Monday, November 23, 2009

వ్యక్తిగత విషయంపై చర్చ....రచ్చ రచ్చ

గత రెండు రోజులుగా...విజయవాడకు చెందిన వివాహిత జ్యోతి, కర్నూలు కుర్రోడు కార్తీక్ ల మధ్య వివాదం TV-9 కు మంచి మసాలాను అందించింది. ఆదివారం నాడు ఒక్క జ్యోతి కథనాన్ని మాత్రమే అందంగా అందించిన ఆ ఛానల్, కార్తీక్ వాదనను పట్టించుకోలేదు. తన బిజినెస్ భాగస్వామి అయిన కార్తీక్ హ్యాకింగ్ కు పాల్పడి...తనకు తన భర్తకు మధ్య జరిగిన ఆన్ లైన్ సంభాషణను అందరికీ పంచాడని, తనను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తూ మానసికంగా హింసించాడని ఆ అమ్మాయి ఆరోపిస్తున్నది.

కార్తీక్ ఈ ఆరోపణలను ఖండిస్తూ...తనను పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయే వేధిస్తున్నదని ప్రత్యారోపణ చేస్తున్నాడు. TV-9 లో జ్యోతి కథనం విన్న కార్తీక్ తన వాదన కూడా వినాలని ఆ ఛానల్ ను కోరాననీ, కానీ తనకు అందుకు అవకాశం ఇవ్వలేదని వాపోయాడు. సాయంత్రానికి 'Zee- 24 గంటలు' వారు కార్తీక్ ను లైవ్ లోకి తీసుకున్నారు. తన వాదన వినిపించేందుకు మంచి అవకాశం కల్పించారు. దాంతో కథ మరింత రక్తి కట్టింది. 

ఆరా తీస్తే తెలిసింది ఏమిటంటే...టీ వీ రంగాన్ని శాసిస్తున్న కేబుల్ నెట్ వర్క్ లో ఒక పెద్ద మనిషితో జ్యోతి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయనీ, ఆయన వల్లనే మొదటి రోజు కార్తీక్ వాదన బుల్లి తెరపై కనిపించలేదని తెలియవచ్చింది. జీ ఛానల్ లో కూడా కార్తీక్ వాదన రాకుండా వుండాలని సదరు ప్రముఖుడు ప్రయత్నించి విఫలమైనట్లు సమాచారం.

అదలా వుండగా...సోమవారం రాత్రి అటు జ్యోతిని లైవ్ లో వుంచి, ఇటు కార్తీక్ ను టెలిఫోన్ లైన్లో తీసుకుని రజనీకాంత్ దాదాపు ఒక గంట పాటు నానా యాగీ సృష్టించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిసిన రాత్రి ఈ అంశంపై TV-9 అంత సమయం కేటాయించడం వింతగా తోచింది. యాంకర్ గారు జడ్జ్ పాత్రను పోషిస్తూ కార్యక్రమం నడిపారు. మధ్యలో ఇద్దరు సాంకేతిక 'నిపుణుల'తో కూడా మాట్లాడించారు. "ఈ నేరం కార్తీక్ చేసేందుకు అవకాశం వుంది అని మీరు భావిస్తూ వున్నారా?" అని రజనీకాంత్ అడిగారు. ఆయన ఒక దశలో కార్తీక్ ను మందలించారు. "మీరు ఇప్పటికే చాలా సవాళ్లు విసిరారు," అని ఒకటి రెండు సార్లు కటువుగా, అచ్చం జడ్జి మాదిరిగా, అన్నారు. మొత్తం మీద అమ్మాయి, అబ్బాయి లైవ్ లో మరీ పచ్చిగా మాట్లాడు కోకుండా నిలువరించినందుకు రజనీకాంత్ ను అభినందించాల్సిందే.

ఇంతకూ కోర్టులో తేలాల్సిన విషయాన్ని మిడిమిడి జ్ఞానంతో ఒక ఛానల్ ఎందుకు పరిష్కరించాలని చూస్తున్నదో తెలియడంలేదు. 

చివరకు మంగళవారం కర్నూల్ లో కార్తీక్ ఇంటికి ఒక ఓ.బీ.వ్యాన్ పంపుతున్నామని, ఆయన తన సాక్ష్యాలను ప్రజలకు లైవ్ లో చూపించి "నిర్దోషి" గా బైట పడాలని ఆ ఛానల్ సూచించింది. మీకు ఏమనిపించిందో నాకు తెలియదు కానీ...ఈ వివాదం ఒక పిచ్చి వ్యవహారంలా తోచింది నాకు.

పెళ్లి అయిన అమ్మాయి...భర్తకు తెలీకుండా...మరొకడితో విచ్చలవిడిగా ఆన్ లైన్ వ్యవహారం నడపడం ఏమిటి? వాడినే వ్యాపార భాగస్వామిని చేసుకోవడం ఏమిటి? శ్రుతిమించిన మెసేజ్ లు వాడికి పంపి చనువు ఇవ్వడం ఏమిటి, కంపు కంపు చేసుకోవడం ఏమిటి? పోలీసులు కేసును పరిష్కరిస్తూ ఉండగానే ఒక ఛానల్ కు ఆమె ఎక్కడం ఏమిటి, చస్తా అనడం ఏమిటి? ఆ ఛానల్ వారు ఆ అమ్మాయి కి మాత్రమే అవకాశం ఇచ్చి ఆరోపణలు ఎదురుకుంటున్న వ్యక్తిని దోషిగా చూపించడం ఏమిటి? అమ్మాయి, అబ్బాయి లైవ్ లో బూతులు దోక్కోవడం ఏమిటి? అబ్బాయి "ప్రూఫ్" చూపించడానికి ఒక లైవ్ వ్యాన్ ను వాడి ఇంటికి పంపడం ఏమిటి?---అంతా గందరగోళం, అగమ్యగోచరం. ఛానల్ కు తమాషా, జనానికి టైం పాస్.

రాజకీయ పలుకుబడి వల్ల ఒక అమ్మాయికి నిజంగానే అన్యాయం జరుగుతున్నదని ఛానెల్స్ భావించి ఆ అంశానికి ప్రాముఖ్యత ఇవ్వడం తప్పు కాదు. కానీ...ఇప్పుడు లైవ్ లో చేస్తున్న రచ్చ...గుట్టు చప్పుడు కాకుండా రిపోర్టర్ ఆరా తీయాల్సిన అంశం. రిపోర్టర్ గారు ముందుగా రెండు వైపులా వాదనలు విని...ఆధారాలు స్వయంగా పరిశీలించి...సైబర్ నిపుణులు, పోలీసుల వెర్షన్ తీసుకుని ఒక మంచి స్టోరీ చేస్తే బాగుండేది. దానికి అప్పుడు ఒక పరిపూర్ణత్వం వచ్చి వుండేది. దాని బదులు రిపోర్టర్ సరైన లెగ్ వర్క్ చేయకుండా...లైవ్ లో ఆరోపణలు, ప్రత్యారోపణలు జనాలకు వినిపించడం...ఇలా ఒక సున్నితమైన విషయంపై బహిరంగంగా 'కోర్టు విచారణ" జరపడం దారుణం. ఇది తప్పుడుమారి వికృత జర్నలిజం. 
మసాల అంశాలు (అంటే అమ్మాయిలు ఎక్కువగా మోసపోయి ఇరుకున పడిన విషయాలు)  దొరికినప్పుడు...ఎలెక్ట్రానిక్ మీడియా ఇలా గీత దాటి వ్యవహరిస్తుంది. ఇది చూడటానికి బాగుంటుంది కానీ...ఇందులో భాగాస్వామ్యులైన ఇద్దరి వ్యక్తిగత జీవితాలు తీవ్రంగా దెబ్బ తింటాయి. ఇది కనిపించని అపార నష్టం. ఇప్పుడు అనాలోచితంగా రచ్చకెక్కి....రెచ్చిపోయి తిట్టుకుంటున్న ఈ  ఇద్దరిలో ఒకరు రేపు ఈ వేదన భరించలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే...ఎవరండీ బాధ్యులు?

8 comments:

నరేష్ నందం (Naresh Nandam) said...

న్యూస్ చానళ్లకు కమర్షియాలిటీని చూపించి, కొత్త ట్రెండుకి శ్రీకారం చుట్టిన టీవీ9, సీరియల్ ప్రొగ్రాముల లాగా సీరియల్ న్యూస్‌ని ప్రవేశ పెట్టింది. ఒకే వార్త(?)ని నాలుగు రోజులు సాగతీయటంలో వాళ్లు సీరియల్ డైరెక్టర్లను మించి పోయారు. ఐనా అదేంటో.. ఎంత మంది టీవీ9 గురించి ఎలా మాట్లాడినా.. ఆ చానల్ చూడకుండా తెలుగు వాళ్లు ఉండలేక పోతున్నారు, నాతో సహా. చూద్దాం, ఇంకా ఎన్ని ఎపిసోడ్లు మిగిలి ఉన్నాయో!

గ్రేట్ ఐడియా.. చీర్స్ టు రవి ప్రకాష్ అంద్ రజనీ కాంత్!

Shekhar jakkula said...

yes ramugaru e madhya kalamulo koni channls and journalist la rupam lo uana management rateing kosam elanti masalanu uapa yogichukoni rating incresu chysukovalni chusthunayee mari mukhyaga tv9 varu 2sidesopinion teuskoni telcost chysty bagudunu

Anonymous said...

Ramu gaaru,
jyothi vyavahaaram pichi gaa anpinchindi meeku. aa pichi story ni tv9 vesthe verri zee 24 ku pattukunnattu vundhi.
lekapothe zee ku eem sambandham karthik ni tisuku vachi janam mundu nilabettadaaniki. shailesh daggara ideas ayipoyinattu vunnaay.
Ramu gaaru. sakhiloo english bulletin pedutunnarata, anchoring ram chestadata, elaavuntundi antaaru

Mitra said...

అన్నయ్యా ,
మీడియా వ్యక్తిగత జీవితాల్లోకి ఎప్పుడో జొరబడింది. మీరు రాసినట్లు tv9 అతి చేస్తోంది . ఇద్దరి చీకటి వ్యవహారాన్ని ఏ ప్రయోజనం ఆశించి టెలికాస్ట్ చేసిందో రవిప్రకాష్ చెప్పాలి. ఈ మధ్య గోరటి వెంకన్న పాటకు అన్యాయం పేరా పెట్టిన చర్చ కూడా చివరకి బూమరాంగ్ అయ్యింది. మేము చూపెట్టింది .. మీరు చూడాలి అన్న రీతిలో ప్రవర్తిస్తోంది tv9 .

Anonymous said...

బ్లాగోలేదు
........
జ్యోతి, కర్నూలు కుర్రోడు కార్తీక్ ల మధ్య వివాదం TV-9 కు మంచి మసాలాను అందించిదంటూ మీరు రాసింది బాగానే ఉంది రామ్.... అయితే, పనికిమాలిన ఓ వార్తా స్రవంతిపై మీ బ్లాగ్ లో ఇంత ప్లేస్ ఇవ్వడం ఏమీ బాగోలేదు సార్...

Nagabhushna Rao Turlapati said...

బ్లాగోలేదు సార్...
జ్యోతి, కర్నూలు కుర్రోడు కార్తీక్ ల మధ్య వివాదం TV-9 కు మంచి మసాలాను అందించిందన్న కథనం అంతగా సాగదీయడం బాగోలేదని రాసిన మీరు అదే వార్తపై ఇంతగా సాగదీయడం బాగోలేదు సార్...
ఏమంటారు.....?
ఎన్.ఆర్. తుర్లపాటి

Anonymous said...

ekkada iddari vadanalu tv9 teesukoledu kevalam mask okka amaike veyadam sarikadu abai kooda mask veyali bocz ekkada yavariki vastavam teliyadu.inkoti rajanikanth karteek ni aa amai nee venta padadaniki neelo yam greatnes vundi ani adigaru..appudu aa karteek mari Tv9 lo yam greatenes vundi ani adigadu appudu rajini ki yam cheyalao ardham kaledu . atopic ne divert chesaru.

Anonymous said...

Media court ga pravarthisthunte, anchor Judge ayipothe ika court lu enduku , laweyers enduku, judgelu enduku, in future Tv-9 oka Cort la maridi emo, ipatike maripoindi

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి