికి ఇలా వందల కొలది కాల్స్ చేస్తుంటారు? అలానే సారు వారు మరెంత మంది క్లాస్ మెట్స్ కి ఇలా కాల్స్ చేస్తుంటారు?

6.అమ్మా చంద్రబాల గారు !
మీ సంఘసేవకు జెడిగారు సాయం చేసేవారని చెప్పారు కదా? ఆ సాయాలు ఏవి? చేసిన వారెవరు? ఆ చేసినవారు లక్ష్మినారాయణ అనే వ్యక్తి సిఫార్సు చేస్తే సాయం చేసారా? లేక అతను అత్యున్నత దర్యాప్తు సంస్థ జె.డి అన్న కారణం చేత సాయం చేసారా? ఇది అధికార దుర్వినియోగం కాదా?

ఒక మహిళ -ఒక గృహిణి -ఒక సంఘ సేవకురాలైన చంద్రబాలకు హాని కలుగుతుందని -వారి ప్రైవసి పోయిందని ముసలి కన్నీరు కారుస్తున్నారే .. జగన్ తో /జగన్ మీడియాతో మీకున్న ప్రత్యక్ష పోరులో వీరిని భాగస్వాములు చేయడం వల్లేగా వారి ప్రైవసి పోయింది ..వారి ప్రాణానికి హాని వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఈ ముక్క ఎందుకు అంగీకరించరు?
.రాధాకృష్ణ గారు .. !

చంద్రబాల వంటి సంఘ సేవకులు కోకొల్లలుంటారు కదా. వారిలో ఈ రెండు నెలల్లో మరెంతమంది -మీకు కాల్ చేసారు. మీరు ఎంతమందికి కాల్ చేసారు?

బ్లాగర్ల రాతలు చూసి వెర్రి వెధవలు అనుకునే లా బ్లాగుల్ని తయారు చెసుకుంటున్నామా??బ్లాగర్లా!!వాళ్ళవన్నీ పిచ్చి రాతలు అని నలుగురూ నవ్వే స్థితి లోనికి నెట్ట వేయబడుతున్నామా??

sasi said...

@ksv,
Mastaaru channel lo oka 30 mts program ravalante ,leda roju mottam ads laga ravalante reporter tho pani avutunda
Also she spoke to RK twice.Once he was in flight(told in interview)
So meeru chese vaadanaku logic assalu ledu.Okasari matladithe kutra?
Media lo unnavallu rojuki konni vandala manditho matladataru.
Just think as an educated person with common sense.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి