Saturday, November 28, 2009

'ఈనాడు' లో మార్పులు? పెద్దాయనకు రెస్ట్??

తెలుగు జర్నలిజం లో పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన నిత్య కృషీవలుడు, ప్రముఖ వ్యాపారవేత్త, 'ఈనాడు'  ప్రధాన సంపాదకుడు చెరుకూరి రామోజీ రావు ఇకపై కొంత విశ్రాంతి తీసుకోబుతున్నారని సమాచారం.
నవంబర్ పదహారున 74 వ పుట్టిన రోజు జరుపుకున్న రామోజీ స్థానంలో ఆయన పెద్ద కుమారుడు కిరణ్ గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధ మయ్యిందని 'ఈనాడు' వర్గాల ద్వారా తెలిసింది.
ప్రస్తుతం 'ఈనాడు' ఎం.డీ. గా వున్న కిరణ్ స్థానాన్ని ఈ గ్రూప్ నకు ఎన్నో ఏళ్ళుగా నమ్మిన బంటుగా వున్న వెంకట్ భర్తీ చేయబోతున్నట్లు భోగట్టా.
ఈ అంశంపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో నిర్ణయం జరిగిందని...త్వరలోనే...ఈ మార్పులు జరగబోతున్నాయని అంటున్నారు.


ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి..స్వశక్తితో అనూహ్యంగా ఎదిగిన రామోజీకి విశ్రాంతి అవసరమని కుటుంబం గట్టిగా నమ్ముతున్నది. కొంత అపార్ధంతో కుటుంబంలో కలత సృష్టించి తండ్రికి మనోవేదనను కలిగించిన సుమన్ కూడా తల్లిదండ్రులకు దగ్గర అయ్యాడు. "నాన్ స్టాప్" అనే ఆడియో విడుదల కార్యక్రమంలో కుటుంబం అంతా ఒక్కటిగా కనిపించింది. రామోజీ గారు సుమన్ ను దగ్గరకు తీసుకుని ఆశీర్వదించడం చూసి 'ఈనాడు' గ్రూప్ ఉద్యోగులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

పెద్దాయన పూర్తి రెస్ట్ తీసుకుంటారా? లేక అన్ని వ్యవహారాలూ కొడుకుకి వంటబట్టే దాకా పక్క నుంచి నేర్పిస్తారా? 'ఈనాడు' ను విజయ పథం లో నడపడానికి వెంకట్ వద్ద ఉన్న మ్యాజిక్ ఏమిటి? యాజమాన్యం మార్పులేనా లేక ఎడిటోరియల్ స్థాయిలో కూడా ప్రక్షాళన ఉంటుందా? అన్నవి ప్రస్తుతానికి సమాధానాలు లేని ప్రశ్నలు.  

3 comments:

రవిగారు said...

రాముగారు అది nonstop కాదండి comedyexpress సినిమా ఆడియో ఫంక్షన్ అనుకుంటా . ఇంకా రెండోది యి మద్యనే సుమన్ కాస్త సుమన్ బాబు అయిపోయాడు ఇంకా మీ దృష్టికి రాక పోవడం ఆశ్చర్య కరం .బాబు తగిలించుకుంటే ప్రభాకర్ కుడా మళ్ళి తగులు కుంటాడని ఎవరో దైవజ్న శర్మలు చెపితే ఆ విధం గా ముందుకు పోతున్నారన్న మాట .

Anonymous said...

రాష్ట్రానికి పట్టిన పీడ సగం వదులుతుంది. మీడియా మాఫియా అధినేత రెస్టు తీసుకుంటే పొద్దున్నే లేస్తూనే అబద్ధాలు చదివే దౌర్భాగ్యం రాష్ట్ర ప్రజలకు తప్పుతుంది.

Anonymous said...

కిరణ్ ఓకే. కానీ ఒక రాహుల్, ఒక డీఎన్, ఒక ఎం ఎన్ ఆర్, ఒక విశ్వప్రసాద్ అలాగే ఉన్నన్ని రోజులూ ఏ మార్పూ ఉండదు. ఆ సిండికేట్ తోనే పెద్ద ప్రమాదం